Nitin Gadkari

‘మోటారు పరిశ్రమకు వ్యతిరేకిని కాను’

Updated By ManamWed, 09/05/2018 - 22:03

Nitin Gadkariన్యూఢిల్లీ: రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తాను మోటారు వాహనాల పరిశ్రమకు వ్యతిరేకం కాదని, పరిశ్రమకు అనుకూలమైన విధానాలను పొందుపరిచా మని  చెప్పారు. ఆటోమోటివ్ కంపొనెంట్  మాన్యుఫ్యా క్చర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏ.సి.ఎం.ఏ) బుధవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం లో ఆయన ప్రసంగించారు. గడ్కరీ బుధవారంనాటి ప్రసంగం ఇదే వేదిక పైనుంచి ఆయన గత ఏడాది చేసిన ప్రసంగానికి భిన్నమైన రీతిలో సాగింది. ‘‘రవాణాపై ప్రభుత్వ విధానాలు స్పష్టంగా లేవని అనవద్దు. మేం దిగుమతులు తగ్గించి, ఎగుమతులు పెంచాలని, కాలుష్య సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. వీటికోసం ఏ చర్యలు అవసరమైతే వాటిని తీసుకుంటాం’’ అని గడ్కరీ అన్నారు. ఆయన ఇదే వేదిక పైనుంచి గత ఏడాది ప్రసంగిస్తూ కాలుష్య కారక వాహనాలను (పెట్రోల్/డీజిల్) ఎత్తి కుదేస్తామని, కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్ల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను కోరుకుంటున్నామని చెప్పారు. అప్పట్లో ఆయన ప్రకటన మోటారు వాహనాల పరిశ్రమ నుంచి, దానితో ముడిపడినవారి నుంచి విమర్శలకు గురైంది. ఈ రంగంపై ప్రభుత్వానికి స్పష్టమైన విధానాలు లేవని వారు దుమ్మెత్తిపోశారు. బీఎస్-సిక్త్స్‌కు అనుకూలమైన ఇంజన్లపై ఈ రంగం ఎంతో ఇన్వెస్ట్ చేసిన తర్వాత, ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల గురించి మాట్లాడుతోందని, వాటిపై మరోసారి పెద్ద మొత్తాలను పెట్టడం గురించి ప్రస్తావిస్తోందని విమర్శించారు.  

అయితే, బుధవారంనాడు గడ్కరీ ప్రసంగ సరళి మారింది. నవకల్పనలతో ఉత్పత్తులు తీసుకురాగల సత్తా భారతదేశానికి ఉందని, ప్రపంచంలో ఇతర మార్కెట్లకన్నా అది ఈ విషయంలో నిచ్చెన పైకి ఎగబాకగలదని ