prudvi

షాక్ 

Updated By ManamMon, 08/06/2018 - 03:18

imageసిటీ హాస్పిటల్ ఐసీయూ వార్డ్ లోపల హత్యాయత్నానికి గురైన మాయ తీవ్రమైన గాయాలతో అపస్మారక స్థితిలో బెడ్‌పైన పడుకొని ఉంది. ఇద్దరి చావుకు కారణమైన హంతకుడ్ని చూసిన ఏకైక ప్రత్యక్ష సాక్షి మాయ. అందుకే ఆమె వాంగ్మూలం కోసం పోలీసులు, రిపోర్టర్లు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు.

imageమరో పక్క ఆమె భర్త వినోద్ దుఃఖంతో కుమిలిపోతూ కూర్చొని ఉన్నాడు. ఇన్‌స్పెక్టర్ పృథ్వీ ముందుగా వినోద్‌ను కలిశాడు. ‘‘మాయపై, మీ బాబు బంటిపై హంతకుడు దాడి చేయడానికి కారణం ఏంటని మీరనుకుంటున్నారు?’’ అనడిగాడు. ‘‘అదే నాకూ అర్థం కావట్లేదు. తనెప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉంటుంది. రెండ్రోజుల క్రితమే గోవాలో షూటింగ్ ముగించుకొని వచ్చింది. నేను మా సొంతూరు వెళ్లి ఉదయమే వచ్చాను. ఈలోగా ఈ ఘోరం జరిగింది. ఆ దుర్మార్గుడు పిల్లాడు బంటిని కూడా పొట్టన పెట్టుకున్నాడు..’’ ఇంక మాట్లాడలేకపోయాడు వినోద్.

‘‘మీకు శత్రువులెవరైనా ఉన్నారా?’’ సూటిగా అడిగాడు పృథ్వీ.
‘‘తను నటి కాబట్టి రకరకాల మనుషులతో పరిచయాలుంటాయి. వారిలో శత్రువులెవరో, మిత్రులెవరో నాకు తెలీదు..’’ అతనింకా చెబుతుండగా మాయకు మెలకువ వచ్చిందనే కబురొచ్చింది. వెంటనే ఆమె దగ్గరకు వెళ్లారు. మాయ కళ్లయితే తెరిచింది కానీ మాట్లాడలేకపోతోంది. సైగ చేయడంతో ప్యాడ్, పెన్ను ఆమె చేతిలో పెట్టారు. మాయ పెన్నును ఎడమ చేతిలోకి తీసుకొని గబగబా ఇంగ్లీష్‌లో ఓ పేరు, ఫోన్ నంబర్ రాసి మళ్లీ తల వెనక్కి వాల్చింది. తిరిగి కోమాలోకి వెళ్లిపోయిందని డాక్టర్ చెప్పాడు. 

