Central govt

కేకే మాకు మద్దతివ్వండి..: టీడీపీ ఎంపీలు

Updated By ManamSun, 07/15/2018 - 20:18

TDP MPS Mets TRS MP Kesava Rao Over No Motion On Central Govt

హైదరాబాద్: ఏపీకి జరిగిన అన్యాయాన్ని దేశంలోని అన్ని పార్టీల ముఖ్యనేతలకు వివరించి కేంద్రంపై యుద్ధం ప్రకటించేందుకు టీడీపీ సన్నాహాలు చేసింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎంపీలను.. టీడీపీ ఎంపీలు ఎంపీలు సుజనాచౌదరి, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, శ్రీరామ్ మాల్యాద్రి కలిసి పార్లమెంట్‌లో కేంద్రంపై అవిశ్వాసం పెట్టేందుకు మద్దతు ఇవ్వాలని కోరారు.

ఎంపీలతో సమావేశం అనంతరం కేశవరావు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి అన్యాయం జరిగిన నేపథ్యంలో కేంద్రంపై అవిశ్వాసతీర్మానం పెట్టేందుకు మా మద్దతు కావాలని కోరారు. ఈ విషయమై టీఆర్ఎస్ ముఖ్యనేతలంతా కలిసి చర్చించుకుని ఓ నిర్ణాయానికి వస్తామని బదులిచ్చాం. విభజన హామీలను రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం అమలు చేసి తీరాల్సిందే. ఇది రెండు రాష్ట్రాలకు చెందిన అంశం" అని ఆయన చెప్పుకొచ్చారు.



చంద్రబాబు చివరి ప్రయత్నం ఫలించేనా?

Updated By ManamSun, 07/15/2018 - 19:39

Will Chandrababu Success Final Attempt On Centre

అమరావతి: ఏపీకి కేంద్రం ఇచ్చిన విభజన హామీలు, నిధులు రాబట్టుకునే విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు మరో అడుగుముందుకేశారు. త్వరలో చివరి పార్లమెంట్ సమావేశాలు జరగనుండటంతో కేంద్రంపై ఆఖరి అస్త్రం వదిలేందుకు సీఎం సిద్ధమయ్యారు. మొదట జాతీయ స్థాయి పార్టీ నేతల మద్దతు కూడగట్టుకునే పనిలో టీడీపీ ఎంపీలు నిమగ్నమయ్యారు. ఇందుకు ఎంపీలతో కూడిన ఆరు బృందాలను చంద్రబాబు తయారుచేశారు. ఈ క్రమంలో టీడీపీకి చెందిన ఎంపీలందరూ 18పార్టీల నేతలను కలవనున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై టీడీపీ పోరాటానికి మద్దతు కోరనున్నారు. చంద్రబాబు లేఖలను ఆయా పార్టీల నేతలకు ఎంపీలు అందజేయనున్నారు. 

టీఎంసీ, బీజేడీ, ఆప్, ఎస్ఏడీ నేతలను సుజనా చౌదరి, అవంతి శ్రీనివాస్, జేసీ, మాల్యాద్రి కలవనున్నారు. సీపీఎం, సీపీఐ, శివసేన, ఎన్సీపీ నేతలను తోట నర్సింహం, మాగంటిబాబు, రవీంద్రబాబు కలుస్తారు. డీఎంకే, ఏఐడీంకే, జేడీఎస్, ఎస్పీ, బీఎస్పీ నేతలను సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, మురళీ మోహన్ కలవనున్నారు. జేడీయూ, ఆర్జేడీ, ఎల్జేపీ నేతలను గల్లా జయదేవ్, గరికపాటి మోహన్‌రావు, రవీంద్ర, టీఆర్ఎస్, ఎంఐఎం, కేరళ కాంగ్రెస్ నేతలను అశోక్ గజపతిరాజు, నారాయణ, నిమ్మలకిష్టప్ప, ఎన్.శివప్రసాద్ కలవనున్నారు. ఎన్ఎల్డీ, రాష్ట్రీయ లోక్‌దళ్, ఎస్డీఎఫ్, ఆర్పీఐ, మిగతా లెఫ్ట్ పార్టీలను రామ్మోహన్ నాయుడు, బుట్టా రేణుక, సీతారామలక్ష్మి కలిసి ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివరించనున్నారు. అంతేకాదు అవసరమైతే పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెట్టాలని కూడా ఇదివరకే ఎంపీలకు చంద్రబాబు సూచించారు. అయితే చంద్రబాబు చేస్తున్న ఈ ఆఖరి ప్రయత్నం ఎంతమేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.



