Central govt

'మరోసారి టీడీపీ గెలుపు చారిత్రక అవసరం'

Updated By ManamThu, 05/17/2018 - 18:36

TDP, Historical needed, Chandrababu naidu, Neeru-Pragathi programme, Central govtకందుకూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ టీడీపీ గెలుపు ఓ చారిత్రక అవసరమని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లాలోని కందుకూరులో గురువారం  ‘నీరు-ప్రగతి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో సమర్థమైన, మెరుగైన పాలన అందిస్తున్నామన్నారు. ప్రభుత్వంతో లాభం పొందే ప్రతి వ్యక్తి ప్రభుత్వానికి సహకరించాలని చెప్పారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రతిఒక్కరూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. ధర్మపోరాటం కొనసాగించాలని, హక్కులను సాధించాలనే ఆవేశం, ఆలోచన అనునిత్యం రావాలని సీఎం ఆకాంక్షించారు. తక్కువ వనరులు ఉన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తుంటే రాష్ట్రంలో ప్రతిపక్షాలు తమపై విమర్శలు చేయడం బాధాకరమన్నారు.

ప్రజలకు మెరుగైన పాలన అందించడం, ఎవరికీ ఇబ్బందులు లేకుండా చేయడం, ఆర్థిక అసమానతల్ని తగ్గించడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. తాను ప్రజల సంక్షేమం కోసమే కష్టపడుతున్నట్టు చెప్పారు. ప్రతిపక్ష నాయకుడు, వైకాపాలో అవినీతిపరులు కొందరు తనను విమర్శిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఏకవచనంతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అయినా ఆ మాటలన్నీ ప్రజల కోసమే పడుతున్నానన్నారు. దీనిపై ప్రతి ఇంట్లో, ప్రతి వూళ్లొ చర్చ జరగాలన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చేది దయాదాక్షిణ్యాపై కాదని, అతి రాష్ట్ర ప్రజల హక్కు అన్నారు. 'ఆయన చెప్పినట్టే వైఎస్ఆర్సీపీ నడుస్తోంది'

Updated By ManamThu, 04/26/2018 - 16:20

Varla Ramaiah, Central govt, Amith shah, YSRCP, Modi govtవిజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య విమర్శించారు. గురువారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని బీజేపీ నేతలను వైఎస్సార్ సీపీలో చేర్చుకోవద్దని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. జగన్‌కు ఫోన్ చేయడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. వైసీపీలో చేరాలనుకున్న కన్నా లక్ష్మీనారాయణ ఆరోగ్యం బాగోలేదంటూ ఆస్పత్రిలో చేరడం వెనుక అమిత్ షా ఉన్నది నిజం కాదా? అనే ప్రశ్నను సూటిగా సంధించారు.

వైఎస్ జగన్ చెప్పినట్టు కాకుండా అమిత్ షా చెప్పినట్టు వైఎస్సార్ సీపీ నడుస్తోందని ఆరోపించారు. విభజన హామీలు, ప్రత్యేక హోదాను అమలు చేయాల్సింది చంద్రబాబు కాదని.. కేంద్ర ప్రభుత్వమని అన్నారు. జగన్ కేసులపై ఏం తెలుసని కేంద్రమంత్రి రాందాస్ వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఎన్డీయేలోకి ఆహ్వానిస్తామంటూ వ్యాఖ్యానించారని వర్ల రామయ్య విమర్శించారు.20న సీఎం చంద్రబాబు నిరాహార దీక్ష

Updated By ManamSat, 04/14/2018 - 15:10

AP CM chandrababu naidu, Pawan kalyan, JFC committee అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకరోజు నిరాహార దీక్ష చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 20న తన పుట్టినరోజున చంద్రబాబు నిరాహార దీక్ష చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఢిల్లీ చక్రం తిప్పుతామని, ఢిల్లీని శాసించబోయేది టీడీపీనే అని ఆయన అన్నారు. 25 వరకు ఎంపీ సీట్లు గెలిస్తేనే ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారు. టీడీపీ అంటే ఏమిటో దేశానికి చూపుతామని తెలిపారు. ఈ ఏడాది చివర్లోగా 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. రాజ్యాంగం మంచిదైనప్పటికీ.. అమలు చేసే వాళ్లు చెడ్లవాళ్లైతే చెడ్డదవుతుందని అంబేడ్కర్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. ఎస్సీలో సమర్థవంతమైన నాయకత్వం తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు.

