mathanam

రాజకీయాల్లో తిరుగులేని ముద్ర

Updated By ManamMon, 11/19/2018 - 07:54

aఅనేక అవమానాలు, సందేహాల మధ్య గుప్పె డు మందితో 2001 ఏప్రిల్ 27న ప్రారంభమైన గులాబీపార్టీ నేడు తెలంగాణలో అతిపెద్ద పార్టీగా మరోసారి అధికారం వైపు అడుగులు వేసేలా ఉండడం ఆశ్చర్యమే! 

ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించి ఉప ప్రాంతీయ పార్టీగా తెలంగాణాలో కొన్ని జిల్లాలు, కొంత ప్రాంతానికే పరిమితం అన్న విమర్శలు ఎదు ర్కొన్న పార్టీ నేడు ముందస్తు అడుగులు వేస్తూ జాతీ య ప్రధాన పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేయడం అద్భు తమే!

2001లో అప్పటి డిప్యూటి స్పీకర్‌గా ఉన్న కల్వ కుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ రాష్ట్ర సమితి      ఉద్యమ సంస్థను రాజకీయ పార్టీగా ప్రకటించిన నాటి నుంచి నేటివరకు పార్టీలో ఎన్ని ఒడిదుడుకు లు వచ్చినా, ఎన్ని పరిణామాలు సంభవించినా మొత్తంగా టీఆర్‌ఎస్ పార్టీ దుకాణం బంద్ చేయిం చాలనే కుట్రలు జరిగినా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా అంచెలంచెలుగా ఎదుగుతూ అప్రతి హతంగా కొనసాగడం అభినందించాల్సిందే!

impression in politics

1969 ఉద్యమం విఫలమైందనే విమర్శ ల కాలం నుంచి 2001 టీఆర్‌ఎస్ ఆవి ర్భావం వరకు తెలంగాణ ఉద్యమం నిరం తరంగా ఉంది. ఉద్యమ ఆకాంక్షలు ప్ర త్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రయత్నాలు కొనసాగాయి.

చర్చలు, వేదికలు, సమావే శాలు, పత్రికల్లో వ్యాసాలు, విశ్వవిద్యాలయాల్లో సెమినార్లు కొనసాగాయి. తెలం గాణ ప్రజల అర్తిని దుఃఖాన్ని జరుగుతున్న వివక్షలను ఎండగట్టే ప్రయత్నాలు జరిగాయి.

ప్రొఫెసర్ జయశంకర్ సారు, కాళోజి, కేశవరావు జాదవ్, బియ్యాల జనార్ధన్‌రావు వంటి వారు నిరంత రం ఆలోచనల్ని అందరికి పంచుతూనే ఉండగా ఇంద్రారెడ్డి, మేచినేని కిషన్‌రావు వంటివారు రాజకీయ ప్రయోగాలు చేశారు. తెలంగాణలో పలు విశ్వవిద్యాల యాల్లో తెలంగాణ పేరిట అక్కడక్కడా విద్యార్థి సం ఘాలు వెలిశాయి.

పి.వి.నర్సింహారావ్ ప్రధానమంత్రిగా ఉన్న సమ యంలో తెలంగాణ శాసనసభ్యుల ఫోరం పేరిట జానా రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్, టీడీపీ ఇతర ప్రతిపక్షాలతో కలిసి ఒక బృందం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి  వినతిపత్రం సమర్పించారు. ఇక్కడ ఎన్నో సమావేశాలు నిర్వహించారు.

1998లో బీజేపీ ‘ఒక ఓటు రెండు రాష్ట్రాలు’ పేరి ట ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తామని కాకినాడలో తీర్మానం చేసింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటే లక్ష్యం గా సామాజిక, సంఘాలు, ప్రగతిశీల విప్లవ భావ జాలం ఉన్న సంస్థలు ప్రముఖులంతా కలిసి 1997లో భువనగిరి జరిపిన సమావేశాలు చర్చకు తెరతీశాయి.

అయినా, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, ప్రకట నలు, తీర్మానాలు చర్చలు చేసినా ప్రత్యేక తెలంగాణ సాకారం కాలేదు. ప్రజల్లో మాత్రం ప్రత్యేక ఆకాంక్షలు మాత్రం సజీవంగానే ఉండిపోయాయి.

గతం పునాదులపై వర్తమానాన్ని బేరీజు వేసుకుం టూ భవిష్యత్ గురించి ఆలోచించే వాడే ఏ రంగంలో నైనా విజయం సాధిస్తాడు అలాంటి కోవకు చెందిన వాడే కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే ఆకాంక్ష ఇక్కడి ప్రజల్లో ఎంతగా ఉందో పసిగట్టి నివురుగప్పిన నిప్పులా ఉన్న పరిస్థితిని అంచనావేసి ప్రత్యేక రాష్ట్రం అజెండాను అనుసరించారు. 

2001లో పార్టీ స్థాపించడానికి ముందు కవులు, కళాకారులు మేధావులు వివిధ రంగ నిపుణులతో ఆయన వందల గంటల కొద్ది జరిపిన చర్చలు.... పార్టీ స్థాపించడమే కాదు, దానిని ఏ రకంగా నిర్మాణం చేసుకోవాలి... నిలబెట్టుకోవాలి కొనసాగించాలనే ముందస్తు వ్యూహాన్ని రచించుకొని పార్టీ ఏర్పాటు ప్రకటన చేశారు.
త్యాగాల పునాదుల మీదుగానే తెలంగాణను సాధిస్తామని ప్రకటించి, డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసనసభ్యత్వానికి ఆనాడు చేసిన రాజీనామా ఆయన లో నిబద్ధతను చాటింది.

ఎన్నికలు రాజకీయాలు ఉప ఎన్నికలు ఎన్నికల మధ్య పొత్తులు ఎత్తులతో తెలంగాణ అంశాల్ని జాతీ య రాజకీయ స్రవంతిలో ప్రధానంగా ఉండే విధంగా స్థానికంగా పార్టీ ఎదిగేలా ప్రయత్నిస్తూ బలం పెంచు కుంటూ ముందుకెళ్ళారు.
సందర్భాన్ని బట్టి కాంగ్రెతో పొత్తు పెట్టుకోవడం విభేదించడం తెలుగుదేశం, సీపీఎంలతో కూడా పొత్తు పెట్టుకుని ఇవన్నీ తెలంగాణ సాధనకు వేసిన ఎత్తు ఎత్తుగడలుగా చూపించడం సంపూర్ణ రాజకీయ పార్టీ గా తనను తాను ఆవిష్కరించుకుంది.

2009 ఎన్నికల్లో మహాకూటమి ద్వారా పోటీ చేసి న టీఆర్‌ఎస్‌కు చేదు అనుభవం ఎదురైంది. టీఆర్‌ఎస్ పని అయిపోయింది తెలంగాణ భవన్ ఖాళీ అనే స్థితి నుంచి ఫ్రీ జోన్ అంశాన్ని ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసి పడేలా వ్యూహ రచన చేసి ఏకంగా ఆమరణ నిరాహార దీక్ష అస్త్రాన్ని ప్రయోగించి కేంద్ర ప్రభుత్వంలో ఒక ప్రకంపన సృష్టించి డిసెంబర్ 9వ తేదీన చిదంబరం ప్రకటన వచ్చేలా చేసి మళ్ళీ పార్టీని పదింతలు పుంజు కునేలా చేశారు.

కేవలం ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్న పార్టీ కేంద్ర ప్రభుత్వంలో చలనం తీసుకువచ్చి రాష్ట్రాన్ని  సాధించడం, సాధించుకున్న రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు లేకుండా ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఒక సంచలనమే! అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించడం, రాజకీయ కోణంలో ఆలోచిస్తూ తలసాని, తుమ్మలతో పాటు టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ శాసన సభ్యులను, పార్లమెంట్ సభ్యులను చేర్చుకుని ఆ పార్టీలకు ‘వాయిస్’ లేకుండా చేయడం కేసీఆర్ రాజకీయ చతురతను తెలియ జేస్తుంది.

సంక్షేమ పథకాల పేరిట సబ్బండ జాతులకు దగ్గ రయ్యే ప్రయత్నంలో సఫలీకృతులయ్యారు. ముందస్తు వ్యూహంతో పక్కా ప్రణాళికతో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో మరోసారి అధికారం సాధించే దిశగా ముందుకెళ్తున్నారు. రాజకీయపార్టీ ఎలాగైనా విజయం సాధించాలనుకొంటుంది దానికోసం ఎన్ని ఎత్తుగడ లైనా వేస్తుంది. అతి కొద్దిమందితో ప్రారంభమై అప్రతి హతంగా అతిపెద్ద పార్టీగా అవతరించడం ఏకకాలం లో రాష్ట్ర రాజకీయాల్లో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ వేసిన ముద్ర చెరగనిది. విమర్శకులు సైతం మెచ్చు కునే ఫక్త్ రాజకీయనాయకుడు కేసీఆర్!

- రూపా సురేష్ 
(ఫ్రీలాన్స్ జర్నలిస్ట్)ఆదివాసీ గిరిజనుల పెన్నిధి

Updated By ManamMon, 11/19/2018 - 07:54

aభారతదేశం ఎన్నెన్నో చారిత్రక ఘట్టాలకు, చారిత్రక పోరాటాలకు నెలవు. నాటి ఆంధ్రప్రదేశ్‌లో, నేటి తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా అంటేనే ప్రకృతి వనరులు, జంతుజాలం, దట్టమైన అర ణ్యాలతో మమేకమైన ఆదివాసుల జిల్లాగా పేరొందినది. గోండ్వా నా రాజ్యం మొదలుకొని బ్రిటిష్, నైజాం పాలనతో పాటు ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా... ఆదివాసులు తమ అస్థిత్వం, స్వయంపాలన కోసం పోరాటమే జీవితంగా మారుతోంది. ఉమ్మడి రాష్ట్రంలోని ఆదిమజాతి సంక్షేమం గురించి పరిత పించిన రాజకీయ నేతలలో కోట్నాక భీమ్‌రావు ఆదివాసీలలో తొలి తరం నాయకుడు. గిరిజనులలో మొట్టమొదటి ఆదివాసీ మంత్రి. గోండు తెగకు చెందిన భీమ్‌రావు ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని బంబార గూడెంలో కోట్నాక జంగుమొకాసి, బాదుబాయిలకు రెండవ సంతానంగా జన్మించాడు. తన జీవితాన్ని (1933 - 2002) బడుగు బలహీన వర్గాలు, పేదల ఉన్నతికి అంకి తం చేసిన నిస్వార్థ సేవాపరాయణుడు. భీమ్‌రావు 1972-76, 1989-93 కాలంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పదవిలో ఉండగా ఆదివాసుల సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన ఆదర్శమూర్తి.

aస్వాతంత్య్రం సిద్ధించిన మలిరోజుల్లో (1948 - 1956) బీ.ఏ., ఎల్.ఎల్.బీ చదివిన భీమ్‌రావు గోండు గిరిజనులలో ప్రథమ పట్టభద్రుడు. గోండులలో ఏకైక ఐ.ఏ.ఎస్. దివంగత మడవి తుకారాం కంటే పూర్వమే (1957) గ్రూప్ -1 పరీక్షలలో ఉత్తీర్ణుడైన తొలి ఆదివాసీ విద్యావంతుడు ఆయన. ఉద్యోగాన్వేషణను విరమించుకొని ప్రజాసేవ సంకల్పంతో తన జీవిత గమ్యాన్ని రాజ కీయదిశగా మార్చుకొని నిస్వార్థ రాజకీయనేతగా ఖ్యాతినార్జిం చాడు. 1952లో మొదటిసారిగా ఆదివాసీ తెగల నుంచి పాడేరు  ఎం.పీగా ఎన్నికైన మల్లుదొర పార్లమెంటులో అరంగేట్రం చేయగా, 1962లో ఆసిఫాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన కోట్నాక భీమ్‌రావు రాష్ట్ర శాసనసభలోకి అడుగుపెట్టిన తొలి ఆదివాసీ ఎమ్మెల్యే.

పీ.వీ. నరసింహరావు మంత్రివర్గంలో (1972) గిరిజనులకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఆవిర్భవించింది. భీమ్‌రావు తొలి గిరిజన సంక్షేమ శాఖమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 1989లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా (రెండోసారి) గెలిచిన తర్వాత మర్రి చెన్నా రెడ్డి మంత్రివర్గంలో, నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి హయాంలో (1990), కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ప్రభుత్వంలో (1992-93) గిరిజన సంక్షేమ శాఖమంత్రిగా పనిచేయడం భీమ్‌రావు ప్రతిభకు, సేవాతత్పరతకు నిదర్శనం. తెలంగాణ రాష్ట్రంలోని గోండు, కోలాము, కోయ పరధాను, మన్నేవార్లు, నాయకపోడు మొదలైన గిరిజన తెగల వారికి అభివృద్ధి ఫలాలు అందిపుచ్చుకోవడానికి అవసరమైన బృహత్తర కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. 1973 - 74 మధ్య రాష్ట్రంలో ఆదిమ గిరిజనులు నివసించే 5,948 షెడ్యూల్డ్ ఏజెన్సీ గ్రామాల పరిధిలో తొమ్మిది సమగ్ర గిరిజనా భివృద్ధి సంస్థలు (ఐ.టి.డి.ఏ.) ఏర్పాటుకు కృషి చేసిన ఐ.టి.డి.ఏల రూపశిల్పి. ప్రస్తుతం ఐటిడిఏలు ఏటూరునాగరం (వరంగల్), శ్రీశైలం (కర్నూలు), ఊట్నూరు (ఆదిలాబాద్), పార్వతీపురం (విజ యనగరం), రంపచోడవరం (తూర్పుగోదావరి), సీతంపేట (శ్రీకాకుళం), పాడేరు (విశాఖపట్నం), భద్రాచలం (ఖమ్మం), ఏపీ, తెలంగాణ ప్రాంతాలలో ఉన్నాయి. గిరిజనులలో అక్షరాస్యతను పెంచి, చైతన్య వంతులను చేసేందుకు 1974-75 మధ్య ఐటిడిఏల ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను, తదుపరి గిరిజన వసతి గృహాలను ప్రారంభించారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా అనేక ఆదిమవాసీ గ్రామాల్లో విద్యుత్, పారిశుద్ధ్యం, వ్యవసాయం, గృహనిర్మాణాల పట్ల అత్యంత శ్రద్ధ కనబరిచారు. బీమ్‌రావు హాయంలోనే ఆదివాసులు ఆర్థికంగా నిలదొక్కుకోగలిగారు. గిరిజనుల్లో జీవన ప్రమాణాలు పెరిగి ఉద్యోగ, ఉపాధి  అవకాశాలు కూడా మెరుగుబడినవి.