పోలవరంపై ఇంకా అభ్యంతరాలు, అనుమానాలు!

Updated By ManamWed, 07/11/2018 - 19:20

Central govt Still Arguments and Doubts On Polavaram project

పోలవరం: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి పోలవరం పనుల పరిశీలనకు ఏపీకి వచ్చారు. ఈ సందర్భంగా ఏపీ  సీఎం చంద్రబాబుతో కలిసి సుమారు అరగంటపాటు పనులను పరిశీలించారు. పనుల పురోగతిని కేంద్రమంత్రికి బాబు వివరించడం జరిగింది. కేంద్ర మంత్రి రాకతో ఓ వైపు టీడీపీ.. మరోవైపు బీజేపీ వేర్వేరుగా వేదికలను ఏర్పాటు చేసి ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 2019 డిసెంబర్ నాటికి డెడ్‌లైన్ పెట్టుకున్నామని  టార్గెట్‌గా పెట్టుకొని పనులు చేస్తున్నామన్నారు. ఫిబ్రవరి నాటికి కాంక్రీట్ పనుల్ని పూర్తిచేస్తామన్నారు. మెజార్టీ పనులన్నీ ఏప్రిల్ కల్లా పూర్తి చేసేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. డీపీఆర్-2ను కూడా వీలైనంత త్వరగా క్లియర్ చేయాలని కేంద్రాన్ని ఈ సందర్భంగా బాబు కోరారు. 2013 చట్టం ప్రకారం ఖర్చు అంచనాలు పెరిగాయన్నారు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరానికి రూ. 57,940 కోట్లు అవసరమని కేంద్రమంత్రికి బాబు వివరించారు. భూ సేకరణకు రూ. 33వేల కోట్లు అవసరమన్నారు. పెండింగ్‌లో ఉన్న నిధులన్ని విడుదల చేయాలని ఈ సందర్భంగా బాబు కేంద్ర మంత్రికి వివరించారు. కాగా బాబు మాట్లాడుతున్నంత సేపు గడ్కరీ తథేకంగా ఆయనవైపే చూడసాగారు.

నితిన్ గడ్కరీ మాట్లాడుతూ..
"
పోలవరం ఏపీకే కాదు దేశానికి కీలకమైన ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్టు రైతులకు కొత్త జీవితాన్నిస్తుంది. పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉంది. ప్రాజెక్టు పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. పోలవరం ఏపీకే కాదు.. దేశానికి కీలకమైన ప్రాజెక్ట్. పనులు పూర్తి చేసేందుకు నిధుల్ని అడ్వాన్స్‌గా చెల్లించాలని సీఎం కోరారు. పోలవరం పూర్తి చేయడానికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారు. ప్రాజెక్ట్ ఏపీకి కొత్త జీవితాన్నిస్తుంది.

త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను కోరాము. భూసేకరణ, పరిహారం కోసం నిధులు చెల్లించాలంటే ఫైనాన్స్ కమిషన్ అనుమతి కావలి. పోలవరం భూసేకరణ ఖర్చు దాదాపు రెట్టింపు అయింది. పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రాజెక్ట్ వేరు.. రాజకీయాలు వేరు. ప్రాజెక్టును పూర్తి చేసే విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావు లేదు. ముందుగా గిరిజనులకు పరిహారం విషయాన్ని సెటిల్ చేయాల్సి ఉంది. కేంద్ర, రాష్ట్ర అధికారులు మూడు రోజుల పాటు ఇక్కడే మకాం వేసి సమస్యలను పరిష్కరించాలని సూచించాను. పెరిగిన ప్రాజెక్టు అంచనాను ఆర్థిక శాఖకు పంపిస్తాము. నీటి సదుపాయం ఉంటే ఎంతమేలు జరుగుతుందో నాకు తెలుసు" అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.

