cars

ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో జోరు

Updated By ManamTue, 06/12/2018 - 22:50

carsన్యూఢిల్లీ:  ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు మే నెలలో మంచి వృద్ధిని సాధించినట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియాం) తెలిపింది. ఈ ఏడాది ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 19.65 శాతం పెరిగాయి. గతేడాది మేలో వీటి అమ్మకాలు 2.51,764 యూనిట్లుగా ఉంటే 2018 మేలో 3,01,238 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయని ‘సియాం’ పేర్కొంది. ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా క్రిందటేడాది మే కంటే 2018 మేలో 15 శాతం  పెరిగినట్లు ‘సియాం’ వెల్లడించింది. ఈ ఏడాది మేలో ద్విచక్ర వాహనాలు 12,21,559 యూనిట్లు విక్రయవువగా, 2017 మే నెలలో 10,60,744 యూనిట్ల అమ్మకమయ్యాయి. అన్ని కేటగిరీలకు చెందిన వాహనాల విక్రయాలు గతేడాది మేతో పోల్చుకుంటే  12.13 శాతం పెరిగినట్లు ‘సియాం’ తెలిపింది. దేశవ్యాప్తంగా 2017 మేలో వాహనాల అమ్మకాలు 20.35.610 యూనిట్లు కాగా 2018 మేలో 22,82,618 యూనిట్ల అమ్మకాలు నమోదైనట్లు ‘సియాం’ వెల్లడించింది.జర్మనీ కార్ మార్కెట్‌పై పిడుగుపాటు

Updated By ManamTue, 02/27/2018 - 20:27
cars

జర్మనీలోని అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. జర్మనీలోని పలు ప్రముఖ నగరాల్లో డీజిల్ కార్లను బ్యాన్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం జర్మనీలో కార్ల తయారీ సంస్థల పాలిట పెను శాపంలా పరిణమించనుంది. దాదాపు కోటి 20 లక్షల కార్లు రోడ్డెక్కలేని పరిస్థితి నెలకొననుంది. వీటిలో మార్పులు చేయడం ఖరీదైన వ్యవహారం కావడంతో కారు ఉత్పత్తి సంస్థలు కుదేలయ్యే పరిస్థితి ఏర్పడనుంది.

జర్మనీలో అధికారంలో ఉన్న ఏంజెలా మెర్కెల్ ప్రభుత్వం...డీజిల్ కార్లపై నిషేధాన్ని వ్యతిరేకించినా కోర్టు దీనికి ఆమోదం వేయడం సంచలనం రేకెత్తిస్తోంది. పలు ఇతర దేశాలు కూడా డీజిల్ కార్లపై నిషేధం విధించే యోచనలో ఉన్నాయి. ఆ దేశాల్లో కూడా నిషేధం అమలైతే మోడర్న్ ఆటోమొబైల్ పరిశ్రమకు కేంద్రంగా వర్ధిల్లుతున్న జర్మనీ పాలిట శాపంలా పరిణమించే ప్రమాదం ఉంది.వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Updated By ManamWed, 02/21/2018 - 09:50

Seven killed, 4 hurt as cars collide In Wanaparthyవనపర్తి: జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే తుదిశ్వాస విడిచారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడ్ని స్థానికులు ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు. 

హైదరాబాద్ నుంచి కర్నూలు వెళుతుండగా ఈ ఘోరం జరిగింది. కాగా ఈ ఘటనలో చనిపోయిన వారంతా హైదరాబాద్, వనపర్తి జిల్లా వాసులని తెలుస్తోంది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.దూసుకు పోతున్న వాహనరంగం