భీమ్‌రావు భారీ, బంబార జాగీరు, మొకాసీఖాన్‌దాని వ్యక్తి ఐనందున గోండ్వానా రాజ్యం నుంచి దేశానికి స్వాతంత్య్రానం తరం గోండుల పోరాటాలు, చరిత్రను పరిశోధించిన అధ్యయనశీలి. 1940, సెప్టెంబర్ 1న నిజాం మూకల దాడిలో అమరుడైన ఆదివాసీల ఆశాజ్యోతి కొమురం భీం చరిత్రను తొలుత ‘సామల సదాశివ్’ చేత లోకానికి పరిచయం చేసిన ఘనత భీమ్‌రావుకే దక్కుతుంది. తర్వాత భీమ్ చరిత్రను అల్లం రాజయ్య, సాహూ, దేశ్‌పాండే నవలలుగా రచించారు. ఒక మంత్రి హోదాలోనూ గోం డు గిరిజనుల పండుగలు, సంస్కృతీ సంప్రదాయాలను ఆరా దించిన భీమ్‌రావు ఆదివాసుల ఆత్మబంధువు.

మారుతున్న సమాజంలో వచ్చే నూతన మార్పులను, కుటుం బ తగాదాలను స్వయంగా పరిష్కరించుకొనేందుకు హైమండార్ప్ - ఎలిజబెత్‌ల ఆధ్వర్యంలో ‘గోండ్వానా, రాయ్ సెంటర్, రాజ్ గోండ్ సేవాసమితి, అవ్వల్ కమిటీలను ఏర్పాటు చేశారు. నిజాం పాలనలో అనే (నిజాం-7) సర్కార్ ఏర్పాటు చేసిన ‘ఖదీ అభ్యాం’ శాఖ అనేది సోషల్ సర్వీస్, సోషల్ వెల్ఫేర్‌గా ఉండేది. దీని నుంచి ప్రత్యేకంగా ట్రైబల్ వెల్ఫేర్ (గిరిజన సంక్షేమశాఖ)గా అవతరిం చింది. ఆదివాసీల సంక్షేమం కోసం నిరంతరం కృషిచేసిన భీమ్‌రావు 2002 ఆగస్టు 29న కన్నుమూశారు. ఆదిలాబాద్ జిల్లాలో సిడాం అర్జు, కోవ లక్ష్మి (ప్రస్తుతం ఎమ్మెల్యే, అసిఫాబాద్) ఆధ్వర్యంలోని భీమ్‌రావు స్మారక సంక్షేమ సంఘం భీమ్‌రావు స్ఫూర్తితో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఐటిడిఏల రూపకల్పనకు భీమ్‌రావు చేసిన కృషి అనన్యమైనది. కాబట్టి భీమ్‌రావు విగ్రహాలను అన్ని ఐటిడిఏ ప్రాంగణాలలో నిర్మించి ఐటిడిఏ స్థాపకోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తే సబబుగా ఉంటుంది.

- గుమ్మడి లక్ష్మీనారాయణ
9491318409
(నేడు భీమ్‌రావు జయంతి)సేద్యాన్ని కుంగదీస్తున్న చిన్న కమతాలు

Updated By ManamSun, 11/18/2018 - 01:46

aవ్యవసాయ కమతాలు రాను రాను చిన్నవైపో తున్నాయి. భూముల పంపిణీ అస్తవ్యస్తంగా తయారవుతోందని 2015-16 నాటి వ్యవసాయ రంగంలోని వారి జనాభా గణాంకాల్లో తేటతెల్ల మైంది. వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే కమతం ఓ మోస్తరుగానైనా ఉండాలి. వ్యవ సాయ గణాంకాలనుబట్టి గ్రామీణ ప్రాంతాలలో సంక్షోభం పెరగడానికి కమతాలు చిన్నవి కావ డం కూడా ప్రధాన కారణం అని రుజువైంది.

2010-11లో 159.59 మిలియన్ హెక్టార్ల లో సేద్యం సాగితే 2015-16 నాటికి అది 157. 14 మిలియన్ హెక్టార్లకు పడిపోయిందని తాజా గణాంకల వల్ల తేలింది. అదే సమయంలో వ్య వసాయం చేసే కమతాలు 5.33 శాతం పెరిగా యి. 2010-11లో ఇవి 138 మిలియన్ హెక్టార్లు ఉంటే 2015-16 నాటికి 146 మిలియన్ హెక్టా ర్లకు పెరిగాయి. అంటే ఒక్కో రైతు సేద్యం చేసే కమతం ఇదివరకు సగటున 1.15 హెక్టార్లు ఉం టే ఇప్పుడది 1.08 హెక్టార్లకు తగ్గింది. అంటే వ్యవసాయదార్ల సంఖ్య పెరిగింది కాని కమతా లు కుంచించుకు పోయాయి. కమతం చిన్నదైన కొద్దీ ఉత్పత్తి తగ్గుతుంది.

2011 నాటి పరిస్థితినిబట్టి చూస్తే కమతా లు ముక్కలు ముక్కలు అవుతున్నాయి. పంపి ణీ అస్తవ్యస్తంగాa తయారవుతోంది. చిన్న, సన్న కారు రైతులు పెరుగుతున్నారు. 2015-16 నాటి కి చిన్న, సన్నకారు రైతులు 86.21 శాతం ఉన్నా రు. వీరికి రెండు హెక్టార్ల భూమి ఉండడమే గగనమైపోతోంది. అందులోనూ వీరు సేద్యం చేయగలిగిన భూమి 47.34 శాతం మాత్రమే. చిన్న, సన్నకారు రైతులు సేద్యం చేసే భూ విస్తీర్ణం 0.6 హెక్టార్లు మాత్రమే. ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి పేదరికంతో కొట్టుమిట్టాడే రాష్ట్రా లలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. 2 నుంచి 4 హెక్టార్ల భూకమతం ఉన్న వారు మొత్తం సేద్య భూమిలో 9.45 శాతమే. ఇందులో వ్యవసాయ పనులు జరుగుతున్నది 23.65 శాతం కమతా ల్లో మాత్రమే. 4 నుంచి 10 హెక్టార్ల భూమి ఉన్న రైతులు 3.76 శాతం అయితే అందులో నూ వ్యవసాయ పనులు కొనసాగుతున్నది 19.96 శాతం భూ కమతాల్లో మాత్రమే. పెద్ద కమతాలున్న వారి చేతిలో ఉన్న భూమి కేవలం 0.57 శాతం అయితే అందులో వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగేది 9.04 శాతమే. షెడ్యూల్డు కులాల వారి చేతిలో 9 శాతం భూమే ఉంది. సగటున వారికి ఉన్న కమతం 0.78 హెక్టార్లు. ఎస్.సి.ల చేతిలో ఉన్న భూమిలో 92 శాతం సన్న, చిన్నకారు రైతులే. దీన్ని బట్టి ఒక సామాజిక వర్గానికి భూమి చాలా తక్కువ అందుబాటులో ఉంది. చాలా రాష్ట్రాలలో ఈ విషయాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు.

వ్యవసాయ కమతాలు చిన్నవైనకొద్దీ వ్యవ సాయ ఉత్పాదకత పెరుగుతందా? కమతాలు చిన్నవైన కొద్దీ ఉత్పాదకత తగ్గిపోతోందని 1960, 1970లలో విపరీతమైన చర్చ జరిగిం ది. 2011 నాటి నేషనల్ శాంపుల్ సర్వే గణాంకాలను బట్టి చూస్తే పెద్ద కమతాలకన్నా చిన్న కమతాలలోనే ఉత్పాదకత ఎక్కువ ఉన్న ట్టు రుజువైంది. అయితే తలసరి ఉత్పాదకత త గ్గుతుంది. అందువల్ల పేదరికం తాండవిస్తుంది. చిన్న, సన్నకారు రైతులకు బ్యాంకు రుణాలు చాలా తక్కువగా అందుబాటులో ఉంటాయి. వారు పెట్టుబడి కోసం మధ్య దళారుల మీద ఆధారపడవలసి వస్తుంది.

అదీగాక ఒక హెక్టారు కన్న ఎక్కువ సేద్య పు భూమి ఉన్న రైతులకే నెలసరి ఆదాయం ఉంటుంది. అంటే వారికే ఇతర వనరుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. ఒక హెక్టారు కన్నా తక్కువ భూమి ఉంటే తగినంత ఆదాయం ఉం డదు. ఆదాయం తక్కువైతేనే వ్యవసాయ సంక్షో భం పెరుగుతుంది. కమతాలు చిన్నవైనకొద్దీ ఈ సమస్య ఇనుమడిస్తుంది. 2015-16 వ్యవసాయ గణాంకాల ప్రకారం 68.52 శాతం మంది చి న్న, సన్నకారు రైతులే. కానీ వీరిలో ఎస్.సి.లు 78.06 శాతం. వ్యవసాయం మీద ఆధారపడ్డ వారిలో ఈ వర్గాలవారే పేదరికంలో మగ్గి పోతు న్నారు. కులాల వారీగా సేకరించిన గణాంకాల ప్రకారం చూస్తే కుల వివక్షకు ఎక్కువగా గురి అవుతున్నది ఎస్‌సీలే వారికి వనరులు అందు బాటులో ఉండవు. అందువల్ల ఉత్పాదకతా తగ్గుతుంది.

వ్యవసాయేతర ఉపాధి అవకాశాలు తక్కు వ అయినందువల్ల కమతాలు చిన్నవైపోవడం వల్ల వారికి దుర్గతీ ఎక్కువే. వారికి ఇతర పను లు చేసే అవకాశమూ ఉండదు. వారి కష్టాలు తీర్చడానికి సేద్య యోగ్యమైన భూములను సం ఘటితం చేయవలసిన అగత్యం ఉంది. కౌలుదా ర్లకు రక్షణ కల్పించడానికి చట్టాలు, కౌలుకు తీసుకునే పద్ధతులను సరళీకృతం చేయడం, భూమి బ్యాంకులు ఏర్పాటు చేయడం లాంటి వాటి గురించి చర్చ జరిగినా కమతాలను సం ఘటితం చేయడం సులభం కాదు. చిన్న కమ తాలవల్ల ఉండే ఇబ్బందిని అధిగమించడానికి సహకార సేద్యాన్ని చిన్న, సన్నకారు రైతులు ఉత్పత్తిదార్ల కంపెనీలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించవచ్చు. అయితే కమతాలను సంఘ టితం చేయడంలో రాజ్య వ్యవస్థ కీలక పాత్ర పోషించాలి. ముఖ్యంగా సామాజికంగా వెనుకబ డిన వర్గాలవారిని ఆదుకునే ఏర్పాటు చేయాలి. అనేక రాష్ట్రాలు భూ సంస్కరణలు, వ్యవసాయ సంస్కరణలు అమలు చేయడంలో విఫలమైనా యన్న వాస్తవాన్ని గమనించాలి.

-  సీలోజు శివప్రసాద్గ్రామీణులపై ప్రపంచీకరణ పిడుగు!

Updated By ManamSun, 11/18/2018 - 01:46

aప్రపంచీకరణ నేపథ్యంలో నేడు ప్రపంచం కుగ్రామంగా మారి, శాస్త్ర, సాంకేతిక పురోగాభివృద్ధి వలన ప్రపంచంలో ఏ మూలాన ఏ సంఘటన జరిగిన క్షణాలలో ఆ వార్తా ప్ర పంచమంతటా వ్యాపిస్తోంది. అలాగే కట్టు బొట్టు అలంక రణ వేషధారణ ఆహారపు అలవాట్లు, సంస్కృతి ఆచారాలు, సాంప్రదాయాలలో పెనుమార్పులు సంభవించి, గ్రామాలు సైతం పట్టణాలుగా మారి, గ్రామీణ సంస్కృతిని దెబ్బ తీస్తున్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానం తక్కువుగా ఉన్న సమయంలో ఎక్కువ కాలం బతికి, సుఖమయ జీవితం గడపడానికి అన్నిరకాల అవకాశాలున్న నేడు నీటి బుడగలాంటి జీవితాలను కొనసా గిస్తున్నాము. రెండు దశాబ్దాల క్రితం గ్రామీణ సంస్కృతి, నాగరికత నేడు కనుమరుగయిందనడంలో ఎలాంటి ఆశ్చ ర్యం లేదు. నేడు ‘ఏకత్వంలో భిన్నత్వం’ల కులాలు, మతా లు పోటీలు, వర్గాలు, కక్షలు ఈర్ష అసూయలతో తన వారిని సైతం పట్టించుకోకుండా ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్లుగా మారిపోతున్నారు. 