విదేశాలకు వెళ్లే విద్యార్థులకు రూ.15 లక్షలే కాదు.. అన్నిరకాల సాయం చేస్తామని తెలిపారు. డప్పు కళాకారుల పింఛన్ల కోసం రూ. 12 కోట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టానికి రక్షణ కల్పించేందుకు దేశవ్యాప్తంగా పోరాటం చేస్తామన్నారు. దళితుల ఆదాయం పెంచేందుకు నిరంతరం కృషి చేస్తామని చంద్రబాబు తెలిపారు. బాల సంజీవని పేరుతో పిల్లలకు పౌష్టికాహారలోపం నివారించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. 2019లో టీడీపీ మద్దతిచే పార్టీనే కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్నారు.'విభజనతో ఏపీని ముంచారు.. నష్టాన్ని కేంద్రమే భర్తీ చేయాలి'

Updated By ManamWed, 04/04/2018 - 17:15
  • నాలుగేళ్లలో 29 సార్లు ఢిల్లీకి వచ్చాను.. ఏపీకి న్యాయం కోసం నాలుగేళ్లుగా ఎదురుచూశాం

  • కేంద్రం తీరుతో ఏపీ ప్రజలు విసుగెత్తిపోయారు.. 5 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు

Chandrababu naidu slams Central govt on AP bifurcation Issues and promisesన్యూఢిల్లీ: విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వమే భర్తీ చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏపీని కేంద్రం నిండా ముంచిందని, రైల్వే జోన్ హామీని కూడా అమలు చేయలేదని అన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు వివిధ పార్టీల నేతలతో సమావేశమై ఏపీకి జరిగిన నష్టాన్ని వివరించారు. లోక్‌సభలో టీడీపీ ఎంపీలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. ఏపీకి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీల వీడియోను చంద్రబాబు ప్రదర్శించారు. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టాన్ని బుధవారం సాయంత్రం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఆయన వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు జాతీయ మీడియాతో మాట్లాడుతూ..‘ నాలుగేళ్లలో 29 సార్లు ఢిల్లీకి వచ్చాను. ఏపీకి న్యాయం కోసం నాలుగేళ్లుగా ఎదురుచూశాం. కేంద్రం తీరుతో ఏపీ ప్రజలు విసుగెత్తిపోయారు. 5 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. విభజన తర్వాత ఏపీ తలసరి ఆదాయం తగ్గింది.

పార్లమెంటులో ఎంపీల పోరాటంపై కేంద్రం స్పందించడం లేదు. ప్రత్యేక ప్యాకేజీ కోసం రెండేళ్లు ఎదురుచూశాం. ఇప్పుడు స్పెషల్ పర్పస్ వెహికల్ అంటున్నారు. విభజన వల్ల వచ్చే సమస్యలపై శ్వేతపత్రాలు విడుదల చేశా. చివరిసారిగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశా. ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చలేదు. ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని విభజన సమయంలోనే దీక్ష చేశా. పార్లమెంటులో చేసిన చట్టాలు అమలు కావడం లేదు. పార్లమెంటులో ఎంపీల పోరాటంపై కేంద్రంపై స్పందించడం లేదు. ప్రత్యేక హోదా కుదరదని 14వ ఆర్ధిక సంఘం చెప్పిందనడం అబద్దం. ఏ రాష్ట్రానికి హోదా, రాయితీలు లేవంటూనే కొన్ని రాష్ట్రాలకిచ్చారు. పోలవరం నిర్మాణ ఖర్చు పూర్తిగా కేంద్రమే భరిస్తుంది. పోలవరాన్ని రాష్ట్రమే పూర్తి చేస్తుందని నీతి ఆయోగ్ చెప్పింది.