చేసేది లేక ఆ పేపర్‌ను జేబులో పెట్టుకొని వెనక్కి వచ్చారు. పృథ్వీ ‘‘ఇలా అడుగుతున్నానని ఏమనుకోకండి. తప్పదు. మాయకు గతంలో ఏవైనా ఎఫైర్స్ లాంటివి ఉన్నాయా?’’ అనడిగాడు వినోద్‌ను. ఆ మాటలకు వినోద్ తడబడ్డాడు. ‘‘అబ్బే.. లేదు లేదు.. అలాంటివి తనకేమీ లేవు..’’ అన్నాడు. పోలీస్ స్టేషన్‌లో మాయ రాసిచ్చిన పేపర్ తీసి చూశాడు పృథ్వీ. దాని మీద రాసిన రిషి అనే పేరు, ఫోన్ నంబర్ రూసి, అడ్రస్ ట్రేస్ అవుట్ చేసి, మాదాపూర్‌లో ఉన్న అతని ఇంటికి చేరుకున్నారు పృథ్వీ, అతని అసిస్టెంట్ రమణ. అయితే రిషి ఇంటికి తాళం వేసివుంది. తాళం పగలకొట్టి లోపలికి వెళ్లారు. డ్రాయింగ్ రూమ్‌లో పరిశీలిస్తుండగా కంప్యూటర్‌కు ఉన్న పెన్ డ్రైవ్‌పై రమణ దృష్టి పడింది. సిస్టమ్ ఆన్ చేసి, పెన్ డ్రైవ్‌ను ఓపెన్ చేశాడు. అందులో రిషి, మాయ కలిసి ఉన్న చాలా ఫొటోలు కనిపించాయి. వాటిని చూసి, తలాడించాడు పృథ్వీ. రిషి ఫోన్ కాల్ డేటా పరిశీలించారు. అతడి ఫోన్ లొకేషన్ టోలీచౌక్‌లోని ఓ చవకబారు లాడ్జిలో ఉన్నట్లు తెలిపింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ లాడ్జికి చేరుకున్నారు. రూమ్ నంబర్ 202 తలుపు కొట్టాడు రమణ. తలుపు తెరిచాడు రిషి. ఎదురుగా పోలీసులు కనిపించగానే భయంతో వణికిపోసాగాడు. పృథ్వీ అతడ్ని పట్టుకొని చెంపమీద గట్టిగా ఒక్కటిచ్చాడు. ‘‘చెప్పరా.. మాయను ఎందుకు హత్య చేయడానికి ప్రయత్నించావ్? అన్నెంపున్నెం తెలీని పసివాడ్ని ఎందుకు పొట్టన పెట్టుకున్నావ్?’’ అని గద్దించాడు. ‘‘లేదు సార్.. నేనీ హత్య చెయ్యలేదు.. ఆ రోజు మాయ ఫోన్ చేస్తే వెళ్లాను. నేను వెళ్లేసరికే ఈ ఘోరం జరిగింది. అది చూసిన భయపడి దాక్కున్నానే కానీ భార్యనూ, కొడుకునూ చంపుకొనేంతటి దుర్మార్గుడ్ని కాను.’’ అంటూ ఘొల్లుమన్నాడు రిషి. 

పృథ్వీ ఆశ్చర్యపోతూ ‘‘ఏంటి నువ్వు మాట్లాడేది? మతివుండే మాట్లాడుతున్నావా!’’ అంటూ మరో దెబ్బ వేశాడు. ‘‘నేను చెప్పేది నిజం సార్. మీరు కొట్టినా, తిట్టినా నాకూ, ఈ హత్యకూ సంబంధం లేదు. ఒకవేళ నేను చంపాలనుకుంటే కేవలం మాయను మాత్రమే చంపుతాను కానీ నా భార్య సీమ, నా కొడుకు బంటిని ఎందుకు చంపుతాను?’’ అన్నాడు రిషి. అతని స్టేట్‌మెంట్ తీసుకొని, ‘‘హంతకుడు దొరికేవరకు నువ్వు మా అబ్జర్వేషన్‌లోనే ఉంటావు. ఏవైనా పిచ్చి వేషాలు వేశావో.. జాగ్రత్త’’ అని హెచ్చరించాడు పృథ్వీ. జీపులో పోలీస్ స్టేషన్‌కు వెళ్తుంటే, రమణ ‘‘ఇదేం ట్విస్ట్ సార్. చనిపోయిన సీమను రిషి తన భార్య అంటాడు. బంటిని తన కొడుకు అంటాడు. మాయ కొడుకు కదా బంటి. ఇదెలా సాధ్యం? విచిత్రంగా ఉందే!’’ అన్నాడు. ‘‘అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. బంటి, సీమ డెడ్ బాడీలను పోస్ట్ మార్టమ్‌కు పంపారు కదా. బంటి డీఎన్‌ఏ రిపోర్ట్ కూడా తీసుకొని వాటిని రిషి డీఎన్‌ఏ రిపోర్ట్‌తో కంపేర్ చేస్తే విషయం తెలిసిపోతుంది’’ చెప్పాడు రిషి. ‘‘మరైతే ఈ హత్యలు వినోద్ చేసి ఉంటాడంటారా?’’ ‘‘ఆ అవకాశం ఎక్కువే. ఏ భర్తయినా తన భార్యకు మరొకరితో సంబంధం ఉందంటే సహించలేడు. పైగా బంటి తన కొడుకు కాదన్న విషయం కూడా వినోద్‌కు తెలిసి పోయుంటుంది. పద.. అతన్నే విచారిద్దాం.’’