గ్రామాలలో వుండే సంస్కృతి, సంప్రదాయాలు, కట్టు బాట్లు, ఆచారాలు, వివిధ కులవృత్తులను నేటితరం పుస్త కాలలో చదివి ఊహించుకునే పరిస్థితి అవసరం ఏర్పడు తోంది. ఒక్కసారి నాటి గ్రామాలను పరిశీలిస్తే, ఇప్పటి తరా నికి ఆ గ్రామ జీవితం అర్థం కావాలంటే అందరికి ఇష్టం ఉండే ‘ఫ్రూట్స్ సలాడ్’ అన్ని రకాల పండ్లతో చేసిన రసం లా అన్ని కులాలకు చెందిన కుటుంబాల వారు, వారి వృత్తు లను కొనసాగిస్తూ నిండుకుండలా ఆనందకర వాతావర ణంలో స్వేచ్ఛగా ఆరోగ్యకరంగా ఉండేది. ఇంకాస్త విపులం గా పరిశీలిస్తే గ్రామానికి అతి దగ్గరలో చెరువులు, కుంటలు, కాలువల వద్ద తాటిచెట్లు వేపుగా పెరిగే ‘దృశ్యాన్ని’ తల పించే విధంగా ఉండేవి. వాటి నుంచి ముంజలు, తాటిపం డ్లు, తాటికల్లు లాంటివి లభించేవి. అలాగే ఆకులతో పూరి ళ్లు, తాటి మొదళ్లతో చేసిన పట్టెలు, దూలాలు, తాటి నార తో వ్యవసాయ పనిముట్లు తయారు చేసేవారు. అలాగే రా మాయణ, భారత, భాగవతాలను, ఎన్నో గ్రంథాలను (తా టి ఆకులపై) తాళపత్రాలపై రచించి అందించిన చరిత్ర వార థిగా తాటిచెట్టు కొన్ని యుగాలుగా వర్థిల్లుతున్నది. తాటి చెట్లు అనగానే ముందుగా గుర్తువచ్చేది గౌడ కులస్తులు. వా రు రోజుకు మూడుసార్లు తాటిచెట్లు ఎక్కి కల్లు తీసేవారు. తీసిన కల్లును తాటివన సమూహ ప్రాంతంలో పెట్టి అమ్మ డాన్ని కల్లు మండువ అనేవారు. అలాగే అందుబాటులో తినుబండారాలు, వేటగాళ్లు పట్టుకొచ్చిన ఉడతలు, కంజు లు, కాల్చిన చేపలు, ఆరెకటిక వారు తెచ్చి రుచికరంగా వండి, అమ్ముకుని తమ జీవనోపాధిని కొనసాగించేవారు. కల్లు మండువ దగ్గరనే వివాహ సంబంధాలు కుదరడా నికి, విలువైన నిర్ణయాలు తీసుకోవడానికి, స్నేహశీలత గట్టిపడటానికి దోహదపడేవి. ‘దున్నేవానిదే భూమితో పాటు ఎక్కేవానిదే చెట్టు నినాదం’ మండువ నీడనే పుట్టింది. రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తికులా లకు, సంచార జాతులకు, సాంస్కృతిక కళాకారులకు కల్లు మండవే రచ్చబండ. అక్కడే గ్రామంలోని పలు రకాల సమస్యలు, మంచి, చెడుల గురించి చర్చ పరి ష్కార మార్గాలు జరిగేవి. స్వచ్ఛమైన కల్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేసవిలో వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. మూత్ర సంబంధిత వ్యాధులు రాకుండా కల్లు ఉపయోగప డుతుంది. నరాల బలహీనత, రక్తహీనత, మల బద్ధకం, కీళ్ల నొప్పులు లాంటి ఎన్నో వ్యాధులకు కల్లు మంచి ఔషధంగా పనిచేస్తుంది.
 

a

ప్రపంచీకరణ నేపథ్యంలో గ్రామాలల్లో తాటిచెట్లు లేకు న్నా, కాంపౌండుల్లో కల్లు తయారుచేసే సంస్థలు నెలకొల్ప బడుతున్నాయి. అలాగే వాడవాడలా బెల్టు షాపులు వెలసి విభిన్న రకాల మత్తు పానీయాలు లభించి, గ్రామీణ ప్రజలు వ్యసనాలకు బానిసలై ఆరోగ్యాలను పాడు చేసుకొంటున్నా రు. నాడు గౌరవంగా జీవనం కొనసాగించిన గౌడవృత్తుల వారు నేడు ఎక్కడున్నారు? ఎలా అయ్యారన్నది, వాళ్ళ ఆర్థిక పరిస్థితులకు కారణం ప్రపంచీకరణే అని చెప్పక తప్పదు. 

మనదేశంలో ప్రతి కులానికి, జాతికి ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఉన్నది. ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు ఉండేవి. ఇందులో ప్రధానంగా వెనుకబడిన వర్గానికి చెంది న ముదిరాజ్ (ముత్తరాసి, తెనుగు) కులం వీళ్ళు సహజ వనరులపై ఆధారపడి జీవించేవారు. చెరువు, కుంటలలో చేపలు పట్టడం, కొండలు, గుట్టలలో జంతువులను వేటాడ టం, లభించే సీతాఫలాలు తెచ్చి అమ్మడం, మామిడిపండ్లు, రేగిపండ్లు, జామపండ్లు ఇలా ఏ సీజన్లో లభించే పండ్లను ఆ సీజన్లో అమ్ముకోని జీవించేవారు. ప్రకృతి సౌందర్యానికి నెలైవెన చారిత్రకాత్మకమైన గుట్టలలో పగలగొట్టి, వాటిని వివిధ రకాల సైజులలో తయారుచేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. యురేనియం, భాస్వరం, ఇనుప ఖనిజం ఇంకా రకరకాల పేర్లతో గుట్టలలో తవ్వుతున్నారు. సహజ వనరు లను నాశనం చేస్తున్నారు. వాటిపై ఆధారపడి జీవించేవారి పరిస్థితి మరింత హీనం కావడానికి కారణం ప్రపంచీకరణే. చేనేతకు మూలమైన నేతకాని వృత్తికులాలకు నేడు ఏ పరి స్థితిలో ఉందో అందరికీ తెలిసిందే, వారు నాడు గ్రామాల ల్లో నులక, గోగునారలతో నాగలికి అవసర మైన మోకులు, ఎద్దులకు కావల్సిన పగ్గాలు, ముక్కుదోలా, పలుపులు నేసి ఇవ్వడం, రానురాను ముతక చీరలు, పురుషుల వస్త్రాలను నేయడం, తర్వాత మంచం నవారు, జంపఖానలు, చీరలు, ధోవతులు నేయడం, అగ్గిపెట్టలల్లో పట్టే చీరలను నేసి వస్త్ర నిర్మాణంలో తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ఊరూరా తిరిగి వాటిని అమ్ముకుని జీవనం సాగించే ఆ వృత్తి వారు నేడు యాంత్రీకరణలో అభివృద్ధి జరిగి, తక్కువ సమయం లో, తక్కువ మందితో ఎక్కువ రంగురంగుల వస్త్రాలను తయారు చేయడంతో వారి వృత్తి మరుగున పడిందనే చెప్పాలి. 

నేడు వ్యవసాయ రంగం ఆధునిక పద్ధతులు అనుస రించి, యంత్రాలపై ఆధారపడటం మూలంగా ఎద్దులు, ఆవులు కను మరుగవ్వడంతో వాటికి అవసరమైన తాళ్లను ఉపయోగించే అవసరం లేకుండా పోయింది. వీటికి తోడు వివిధ కూలీ పనులు చేసుకునే వారికీ సరిపడా పని దొరకక ఇతర పను లు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఒకప్పుడు కిర్రు చెప్పులు, భుజాన గొంగడి, చేతి రెట్టలకు కాడ పెట్టుకోవడానికి గ్రామీణ ప్రజలు ఎంతో ఇష్ట పడేవారు. ఆనాడు గ్రామాలలో ఎవరి భుజాన చూసిన గొంగడి కనిపించేది. చలి నుంచి వె చ్చదనాన్ని, ఎండలో కప్పుకుంటే చల్లద నాన్ని, వర్షంలో రక్షణ కవచంగా ఉండేది. ఇప్పటి తరానికి అది ఎలాగుంటుందో కూడా తెలియని పరిస్థితి. గొంగడి నేత కు ప్రధాన ముడిసరుకు నల్ల దక్కన్ గొ ర్రెలు ఉన్న గ్రామాలలో ఒకప్పుడు మందల మందులుగా వుండే ఆ గొర్రె లు క్రమేణా తగ్గి, ఇప్పుడు వివాహ, మరణలాంటి శుభ, అశుభ కార్యాల్లో పనికి వచ్చే మాంసం కోసం త్వరగా ఎదిగే సంకర జాతి గొర్రెలను పెంచు తున్నారు. పాలు, పెరుగు, నెయ్యి లభించాలంటే గొల్ల కురుమల ఇంటి గడప తొక్కాల్సిందే. కానీ నేడు వివిధ వర్గాలవారు డైరీ ఫామ్స్ పెట్టి, సంకర జాతి గేదెలను, ఆవులను పెంచడం జరుగుతోంది. పలురకాల నాణ్యతా రహిత పాల ఉత్పత్తులను చేస్తున్నారు. మార్కెట్లోకి వి విధ రంగులతో కూడిన రకరకాలైన బ్లాంకెట్స్ అతి తక్కువ ధరలకే లభించడం వలన గొంగళ్లను వాడటం మరిచారు. హస్తకళాక్షేత్రంలో జీవనం సాగించే అవుసలివారి వృత్తి కూడా రోజురోజుకు కనుమరుగవుతోంది. నేడు మా ర్కెట్లల్లో యంత్రాలతో తయారు చేసే వివిధ రకాలైన డిజైన్ల లో వుండే ఆభరణాలకే అధిక డిమాండ్, ఇంకా రెడీమేడ్ వస్తువులకే గిరాకీ ఎక్కువని చెప్పవచ్చు. 

గ్రామాలల్లో నివసించే కుమ్మరి, వడ్రంగి, కంసాలి వారి వృత్తులు ఎప్పుడో మరుగునపడ్డాయి. వాటి స్థానంలో ఆధు నాతనమైన పద్ధతులు ఉపయోగించి యంత్రాలను ఉపయో గించడం జరుగుతోంది. ప్రపంచీకరణ నేపథ్యంలో గ్రామీణ వృత్తులు కనుమరుగయ్యాయి. అలాగే గ్రామీణ ఆర్థిక పరి స్థితులను దెబ్బతీసి గ్రామాలను ప్రమాదకరంగా తయారు చేశాయని చెప్పవచ్చు. నాడు గ్రామీణ రైతులు ఎలాంటి రోగనిరోధక మందులు వాడకుండా సహజ ఎరువులైన పశు వుల పేడ, జీవాల ఎరువును ఉపయోగించి విభిన్న రకాలైన ఆహార పంటలను పండించేవారు. నేడు యంత్రాలను ఉప యోగించి వివిధ రకాలైన కృత్రిమ ఎరువులను ఉపయో గించి పండించే వాణిజ్య పంటలకే అధిక ప్రాధాన్య త నివ్వడం జరుగుతోంది. అక్కడక్కడ ఆహార పంటలు పండించినా కృత్రిమ విత్తనాలు, రసాయనిక ఎరువుల వాడ కం వలన నాణ్యత కోల్పోయి, పోషక పదార్థాలు తగ్గి మనిషి సగటు జీవిత కాలాన్ని తగ్గిస్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తిలేదు. వివిధ రకాల పండుగలకు గ్రామాలల్లో వేసే వీధి నాటకాలు, సర్కసులు, తెరపై సినిమాలు, ఊరూ రా తిరిగి చెప్పే కథలు ఏనాడో కనుమరుగయ్యాయి. ప్రపం చీకరణ నేపథ్యంలో గ్రామాలల్లో అన్నిరకాల వృత్తులు దెబ్బ తిన్నాయి. సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలలో విపరీ తమైన మార్పులు వచ్చాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసింది. మానవులను వివిధ రకాల వ్యసనాల బారిన పడేసింది. గ్రామీణ ప్రాంతాలల్లో ఉండే సహజ వనరులను దెబ్బతీసి గ్రామీణ ప్రాంతాలను కృత్రిమ జీవనం కొన సాగించే ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టవేయబడిందని చెప్పవచ్చు. సమాజ పరిణామ క్రమంలో అభివృద్ధి అనేది అవసరం అయినప్పటికీ అది గ్రామీణ సమాజానికి పెను ముప్పుగా మారకూడదు. 

ఉదాహరణకు ఏ అభివృద్ధి లేనప్పుడు మానవులు శతా బ్ద కాలం పాటు జీవించి, నేడు ఎంతో అభివృద్ధి సాధించిన అర్ధ శతాబ్దానికే ఎందుకు పరిమితుడవుతున్నాడో ఆలోచిం చాల్సిన అవసరం ఉన్నది. నేడు గ్రామాలలో రసాయనిక ఎరువుల వాడకం లేనిది పంటలు పండవు, యంత్రాల సహాయం లేకుండా వ్యవసాయం చేయడం కుదురడం లే దు. మనం తినే ఆహారం కూడా ఏనాడో పోషకాలను కో ల్పోయి రసాయనాలుగా మారి కలుషితమయింది. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం వలన గ్రామాలలో నివసించే ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఒక మొబైల్ ఉండటం సాధారణమైంది. సెల్‌ఫోన్ రేడియేషన్ ప్రభా వంతో ప్రకృతి రమ్యమైన కొన్ని జాతుల పక్షులు, సీతాకోక చిలుకలు, క్రిమికీటకాలు అదృశ్యమైపోతున్నాయి. అదే వి ధంగా మానవులు కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటు న్నారు. గొట్టపు బావుల వలన భూగ ర్భజలాలు అడుగంటి, పంటపొలాలు, ఎడారిగా మారుతున్నాయి. అడవుల నరికి వేత, అడవులను తవ్వడం మూలంగా కాలుష్యం బారిన పడాల్సివస్తోంది. రెడీమేడ్ వస్తువులు మార్కెట్లల్లో విచ్చల విడిగా లభిస్తుంటే వాటివల్ల అనారోగ్య బారిన పడాల్సి వచ్చినప్పటికీ వాటినే ఉపయోగించుకుంటున్నాము. దాని మూలంగా గ్రామాలలో ఉండే కులవృత్తులు మాయమైపో తున్నాయి. గత శతాబ్ద కాలం నుంచి గ్రామీణ యువత విద్యారంగంలో కొంతమేర ముందుకెళ్లినా సాధారణ విద్య నభ్యసించడం మూలంగా నిరుద్యోగంతో బాధపడాల్సి వస్తోంది. దానికితోడు దేశాన్ని ఆర్ధికంగా ముందుకు తీసుకెళ్లాల్సిన రాజకీయ వ్యవస్థ చెడిపోయి, స్వార్ధ పూరితం గా తయారయి గ్రామీణ స్థాయిలోకి ప్రవేశించి ఈర్ష్యలు, కక్షలు ఏర్పడటానికి మూలం అవుతుంది. 

ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో గ్రామీణ ప్రజలు తమ భూములను కోల్పోయి కులవృత్తులు పోయి, కూలీ పనులు లభించక, అప్పులపాలై ఆకలితో అలమటించాల్సిన అవస రం ఏర్పడుతోంది. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ప్రపంచీకరణలో ఆర్థికంగా బలంగా వున్న కుటుంబాలు, సాంకేతిక విద్యనభ్యసించిన అభ్యర్థులకు, బడా పారిశ్రామిక వేత్తలకు, వ్యాపారులకే లాభదాయకంగా మారింది. కానీ గ్రామీణ ప్రాంతంలో నివసించే వారికీ ఒరగబెట్టిందేమి లేద ని చెప్పవచ్చు.

ఇందుకు పరిష్కారామార్గాల దిశగా ప్రభుత్వాలు తగు విధంగా ఆలోచించి గ్రామీణ ప్రజలను అక్కున చేర్చుకో వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రపంచ దేశాలలో భారతదేశానికి భిన్న సంస్కృతికి పుట్టినిల్లని ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. దేశానికి వెన్నముక రైతులంటారు. అదే రైతుల వెన్నెముక విరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభు త్వాలపైనే వున్నది. మానవ జీవన విధానంపై నష్టాలు కలి గించని, ఏ మాత్రం అనర్థదాయక ప్రభావం చూపని శాస్త్రీయ, సాంకేతిక అభివృద్ధిని తీసుకరావడానికి ప్రతి ఒక్కరు, ప్రభుత్వాలు, ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి. మన పాత రోజులు, సంస్కృతి, ఆచారాలు, కట్టుబాట్లు తిరిగి రాకపోయినా, కలుషితం కాకుండానైనా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. 

