never Stop fighting!

ప్రాణం పోయినా పోరాటం ఆపను!

Updated By ManamMon, 08/06/2018 - 01:10

మధ్యప్రదేశ్ భోపాల్‌కు చెందిన ప్రఖ్యాత పర్యావరణ శాస్త్రవేత్త షెహ్లా మసూద్ 1973లో జన్మించారు. 2011లో తన 38 ఏట ఆమె మరణించారు. వన్యప్రాణుల సంరక్షణలోను, ఆర్‌టీఐ కార్యకర్తగాను ఆమె సుప్రసిద్ధురాలు. 2011 ఆగస్టు 16 ఆవెును కొందరు కిరాయి గూండాలు కాల్చి చంపారు. ఆమె కారులో బయలుదేరే సమయంలో స్థానిక మహిళా ఇంటీరియర్ డిజైనర్ ఈ కిరాయి గూండాలను పం పారు. ఆమె జీవించివున్నంత కాలం హెచ్చరికలు, బెదిరింపులు తరచూ ఎదుర్కొంటూండేవారు. ఆమె బతికివున్నప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యాంశాలు ఇస్తున్నాం.

imageతనను స్థానిక ఎమ్యెల్యే విశ్వాస్ సారంగ్ అవినీతిని ప్రశ్నించినందుకు తనకెన్నో బెదిరింపులు వస్తున్నాయని ప్రఖ్యాత పర్యావరణవేత్త, ఆర్‌టీఐ కార్యకర్త షెహ్లా మసూద్ తెలిపారు. తనపై ఒత్తిడి తెచ్చే ఉద్దేశంతో తనకు ఎమ్మెల్యే కోర్టు నోటీసు పం పారని ఆమె చెప్పారు. ప్రతినెలా ఇంటి ఖర్చుల కింది లక్షల రూపాయల్లో వెచ్చిస్తున్న మధ్యప్రదేశ్ ము ఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ప్రశ్నించానని, చాట్, స్వీట్లు, లంచ్, విందులు, టెలిఫోన్ బిల్లులు, మొబైల్ బిల్లులకు ఖర్చుచేస్తున్నారని ఆమె ఆరోపిం చారు. తనను ప్రిన్సిపుల్ సమాచార శాఖాధికారి (జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం) అరుణా గుప్తా బెదిరించారని ఆవెు తెలిపారు. ముఖ్యమంత్రి ప్రొ టోకాల్ అధికారి సంజయ్ చౌహాన్ నుంచి కూడా బెదిరింపలు వచ్చాయని చెప్పారు. 

ప్రః ఇటువంటి పరిస్థితుల్లో ఎలా పనిచేస్తున్నారు?
జః నేను నిర్విరామంగా బెదిరింపులు ఎదుర్కొంటున్నాను. ఇండోర్‌లోని పోలీస్ శిక్షణ సంస్థ ఐజీ హోదాలో ఉన్న పవన్ శ్రీవాత్సవ 2008లో నన్ను బెదిరించారు. ఆయనంత అవినీతి పరుడు మరొకరు లేరు. రాజకీయ నాయకుతో కుమ్మక్కై ఆయనీ పనులకు పాల్పడుతున్నారు. ఆయన ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు, మధ్యప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు అనిల్ దవేకు సన్నిహితుడు. సాంస్కృతిక శాఖ నిర్వహించిన టెండర్ పనులపై నేను 2008లో స మాచారం సేకరించాను. ఈ అంశంలో నేను ఫిర్యాదుచేసిన రోజే పవన్ నాకు ఫోన్‌చేసి బెదిరించడమే కాకుండా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హె చ్చరించారు. ఆయన మాటల్లో కొంతభాగం నేను రికార్డుచేశాను కూడా. ఆ రికార్డులను సీనియర్‌పోలీసు అధికారులకు, అప్పటి కేంద్ర హోంమంత్రి పి.చిదంబరానికి అందజేశాను. నా ప్రాణాలకు అపాయైవెునా పోరాడుతూనే ఉంటాను.

ప్రః ఏయే అంశాలపై పోరాడుతున్నారు?
జః సుపరపాలన, పారదర్శకత కోసం నేను పోరాటం చేస్తున్నాను. పులుల సంరక్షణ వంటి ప ర్యావరణ అంశాలు, పోలీసు సంస్కరణలపై గళవెుత్తుతున్నాను. ఇందులో భాగంగా సాక్ష్యాల సేకరణ కోసం 2005 నుంచి నేను ఆర్‌టీఐ చట్టాన్ని వినియోగిస్తున్నాను. రాజకీయవేత్తలు, అధికారుల మ ద్య ఏర్పడిన సన్నిహిత సంబంధాలే దేశంలో నెమ్మదినెమ్మదిగా వి షం చిమ్ముతున్నాయి.  

ఇలా ఇంటర్వ్యూ ఇచ్చినకొద్ది రోజులకే ఆమె అనుకున్నంతా జరిగింది. కొంతమంది కిరాయి గూండాలు ఇంటి నుంచి బయటకు బయలుదేరేందుకు కారు ఎక్కుతున్నప్పుడు కాల్చిచంపారు. 
మహి డెస్క్ 

Related News