‘‘నిజం తెలిసిపోయింది వినోద్. ఇక నువ్వు చేసిన నేరం ఒప్పుకోక తప్పదు. నీ భార్యకు ఎలాంటి ఎఫైర్లు లేవన్నావు. కానీ మాయకు రిషితో సన్నిహిత సంబంధాలున్నాయి. నువ్వు ఈర్ష్యతో ఈ దారుణాలకు ఒడిగట్టావు.’’ నిలదీశాడు పృథ్వీ. వినోద్ కళ్లనీళ్ల పర్యంతమై ‘‘మీరన్నట్టు ‘‘హంతకా? ఏ.. ఏమంటున్నారు సార్? చంపింది రిషి కదా?’’ అమాయకంగా అంది మాయ. ‘‘మాయా.. మీరు తెరమీదే నటి. కానీ జీవితంలోనూ నటిస్తూ బతకాలనుకుంటున్నారు. అది మంచిది కాదు.’’ నాకు ఈర్ష్య ఉంటే రిషిని చంపుతాను కానీ, మాయను ఎందుకు చంపాలనుకుంటాను. వాళ్లిద్దరి మధ్య ఎఫైర్ ఉన్న సంగతి నాకు తెలుసు. మాయకు మంచిగా చెప్పి మారుద్దామనుకున్నా. చంపాలని నేనెప్పుడూ ఆలోచించలేదు.’’ వినోద్ మాటలు వినేసరికి కేసు మళ్లీ మొదటికే వచ్చినట్టనిపించింది.

బంటి డీఎన్‌ఏ రిపోర్ట్, రిషి డీఎన్‌ఏ రిపోర్ట్ మ్యాచ్ అయ్యాయి. అంటే చనిపోయిన బంటి.. రిషి కొడుకు. మాయకు మళ్లీ స్పృహ వచ్చింది. ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు పోలీసులు. ‘‘నేను వంటింట్లో వంట చేస్తున్నా. కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీశాను. ఎదురుగా రిషి చేతిలో కత్తితో రాక్షసుడిలా నిల్చున్నాడు. నన్ను తోసి బెడ్‌రూమ్‌లో ఉన్న బంటిని కత్తితో పొడిచాడు. అడ్డు వెళ్లిన నన్ను పొడిచాడు. మళ్లీ కాలింగ్ బెల్ మోగడంతో తలుపు వెనుక దాక్కున్నాడు. సీమ రాగానే ఆమెను కూడా పొడిచి పారిపోయాడు’’ చెప్పింది మాయ. పృథ్వీ కనుబొమ్మలు ముడిపడ్డాయి. మాయ పరిస్థితి కొంత మెరుగైంది. ఇంకా వైద్యుల పర్యవేక్షణలో ఉంది. 