నీతి ఆయోగ్ సిఫార్సు మేరకే పోలవరం నిర్మాణ బాధ్యతలు తీసుకున్నాం. పోలవరాన్ని రాష్ట్రమే పూర్తి చేసేందుకు కేంద్రం అంగీకరించింది. పోలవరానికి పెట్టిన ఖర్చులో ఇంకా రూ.3 వేల కోట్లు ఇవ్వాలి. పోలవరానికి సంబంధించి డీపీఆర్-2ను కేంద్రం ఆమోదించాల్సి ఉంది. ఏపీకి న్యాయం చేయాలని గతంలో జైట్లీ సభలో కోరారు. విభజన హామీలు అమలు చేస్తామంటేనే బీజేపీకి ఓట్లేశారు. పార్లమెంటులో చేసిన చట్టాలు అమలు కావడం లేదు. చిన్న అంశాలు మినహా రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదు. కనీస సాయం చేయకుండా మాపైనే విమర్శలా? హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామంటేనే ఒప్పుకున్నాం. దుగరాజపట్నం పోర్టు విషయంలోనూ హామీ నెరవేరలేదు. కేంద్రంతో కలిసి కొనసాగడం లాభం లేదని భావించాం. ప్రధానికి ఫోన్ చేసి ఇప్పటికీ ఎన్డీయేలో ఉన్నాం.. న్యాయం చేయాలని కోరా. అయినా కేంద్రం వైఖరిలో మార్పు లేదు. యూసీలు ఇచ్చినా.. ఇవ్వలేదని అంటున్నారు.. ఏదైనా ఉంటే నేరుగా చెప్పాలి బురద చల్లడం సరికాదు’ అని చంద్రబాబు వివరించారు.ఏపీలో 4 రైల్వే స్టేషన్లకు అంతర్జాతీయ హోదా

Updated By ManamWed, 04/04/2018 - 13:01

International Status to railway stations, Andhra pradesh state, Central govt, Vijayawada, Guntur, Railway ministry న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 4 రైల్వేస్టేషన్లకు కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ హోదా కల్పించింది. ఏపీ రాజధాని ప్రాంతంలోని విజయవాడ, గుంటూరు, రాయలసీమలోని కర్నూలు, గుంతకల్లు స్టేషన్లకు అంతర్జాతీయ హోదాను కల్పించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే ఈ రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు రూ.25కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తూ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. కాగా, అంతర్జాతీయ హోదాకు సంబంధించి ఈ నెల 10లోగా ప్రతిపాదనలు పంపాలని అధికారులకు రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఈ రైల్వే స్టేషన్లు కొత్త రూపును సంతరించుకోనున్నాయి.కేంద్రానికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్..!

Updated By ManamSun, 03/25/2018 - 13:39

CM Chandrababu Strong Warning To Centre
అమరావతి: ఎన్డీఏ నుంచి టీడీపీ విడిపోయిన మరుసటి క్షణం నుంచి.. బీజేపీ-టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. పార్టీ పరంగా పరంగా మొదలుకుని అదికాస్త వ్యక్తిగత విమర్శల వరకు చేరుకుంది. ఓ వైపు టీడీపీ నేతల విమర్శలు మరోవైపు ఏపీ బీజేపీ నేతలు, ఢిల్లీ స్థాయి నేతలు తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఈ తరుణంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా లేఖ రాయడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. కేవలం రాజకీయాల కోసమే టీడీపీ వైదొలిగిందని.. అభివృద్ధి అస్సలు కాదని లేఖలో ఆయన పేర్కొనడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్.. షా లేఖపై ఇప్పటికే స్పందించారు. అయితే ఆదివారం మధ్యాహ్నం సీఎం బాబు.. పార్టీనేతలతో టెలికాన్ఫరెన్స్‌లో షా లేఖపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ సీఎం చంద్ర (డ్ర) నిప్పులు చెరిగారు. 