- పోలం సైదులు 
యం.ఏ, బీఎడ్, పీహెచ్ డి
 9441930361రైతన్నకు సబ్సిడీ పోటు

Updated By ManamSat, 11/17/2018 - 00:35

imageగత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా రైతులు శాంతియుతంగా పాదయాత్రలు చేస్తూ, తా ము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వా ల దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అక్టోబర్ 2 మహాత్మాగాంధీ పుట్టిన రోజు నాడు కూడా వేల మంది రైతులు, హరిద్వార్ నుంచి ఢిల్లీకి శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే వారి యాత్రను విఫలం చేయటానికి వారి మీద లాఠీఛార్జి చేయ్యటమే కాక బాష్ప వాయువు, నీటి కాన్లతో భయభ్రాంతులకు గురిచేశారు పోలీసులు. అహింసకు మారుపేై రెన మహాత్ముడి పుట్టిన రోజునాడు దేశానికి అన్నంపెట్టే రైతుకు ఎంత ప్రాధాన్యత లభి స్తుందో అర్థమౌతోంది. ఒకసారి మహాత్ముడు బెంగుళూరులోని జాతీయ పాడి పరిశోధనా సంస్థను సందర్శించినప్పుడు, సందర్శకుల పుస్తకంలో తన వివరాలు నమోదు చేస్తు తన వృత్తి వ్యవసాయం అని రాశారంటే మహా త్ముడి దృష్టిలో రైతులంటే ఎంత గౌరవమో అర్థం చేసుకోవచ్చు. కాని నేటి రాజకీయ నాయకులకు మాత్రం రైతులను హీనంగా చూడటం పరిపాటిగా మారిపోయింది.

జాతీయ నేర పరిశోధనా సంస్థ లెక్కల ప్రకారం గత మూడు సంవత్సరాలో రైతులు నిరసన ప్రదర్శనలు చెయ్యటంformer ఏడు రెట్లు పెరిగింది. 2014లో దేశవ్యాప్తంగా 687 నిరశన ప్రదర్శనలు జరిగితే 2015లో 2,683, 2016లో 4,837 నిరశన ప్రదర్శనలు జరి గాయి. దేశంలో ఏక్కడ ఏ మూల రైతులు ఆందోళన చేసినా, రెండు విషయాల్లో మాత్రం అందరి స్వరం ఒక్కటే. మొదటిది పంట రుణాలను మాఫీ చెయ్యటం రెండవది 50 శా తం అనా లాభముండేటట్లు మద్దతు ధర ప్ర భుత్వం ప్రకటించటం. కేంద్ర ప్రభుత్వంతో సహా అన్ని రాష్ట్రాలు ఈ రెండు విషయాల మీద హామీలు గుప్పిస్తున్నారు. కాని ఆచర ణలో మాత్రం నిధుల లేమి వల్ల వారిని ఆదు కోలేక పోతున్నామని ముసలి కన్నీరు కారుస్తున్నారు.

98 శాతం రైతులందరూ అప్పులతోనే వ్యవసాయం సాగిస్తున్నారనేది వాస్తవం. 94 శాతం మంది రైతులకు వస్తున్న ఆదాయం కన్నా వ్యవసాయ పెట్టుబడులే ఎక్కువగా వుంటున్నాయి. గత నాలుగు దశాబ్దాలుగా రైతుల ఆదాయం గణనీయంగా తగ్గిపోయిం దనేది వాస్తవం. పెరిగిన వ్యవసాయ అవ సరాల ఖర్చులు, కరువు కాటకాలతో దిగుబ డి తగ్గిపోవటం, గిట్టుబాటు ధరలు లేకపోవ టం వంటి కారణాలతో వీరికి న్యాయంగా రావాల్సిన ఆదాయం కూడా రాలేదు. దేశం మొత్తం మీద రైతులందరి అప్పును లెక్క కడితే రూ.12.60 లక్షల కోట్లుగా తేలింది (పార్లమెంటు నివేదిక). ఈ రుణాన్ని మొత్తా న్ని ఒకేసారి మాఫీ చేసే ఉదార హృదయం ఏ ప్రభుత్వానికీ లేదు కాని రూ.13.16 లక్షల కోట్ల రూపాయల కార్పొరేటు సంస్థల అప్పు లను మాత్రం రద్దుచేసే గొప్ప మనసుంది. రైతులందరూ ఎప్పుడైతే రుణమాఫీ కోసం తమ స్వరాన్ని పెంచుతారో, అప్పుడు మా త్రం మనదేశ ఆర్థికవేత్తలకు, విధాన రూపకర్త లకు మనదేశ ద్రవ్యలోటు గుర్తుకొస్తుంది. కార్పొరేట్ సంస్థల రుణాలు మాఫీ చేసే సమయంలో వీరికి ఇవేవీ గుర్తుకురావు.

దీనికి ముఖ్య కారణం ఏమంటే, నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయాన్ని ఏనాడు ఈ దేశానికి ఆర్థిక వనరుగా పరిగ ణించకపోవటమే. రైతుల మీద వెచ్చించిన ప్రతిరూపాయీ బూడిదలో పోసిన పన్నీరే అని వీరందరి అభిప్రాయం. వీరందరూ ఒక్క విషయాన్ని మర్చిపోతున్నారు. దేశంలో అత్య ధికంగా ఉపాధి కల్పిస్తున్న రంగం ఏదన్నా వుందంటే అది వ్యవసాయ రంగం మాత్రమే.

దేశంలోని 23 రకాల పంటలకు గిట్టు బాటు ధరలు ప్రకటించలేనప్పుడు, ప్రభుత్వ మే ఈ పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవచ్చు. దేశంలోని పంటలన్నిటినీ కొ నుగోలు చెయ్యటానికి లక్ష కోట్ల రూపాయలు అవసరమౌతాయి. కాని ఇక్కడ కూడా నిధు లు లేవనే పాతపాటే పాడుతున్నాయి ప్రభు త్వాలు. మరి పదేళ్ళుగా, ఆర్థిక మాంధ్యం (2008 - 2009) కారణంగా అప్పుల పాలైన పరిశ్రమలను ఆదుకోవటానికి ప్రతి ఏడాది రూ.1.86లక్షల కోట్లు ఆర్థిక సహాయం ఎలా చేయగలుగుతున్నారు. అసలు మద్దతు ధర ఏ ప్రతిపాదికన లెక్కగడుతున్నారో కూడా ప్రభుత్వాల దగ్గర లెక్కలు లేవు. కేవలం పంట పెట్టుబడి ఖర్చులు, పంట పండించ టానికి కావాలిసిన కార్మికుల వేతనాలు మాత్రమే లెక్కలోకి తీసుకుని మద్ధతు ధరలు లెక్కగడుతున్నారు. వ్యాపారులు ఏ కష్టం పడకుండానే లాభాలు వేసుకుని వస్తువులు అమ్ముతున్నప్పుడు పంట పండించిన రైతు లు తమ పంటను అమ్ముకునేటప్పుడు లాభా లు వేసుకోనక్కర్లేదా.

ఇటీవల అంతర్జాతీయ ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థలోని సభ్యదేశాల సహకారం తో భారతీయ ఆర్థిక విధానాల పరిశోధనా సంస్థ చేసిన ఒక సర్వేలో, మనదేశంలోని మార్కెటింగ్ విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని స్పష్టం చేసింది. దీనికి ము ఖ్య కారణం ఎగుమతులపై నిషేధం విధించ టం, అత్యవసర ఆహార చట్టం ప్రకారం, ఎగుమతి ధరలను నియంత్రించటం అమ్మ పెట్టదు, అడుక్క తిననివ్వదు అనే చందంగా దేశీయంగా అమ్ముకుందాం అంటే మద్దతు ధర దొరకదు, విదేశాలకు ఎగుమతి చేద్దా మంటే చట్టాలతో అడ్డం పడుతోంది ప్రభు త్వం. ఇకనైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి రైతుల సమస్యలపై కూలంకుషంగా చర్చించి సమస్యలకు పరిష్కారాలు కనుగొనకపోతే మరిని నిరశన ఉద్యమాలు రానున్న కాలంలో జరుగుతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు.

- ఈదర శ్రీనివాసరెడ్డిచిక్కుల్లో ఆరోగ్యం చుక్కల్లో వైద్యం

Updated By ManamSat, 11/17/2018 - 00:35

imageమానవుల ప్రాథమిక అవసరాల్లో ఈనాడు ఔషధాల పాత్ర ఎంత ప్రధానంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉప్పూ పప్పూ లేకపోయినా రోజు గడిచిపోతుంది కాని, మందుబిళ్ళ లేకుండా పూట గడిచే పరిస్థితి మాత్రం కానరావడం లేదు. రకరకాల వ్యాధులతో బాధపడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. ఆరోగ్య పరిరక్షణ, పౌష్టికాహారానికి సంబంధించి 47వ అధికరణ ఇస్తున్న రాజ్యాం గ హామీ భారతీయులకు చేదుమాత్రగానే మిగిలిపోయింది. పేదరికం కారణంగా పౌష్టికాహారం అందక ప్రజలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. 

ప్రపంచం మొత్తంలో వివిధ రకాల వ్యాధులతో బాధపడు తున్నవారు మనదేశంలోనే ఎక్కువగా ఉన్నారు. దేశంలోని అత్యధిక శాతం మంది ప్రజలు తమ ఆదాయంలో 70 శాతం ఔషధాల కొనుగోలుకు, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన ఖర్చులకే వినియోగిస్తున్నారు. తక్కువ ఆదాయ మార్గాలు కలి గిన మధ్య తరగతికి చెందిన 40 శాతానికి పైగా కుటుంబాలు కేవలం ఆరోగ్యపరమైన అవసరాలకే అప్పులు చేస్తున్నాయని ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ సర్వే వెల్ల డించింది. దేశంలో  పేదరికం పెరగడానికి ప్రధాన కారణం వైద్య ఖర్చులే కావడం ఎంతైనా విచారించదగిన, సిగ్గు పడాల్సిన విషయం. వైద్య ఖర్చులు చాలామందిని దారి ద్య్ర రేఖ దిగువకు నెట్టేస్తున్నాయి. సాధారణ, మధ్య తరగతికి చెందిన ప్రజలు తమ కుటుంబంలో ఎవరో ఒకరోగికి వైద్యం చేయించి, ఉన్నదం తా పోగొట్టుకొని పేదల జాబితాలో చేరిన వారు అనేకమంది ఉన్నారు. దేశంలో వేలాదిమంది కేవలం వైద్య ఖర్చుల కా రణంగా బలవంతంగా పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే, రోగ నిర్ధారణకు(టెస్టులకు), ఔషధాల కొను గోలుకు, వైద్యశాల గదులకు(రూమ్ రెం ట్స్), డాక్టర్ ఫీజులకు అయ్యే ఖర్చు భరిం చలేక లక్షలాదిమంది ప్రజలు దారిద్య్రపు కోరల్లో చిక్కుకుపోతున్నారు. కేవలం మెడికల్ బిల్లుల కారణంగానే అనేకమంది దివాలా తీస్తున్నా రని స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అధికారులే వెల్లడించారు.
 

mathanam

ఈ దుస్థితికి ప్రధాన కారణం వ్యవస్థలోని లోపాలు. ఈ లోపాలే ప్రజలకు శాపాలుగా మారుతున్నాయి. ఔషధాల తయారీకి గాని, మార్కెటింగ్‌కు గాని ఒక స్పష్టమైన, నిర్దిష్ట  విధానమంటూ లేకుండా పోయింది. ఒక ఔషధాన్ని తయారు చేసేకంపెనీ దాన్ని ఎంతకైనా సొమ్ముచేసుకోవచ్చు. పదిరూపా యలు విలువచేసే మందును వంద రూపాయలకైనా అమ్ముకో వచ్చు. దీనిపై ఎలాంటి నియంత్రణ లేదు. ఈ కారణంగానే ఔషధ తయారీకంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇష్టమొచ్చినట్లు దోచుకుంటున్నాయి. పట్టించుకునే వారు, ప్ర శ్నించే వారు ఎవరూ లేరు. ఆడింది ఆట, పాడింది పాటగా సదరు కంపెనీలు ఇష్టారాజ్యం చేస్తున్నాయి. వ్యవస్థలోని లోపా లను ఆసరాగా చేసుకొని ఎవరికి వారు అందిన వరకు దండు కుంటున్నారు. ఫలితంగా వినియోగదారులు అనివార్యంగా తీవ్రమైన నష్టాన్ని చవిచూడవలసి వస్తోంది. ప్రభుత్వం నుంచి గాని, సంబంధిత శాఖ నుంచి గాని ఎలాంటి అవరోధాలూ, నియంత్రణలూ లేకపోవడం ఉత్పత్తిదారులకు, వ్యాపారులకు, వైద్యులకు అద్భుత వరంగా పరిణమిస్తోంది. ఈ సువర్ణా వకాశాన్ని వారు చక్కగా వినియోగించుకుంటూ, వినియోగ దారుల ముక్కుపిండుతున్నారు.

         సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలు మొదలు, గ్రామీణ వైద్యశాలల వరకు, చిన్నచిన్న రక్త పరీక్షా కేంద్రాలు మొదలు పెద్ద పెద్ద, రకరకాల పరీక్షలు, ఎక్స్‌రేలు, స్కానింగు లు తీసే డయాగ్నో స్టిక్ సెంటర్ల వరకు పచ్చి వ్యాపారమే రాజ్యమేలు తోంది తప్ప, మానవీయ కోణం ఏ కోశా నా కానరావ డం లేదు. వీటికి ఏ మాత్రం తీసిపో కుండా మెడికల్ షా పులు పోటీ పడుతు న్నాయి. ఈ మూడు విభా గాలూ రోగులను పీల్చిపిప్పి చేస్తున్నాయన్న ప్రజల ఆరోపణ సత్యదూరం ఎంతమాత్రం కాదు. అయితే ఇక్కడ అందరినీ ఒకే గాటన కట్టలేం. వైద్యుల్లో, ఔషధ వ్యాపారుల్లో, పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్న వారిలో సేవాభావం కలిగినవారు, ప్రమాణాలు పాటించేవారు, మానవీయ విలువలను గౌరవించేవారు చాలామంది ఉన్నా రు. కాని ఇలాంటివారి సంఖ్య తక్కువగా ఉంది. ‘రోగగ్రస్త’ సొమ్ముకోసం అర్రులు చాస్తున్నవారే అధికశాతం ఉన్నారు, ఇదే ఆవేదన కలిగించే విషయం.