మొత్తానికి చూస్తే.. పోలవరం విషయంలో కేంద్రం ఎలాంటి హామీలివ్వకపోగా కొర్రీలు పెట్టడం గమనార్హం. తాజా డీపీఆర్‌పై అభ్యంతరాలు, అనుమానాలు కేంద్రం వ్యక్తం చేయడమేంటో అర్థం కాని పరిస్థితి. కనీసం అడ్వాన్స్ ఇచ్చేందుకు కూడా కేంద్రం ముందుకురాకపోవడం విచిత్రం. ఇవన్నీ అటుంచితే పునరావసంపై కూడా గడ్కరీ అనుమానాలు వ్యక్తం చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్యాకేజీ భారం పెరిగిందని సీఎం చంద్రబాబు కేంద్రానికి విన్నవించుకున్నా ఎలాంటి ఫలితం లేకపోయిందన్నది స్పష్టంగా అర్థమవుతోంది. పెరిగిన ప్యాకేజీతో పాటు సేకరించిన భూమి కూడా పెరుగుతోందని గడ్కరీ.. సీఎం బాబునే నిలదీయడాన్ని పలువురు విశ్లేషకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.



పోలవరం వద్ద బీజేపీ వర్సెస్ టీడీపీ

Updated By ManamWed, 07/11/2018 - 17:47

tdp leaders vs bjp leaders at polavaram project

పోలవరం: పోలవరం ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు ఢిల్లీ నుంచి వచ్చారు. దీంతో ఆయనకు ఆహ్వానం పలికేందుకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, కార్యకర్తలు విచ్చేశారు. అయితే ఇదే క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా పోలవరంకు రావడం.. ఆయన వెంట కొందరు మంత్రులు కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా.. గడ్కరీ వచ్చే హెలిప్యాడ్ వద్దకు అనుమతించాలని బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అయితే పాస్‌లు ఉన్నవారిని మాత్రమే పంపుతామని పోలీసులు చెప్పడంతో బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఈ క్రమంలో పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. ప్రాజెక్టు పరిశీలన అనంతరం ప్రాజెక్టు వద్దే పార్టీ నేతలు, నిర్వాసితులతో గడ్కరీ సమావేశం అవుతారని తెలుస్తోంది.

ఈ సందర్భంగా.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. గడవులోగా పోలవరాన్ని కేంద్రం నిర్మించి తీరుతుందన్నారు. కేంద్రం నిర్మిస్తున్న పోలవరంపై రాష్ట్రం పెత్తనం ఏంటి..? అని కన్నా వ్యాఖ్యానించారు. ప్రజలకు నిజాలు చెప్తున్నామని మాపై దాడులు చేస్తున్నారన్నారు. దీంతో టీడీపీ, బీజేపీ నేతల మధ్య మరోసారి మాటల యుద్ధం నెలకొంది. పోలవరంపై రాష్ట్రానికి కేంద్రం ఒక్కరూపాయి కూడా బాకీలేదన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు రాష్ట్రానికి ఏం సంబంధం లేదని ఈ సందర్భంగా కన్నా స్పష్టం చేశారు. కేంద్రం, కాంట్రాక్టర్ల మధ్య రాష్ట్ర ప్రభుత్వం సమన్వయకర్త మాత్రమేనన్నారు. కాగా తాజా వ్యవహారాలపై నేతలు, పార్టీ శ్రేణుల చర్చలో భాగంగా.. ఇటీవల జరిగిన దాడులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు కన్నా సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే విషయం విన్న తర్వాత కేంద్ర మంత్రి నుంచి ఎలాంటి రిప్లై వస్తుందో వేచిచూడాల్సిందే.