నా సంగతి నీ కొడుకు సంగతి చూస్కో షా..!!
బీజేపీపై సీఎం చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. నా మీద, ప్రభుత్వంపై అవినీతి కేసులు వేయడమేంటి? అంటూ సీఎం తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ముందుగా అమిత్ షా కుమారుడు జై షా అవినీతి వ్యవహారం తేలాలన్నారు సీఎం. కొందరు తనపై కేసులు పెట్టాలని చూస్తున్నారని అంతకంటే ముందుకు షా కుమారుడు కేసుల సంగతి కూడా చూడాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే రూ. 50 నుంచి 16వేల రెట్లు ఏ రకంగా పెరిగిందనే వివాదం ఉందని.. దీనిపై అనేక రాజకీయ విమర్శలు వచ్చాయనే విషయాన్ని సమావేశంలో బాబు ప్రస్తావించారు. ఈ సందర్భంగా అసలు ఏపీలోని పార్టీలు తనవైపు ఉంటాయో.. కేంద్రం వైపు ఉంటాయో తేల్చుకోవాలని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యంగ వ్యవస్థని నాశనం చేసిందని ఆయన మండిపడ్డారు. 

రెండు చోట్లా అదే పరిస్థితి..!
"
గుజరాత్‌లో భారతీయ జనతాపార్టీ ఏం చేసింది?. ఒకే ఒక్క రాజ్యసభ స్థానాన్ని గెలుచుకోవడానికి అనేక పాట్లు, ఎన్ని అడ్డు దారులు తొక్కి వైఫల్యం చెందిందో తెలుసు. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌ను ఓడించేందకు ఎటువంటి కుయుక్తులు పన్నారో మీకు గుర్తు లేదా అంటూ కేంద్రానికి సీఎం సూటి ప్రశ్న సంధించారు. ఇలాంటి విషయాలు చాలానే ఉన్నాయని వాటన్నింటినీ రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని నేతలకు బాబు దిశానిర్దేశం చేశారు. నీతులు చెప్పే బీజేపీ.. యూపీ.. గుజరాత్‌లో రాజ్యసభ సీటు కోసం ఏం చేశారో తెలియదా?. టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలే తక్కువగా ఉన్నా.. విలువల కోసం మూడో స్థానానికి పోటీ పెట్టలేదు" అని నేతలకు సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారని తెలుస్తోంది.

కేంద్రంపై భయపడేది లేదు..!
ఆదివారం టీడీపీ నేతలతో జరిపిన టెలికాన్ఫరెన్స్ కేంద్రంపై సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఈ సమావేశంలో సీఎం చేసిన వ్యాఖ్యలు తీవ్రతరం చేసేలా ఉన్నాయి. " కేంద్ర ప్రభుత్వంపై భయపడే ప్రసక్తే లేదు. కేసులతో పాటు ఇతరత్రా వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వంపై ఉసిగొల్పి బెదిరించే ప్రయత్నం చేస్తోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే ఇప్పటికే కొందరు బీజేపీ నేతలు ప్రాజెక్టులపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని అంటున్నారని.. వారి వ్యాఖ్యలను తిప్పి కొట్టాలని నేతలకు సూచించారు. అవినీతి అంటూ బురద చల్లాలని చూస్తే అంతే ఘాటుగా తాము కూడా రెస్పాండ్ అవుతామని.. అంతేకాదు ప్రశ్నల వర్షం కురిపిస్తామని అభిప్రాయాన్ని కలుగజేసే ప్రయత్నం చేశారు. బీజేపీ పెద్దలతో ఢీ అంటే ఢీ అనడానికి మేం కూడా సిద్ధంగా ఉన్నాము" అని నేతలతో బాబు అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు అంటూ చేసిన వ్యాఖ్యలపై కూడా సీఎం ఘాటుగా స్పందించినట్లు తెలుస్తోంది.ఏపీకి ‘ప్రత్యేక హోదా’ ఇస్తాం కానీ...! 