ఒకవ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ దవాఖానకు వెళి తే, ముందుగా అక్కడి రిసెప్షన్ కౌంటర్‌లో వేలకువేలు డిపా జిట్ చేయాలి. కేసు తీవ్రతను బట్టి లక్షలు కూడా కట్టించుకుం టారు. తరువాత ‘పరీక్షలు’ మొదలవుతావు. పరీక్షల ద్వారానే రోగనిర్ధారణ జరుగుతుందన్న విషయంలో మరో అభిప్రాయా నికి తావు లేదు. కాని, అవసరమున్నా, లేకున్నా పదుల సం ఖ్యలో వివిధ రకాల పరీక్షలు నిర్వహించి రోగిని ఆర్ధికంగానే కాకుండా, మానసికంగానూ గుల్లచేసే ధోరణి గత కొన్నేళ్ళుగా బాగా ప్రబలిపోయింది. ఇక దీని తరువాత అసలు ‘వైద్యం’ మొదలవుతుంది. ఇందులో డయాగ్నోస్టిక్ సెంటరుతో పాటు, మందుల షాపుదీ (అన్నీ కాదు) ప్రధానపాత్రే. కొందరు వైద్యు లు తక్కువ ధరకు లభిస్తున్న నాణ్యత కలిగిన మందులను సిఫారసు చేయకుండా, కమీషన్ల కక్కుర్తితో అంతగా నాణ్యత లేకపోయినా అధికధర- అంటే, యం.ఆర్.పి ఎక్కువగా ఉన్న, కమీషన్లను తెచ్చిపెట్టే నాసిరకం మందులనే సిఫారసు చేస్తుం టారు. ఇది రోగికి గోరుచుట్టుపై రోకటి పోటులా పెను భారం గా పరిణమిస్తోంది. చౌకధరకే నాణ్యమైన మందులు అంటూ ప్రవేశపెట్టిన జనెరిక్ ఔషధాలు ఎవరికి ప్రయోజనం చేకూర్చు తున్నాయో ప్రభుత్వమే చెప్పాలి.

ప్రస్తుతం సుగరు, బీపీ, గుండెజబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు మానవ సమాజంపై బలంగా దాడిచేస్తున్నాయి. దేశంలో ప్రతి నలుగురి లో ఒకరికి సుగరు, ప్రతి ముగ్గురిలో ఒకరికి బీపీ ఉన్నట్లు జాతీయ పౌష్టికాహార సంస్థ దేశవ్యాప్తంగా దాదాపు 1.72 లక్షల మందిపై సర్వేచేసి వెల్లడించింది. ఇందులో అన్నిటికన్నా ఎక్కు వగా కలవర పెడుతున్నది సుగర్ వ్యాధి. చిన్నాపెద్దా అనే తార తమ్యం లేకుండా అందరినీ చుట్టుముట్టి  పట్టిపీడిస్తున్న ఈ వ్యాధి మనదేశంలో శరవేగంతో విజృంభిస్తోంది. ఈ మహ మ్మారి నుంచి తమను తాము కాపాడుకోడానికి ఒక్కో రోగి ఏటా సగటున 10 వేలు కేవలం సుగర్ మందులకే ఖర్చు పెడుతున్నాడు. మారిన జీవనశైలి, ఆహారపుటలవాట్ల కారణం గా మృత్యువాత పడుతున్నవారి సంఖ్య పదేళ్ళలో 50 శాతం పెరిగింది. గ్లోబల్ బర్డన్ ఆఫ్ డిసీజ్ డాటా ప్రకారం - 2005 కు ముందు మనదేశంలో మరణాలకు కారణమైన వ్యాధుల జాబితాలో మధుమేహం 11వ స్థానంలో ఉండగా, ఇప్పుడది ఏడవ స్థానానికి చేరుకుంది. చైనా తరువాత అత్యధికంగా సుగ ర్ వ్యాధిగ్రస్తులున్నదేశం మనదే. 6.51 కోట్ల వ్యాధిగ్రస్తులు మనదేశంలో ఉన్నారు. 2030 నాటికల్లా ఈ సంఖ్య 10.12 కోట్లకు చేరుకుంటుందన్న ’తీపి’ నిజం ఇప్పుడు దేశాన్ని వణికిస్తోంది.

ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోడానికి ఇండియన్ ఫార్మా స్యూటి కల్ అసోసియేషన్ 2016లో, తన 55వ జాతీయ వారోత్స వాల సందర్భంగా, అన్న నినాదాన్ని ఎంపిక చేసింది. 2017లోఅన్న నినాదాన్ని ఎంచుకుంది. ఈ సంవత్సరంనినాదాన్ని ఎంపికచేసింది. దీని కనుగుణంగా  వ్యాధుల నియంత్రణకు, ఆరోగ్య భారత నిర్మా ణ కల సాకారం చేయడానికి ఫార్మాసిస్టులు తమ పాత్రను సమర్ధవంతంగా నిర్వర్తించడానికి ప్రయత్నం చెయ్యాలి. ప్రభు త్వాలు, ప్రజలు కూడా వారి సేవలను సమర్ధవంతంగా విని యోగించుకోగలిగితే ఆశించిన ఫలితాలు సాధించవచ్చు. ‘ప్రివె న్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ’ అని మన పెద్దలు అన్న ఆణిముత్యం లాంటి మాటను వంట బట్టించుకొని, వ్యాధి సోకిన తరువాత తీరిగ్గా బాధపడేకంటే, అసలు అది రాకుం డా జాగ్రత్తపడడం తెలివైన పని. ఈ దిశగా ప్రజల్లో అవగా హన, చైతన్యం కలిగించగలిగితే అనేక వ్యాధుల నుంచి మానవ సమాజం రక్షణ పొందగలుగుతుంది.

- యండి.ఉస్మాన్ ఖాన్
సీనియర్ పాత్రికేయులు
 9912580645

 నేటి బాలలే రేపటి రోగులు!?

Updated By ManamWed, 11/14/2018 - 01:10

imageఅవును. రేపటి పౌరులుగా, ఆరోగ్య వంతమైన యువతగా దేశప్రగతికి కారణం కావలసిన నేటి బాల్యం రక రకాల అలవాట్లు, బలహీనతలు, రుగ్మతలతో సతమతమౌతోంది. ఎటు చూసినా విటమిన్ల లోపాలు, అపరిశుభ్ర కాలుష్యంతో విస్తరిస్తున్న వైరస్‌లు ఒకవైపు, నిర్లక్ష్యం, సమయా భావ జీవితంలో జంకు పదార్థాలు, నియమం తప్పిన భోజన విధానం ముఖ్య కారణాలుగా కనిపిస్తాయి.

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాలలో పౌష్టికాహారలోపంతో చాలినంత ఆహారం లేక బాధ పడుతున్నారు. జపాన్ వంటి చిన్న దేశాలే అయినా ఆరోగ్యవంతమైన ఆహారం, అలవాట్లతో ప్రపంచంలోనే అధికశాతం దీర్ఘాయుష్మంతులతో ప్రత్యేక శ్రద్ధతో జీవిస్తూ ఇతర దేశాలకు మార్గదర్శకమౌతున్నాయి.

image

అయితే, మనదేశంలో వచ్చిన ముఖ్యమైన సమస్య విద్యార్ధులపై తీవ్రస్థాయిలో ఒత్తిడితో బాటు, చదువుకు ఇచ్చిన విలువ తినే సమయాలకు ఇవ్వకపోవటం ఎక్కువగా ప్రైవేటు పాఠ శాలల్లో కనిపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో తగినంత సమయం కేటాయిస్తున్నా, విద్యార్ధులు ఎక్కువగా ప్రైవేటు స్కూళ్ళలో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో మం చి నియమ నిబంధనలే పాటిస్తున్నా, అవి తక్కువ శాతంగా మాత్రమే వుంటున్నాయి.

చాలా స్కూళ్ళలో ఇళ్ళ నుంచి పిల్లలు బయలుదేరే సమయాన్ని బట్టి ఉదయం ఏడు, ఏడున్నరకల్లా తినలేక స్కూళ్ళకు చేరుతుంటారు. అయితే బడిలో వారికోసం ఇచ్చే షార్ట్ బ్రేక్ సమయం పదినిమిషాలే వుంటోంది. ఆ సమయంలో వాళ్ళు వాష్ రూంలకెళ్ళి చేతులు శుభ్రం చేసుకుని వచ్చే సరికే సరిపోతుండటంతో, ఇంకా టీచర్లు కూడా బెల్ మోగినా మరి కాస్త ఎక్కువ సమయం క్లాస్ తీసుకుంటే, తరువాత వచ్చే టీచర్లు బాక్స్‌లు మూసేయమని కోపగించుకోవటంతో ఉపాహారం తినలేకపోతున్న విద్యార్ధులు అధికం.
కొందరు ప్రిన్సిపాళ్ళు, టీచర్లు స్వయంగా ‘పిల్లలకు ఇడ్లీ, దోశ, చపాతీ, అన్నం లాంటివి పెట్టకండి. లైట్‌గా వుండే ఏ బ్రెడ్డో, నూడిల్సో పెట్టి పంపండి. లేకుంటే సమయం సరిపోదు’ అంటూ పిల్లల ఆరోగ్యం కన్నా, వారు పాఠాలు వినటానికి సిద్ధంగా వుండటమే మిన్నని భావిస్తూ చెప్పటం విన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది.

మునుపు ఉదయం ఎనిమిదిన్నరకు మొదలయ్యే స్కూళ్ళు పన్నెండింటికి మధ్యాహ్న భోజనానికి వదిలితే, తిరిగి  ఒకటిన్నర నుంచి సాయంత్రం నాలుగింటి వరకు వుండేవి. ఇళ్ళ కెళ్ళి వచ్చే పని లేనందు వల్ల కనీసం ఇప్పుడు పన్నెండింటి నుంచీ ఒక గంటవరకైనా సమ యం కేటాయిస్తే వాళ్ళు తగినంత ఆహారం తినగలుగుతారు. అంతే కాకుండా ప్రతి పీరియడ్ లోనూ టీచర్ రాగానే వాళ్ళను ఓ గ్లాసుడు మంచినీళ్ళు తాగమని చెబితే సరైన మోతాదులో  నీళ్ళు కూడా తాగక చదువులోపడి అనేక ఆరోగ్య సమస్యల బారిన పడకుండా వుండ గలుగుతారు.

నిజానికి నర్సరీ నుంచీ ఐదవతరగతి వరకూ పరీక్షలు, గ్రేడులన్నవి, వారి లేత వ్రేళ్ళు వాచేలా హోంవర్కులు, యాక్టివిటీలు ఇవ్వకుంటే ఒత్తిడికి దూరమై వాళ్ళు మానసికంగా ఎదగ గలుగుతారు. అలాగే, ర్యాంకులే పరమావధని, డాక్టర్, ఇంజనీర్ కాకుంటే ఆ చదువే నిరర్ధకమని భావించకుండా పిల్లల్ని మార్కులుతెచ్చే యంత్రాల్లా భావించి ఏదో ఒక ఆహా రం ఆరోగ్యానికి మంచిదంటూ పిల్లల రుచిని పట్టించుకోకుండా వండి ఇచ్చేయటం పేరంట్స్ కి తగదు. ఏ పదార్ధమైనా కాస్త శ్రద్ధ పెట్టి వీలైనంత వరకు ఇంటి భోజనంలో ఆకుకూరలు, కూరగాయలతో, ఒక పండు, స్నాక్స్‌గా కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇవ్వగలిగితే మేలు. వారి అభి రుచిని బట్టి విద్యార్ధుల్ని ఆ రంగంలో ప్రోత్సహిస్తే వాళ్ళు ఉన్నతంగా ఎదిగే అవకాశం వుంటుంది. 

ముఖ్యంగా తగిన ఆహారంతో బాటూ స్కూళ్ళలో అయినా, ఇంటిదగ్గరైనా కాస్త ఎండ శరీరానికి తగిలేలా ఉదయం, సాయంత్రం పావు గంటైనా వుండనిస్తే శరీర ఎదుగు దలకు, తీసుకున్న ఆహారంలోని కాల్షియం వొంటికి అందించే విటమిన్ ‘డి’ అంది, ఈ రోజుల్లో చాలా మందిలో కొరవడ్తున్న ‘డి’ విటమిన్ డెఫిషియన్సీ వుండదు. దానివల్ల శారీరక, మానసిక వికాసం, రక్తహీనత లాంటి ఇబ్బందులు తొలగి ఉత్సాహవంతులైన, ఆరోగ్యంతో ఆలోచనలో పరిణతి కలిగిన వివేకవంతులైన పౌరులు తయారవుతారు.

ప్రభుత్వం కూడా కలుగ జేసుకుని అన్ని ప్రైవేటు స్కూళ్ళలో సైతం ఉపాహార సమయం అరగంటకు, మధ్యాహ్న భోజన సమయం కనీసం ముప్పావు గంటకు, పెంచితే నిదానం గాను, ఇప్పటికంటే మెరుగ్గాను ఆహారం తీసుకునే వీలుంటుంది. పాఠాలు చక్కగా బుర్రకెక్కి జ్ఞాపకం వుంటాయి. దానివల్ల వ్యాధినిరోధకశక్తి వచ్చి, తరగతుల్లో ఉత్తీర్ణతా శాతం కూడా మెరుగై మానసిక సమస్యలు తొలగి ఆరోగ్య భారతం మనదవుతుంది.

- డేగల అనితాసూరి
9247500819మాకొద్దీ ‘కంటిన్యూడ్ టెన్షన్’ స్కీం..

Updated By ManamTue, 11/13/2018 - 00:52

image‘కొండ నాలుకకి మం దేస్తే ఉన్న నాలుక ఊడింది’ అన్నట్లుంది, కాంట్రిబ్యూటరీ పెన్ష న్ స్కీంలోకి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి. ఉద్యోగ విరమణ తర్వాత, పాత పద్ధతి కన్నా ఎక్కువగా ఆర్థిక ప్రయోజనాలు దీనిలో ఉంటా యని, ప్రభుత్వం ఉద్యోగుల మీద బలవంతంగా రుద్దింది. ఈ స్కీం పరిధిలోకి రావడం మూలాన సర్వీసులో ఉన్న ఉద్యోగి అకాల మరణం నుంచి, ఆరోగ్యంగా జీవించి సహజంగా మర ణించే వరకు, కారుణ్య నియామకం నుండి ఫ్యామిలీ పెన్షన్ వర కు ఉద్యోగికి న్యాయంగా అందాల్సిన అనేక రకాల ప్రయోజనాలు కోల్పోవాల్సి వచ్చింది.