'మరోసారి టీడీపీ గెలుపు చారిత్రక అవసరం'

Updated By ManamThu, 05/17/2018 - 18:36

TDP, Historical needed, Chandrababu naidu, Neeru-Pragathi programme, Central govtకందుకూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ టీడీపీ గెలుపు ఓ చారిత్రక అవసరమని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లాలోని కందుకూరులో గురువారం  ‘నీరు-ప్రగతి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో సమర్థమైన, మెరుగైన పాలన అందిస్తున్నామన్నారు. ప్రభుత్వంతో లాభం పొందే ప్రతి వ్యక్తి ప్రభుత్వానికి సహకరించాలని చెప్పారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రతిఒక్కరూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. ధర్మపోరాటం కొనసాగించాలని, హక్కులను సాధించాలనే ఆవేశం, ఆలోచన అనునిత్యం రావాలని సీఎం ఆకాంక్షించారు. తక్కువ వనరులు ఉన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తుంటే రాష్ట్రంలో ప్రతిపక్షాలు తమపై విమర్శలు చేయడం బాధాకరమన్నారు.

ప్రజలకు మెరుగైన పాలన అందించడం, ఎవరికీ ఇబ్బందులు లేకుండా చేయడం, ఆర్థిక అసమానతల్ని తగ్గించడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. తాను ప్రజల సంక్షేమం కోసమే కష్టపడుతున్నట్టు చెప్పారు. ప్రతిపక్ష నాయకుడు, వైకాపాలో అవినీతిపరులు కొందరు తనను విమర్శిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఏకవచనంతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అయినా ఆ మాటలన్నీ ప్రజల కోసమే పడుతున్నానన్నారు. దీనిపై ప్రతి ఇంట్లో, ప్రతి వూళ్లొ చర్చ జరగాలన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చేది దయాదాక్షిణ్యాపై కాదని, అతి రాష్ట్ర ప్రజల హక్కు అన్నారు. 



'ఆయన చెప్పినట్టే వైఎస్ఆర్సీపీ నడుస్తోంది'

Updated By ManamThu, 04/26/2018 - 16:20

Varla Ramaiah, Central govt, Amith shah, YSRCP, Modi govtవిజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య విమర్శించారు. గురువారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని బీజేపీ నేతలను వైఎస్సార్ సీపీలో చేర్చుకోవద్దని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. జగన్‌కు ఫోన్ చేయడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. వైసీపీలో చేరాలనుకున్న కన్నా లక్ష్మీనారాయణ ఆరోగ్యం బాగోలేదంటూ ఆస్పత్రిలో చేరడం వెనుక అమిత్ షా ఉన్నది నిజం కాదా? అనే ప్రశ్నను సూటిగా సంధించారు.

వైఎస్ జగన్ చెప్పినట్టు కాకుండా అమిత్ షా చెప్పినట్టు వైఎస్సార్ సీపీ నడుస్తోందని ఆరోపించారు. విభజన హామీలు, ప్రత్యేక హోదాను అమలు చేయాల్సింది చంద్రబాబు కాదని.. కేంద్ర ప్రభుత్వమని అన్నారు. జగన్ కేసులపై ఏం తెలుసని కేంద్రమంత్రి రాందాస్ వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఎన్డీయేలోకి ఆహ్వానిస్తామంటూ వ్యాఖ్యానించారని వర్ల రామయ్య విమర్శించారు.



20న సీఎం చంద్రబాబు నిరాహార దీక్ష

Updated By ManamSat, 04/14/2018 - 15:10

AP CM chandrababu naidu, Pawan kalyan, JFC committee అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకరోజు నిరాహార దీక్ష చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 20న తన పుట్టినరోజున చంద్రబాబు నిరాహార దీక్ష చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఢిల్లీ చక్రం తిప్పుతామని, ఢిల్లీని శాసించబోయేది టీడీపీనే అని ఆయన అన్నారు. 25 వరకు ఎంపీ సీట్లు గెలిస్తేనే ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారు. టీడీపీ అంటే ఏమిటో దేశానికి చూపుతామని తెలిపారు. ఈ ఏడాది చివర్లోగా 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. రాజ్యాంగం మంచిదైనప్పటికీ.. అమలు చేసే వాళ్లు చెడ్లవాళ్లైతే చెడ్డదవుతుందని అంబేడ్కర్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. ఎస్సీలో సమర్థవంతమైన నాయకత్వం తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు.