Updated By ManamSat, 01/27/2018 - 10:42
  • రాష్ట్రంలో భారీగా పెరిగిన విక్రయాలు

  • నిరుడు 4.79 లక్షల వాహనాల రిజిస్ట్రేషన్లు 

  •  కార్లపైనే అధిక మోజు.. 27% పెరుగుదల సర్కారుకు రూ.4 వేల కోట్ల ఆదాయం

carsఅమరావతి:నవ్యాంధ్రలో వాహన రంగం శరవేగంగా దూసుకుపోతోంది. ఏటికేడు వాహనాల విక్రయాలు భారీగా పెరిగిపోతున్నాయి. పేద, మధ్యతరగతి వర్గాల వారు ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేస్తుండగా. కొంచెం ఎగువ, సంపన్న వర్గాల ప్రజలు కార్ల కొనుగోలుకు ఆసక్తి కనబర్చుతున్నారు. ఈ క్రమంలో 2017లో ద్విచక్ర వాహనాల విక్రయాలు 25 శాతం, కార్ల విక్రయాలు 27 శాతం పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2016-17లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్ల సగటున 36 వేల వరకు కొత్త వాహనాల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.79 లక్షల వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2015-16తో పోలిస్తే నిరుడు 98,550 వాహనాలు అధికంగా అమ్ముైడెనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో 2016-17లో రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. వాహన రిజిస్ట్రేషన్ల ద్వారా సుమారు రూ. 4 వేల కోట్ల ఆదాయం వచ్చింది. సొంత వాహనం కోసం కసరత్తు సామాన్యుల ఆలోచన సరళిలో మార్పులు వస్తున్నాయి. తమ ఊరి పరిసరాల్లో చిన్నచిన్న పనులకు బస్సులు లేదా ప్రైవేటు వాహనాలపై ఆధారపడే కన్నా సొంత వాహనం ఉండడం మేలని భావిస్తున్నారు. దీంతో వాయిదా పద్ధతులలోనైనా ద్విచక్రవాహనాన్ని కొనుగోలు చేస్తున్నారు. 2016-17లో రాష్ట్ర వ్యాప్తంగా 3,84,370 ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు జరిగాయి. ఏడాదితో పోలిస్తే 25 శాతం పెరుగుదల ఉంది. మరోవైపు కాస్త మంచి ఉద్యోగం ఉన్నవారు, ఎగువ మధ్యతరగతి సంపన్న వర్గాల ప్రజలు కారు అవసరమని భావిస్తున్నారు. దీంతో 2016-17లో గణనీయంగా కార్ల కొనుగోళ్లు పెరిగాయి. ముఖ్యంగా విశాఖ, విజయవాడ, గుంటూరుల్లో కార్ల విక్రయాలు బాగా పెరిగాయి. రాజధాని ప్రాంత భూములకు భారీగా ధరలు రావడంతో కొందరు రైతులు కూడా కార్లను కొనుగోలు చేశారు. దీంతో 2015-16 కన్నా నిరుడు కార్ల కొనుగోళ్లలో 27 శాతం వృద్ధి నమోదయింది. గత ఏడాది విశాఖపట్నంలో అత్యధికంగా 5693 కార్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. తర్వాతి స్థానంలో కృష్ణా 4668, గుంటూరు 3211 కార్ల కొనుగోళ్లు జరిగాయి. 


ఏడాదిలో 26 శాతం వృద్ధి
2015-16లో 3,80,984 వాహనాల రిజిస్ట్రేషన్లు జరగ్గా 2016-17లో ఈ సంఖ్య భారీగా పెరిగింది. ఒక్క ఏడాదిలోనే వాహన రిజిస్ట్రేషన్లలో 26 శాతం వృద్ధి కనిపించింది. 2016-17లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,79,508 వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయి.
కృష్ణాజిల్లాలో అత్యధికంగా 57,369 వాహనాల రిజిస్ట్రేషన్ జరగ్గా.. విశాఖ జిల్లాలో 53,447 వాహనాల కొనుగోళ్లు జరిగాయి. 
తర్వాతి స్థానంలో గుంటూరు ఉంది. ఇక్కడ 52,576 వాహనాల విక్రయాలు జరిగాయి. రాయలసీమ జిల్లాల్లో అత్యధికంగా చిత్తూరులో 38,242 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇక విజయనగరం జిల్లాలో అతి తక్కువగా 13,969 వాహనాల కొనుగోళ్లు మాత్రమే
జరిగాయి. వాహనాల మీద లైఫ్ ట్యాక్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, యూజర్ చార్జీలు, ఇతర ఫీజుల రూపంలో ఖజానాకు ఆదాయం వస్తోంది. 2016-17లో అన్ని జిల్లాల నుంచి దాదాపు రూ.4758 కోట్లు ఖజానాకు చేరాయి. 2015-16తో పోల్చితే ఇది రూ.833 కోట్లు
అధికం. ఇక, తప్పనిసరి