2004లో వాజపేయి హయాంలోని ఎన్డీయే ప్రభుత్వం చేసిన ఈ చట్టం, ఉద్యోగుల పాలిట శాపంలా మారింది. నాడు పార్ల మెంటులో చట్టం చేస్తూ, ‘సీపీఎస్ పరిధిలోకి వచ్చే ప్రతి ఉద్యోగి, పదవీ విరమణ తర్వాత ఒకేసారి పెద్ద మొత్తంలో, మోయలేనంత డబ్బును అందుకుంటారు అని ఊహల్లో ముంచారు. దీనిపై అం తగా స్పష్టత లేకపోవడంతో వివిధ పార్టీలు, ఉద్యోగులు దీనిపై ఆసక్తి కనబరచారు. ఇదే సందర్భంలో కమ్యునిస్టు పార్టీల సభ్యు లు మాత్రం కొత్త పద్ధతిలో లోపాలను వేగంగా అర్థం చేసుకుని, రాబోయే కాలంలో ఇది ఉద్యోగుల్లో తీవ్ర అభద్రతని కల్గిస్తుం దని, కనుక వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. కాని, వారికి మద్దతిచ్చే సభ్యులు చాలినంత లేకపోవటంతో బిల్లు పాస య్యింది. కేవలం కమ్యునిస్ట్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ కొత్త పెన్షన్ స్కీమ్‌లో చేరలేదు. మిగతా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్కీంలో చేరడానికి మొగ్గు చూపి, తమ రాష్ట్ర ఉద్యోగులను దీని పరిధిలోకి తెస్తూ కేంద్రానికి లేఖలు పంపాయి. ఇదిలా ఉండగా పాత పెన్షన్ అమల్లో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇటీవల అధికారం లోకి వచ్చిన కొత్త ప్రభుత్వాలు దాన్ని రద్దు చేసి కొత్త పెన్షన్ ను అమలు చేసి ఉద్యోగుల పట్ల తమ కర్కశాన్ని చూపాయి.
 

image

2004 కంటే ముందు ఉద్యోగం సాధించిన వారికి ఆర్థిక భద్రత ఉంది. వారు సర్వీసులో ఉండి ప్రమాదవశాత్తు చనిపోతే, తక్షణమే ఉద్యోగి ఇంట్లో ఒక సభ్యునికి విద్యార్హతను బట్టి ఏదేని శాఖలో ఉద్యోగం ఇచ్చేవారు తద్వారా సామాజిక, ఆర్థిక భద్రత కల్పించేవారు. అదే సమయంలో ఉద్యోగి చేసిన సేవలకు గుర్తిం పుగా గ్రాట్యుటీ అందించేవారు. ఇలా కాకుండా, ఉద్యోగి ఆరో గ్యంగా ఉండి పూర్తి సర్వీసు కాలం పనిచేసి సహజ మరణం పొం దితే, అతనికి గ్రాట్యుటీతో పాటుగా పెన్షన్ వర్తింపజేసేవారు. పెన్షన్‌ను మొదట ఆ ఉద్యోగికి, తర్వాత  భార్య/భర్తకి అందించి, వారు మరణించిన తర్వాత వారి సంతానంలో ఒకరికి వివాహం అయ్యే వరకు వర్తింప జేసేవారు. సర్వీసులో ఉన్నవారికి  అత్య వసర సమయాల్లో ఆదుకోవడానికి జీిపీఎఫ్ లోన్ ఇచ్చేవారు. కాని ఇది గతం.

2004 సెప్టెంబర్ 1 తర్వాత సీను మారింది. ఉద్యోగార్థులు పాత పద్ధతి లాగే (కొన్ని ఉద్యోగాలలో గతం కంటే కఠినంగా) కేంద్ర/రాష్ట్ర ప్రభు త్వాలు నిర్వహించే అర్హతా పరీక్షల కోసం ఎంతో కాలాన్ని, ధనాన్ని వెచ్చించి, ఎంతో మందితో పోటీపడి నెగ్గి ఉద్యో గం సాధిస్తున్నారు. వీరికి పాత పెన్షన్ పద్ధతిలోని ఉద్యోగికి అందే అకాల/సహజ మరణాంతరం/పదవీ విరమణ అనంతరం అందే ప్రయోజనాలు ఏవి అందకపోవడం విచారకరం. దీనికి కారణం పార్లమెంటులో చేసిన ఫెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్ మెంట్ అథారిటీ (్కఊఖఈఅ) బిల్లు చట్టంగా మార్చడం.దీనిలో  ప్రతినెల ఉద్యోగి జీతంలో 10శాతంతో పాటు, ప్రభుత్వం 10 శాతం కలిపి షేర్ మార్కెట్‌లో పెట్టుబడిగా పెట్టి దాని లాభ, నష్టాల మీదనే ఉద్యోగి పెన్షన్ ఆధారపడేలా చేశారు. షేర్ మార్కె ట్ అంతర్జాతీయ కారణాలతో ఎప్పుడు లాభనష్టాలకు గురవుతుం దో ఎవరికీ తెలియదు. దీనిలో లాభం మాట అటుంచి నెలనెలా పోగేసుకున్న డబ్బుకు కూడా భద్రత లేకుండాపోయింది. 2007లో ఉద్యోగంలో చేరి 2016లో పదవీ విరమణ చేసిన ఉద్యోగికి 650 పెన్షన్ అందుతుందంటే, నాటి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఎంత మోసపూరితంగా వ్యవహరించిందో అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగి తో చేతనైనంత వరకు పని చేయించుకుని, తర్వాత నిరాదరణకి గురిచేయడం సీపిఎస్ ఉద్యోగులకు ఆగ్రహం తెప్పిస్తున్నది. వృద్ధా ప్యంలో పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, సొంతింటికలలు, తీవ్రమైన అనారోగ్య సమస్యలు, అనుకోని సమస్యలు ఇలా అనేకం  ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. ఇవన్ని ఒక ఎత్తైతే కొత్తస్కీం ఉద్యోగి సర్వీ సులో అకాల మరణం చెందితే వారి కుటుంబం ఉన్న ఫలంగా రోడ్డున పడుతుంది.

ఇలాంటి కుటుంబాలు నేడు తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు 140 దాకా ఉన్నాయి. వారి పరిస్థితి ఘోరాతి ఘోరం. ఈ పరిస్థితుల దృష్ట్యా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం కాస్త కంటిన్యూడ్ టెన్షన్ స్కీంగా మారింది. అందుకే కొత్త పెన్షన్ స్కీం ను వ్యతిరేకించే సంఘాలు, ముందు డెత్ కం రిటైర్మెంట్ గ్రాట్యు టీ, కారుణ్య నియామకాలు, ఫామిలీ పెన్షన్ వర్తింపజేయాలని చాలా కాలం క్రితమే ఉద్యమ బాట పట్టాయి. మరణించిన కుటుంబానికి ఎంత త్వరగా వీలైతే, అంత త్వరగా వర్తింపజేసి ఆ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలనేది వారి ఆశ. ఇప్పటికే ఎన్నో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం మీద ఒత్తి డి తీసుకురావడానికి మాతృ సంఘాలతో పాటు అన్ని సంఘాల సమ్మేళనం అయిన టీఎస్ సీపిఎస్ సీఏలు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాయి. కానీ, ప్రభుత్వాలలో చలనం లేదు. తెలంగాణ తొలి ప్రభుత్వం ఏర్పాటు అయిన కొత్తలో కూడా దీన్ని మార్చు కునే అవకాశం ఉండగా ప్రభుత్వం పాత పద్ధతిలోనే కొనసాగు తామని కేంద్రానికి లేఖ ఇవ్వడంతో ఆ అవకాశం కూడా చేజా రింది. శాసనసభలో విపక్ష సభ్యులు లేవనెత్తిన సీపిఎస్ సమస్యపై ఆర్థికమంత్రి గారు మాట్లాడుతూ, దీనిపైన సందేహాలు పెట్టుకోవ ద్దని పాత పెన్షన్ పద్ధతి కన్నా అధిక ఆర్ధిక ప్రయోజనాలు దీని ద్వారానే అందుతాయని వ్యాఖ్యానిం చారు. దీనిని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తూ, ఆందోళన వ్యక్తం చేసాయి. అంత ఎక్కువ ప్రయోజనాలు ఉంటే పాతపద్దతిలోని వారిని కూడా దీని పరిధిలోకి ఎందుకు తీసుకురాలేదు? అనే ప్రశ్న ఈ సందర్భంగా ఆలోచించవలసిందే.

32 ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న లక్షా 20 వేల ఉద్యోగులు దీని పరిధిలో ఉండటం వలన వారి కుటుంబాలు సైతం తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. కాబట్టి రాబోయే ప్రభుత్వ మైనా, ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవో నం.653, 654, 655లను రద్దు చేస్తూ ఉద్యోగులను తిరిగి పాత పెన్షన్ పద్ధతి పరిధిలోకి తీసుకు వస్తూ, వారి కుటుంబాలకు భరో సా కల్పించాలి. పాత పెన్షన్ పరిధిలోని ఉద్యోగులు అందరూ సీపిఎస్ ఉద్యోగులకు మద్దతిచ్చి పరిష్కారం అయ్యేవరకు పోరా డాలి లేదంటే మెల్లిమెల్లిగా వారిని కూడా ఈ పెట్టుబడిదారీ అను కూల ప్రభుత్వాలు సీపిఎస్ పరిధిలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తాయి. అంతే కాకుండా వారి పిల్లలు రేపు కొత్తగా సర్వీసులోకి వస్తే వారికి కూడా ఈ కొత్త పెన్షన్ అనే మహమ్మారి పట్టుకుంటు దనే విషయం మరువరాదు.

కావున అందరు కలిసికట్టుగా, ఉమ్మడి ప్రణాళికతో ఐక్య ఉద్యమాలు నిర్మించి సీపిఎస్ రద్దు తప్ప వేరే గత్యంతరం లేని పరిస్థితిని రాబోయే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి కలుగజేయాలి.’ పెన్షన్ అనేది భిక్ష కాదు, వృద్ధా ప్యంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వ కనీస బాధ్యత’ అని చాటిన సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది. కావునా వివిధ సంఘాల్లో ఉన్న ఉద్యోగులు అందరూ ఎలాంటి బేషజాలకు పోకుండా, సీపిఎస్ రద్దు కోసం ఉమ్మడి కార్యచరణతో ముక్తకంఠంతో గళమెత్తాలి. అప్పుడే సీపిఎస్ రద్దుకై ప్రభుత్వాల్లో ఆలోచన మొదలవుతుంది. ఆ దిశగా ఉద్యోగులు సీపిఎస్ రద్దు కోసం పోరాటాన్ని  తీవ్ర తరం చేసి, పాత పెన్షన్ సాధించుకోవాలి. ఆ భద్రతతో ప్రజలకు మరింత మెరుగైన, నాణ్యమైన సేవలు అందించి, ఉన్న తమైన సమాజ నిర్మాణం కోసం అకుంఠిత దీక్షతో పనిచేస్తారని ఆశిద్దాం.

- రవికుమార్ సంగనమోని
7893903740ఫోన్ ‘టాప్’ఇంగ్

Updated By ManamTue, 11/13/2018 - 00:52

imageమీ చేతిలో ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్ ఉందా.. అయితే ప్రపంచం చేతిలో మీరు ఉన్నట్లే... పెరుగుతున్న సెల్ ఫోన్ల సంఖ్యతో పాటు వాటి ద్వారా జరుగుతున్న ఆన్‌లైన్ నేరాల్లో 2012లో 30 శాతం పెరుగుదల నమోదైందని ప్రముఖ యాంటీ వైరస్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. సెల్‌ఫోన్ల ఆధారంగా ఆర్థిక లావాదేవీలు పెరుగు తుండటంతో నేరాలు అదే స్థాయిలో వృద్ధి చెందుతున్నాయి. ఇవే కాక ఇంటర్నెట్ ద్వారా జరుగుతున్న నేరాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. సగటు మొబైల్ వినియోగదారుడ్ని వెంటాడుతున్న భయం ఫోన్ ట్యాపింగ్. దీని ద్వారా మొబైల్‌లోని వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులు దొంగలిస్తారు. అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్ రహస్య వివరాలను తెలుసుకొని మీ ఖాతాలకు కన్నం వేస్తారు. మీరే పంపించినట్లుగా అనుచిత సందేశాలను ఇతరులకు పంపిస్తారు. మీ పనిని మరింత సులభం చేస్తామంటూ ట్రాక్ వ్యూ లాంటి ట్యాపింగ్ యాప్స్ కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. ఆ ట్యాపింగ్ భూతం నుంచి తప్పించుకోవడం ఎలా.. మన మొబైల్ ట్యాపింగ్‌కు గురైం దని తెలుసుకోవడం ఎలా?

సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయాలు కొంపలు ముంచేస్తాయని తెలుసుకోలేక ఎంతోమంది మోసపోతూనే ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కొన్ని ముఠాలు నిత్యం వల వేస్తూనే ఉన్నాయి. ఉద్యోగ ప్రకటనలు, వివాహ ప్రకటనలు, స్నేహాల పేరుతో కొన్ని ముఠాలు, బ్యాంకు ఖాతాదారుల ఓటీపీలను తెలుసుకుని మరికొన్ని ముఠాలు మోసాలకు పాల్పడుతున్నాయి. వ్యక్తుల వ్యక్తిగత గోప్యత, అంతర్జాలం ద్వారా ఇతరులకు తెలిసే అవకాశం ఉంది. ఆ వ్యక్తిపై అతని కంప్యూటర్‌ను వైరస్ ద్వారా లొంగ దీసుకుని అతని సమాచారాన్ని దొంగిలించడం జరుగుతోంది ఈ నేరాలానే హ్యాకింగ్, ట్యాపింగ్ అంటారు. అలాగే అంతర్జాలం ద్వారా నకిలీ సాఫ్ట్‌వేర్‌ని ప్రచారం చేయడం తద్వారా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ హక్కులను అతిక్రమిస్తున్నారు. అంతేకాక అశ్లీల చిత్రాలను, వీడియోలను సమాజంలోకి వెదజల్లడం తరహా సైబర్ నేరాలు చేయడం ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రస్తుత సమాజంలో కంప్యూటర్, మొబైల్ దాని అనుబంధ వస్తు సామాగ్రిని ఉపయోగించి అనేక రకాల నేరాలు జరగడం సహజంగా మారింది.

image


సైబర్ ప్రపంచం రెండు వైపులా పదునున్న కత్తిలాం టిది. సైబర్ నేరగాళ్లు సైబర్ క్షేత్రాన్ని దుర్వినియోగం చేసి ప్రపంచ భద్రతను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్న సైబర్ నేరస్తులు నెట్టింట్లో ప్రవేశించి ప్రజల బ్యాంకు ఖాతాను ఖాళీ చేసేస్తున్నారు. వారి సెల్‌ఫోన్ ప్రైవసీని దెబ్బతీస్తున్నారు. కంప్యూటర్ ముందు మీటలు నొక్కుతూ అంతరిక్షంలోని కృత్రిమ ఉపగ్రహాల వ్యవస్థను ఛిద్రం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో.. ఒక్క బటన్ నొక్కితే శత్రు దేశంలో అణ్వాయుధాలు రీప్రొగ్రామింగ్ జరిగి విధ్వంసం జరిగే ప్రమాద మూ ఉంది. కంప్యూటర్ వ్యవస్థలను విధ్వంసం చేసి అత్యంత సున్నితమైన సమాచారాన్ని తస్కరిస్తు న్నారు. సోషల్ నెట్ వర్కింగ్ పేరుతో ఆడవాళ్ల మీద లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్‌తో చెలరేగిపోతున్నారు. భవిష్యత్‌లో దేశాల మధ్య యుద్ధాలకు సైబర్ క్షేత్రాలే వేదికలవుతాయనడానికి ఇప్పటికే అనేక ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. సైబర్ నేరాల భవిష్యత్ ముఖచిత్రం ప్రపంచాన్ని భయపెడుతోంది. మరి అసలు మన ఫోన్ గోప్యంగా లేదని ఎలా గుర్తించాలి.

ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అనవసరమైన శబ్దాలు లేదా ఝుమ్మని వినిపిస్తుంటే.. మీ ఫోన్ ట్యాపింగ్‌కు గురైం దని అనుమానించొచ్చు. కొన్ని సందర్భాల్లో నెట్‌వర్క్ సమ స్యల వల్ల కూడా ఇలాంటి ధ్వనులు రావచ్చు. సాధారణంగా ఫోన్ ఉపయోగించనప్పుడు ఎలాంటి శబ్దాలు రాకూడదు. అలాకాకుండా మామూలు సందర్భాల్లో కూడా బీప్ సౌండ్స్‌గానీ, క్లిక్ సౌండ్స్‌గానీ వస్తున్నట్లయితే ఫోన్‌ను ఎవరో ట్యాప్ చేసినట్లే. సాంకేతికంగా దీనిని మరింతగా నిర్ధారించుకోవడానికి సౌండ్ బ్యాండ్ విడ్త్ సెన్సార్ అనే పరికరం ఉంటుంది. దీనిని ట్యాపింగ్‌కు గురైన ఫోన్ దగ్గర పెట్టినట్లయితే అలారం మోగుతుంది. ఒకే నిమిషంలో ఎక్కువ సార్లు అలారం మోగినట్లయితే ఫోన్ ట్యాపింగ్‌కు గురైందని నిర్ధారించుకోవచ్చు. ఫోన్ ఛార్జింగ్ బ్యాటరీ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఒక్కసారిగా బ్యాటరీ లైఫ్ పడిపోయినట్లయితే కొంచెం ఆలోచించాల్సిందే. మనకు తెలియకుండానే బ్యాక్ గ్రౌండ్‌లో ట్యాపింగ్ సాఫ్ట్‌వేర్ రన్ అవుతుండటం వల్ల కూడా ఇలా జరగొచ్చు. ఎంత సేపు ఛార్జింగ్ పెట్టాం? ఎక్కువగా ఫోన్ కాల్స్ ఏమైనా మాట్లాడామా? యాప్స్ ఏమైనా ఉప యోగించామా? నెట్ బ్రౌజ్ చేశామా? లాంటి అంశాలను బేరీజు వేసుకోవాలి. ఒకవేళ ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తే దానివల్లే బ్యాటరీ ఖర్చయిందని అర్థం. లేదంటే మన ఫోన్ ట్యాపింగ్‌కు గురైనట్లే లెక్క.

ూౌట్టౌ అంచనా ప్రకారం భారతదేశంలో ఏటా 42 లక్షల సైబర్ నేరాలు నమోదవుతున్నాయి. ప్రతి పది మంది లో ఏడుగురు సైబర్ నేరాల బారిన పడుతున్నారు. నిమిషానికి 80 మంది ఈ-నేరాల వలలో చిక్కు కుంటున్నారు. వీటి వల్ల ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న నష్టం 11 వేల కోట్ల డాలర్లు. ఇది వ్యక్తిగత స్థాయిలో జరుగుతున్న నష్టం మాత్రమే. ఇక కావాలని ఎరవేసి డబ్బు లాగే స్పామ్ దాడుల లెక్కలు చూస్తే అవాక్కు కావాల్సిందే. ఈ విషయంలో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. వైరస్ దాడుల్లో రెండో స్థానంలో ఉంది. అన్ని రకాల సైబర్ నేరాల్లో మూడో స్థానంలో ఉంది. యాపిల్, ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో ఏ అప్లి కేషన్ ఎంత మేర బ్యాటరీని వినియోగించుకుంటుందో తెలు సుకోవచ్చు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి బ్యాటరీ సెట్టింగ్స్‌తో  బ్యాటరీ యూసేజ్ ఆప్షన్‌తో తెలుసుకోవచ్చు. లేదంటే బ్యాటరీ లైఫ్, కోకోనట్ బ్యాటరీ తదితర యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా బ్యాటరీ ఉపయోగించడం ప్రా రంభించిన తర్వాత దాని ఛార్జింగ్ నిల్వ సామర్థ్యం సంవత్సరం వరకు బాగానే ఉంటుంది.ఆ తర్వాత క్రమేపీ తగ్గిపోతుంది. అలాంటి సందర్భాల్లో బ్యాటరీని ఎక్కువగా వినియోగించే యాప్స్, జీపీఎస్, వైఫై ఆఫ్ చేయడంతో పాటు, డిస్‌ప్లే స్క్రీన్ బ్రైట్‌నెస్ వీలైనంత వరకు తగ్గించుకోవాలి. అలా కా కుండా మీ మొబైల్ ఇంతకు మునుపటిలా సమర్థంగా పని చేయడం లేదా? స్విచ్చాఫ్ చేసిన వెంటనే షట్‌డౌన్ కావడం లేదా? స్విచ్ ఆఫ్ చేసినప్పటికీ లైట్ ఇండికేటర్ వెలుగుతూనే ఉందా? అయతే మీ ఫోన్‌ను ఎవరో ట్యాప్ చేశారని అనుమానపడొచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఫోన్‌ను ఒక్కసారి రీబూట్ చేయడం మంచిది. కొన్నిసార్లు కొత్తగా ఇన్‌స్టాల్ చేసిన యాప్స్ వల్లగానీ, ఆప్‌డేటెడ్ సాఫ్ట్‌వేర్‌లో ఏమైనా లోపాలున్నా సరే ఇలాంటి సమస్యలు తలెత్తవచ్చు.

మీ ప్రమేయం లేకుండానే ఫోన్ ఆన్, ఆఫ్ అవుతోందా? కొత్త యాప్స్ వాటంతట అవే ఇన్‌స్టాల్ అయిపోతున్నాయా? అయితే మీ ఫోన్‌ను ఎవరో హ్యాక్ చేసినట్లే.. మీ మొబైల్‌లో కొన్ని స్పై యాప్స్‌ని ఇన్‌స్టాల్ చేసి మీ వ్యక్తిగత సమాచారాన్ని దొరకబుచ్చుకుంటారు. తద్వారా మీ కాల్స్‌ను ట్యాప్ చేస్తారు. మీకు ఇలాంటి అనుమానం వచ్చినట్లయితే వెంటనే అలెర్ట్స్‌ను యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మన మొబైల్ లో ఎలాంటి యాప్స్ ఇన్‌స్టాలైనా సంబంధిత ఈ మెయిల్ అకౌంట్‌కు అలెర్ట్ మెసేజ్ వెళ్తుంది. మీ మొబైల్‌కు అపరిచత వ్యక్తుల నుంచి ఎన్‌కోడెడ్ మెసేజ్‌లు వస్తున్నట్లయితే.. కచ్చి తంగా జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే మొబైల్ ట్యాపింగ్ జరిగిందనడానికి ఇదో నిదర్శనం. వీటి ద్వారా మాల్‌వేర్‌ను మన ఫోన్‌లోకి చొప్పించి ట్యాపింగ్‌కు పాల్పడతారు. మీరెప్పుడైనా గమనించారోలేదో.. మాట్లాడుతున్న ఫోన్‌ను టీవీ దగ్గర గానీ, రేడియో దగ్గర గానీ, ల్యాప్‌టాప్, కాన్ఫరెన్స్ ఫోన్ దగ్గర ఉంచినప్పుడు ఝుమ్మ్‌ని శబ్దం వినిపిస్తుంది. మామూలుగా ఉన్నప్పడు ఇలాంటి శబ్దాలు రావు. ఫోన్ ఉపయోగించనప్పుడు కూడా ఇలాంటి శబ్దాలు వస్తున్నాయంటే మీ ఫోన్ ద్వారా అవతలి వ్యక్తులు మీరు మాట్లాడుకుంటున్నది వింటున్నట్లే లెక్క. ఇంతేకాక సాధారణంగా వస్తున్న ఫోన్ బిల్ కంటే ఒకేసారి ఎక్కువ బిల్ వచ్చిందా? వెంటనే ఆ లిస్ట్ తెప్పించుకొని చెక్ చేయండి. కాల్స్ కోసం ఎంత ఖర్చు చేశామో? డేటా కోసం ఎంత ఖర్చు చేశామో? పరిశీలించండి. కొందరు వ్యక్తులు మాల్‌వేర్స్‌ని మొబైల్‌లోకి చొప్పించి.. మన డేటా ప్లాన్‌ను తస్కరించి వారి రహస్య లావాదేవీలను జరుపుతారు. మనకు తెలియకుండా ఏదో యాప్ ను ఇన్‌స్టాల్ చేస్తే... అది ఎక్కువ డేటాను ఉపయోగించిన ప్పుడు కూడా ఇలాంటి సమస్యలు తలెత్తవచ్చు.

ఇవన్నీకి కారణం కూడా మీరే అది ఎలా అనుకుంటు న్నారా ..? సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ వంటి చోట్ల ఏదో ఒక సర్వే చేస్తున్నామని నమ్మబలుకుతుంటారు. ఈ-మెయిల్ ఐడీ, సెల్‌ఫోన్ నెంబరు రాసి డబ్బాలో వేస్తే... డ్రా తీసి బహుమతి ఇస్తామని కూడా ఆశపెడతారు. అలాంటి వారికి వివరాలిస్తే, ఇబ్బందే. వారి దగ్గర నుంచి ఈ వివరాలను సైబర్ నేరగాళ్లు కొనేసి తమ పని కానిస్తుంటారు. మేం ఫలానా బ్యాంకు నుంచి మెయిల్ చేస్తున్నాం. భద్రతా చర్యల్లో భాగంగా అందరి వివరాలూ తనిఖీ చేస్తున్నాం.మీ అకౌంట్ నెంబర్, పాస్‌వర్డ్ చెప్తే ఎవరూ టాంపర్ చేయకుండా చర్యలు తీసుకుంటాం. అంటూ వచ్చే ఈ-మెయిల్‌కు స్పందిస్తే ఖాతా ఖాళీ అయిపోయినట్లే. ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రోజుకు ఇలా 98 లక్షల ఫిషింగ్ మెయిల్స్ పంపుతున్నట్లు తెలుస్తుంది... సాంకేతిక సమాచార అవకాశాలు పెరగడంతో అనేక విద్య, వాణిజ్య రంగాల అభివృద్ధికి దోహదపడుతుంది. అదే సమయంలో ఈ విజ్ఞానం పక్కదోవ పట్టి కొత్త రకమైన నేరాలు జరగడం మొదలైంది. వాటిని సైబర్ నేరాలుగా గుర్తిస్తున్నాము. సాధారణంగా మొబైల్, కంప్యూటర్‌ను ఉపయోగించి చేసే ఏ నేరమైనా సైబర్ క్రైం కిందకు వస్తుంది. సాంకేతిక సమాచార రంగంలో కంప్యూటర్‌ను అంతర్జాలాన్ని దుర్వినియోగం చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నా రు. ఈ మధ్య కాలంలో ఇటువంటి కేసులు అనేకం నమోదు అవుతున్నాయి. వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కూడా సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఈ నేరాలు దేశాల హద్దులు కూడా దాటుతుండడంతో చట్టాన్ని అమలు చేసే సంస్థలకు, దర్యాప్తు సంస్థలకు పెద్ద తలనొప్పిగా మారింది. అంతర్జాలాన్ని వినియోగించి ఒకటి కాదు అనేక రకాల మోసాలు జరుగుతున్నాయి. సైబర్ నేరాల కోసం కంప్యూటర్, మొబైల్ ఫోన్, స్కానర్, డిజిటల్ కెమెరాల వంటి అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలను నేరస్తులు విరివిగా వినియోగిస్తున్నారు. ఫోర్జరీ, చిత్రాల రూపు మార్చడం, అసభ్యకరమైన అగౌరవకరమైన సమాచారాన్ని చేరవేయడం, మొబైల్ ఫోన్‌లలో బెదిరింపులు చేయడం,అనుమతి లేకుండా రహస్యంగా ఫొటోలను తీసి వ్యక్తులను బ్లాక్ మెయిల్ చేయడం సైబర్ నేరాలలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సమాచార సంకే తిక చట్టాన్ని పార్లమెంట్ 2000 సంవత్సరంలో రూపొందిం చింది. ఆ చట్టం వల్ల ఎలక్ట్రానిక్స్ ఆధారిత సమాచార వ్యవస్థలో ఏకీకృత విధానాలను ప్రవేశపెట్టడం, దాని ద్వారా వాణిజ్యానికి సాంకేతిక సమాచార అభివృద్ధికి సంబంధాలను ఏర్పరచారు. ఈ చట్టంలో కొన్ని రకాల నేరాలను తీవ్రమైన సైబర్ నేరాలుగా గుర్తించి అందుకు నిర్దిష్టమైన కఠిన శిక్షలను రూపొందించారు. 