Updated By ManamSat, 03/24/2018 - 12:35

Somu Veerraju Sensational Comments

అమరావతి: తెలుగుదేశం పార్టీపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీకి తప్పకుండా ప్రత్యేక హోదా ఇస్తామని అందుకు కొన్ని కండిషన్స్ ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అవినీతికి పట్టిసీమ పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అవినీతిని తవ్వడానికి పలుగు సరిపోదని.. ఏకంగా బుల్డోజరే కావాలని వ్యాఖ్యానించారు. పట్టిసీమలో ఒక లారీ మట్టి తీయడానికి రూ. 4 లక్షల ఖర్చా అంటూ ఆయన ఆశ్చర్యపోయారు. పట్టిసీమ ప్రాజెక్టులో తీయడానికి కేంద్రం రూ. 67 కోట్లు ఇచ్చిందన్నారు. రూ. 1120 కోట్లతో మొదలైన పట్టిసీమ రూ. 1667 కోట్లకు వెళ్లిందని వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టీడీపీ:- తెలుగు డ్రామా పార్టీ!
" పోలవరంకు 30 మోటార్‌లు అన్నారు.. 24 పెట్టారంతే. పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో ఉన్న మెకానిజం ఏంటి? స్పిల్‌ వే పనులకు రూ.1400కోట్లు ఎందుకు ఖర్చు అయిందో చెప్పండి. మట్టి తీయడానికే రూ.67కోట్లు ఇచ్చారని.. 3 కిలోమీటర్ల గొట్టాలకు రూ. 817 కోట్లు ఖర్చు అన్నారనీ పట్టిసీమ పంపు సెట్ల ఖరీదులోనూ మతలబు ఉంది. కార్యకర్త స్థాయికి టీడీపీ అవినీతిని తీసుకెళ్లింది. మరుగుదొడ్ల నిర్మాణంలోనూ అవినీతి చేశారు. ఎమ్మెల్సీల అవినీతిని కంట్రోల్ చేసే పరిస్థితి ఉందా?. మంత్రి నారా లోకేశ్‌కు 20 అవార్డులు వచ్చాయి.. కానీ ఆ శాఖలో మాత్రం అవినీతికి హద్దు లేకుండా పోయింది. ఉపాధి హామీ, సర్వశిక్ష అభియాన్‌పై తక్షణమే సర్కార్ శ్వేతపత్రం విడుదల చేయాలి" సోము వీర్రాజు డిమాండ్ చేశారు. 

టీడీపీ సర్కార్‌పై ప్రశ్నల వర్షం..
"గుంటూరు ప్రభుత్వాస్పత్రి శుభ్రతకు రూ. 40 లక్షలా?. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందా?. ప్రజల సొమ్ము పప్పు బెల్లం అయ్యింది. ‘నీరు-చెట్టు పథకంలో మట్టిని అమ్ముకున్నారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పుతోంది. ఎమ్మెల్యేలను అదుపులో పెట్టే పరిస్థితి కూడా లేదు. ఏపీలో బాత్రూమ్‌లు కట్టకుండానే వేల కోట్లు నొక్కేశారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ.27 వేల కోట్లు కేంద్రం నుంచి వచ్చాయి. చెట్టు-నీరు పథకంలో మట్టి అమ్ముకున్నారు" అని ఆయన లెక్కలతో సహా చెప్పారు.

ప్రత్యేక హోదా ఇవ్వడానికి మేం సిద్ధం..!

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా ఉందని అయితే కార్పొరేషన్ ద్వారా నిధులు అందిస్తామని స్పష్టం చేశారు. హోదా కింద రాష్ట్రానికి రూ. 16వేల కోట్ల రూపాయిలు వస్తాయని ఇప్పటికే లెక్కతేలిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిధులిస్తే అవికూడా అవినీతి పద్దులోకే చేరుతాయని.. కార్పొరేషన్ ద్వారా ఖర్చుచేస్తే లెక్కలు పక్కాగా ఉంటాయని తాము ‘స్పెషల్ పర్పస్ వెహికల్’ ఏర్పాటు చేయమని కోరామని సోమువీర్రాజు స్పష్టం చేశారు. 

మేమిచ్చేది ప్రత్యేక హోదానే.. అని దాని విలువ 16వేల కోట్ల రూపాయిలని మరోసారి వీర్రాజు వివరించారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు అక్కడ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. సుజనా చౌదరి బాగా లెక్కలు చూస్తే ప్రత్యేక హోదా విలువ రూ. 16వేల కోట్లని తేల్చారన్నారు. ఆంధ్ర రాష్ట్రం ప్రమాదంలో ఉందన్నరాయన. అరుణ్‌ జైట్లీ సూచించినట్లు హోదా హామీ ద్వారా ఏపీకి దక్కాల్సిన అన్నిటికి అన్నిమేళ్లూ అందుతాయని ఇందులో బీజేపీపై ఎలాంటి అనుమానాలు అవసరంలేదని వీర్రాజు స్పష్టం చేశారు. అయితే అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు మాత్రం అందుకు సుముఖంగా లేరని, తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఆయన రాష్ట్రాన్ని బలిపెడుతున్నాడని సోమువీర్రాజు పేర్కొన్నారు.