విదేశాలకు వెళ్లే విద్యార్థులకు రూ.15 లక్షలే కాదు.. అన్నిరకాల సాయం చేస్తామని తెలిపారు. డప్పు కళాకారుల పింఛన్ల కోసం రూ. 12 కోట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టానికి రక్షణ కల్పించేందుకు దేశవ్యాప్తంగా పోరాటం చేస్తామన్నారు. దళితుల ఆదాయం పెంచేందుకు నిరంతరం కృషి చేస్తామని చంద్రబాబు తెలిపారు. బాల సంజీవని పేరుతో పిల్లలకు పౌష్టికాహారలోపం నివారించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. 2019లో టీడీపీ మద్దతిచే పార్టీనే కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్నారు.



'విభజనతో ఏపీని ముంచారు.. నష్టాన్ని కేంద్రమే భర్తీ చేయాలి'

Updated By ManamWed, 04/04/2018 - 17:15
  • నాలుగేళ్లలో 29 సార్లు ఢిల్లీకి వచ్చాను.. ఏపీకి న్యాయం కోసం నాలుగేళ్లుగా ఎదురుచూశాం

  • కేంద్రం తీరుతో ఏపీ ప్రజలు విసుగెత్తిపోయారు.. 5 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు

Chandrababu naidu slams Central govt on AP bifurcation Issues and promisesన్యూఢిల్లీ: విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వమే భర్తీ చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏపీని కేంద్రం నిండా ముంచిందని, రైల్వే జోన్ హామీని కూడా అమలు చేయలేదని అన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు వివిధ పార్టీల నేతలతో సమావేశమై ఏపీకి జరిగిన నష్టాన్ని వివరించారు. లోక్‌సభలో టీడీపీ ఎంపీలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. ఏపీకి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీల వీడియోను చంద్రబాబు ప్రదర్శించారు. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టాన్ని బుధవారం సాయంత్రం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఆయన వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు జాతీయ మీడియాతో మాట్లాడుతూ..‘ నాలుగేళ్లలో 29 సార్లు ఢిల్లీకి వచ్చాను. ఏపీకి న్యాయం కోసం నాలుగేళ్లుగా ఎదురుచూశాం. కేంద్రం తీరుతో ఏపీ ప్రజలు విసుగెత్తిపోయారు. 5 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. విభజన తర్వాత ఏపీ తలసరి ఆదాయం తగ్గింది.

పార్లమెంటులో ఎంపీల పోరాటంపై కేంద్రం స్పందించడం లేదు. ప్రత్యేక ప్యాకేజీ కోసం రెండేళ్లు ఎదురుచూశాం. ఇప్పుడు స్పెషల్ పర్పస్ వెహికల్ అంటున్నారు. విభజన వల్ల వచ్చే సమస్యలపై శ్వేతపత్రాలు విడుదల చేశా. చివరిసారిగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశా. ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చలేదు. ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని విభజన సమయంలోనే దీక్ష చేశా. పార్లమెంటులో చేసిన చట్టాలు అమలు కావడం లేదు. పార్లమెంటులో ఎంపీల పోరాటంపై కేంద్రంపై స్పందించడం లేదు. ప్రత్యేక హోదా కుదరదని 14వ ఆర్ధిక సంఘం చెప్పిందనడం అబద్దం. ఏ రాష్ట్రానికి హోదా, రాయితీలు లేవంటూనే కొన్ని రాష్ట్రాలకిచ్చారు. పోలవరం నిర్మాణ ఖర్చు పూర్తిగా కేంద్రమే భరిస్తుంది. పోలవరాన్ని రాష్ట్రమే పూర్తి చేస్తుందని నీతి ఆయోగ్ చెప్పింది.