కంప్యూటర్‌ను వైరస్ ద్వారా అదుపులోకి తీసుకోవడం, నిర్దేశిత కార్యక్రమాన్ని రూపుమాపడం అనే నేరానికి మూడేళ్ల కఠినకారాగార శిక్ష పడుతుంది. అంతేకాక 2 లక్షల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. కం ప్యూటర్‌ను హ్యాక్ చేసి పౌరుల, ప్రభుత్వ ఆస్తుల విధ్వం సానికి పాల్పడితే ఈ తరహా శిక్షలు పడతాయి. అశ్లీల సమా చారం, చిత్రాలను నెట్ ద్వారా ప్రసారం చేయడం వంటి నేరాలకు కనీస జైలు శిక్ష, మొదటి సారి నేరం చేసిన వ్యక్తికి లక్ష జరిమానా విధిస్తారు. రెండోసారి నేరానికి పాల్పడితే పదేళ్ల వరకూ జైలుశిక్ష 2 లక్షల జరిమానా విధిస్తారు. ఈ చట్టం ద్వారా పోలీసులు వారెంటు లేకుండా బహిరంగ ప్రదేశాలను తనిఖీ చేయవచ్చును. అను మానితులను అరెస్ట్ చేయవచ్చు.

చాలా మాల్‌వేర్స్ యాప్స్ ద్వారానే మొబైల్‌లోకి చొర బడతాయి. అందువల్ల యాప్‌స్టోర్ నుంచి గానీ, గూగుల్ ప్లేస్టోర్ నుంచి గానీ యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆయా యాప్స్‌లో స్పైవేర్‌కి సంబంధించిన లక్షణాలు లేనప్పుడే వాటిని డౌన్‌లోడ్ చేయాలి. అయితే అధికారిక యాప్ స్టోర్ లేదా ప్లేస్టోర్‌లో ఉన్న యాప్స్ అన్నీ దాదాపు స్క్రీనింగ్ చేసినవే ఉంటాయి. కానీ, కొన్ని మాల్‌వేర్ యాప్స్ ప్లేస్టోర్ సెక్యూరిటీ కళ్లుగప్పినా ఆశ్చర్యపోనక్కరలేదు. ముఖ్యంగా గేమింగ్ యాప్స్‌తో చాలా జాగ్ర త్తగా ఉండాలి. వాటిని ఇన్‌స్టాల్ చేసినప్పుడు కాల్ హిస్టరీ, అడ్రస్‌బుక్, కాంటాక్ట్ లిస్ట్ కోసం పర్మిషన్ అడిగితే ఆలోచించుకోవాలి. మరికొన్ని చీటింగ్ యాప్స్ మనందరికీ తెలిసిన పేరుతో అదే లోగోతో కనిపిస్తాయి. అందువల్ల డౌన్‌లోడ్ చేసే ముందు ఆ యాప్ డెవలపర్ పేరును చెక్ చేసుకోవడం మంచిది. మీ ఫోన్‌ను మీ పిల్లలు కూడా ఉపయోగిస్తున్నట్ల యితే.. అనుచిత యాప్స్‌ని డౌన్‌లోడ్ చేయకుండా పేరెంటల్ యాక్సిస్ తీసుకోవడం ఉత్తమం. ఏది ఏమైనా మానవుని సౌకర్యం కోసం పెంచుకుంటున్న సాంకేతికతనే... ఇప్పుడు మానవాళి ప్రమాదానికి కూడా కారణం అవుతుందా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. తన మొబైల్ ఫోన్ అన్ లాక్ చేసేందుకు ఫింగర్ ప్రింట్ వాడే వినియోగదారుడు అవి ఎక్కడ కాపీ చేయబడతాయో అని గుర్తించలేక పోతున్నాడు. ఈ నేరాలను పూర్తిగా నివారించడము కష్టం కాబట్టి అప్ర మత్తంగా ఉండటమే ముఖ్యం అని భద్రతా నిపుణులు సూచిస్తున్నారు.

- అర్జున్ మహేంద్ర 
సీనియర్ జర్నలిస్ట్, సామాజిక విశ్లేషకులు 
9951574584స్వరాష్ట్ర కాందిశీకులు 

Updated By ManamMon, 11/12/2018 - 02:24

imageతెలంగాణ స్వరాష్ట్ర కాంక్చ నేరవేరి ఐదేండ్ల కాలం కావొస్తుంది. స్వరాష్ర్ట పాలకుల తీరు తెన్నులు అవగహన చేసుకునేందుకు ఎంతోకాలం పట్ట లేదు. పైగా ఉద్యమానికి నాయకత్వం వహించిన ఉద్యమ నేత  అధికార పగ్గాలు చేపట్టాడు. దీంతో తెలంగాణ దిశ దశ మారుతుందనీ, తెలంగాణ ప్రజానీకానికి మార్గనిర్దేశనం చేస్తారని, మెరుగైన పాలన అందుతుందని ఉద్యమ శక్తులు, తెలంగాణ ప్రజలు భావించారు. కానీ ఆ మార్పేమి లేక పోగా అణచివేత, దోపిడీ, నియంతృత్వం తీవ్రమైంది. ప్రజాస్వామిక హక్కులపై దాడి కొనసాగుతున్నది. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రశ్నించటాన్ని సహించలేకపోతున్నది. ప్రజలను కాందిశీకులుగా చూస్తున్న వైనం ప్రజల ముందున్నది. కుల, మత విభజనల ద్వారా ఓట్ల స్టంట్‌ను పాలకపార్టీలు తీసుకున్నాయి. విభజించి పాలించే సూత్రాన్ని ఒంటబట్టిం చుకున్నాయి. గత పాలకులు అనుసరించిన విధానాలనే టీఆర్‌ఎస్ కొన సాగించింది. ప్రజలు ఏమీ కోరుకున్నారంటే గత పాలకులు చేపట్టిన ఆర్ధిక విధానాల మూలంగా నష్టపోయామనీ, స్వరాష్ట్ర పాలకులైతే ప్రత్యామ్నాయ ఆర్ధిక విధానాలు అమలు చేస్తారని ఆశించారు. వాటిని అమలు చేయక పోగా ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు.
 

image

నీళ్లు, నిధులు, నియమాకాలు పేరుతో ఉద్యమం నడిపి అధికారం చేపట్టాక వాటిని ఏ మేరకు అమలు జరిపారో తెలియంది కాదు. అవి అమలు జరిగి ఉంటే వాటి కోసం ఉద్యమించాల్సి వచ్చేదికాదు. నీళ్లివ్వలేక పోయారు. నిధులు నీళ్లలా ఖర్చుచేశారు. నియమాకాల ఊసు మరిచిపో యారు. వాటికోసం పోరాడిన వాళ్లంతా అంటరాని వాళ్లుగా మిగలగా ద్రోహులంతా అప్తమిత్రులయ్యారు. అధికారాన్ని అనుభవించారు. గతాను భవంలో తెలంగాణ సమాజాన్ని దోపిడీ చేసి ద్రోహనికి పాల్పడిన వారే మళ్లీ పరిపాలనలో భాగస్వాములయ్యారు. వారిలో ఏ మార్పు కనబడిందో పెద్దదొరకు కానీ, తెలంగాణ ప్రజలను, ఉద్యమకారులను బకరాలను చేశా రు. 1200 మంది అమరుల త్యాగాలను అవమానపర్చారు. తెలంగాణ నిజమైన ఉద్యమకారుల ఆవేదన ఎవరికి పట్టరాని ఆంశంగా మారింది. ఆ ఆంశమే నేడు మేనిఫెస్టోల పెట్టాల్సిరావడం జీర్ణంకానీ చేదు గుళికే. 

ముహుర్తాలు, జాతకాలు చూసి, మూఢత్వాన్ని నింపుకొని పాలన చేయడం దేనికి సంకేతం. అసెంబ్లీ భవనాన్ని మార్చాలనుకోవడం, పాత భవనాలకు వాస్తు లేదని, ప్రగతి భవన్ నిర్మించుకోవడం దాని కేంద్రం గానే పాలన చేయడం గడీల పాలన తప్ప మరొకటి కాదు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి మనువాద పాలన చేయడం ద్వారా బీజేపీ పాలన నము నానే టీఆర్‌ఎస్ అనుసరించింది.

మతఛాందస భావజాల వ్యాప్తికి కేసీఆర్ చేసింది ఎక్కువే. ఒక బాధ్య తగల పదవిలో ఉండి పాలకుడిగా నిలబెట్టాల్సిన లౌకికవాదానికి తూట్లు పొడిచారు. మతాన్ని రాజకీయాల్లోకి లాగారు. భక్తుడిగా గుళ్లూ గోపురాలు తిరిగారు. ప్రజాధనాన్ని వారి వ్యక్తిగత మొక్కులకు ఖర్చు చేశారు. ఓ వైపు హిందువులను ఆకరి్షస్తూ మరోవైపు సంక్షేమ పథాకాలు, అభివృద్ధి పేరుతో ముస్లింలను బుట్టలో వేసుకున్నారు. హిందూ ముస్లింల ఓట్లను రాబ ట్టేందుకు  చూపిన శ్రద్ధను ప్రజాసమస్యల పరిష్కారంపై పెట్టలేదు. సమ స్యలపై నీలదీసిన వారిపై, నిరసనలు వ్యక్తం చేసినోళ్లపై ఉక్కుపాదాన్ని మో పారు. కార్మికులపై, హక్కుల కార్యకర్తలతో పాటు రైతులకు బేడీలు వేసి అవమానపర్చారు. రైతుల ఆత్మహత్యలను నివారించలేకపోయారు. హైద రాబాద్‌లోని ధర్నా చౌక్‌ను సైతం ఎత్తేశారు. కేసీఆర్ నిజమైన ఉద్యమకా రుడైతే ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు పూనుకుని ఉండేవారు కాదు.

ఉద్యమ కాలంలో ఇచ్చిన హమీలకు కాలం చెల్లిపోయిందనేది స్పష్ట మైంది. చెప్పినవి చేసినామని, చెప్పనివి కూడా చేసినామనే బూటకపు మాటలు పదేపదే వల్లిస్తున్న ఏలికలు వాస్తవాల్ని మరుగున పరుస్తున్నారు. తెలంగాణకు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి నయవంచన చేశారు. తానే సీఎం పదవిలో కూర్చున్నప్పుడు వారి మాటలకు విశ్వాస నీయత లేకుండా పోయింది. దళితులకు మూడేకరాల భూపంపిణీ నాలు గేండ్లలో అమలకు నోచుకోలేదు. కనీసం రాష్ట్ర వ్యాప్తంగా పదివేల ఎకరాల పంపిణీ జరుగకపోవడం పాలకుల చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నది. పైగా దళితు లపై దాడులు, దౌర్జన్యాలు, కుల వివక్ష, కుల దురహంకార హత్యలకు తెలంగాణ వేదికగా మారింది. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ సాధన జరుగకపోగ ఆదివాసీ, గిరిజన బిడ్డలు హక్కుల కోసం, చట్టాల అమలు కోసం జైళ్లకు వెళ్లాల్సి వచ్చింది. పోడు భూముల సమస్య తీవ్రమైంది. భూముల నుంచి వెళ్లగొట్టి పెట్టుబడిదారుల పంచన చేరేందుకు ఈ ప్రభు త్వం అత్యుత్సాన్ని ప్రదర్శించటం ద్వారా సాధించింది శూన్యమే.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం పేదల్లో ఎన్నో ఆశల్ని కలిగిం చింది. వాస్తవానికి ఇండ్ల స్కీం టీఆర్‌ఎస్‌కు ఓట్లు సాధించి పెట్టింది. అధి కారంలోకి వచ్చేందుకు దోహదపడింది. సమగ్ర సర్వేలో 25 లక్షల మంది ఇండ్లు లేని పేదలున్నారని గుర్తించినట్లు ప్రకటించారు. ఎడాదికి లక్ష ఇం డ్లు నిర్మిస్తామని చెప్పి 10 వేల ఇండ్లు కూడ నిర్మించి ఇవ్వలేదు. ఎర్రవెల్లి, నర్సాపూర్ గ్రామాల్లో మోడల్ ఇండ్లు తప్ప ఎక్కడ పేదలకు ఇండ్లివ్వ లేదు. కొన్ని చోట్ల ఇండ్ల నిర్మాణం చేపట్టినప్పటికి వాటిలో నాణ్యత లేదు. చివరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వైఫ ల్యం చెందింది. ఇండ్లులేని నిరుపేదలను సంతృప్తి పర్చలేకపోయింది. ఇదేగాక కేజీ టూ పీజీ ఉచిత విద్యను అమలు చేయలేదు. నేటి ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు లేని మండలాలు ఆనేకం ఉన్నాయి. కార్పొ రేట్ విద్యాలయాలకు కేసీఆర్ ప్రభుత్వం లాభాలు చేకూర్చి పెట్టింది.

ఇప్పుడు రాష్ట్రంలో సామాజిక ఆంశం కేంద్రంగా రాజకీయాలు  నడు స్తున్నాయి. కులాలకు అనేక తాయిలాలు ప్రకటించినప్పటికి రాజకీయ అవకాశాలు కల్పించటంలో పాలకపార్టిలు ఒకే తానులో ముక్కలమని చాటుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్ అత్యధిక సీట్లు ఆధిపత్య కులాలకే కేటాయించింది. ప్రధాన ప్రతిపక్షం మహకూటమి కూడా అదే రీతిలో సీట్లు కేటాయించనున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పటివరకు అసెం బ్లీలో అడుగుబెట్టని కులాలెన్నో ఉన్నాయి. బీఎల్‌ఎఫ్ బహుజనులకు రాజ్యాధికార లక్ష్యంగా సీట్లు కేటాయిస్తున్నది. బీజేపీతో పాటు ఇతర పార్టీ లు కూడా కులాన్ని కేంద్ర బిందువుగా చేసుకున్నాయి. అయితే టీఆర్‌ఎస్ కులాల్ని తమ వైపు తిప్పుకునేందుకు ముదిరాజ్‌లకు చేపపిల్లలు, గొల్ల కుర్మకులకు గొర్రెలు, బర్లు, వాహనాలు, రుణాలు, కులాల వారీగా భవ నాలు, సంక్షేమ పథకాలు పేరుతో చేసిన ఎత్తులు జిత్తులు చాలానే ఉన్నా యి. కానీ అవి అభివృద్ధికి ప్రతిపాదిక కావు. సామాజిక న్యాయం అసలే కాదు. ప్రజల జీవణ ప్రమాణాలను సంక్షేమ పెంచలేవు. రాజ్యాధి కారంలో అట్టడుగు వర్గాలకు అవకాశాలు దక్కాలి. అందుకు రాజకీయపార్టీలు సంసిద్ధంగా లేవన్నది నిజం.

- మామిండ్ల రమేష్ రాజా

Related News