http://www.manamnews.com/content/bjp-ready-give-special-status-ap-somu-veerraju-12594ఏపీ అంటే అంత చిన్నచూపా?: చంద్రబాబు

Updated By ManamSat, 03/24/2018 - 09:25

Cm Angry On Centre

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్లమెంట్ జరిగిన పరిణామాలపై పార్టీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాగా వచ్చే వారంలో పార్లమెంట్‌కు ఐదు రోజులు సెలవులొచ్చాయి.. ఇంకా రెండు రోజులు మాత్రమే సభ జరుగుతుందన్నారు. " కేంద్రాన్ని మనం ఏం అడుగుతున్నాం.. వాళ్లు ఎందుకివ్వడం లేదు. మిగిలిన రాష్ట్రాలను చూస్తున్నారనే దానిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మన పోరాటం మరింత ఉధృతం చేయాలి. ఏపీ ప్రయోజనాలు కాపాడాలి.. ప్రజల హక్కులు పరిరక్షించాలి. సభలేనప్పుడు ఎక్కడికక్కడ ప్రజల్లోకి వెళ్లాలి. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి వివరించండి.ఒకవైపు మన రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతుంటే ఈశాన్య రాష్ట్రాలకు రూ. 3వేల కోట్లు ఇచ్చారు.. ఇది దేనికి సంకేతం. ఆంధ్రప్రదేశ్ అంటే అంత చిన్నచూపా..? ఇది దేనికి సంకేతం" అంటూ సీఎం కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు.ఒకే క్లిక్‌తో బర్త్ సర్టిఫికేట్

Updated By ManamTue, 03/20/2018 - 02:22
  • ఆన్‌లైన్ దరఖాస్తు ద్వారా 15 రోజుల్లో ఇంటికే.. తొలగనున్న పౌరుల కష్టాలు

  • సివిల్ రిజిస్ట్రేషన్ పాలసీని ప్రవేశపెట్టిన కేంద్రం

imageన్యూఢిల్లీ: ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు ప్రభుత్వం నుంచి ఎలాంటి సేవలు పొందాలన్నా.. ప్రతి ఒక్కరికీ జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా మారింది. అంతేకాకుండా ప్రైవేట్ రంగంలోనూ బర్త్ సర్టిఫికెట్ లేకుండా ఎలాంటి పని ముందుకు సాగదు. ఇలాంటి జనన ధ్రువీకరణ పత్రాన్ని పొందాలంటే అవస్థలు తప్పడం లేదు. ఓ వ్యక్తి మరణించిన తరువాత అతడికి సంబంధించిన ఆస్తులు, వారసత్వంపై లీగల్ ఆథారిటీ పొందాలంటే.. ఆ వ్యక్తి చనిపోయినట్లు ప్రభుత్వం జారీచేసిన మరణ ధ్రువీకరణ పత్రం ఉండాలి. అయితే ప్రస్తుతం ఈ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలకోసం ప్రజలు నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదే అదునుగా దళారులు జేబులు నింపుకుంటున్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రం పొందలంటే రూ.3 వేల నుంచి రూ.6వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇలాంటి ఇబ్బందుల నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తూ.. కేంద్రం ప్రభుత్వం సివిల్ రిజిస్ట్రేషన్ పాలసీ ( సీఆర్‌ఎస్) విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా జనన, మరణ ధ్రువీకరణపత్రాలు ఇంటివద్ద నుంచే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే చాలు.. 15 రోజుల్లో పత్రాలు అందజేస్తారు. ప్రభుత్వం నుంచి అందించే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వమే ఉచితంగా అందజేస్తుంది. 
 