నీతి ఆయోగ్ సిఫార్సు మేరకే పోలవరం నిర్మాణ బాధ్యతలు తీసుకున్నాం. పోలవరాన్ని రాష్ట్రమే పూర్తి చేసేందుకు కేంద్రం అంగీకరించింది. పోలవరానికి పెట్టిన ఖర్చులో ఇంకా రూ.3 వేల కోట్లు ఇవ్వాలి. పోలవరానికి సంబంధించి డీపీఆర్-2ను కేంద్రం ఆమోదించాల్సి ఉంది. ఏపీకి న్యాయం చేయాలని గతంలో జైట్లీ సభలో కోరారు. విభజన హామీలు అమలు చేస్తామంటేనే బీజేపీకి ఓట్లేశారు. పార్లమెంటులో చేసిన చట్టాలు అమలు కావడం లేదు. చిన్న అంశాలు మినహా రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదు. కనీస సాయం చేయకుండా మాపైనే విమర్శలా? హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామంటేనే ఒప్పుకున్నాం. దుగరాజపట్నం పోర్టు విషయంలోనూ హామీ నెరవేరలేదు. కేంద్రంతో కలిసి కొనసాగడం లాభం లేదని భావించాం. ప్రధానికి ఫోన్ చేసి ఇప్పటికీ ఎన్డీయేలో ఉన్నాం.. న్యాయం చేయాలని కోరా. అయినా కేంద్రం వైఖరిలో మార్పు లేదు. యూసీలు ఇచ్చినా.. ఇవ్వలేదని అంటున్నారు.. ఏదైనా ఉంటే నేరుగా చెప్పాలి బురద చల్లడం సరికాదు’ అని చంద్రబాబు వివరించారు.



ఏపీలో 4 రైల్వే స్టేషన్లకు అంతర్జాతీయ హోదా

Updated By ManamWed, 04/04/2018 - 13:01

International Status to railway stations, Andhra pradesh state, Central govt, Vijayawada, Guntur, Railway ministry న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 4 రైల్వేస్టేషన్లకు కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ హోదా కల్పించింది. ఏపీ రాజధాని ప్రాంతంలోని విజయవాడ, గుంటూరు, రాయలసీమలోని కర్నూలు, గుంతకల్లు స్టేషన్లకు అంతర్జాతీయ హోదాను కల్పించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే ఈ రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు రూ.25కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తూ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. కాగా, అంతర్జాతీయ హోదాకు సంబంధించి ఈ నెల 10లోగా ప్రతిపాదనలు పంపాలని అధికారులకు రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఈ రైల్వే స్టేషన్లు కొత్త రూపును సంతరించుకోనున్నాయి.



కేంద్రానికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్..!

Updated By ManamSun, 03/25/2018 - 13:39

CM Chandrababu Strong Warning To Centre
అమరావతి: ఎన్డీఏ నుంచి టీడీపీ విడిపోయిన మరుసటి క్షణం నుంచి.. బీజేపీ-టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. పార్టీ పరంగా పరంగా మొదలుకుని అదికాస్త వ్యక్తిగత విమర్శల వరకు చేరుకుంది. ఓ వైపు టీడీపీ నేతల విమర్శలు మరోవైపు ఏపీ బీజేపీ నేతలు, ఢిల్లీ స్థాయి నేతలు తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఈ తరుణంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా లేఖ రాయడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. కేవలం రాజకీయాల కోసమే టీడీపీ వైదొలిగిందని.. అభివృద్ధి అస్సలు కాదని లేఖలో ఆయన పేర్కొనడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్.. షా లేఖపై ఇప్పటికే స్పందించారు. అయితే ఆదివారం మధ్యాహ్నం సీఎం బాబు.. పార్టీనేతలతో టెలికాన్ఫరెన్స్‌లో షా లేఖపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ సీఎం చంద్ర (డ్ర) నిప్పులు చెరిగారు. 