Updated By ManamSun, 10/29/2017 - 15:17
  • ఎయిర్‌బ్యాగులు తెరుచుకోవాల్సిందే

  • వేగ అప్రమత్త సూచీలు మోగాల్సిందే

  • రివర్స్ పార్కింగ్ సెన్సర్లు ఉండాల్సిందే

  • 2019 జూలై 1 తర్వాతి కార్లన్నింటిలోనూ సేఫ్టీ ఫీచర్లు మస్ట్

న్యూఢిల్లీ, అక్టోబరు 29: ప్రస్తుతం బేసిక్ మోడల్ కార్లలో ఎయిర్‌బ్యాగులు, పార్కింగ్ సెన్సర్ల వంటి సేఫ్టీ ఫీచర్లు లేవు. తద్వారా ప్రమాదాలు సంభcars representationalవించినప్పుడు అవి లేకపోవడం వల్ల కలిగే తీవ్రత ఎక్కువగా ఉంటోంది. కానీ, ఇక నుంచి 2019 జూలై 1 తర్వాత తయారయ్యే కార్లన్నింటినీలోనూ అలాంటి ప్రాథమిక సేఫ్టీ ఫీచర్లు తప్పనిసరిగా ఉండాల్సిందే. దానికి సంబంధించిన విధివిధానాలకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. మరికొన్ని రోజుల్లో ఆ ఆదేశాలు వెలువడనున్నాయి. 2019 జూలై 1 తర్వాత నుంచి తయారయ్యే అన్ని కార్లలోనూ ఎయిర్‌బ్యాగులు, సీట్ బెల్ట్ రిమైండర్లు, వేగ అప్రమత్తత వ్యవస్థ (80 కిలోమీటర్లు దాటితే), రివర్స్ పార్కింగ్ సెన్సర్లు, సెంట్రల్ లాకింగ్ వ్యవస్థను మాన్యువల్‌గా సరిచేసుకునే విధానం వంటి వ్యవస్థలను తప్పనిసరిగా సంస్థలు పొందుపరచాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేవలం లగ్జరీ కార్లలోనే అలాంటి అత్యాధునిక ఫీచర్లన్నీ అందుబాటులో ఉన్నాయి. కాగా, 80 కిలోమీటర్ల వేగం దాటితే కార్లో ఏర్పాటు చేసే వ్యవస్థ ఆడియో సందేశాలను పంపిస్తుంటుందని, వంద దాటితే దాని స్వరం పెరుగుతుందని, 120 దాటితే ఆగకుండా ఏకధాటిగా స్పీడ్ తగ్గించేవరకు అలర్ట్ బజ్జర్ మోగుతూనే ఉంటుందని రవాణశాఖ అధికారి ఒకరు చెప్పారు. ప్రమాదాలు జరిగినప్పుడు సెంట్రల్ లాకింగ్ వ్యవస్థ ద్వారా కారు డోర్లు మూసుకుపోయి తెరుచుకోవు. అప్పుడు అందులోని ప్రయాణికులు బయటపడడం చాలా కష్టమైనపని. దీనిని అధిగమించేందుకే సెంట్రల్ లాకింగ్ సిస్టం ఉన్నా దానిని మాన్యువల్‌గా ఓవర్‌రైడ్ చేసుకునే వ్యవస్థను ఏర్పాటు చేసే కొత్త నిబంధనను తీసుకొచ్చారు. ఇక, రివర్స్‌లో పార్క్ చేసేటప్పుడూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని నివారించేందుకు రివర్స్ పార్కింగ్ సెన్సర్లనూ తప్పనిసరి చేశారు. ఈ వ్యవస్థ ద్వారా రివర్స్ గేర్ వేయగానే వెనక ఏవైనా వస్తువులుగానీ, ఎవరైనా ఉన్నా గానీ అద్దంలో చూపిస్తూ డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంటుంది. కాగా, ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే కారు ముందుభాగం, పక్కభాగం క్రాష్ టెస్టులనూ అమలు చేయవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

Related News