రిజిస్ట్రేషన్ ఇలా...
కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన సీఆర్‌ఎస్ విధానంతో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను సుల భంగా పొందవచ్చు. దీనికోసం ముం దుగా ఆన్‌లైన్ ద్వా రా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. సీఆర్‌ఎ స్‌ఓఆర్‌జీ.జీఓఐ.ఇన్ వైబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. అందు లో జనన లేదా మరణ ధ్రువీకరణకు సంబంధించిన వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. 15 రోజుల వ్యవధిలో విచారణ ప్రక్రియ పూర్తిచేసి ధ్రువీకరణ పత్రాన్ని రిజిస్ట్రేషన్ వివరాల్లో పొందుపరిచిన అడ్రస్, ఈ మెయిల్‌కు పంపిస్తారు. 15 రోజుల్లో పత్రాలు అందక పోతే ఇదే వైబ్‌సైట్ ద్వారా ‘సర్టిఫికేషన్ డిలే’కు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. అప్రూవల్ అయితే సీఆర్‌ఎస్ వెబ్‌సైట్ ద్వారానే సర్టిఫికెట్‌ను పొందే అవకాశం ఉంది.ఉగాది వేడుకల్లో పవన్‌‌కు చంద్రబాబు కౌంటర్!

Updated By ManamSun, 03/18/2018 - 13:31

CM Counter Attack On Janasena Chief

విజయవాడ: జిల్లాలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, దేవదాయ ధర్మాదాయశాఖల ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా చంద్రబాబు పాల్గొని ఉగాది పచ్చడి రుచి చూశారు. మనవడు దేవాన్ష్‌కు బాబు ఉగాది పచ్చడి తినిపించారు. అనంతరం కార్యక్రమంలో మాట్లాడిన ఆయన కేంద్రం, ప్రతిపక్షాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్  కల్యాణ్‌కు మరోసారి పరోక్షంగా బాబు కౌంటర్ ఇచ్చారు.

హామీలన్నీ చిత్తశుద్ధితో అమలు చేయాలి..
కేంద్రంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు పార్లమెంట్‌లో పెట్టినటువంటి.. బిల్లులో ఉండే అంశాలన్నీ.. రాజ్యసభలో మీరు ఇచ్చిన హామీలన్నీ చిత్తశుద్ధితో, స్పూర్తిదాయకంగా అమలు చేయాలని కేంద్రానికి బాబు కోరారు. ఆ రోజు రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీకి 2014 ఎన్నికల్లో డిపాజిట్లు రాలేదన్నారు. శనివారం కాంగ్రెస్ ప్లీనరిలో మళ్లీ హోదా అంశాన్ని ప్రస్తావించారని..  మేము ఈ హామీలన్నీ నెరువేరుస్తామని చెప్పే స్థితికి ఆ పార్టీ వచ్చిందన్నారు.

కేంద్రం.. సహాయ నిరాకరణ
కేంద్రం సహాయం చేయకున్నా.. అన్ని విధాలు ఏపీని ఆదుకుంటోందని చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనకు వ్యతిరేకంగా వాళ్లు పనిచేస్తూ (ప్రతిపక్షాన్ని ఉద్దేశించి) ఇక్కడికొచ్చి తన మీద విరుచుకుపడి రాష్ట్రంలో ఏదో జరిగిపోయిందని జనాల్లో అశాంతి సృష్టించే పరిస్థితులు తెస్తున్నారన్నారు. ఇది మంచి పద్దతి కాదని చంద్రబాబు తెలిపారు. " ఇవాళ నేను బలహీన పడితే ఏపీ రాష్ట్రం బలహీనపడుతుంది. రాష్ట్రం బలహీనపడితే రాష్ట్ర ప్రజానీకం బలహీనపడతారు, వారికి నష్టం జరుగుతుంది. అందుకే ఎవరు ఎన్ని చేసినా ఊరుకునేది లేదు. తమిళనాడు రాజకీయాల్లాగా మన రాష్ట్రంలో కూడా రాజకీయాలు చేయాలని కొందరు అనుకుంటున్నారు. ఈ రాష్ట్రం తమిళరాజకీయాల్లాగా జరగవు.. జరగనివ్వనని హెచ్చరిస్తున్నాను. నాయకత్వాన్ని బలహీనపరచడం.. అనిగిమనిగి ఉన్నవారిపై ఎదురుదాడి చేయడం.. ఎదురుదాడి చేయించడం మంచి పద్ధతి కాదు" అని బాబు హెచ్చరించారు. 

పవన్‌కు మళ్లీ కౌంటర్..!
ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజధాని భూముల గురించి మాట్లాడిన సంగతి తెలిసింది. ఉగాది వేడుకల సందర్భంగా సభలో మాట్లాడిన సీఎం.. పవన్‌కు గట్టి కౌంటరిచ్చారు. "కొంతమంది వ్యక్తులు రాజధానికి 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల స్ఫూర్తిని పరిగణనలోకి తీసుకోకుండా, ఇంత భూమి ఎందుకని తనను ప్రశ్నిస్తున్నారు. ప్రపంచంలో ఏ నగర నిర్మాణమూ ఆకాశంలో జరగలేదు. అన్ని రకాలుగా అమరావతికి ఎలాంటి ఇబ్బందులూ రాకూడదనే తాను స్వచ్ఛందంగా భూములు ఇవ్వాలని రైతులు కోరితే, వారంతట వారే ముందుకొచ్చి తమ భూములు ఇచ్చారు" అని పవన్ పేరు చెప్పకుండా చంద్రబాబు పరోక్షంగా కౌంటరిచ్చారు.

రాజధాని అంటే నాలుగు భవనాలేనా? 
ఇప్పటికే అసెంబ్లీ, సెక్రటేరియేట్ కట్టామని, హైకోర్టు వంటి ఇంకొన్ని భవనాలు కట్టేస్తే సరిపోతుందని బాబు స్పష్టం చేశారు. అసలు రాజధాని అంటే నాలుగు భవనాలేనా? అని ఆలోచించి చూడాలని కాసింత కోపంగా బాబు అన్నారు. రాజధానంటే ఇది కాదని, ప్రజలు వచ్చి ఉండాలని, మౌలిక వసతులు కావాలని, నాణ్యమైన, విశాలమైన రోడ్లు ఉండాలన్నారు. తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగళూరు, మహారాష్ట్రకు ముంబై ఉన్నట్టే తెలుగువారికో నగరం ఉండాలా? వద్దా? అని ప్రశ్నించారు. అందుకే ఎంతమంది ఎన్నా మాట్లాడినా తాను బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మించాలనే కృత నిశ్చయంతో ఉన్నానని బాబు చెప్పుకొచ్చారు.

ఆంధ్రులు గర్వించేలా రాజధాని..
అమరావతికి 34 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల నమ్మకాన్ని నిలబెట్టి ఆంధ్రులు గర్వించేరీతిలో రాజధాని నిర్మిస్తామని చంద్రబాబు చెప్పారు. అరచేతిని అడ్డుపెట్టి ఉదయించే సూర్యుడిని, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేరని అన్నారు. గతంలో కేంద్రం కుట్రలను తిప్పికొట్టిన చరిత్ర ఏపీ ప్రజలకు ఉందని, ఏపీతో చెలగాటమాడితే ఎంతటివారికైనా పరాభవం తప్పదని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ఆగ్రహంతో చెప్పారు.

ఫస్ట్ టైం మనవడితో ఉగాది పచ్చడి..
ఇవాళ తన మనవడు దేవాన్ష్ కలిపిన ఉగాది పచ్చడినే తాను తొలుత తిన్నానని బాబు చెప్పుకొచ్చారు. ఆరు రుచుల్లోనే జీవితసారం ఇమిడి ఉందని అన్నారు. అందులోని వేపపువ్వు చేదుతో తన మనవడికి పెద్దగా నచ్చినట్టు లేదని, రెండు సార్లు తిని, ఇక సరిపోయిందన్నారు. చింతపండు పులుపుతో నేర్పుగా వ్యవహరించాలన్న సంకేతం ఉందని, పచ్చి మామిడి రుచితో కొత్త సవాళ్లు ఎదురవుతాయన్నారు. కారంతో సహనం కోల్పోయే పరిస్థితి వస్తుందని, దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు. ఉగాది పచ్చడిలో ఎంతో నిగూఢార్థం ఉందని, నేడు పంచాంగ శ్రవణాన్ని ప్రతి ఒక్కరూ వినాలని, భవిష్యత్తులో ఎలాంటి మార్పులు సంభవిస్తాయన్న విషయాలను తెలుసుకోవాలన్నారు.

CM Chandrababu Counter Attack On Janasena Chief Pawan In Ugadi Celebrations

Related News