నా సంగతి నీ కొడుకు సంగతి చూస్కో షా..!!
బీజేపీపై సీఎం చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. నా మీద, ప్రభుత్వంపై అవినీతి కేసులు వేయడమేంటి? అంటూ సీఎం తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ముందుగా అమిత్ షా కుమారుడు జై షా అవినీతి వ్యవహారం తేలాలన్నారు సీఎం. కొందరు తనపై కేసులు పెట్టాలని చూస్తున్నారని అంతకంటే ముందుకు షా కుమారుడు కేసుల సంగతి కూడా చూడాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే రూ. 50 నుంచి 16వేల రెట్లు ఏ రకంగా పెరిగిందనే వివాదం ఉందని.. దీనిపై అనేక రాజకీయ విమర్శలు వచ్చాయనే విషయాన్ని సమావేశంలో బాబు ప్రస్తావించారు. ఈ సందర్భంగా అసలు ఏపీలోని పార్టీలు తనవైపు ఉంటాయో.. కేంద్రం వైపు ఉంటాయో తేల్చుకోవాలని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యంగ వ్యవస్థని నాశనం చేసిందని ఆయన మండిపడ్డారు. 

రెండు చోట్లా అదే పరిస్థితి..!
"
గుజరాత్‌లో భారతీయ జనతాపార్టీ ఏం చేసింది?. ఒకే ఒక్క రాజ్యసభ స్థానాన్ని గెలుచుకోవడానికి అనేక పాట్లు, ఎన్ని అడ్డు దారులు తొక్కి వైఫల్యం చెందిందో తెలుసు. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌ను ఓడించేందకు ఎటువంటి కుయుక్తులు పన్నారో మీకు గుర్తు లేదా అంటూ కేంద్రానికి సీఎం సూటి ప్రశ్న సంధించారు. ఇలాంటి విషయాలు చాలానే ఉన్నాయని వాటన్నింటినీ రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని నేతలకు బాబు దిశానిర్దేశం చేశారు. నీతులు చెప్పే బీజేపీ.. యూపీ.. గుజరాత్‌లో రాజ్యసభ సీటు కోసం ఏం చేశారో తెలియదా?. టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలే తక్కువగా ఉన్నా.. విలువల కోసం మూడో స్థానానికి పోటీ పెట్టలేదు" అని నేతలకు సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారని తెలుస్తోంది.

కేంద్రంపై భయపడేది లేదు..!
ఆదివారం టీడీపీ నేతలతో జరిపిన టెలికాన్ఫరెన్స్ కేంద్రంపై సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఈ సమావేశంలో సీఎం చేసిన వ్యాఖ్యలు తీవ్రతరం చేసేలా ఉన్నాయి. " కేంద్ర ప్రభుత్వంపై భయపడే ప్రసక్తే లేదు. కేసులతో పాటు ఇతరత్రా వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వంపై ఉసిగొల్పి బెదిరించే ప్రయత్నం చేస్తోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే ఇప్పటికే కొందరు బీజేపీ నేతలు ప్రాజెక్టులపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని అంటున్నారని.. వారి వ్యాఖ్యలను తిప్పి కొట్టాలని నేతలకు సూచించారు. అవినీతి అంటూ బురద చల్లాలని చూస్తే అంతే ఘాటుగా తాము కూడా రెస్పాండ్ అవుతామని.. అంతేకాదు ప్రశ్నల వర్షం కురిపిస్తామని అభిప్రాయాన్ని కలుగజేసే ప్రయత్నం చేశారు. బీజేపీ పెద్దలతో ఢీ అంటే ఢీ అనడానికి మేం కూడా సిద్ధంగా ఉన్నాము" అని నేతలతో బాబు అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు అంటూ చేసిన వ్యాఖ్యలపై కూడా సీఎం ఘాటుగా స్పందించినట్లు తెలుస్తోంది.





Related News