హత్యలు జరిగిన చోటుకు వెళ్లింది పృథ్వీ బృందం. అక్కడ పరిశీలిస్తుండగా డస్ట్‌బిన్‌లో మాయ సెల్‌ఫోన్ దొరికింది. అందులో చివరి రెండు కాల్స్ ఒకటి రిషికి, ఇంకొకటి సీమకు చేసినట్టు తెలుస్తోంది. రిషి చెప్పినట్టు అతను మాయ ఫోన్ చేస్తేనే వెళ్లాడనే విషయం రూఢీ అయింది. అప్పుడే రమణకు స్టోర్ రూమ్‌లో హత్యకు ఉపయోగించిన కత్తులు రెండు దొరికాయి. ఒకటి పది అంగుళాల కత్తి అయితే, ఇంకొకటి నాలుగంగుళాల చాకు. వాటిని చూశాక జరిగిన సన్నివేశమంతా కళ్ల ముందు కదలాడింది పృథ్వీకి. ‘‘హంతకుడు దొరికినట్టే’’ అన్నాడు రమణతో. హాస్పిటల్‌కు వెళ్తూ మరోసారి రిషిని కలిసి అతని స్టేట్‌మెంట్ కూడా తీసుకున్నారు.

హాస్పిటల్‌లో పోలీసులను చూస్తూనే ‘‘హంతకుడు దొరికాడా ఇన్‌స్పెక్టర్?’’ అడిగింది మాయ. పృథ్వీ తాపీగా స్టూల్ మీద కూర్చుంటూ ‘‘దొరికాడు.. కాదు.. దొరికింది హంతకి!’’ అన్నాడు. ‘‘హంతకా? ఏ.. ఏమంటున్నారు సార్? చంపింది రిషి కదా?’’ అమాయకంగా అంది మాయ. ‘‘మాయా.. మీరు తెరమీదే నటి. కానీ జీవితంలోనూ నటిస్తూ బతకాలనుకుంటున్నారు. అది మంచిది కాదు.’’ ‘‘మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు..’’ ‘‘మాయా! మీరు అబద్ధాలు చెప్పడానికి ఇంకేమీ మిగల్లేదు. రిషిని ప్రేమించారు. అతని బిడ్డకు తల్లయ్యారు. కానీ డబ్బు మీద మోజుతో ప్రొడ్యూసర్ వినోద్‌ను పెళ్లి చేసుకున్నారు. మీ గతం తెలిసినా సహృదయంతో మన్నించారు వినోద్. కానీ మీరు రిషిని వదులుకోలేకపోయారు. అతనితో ఎఫైర్ కొనసాగించారు. అతను సీమను పెళ్లి చేసుకున్నాడు. అది మీకు మింగుడు పడలేదు. సీమకు విడాకులివ్వమని అతన్ని వేధించారు. రిషి కాదన్నాడు. దాంతో అతని మీద కసి పెంచుకొని ఉన్మాదిలా తయారయ్యారు. సీమను హత్యచేసి, అదే సమయానికి అక్కడకు వచ్చిన రిషిపై నేరం తోసేసి, అతడ్ని జైలుపాలు చేసి, కక్ష తీర్చుకోవాలనుకున్నారు. మీ పథకం ప్రకారం ఫోన్ చేసి సీమను పిలిపించారు. ఆమె రాగానే వెనక నుంచి పెద్ద కత్తితో ఎడమచేత్తో ఆమె గొంతు కోశారు. దాన్ని చూసిన బంటిని కన్నకొడుకు అని కూడా చూడకుండా, మిమ్మల్ని మీరు కాపాడుకోడానికి అదే కత్తితో బలంగా పొడిచి చంపారు. మీ మీద ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండాలని ఇంకో చిన్న చాకుతో పైపైన పొడుచుకొని గాయాలు చేసుకున్నారు. మమ్మల్ని తప్పుదారి పట్టించడానికి రిషి పేరు, ఫోన్ నంబరు ఇచ్చారు. కానీ మీ ఎడమచేతి వాటం, రెండు కత్తులు మిమ్మల్ని పట్టిచ్చాయి.’’ పృథ్వీ చెప్పింది వినగానే అక్కడున్నవాళ్లంతా షాక్‌కు గురయ్యారు. మోహంతో రెండు నిండు ప్రాణాల్ని క్రూరంగా బలిగొన్న మాయను పోలీసులు అరెస్ట్ చేశారు.
[email protected]

Related News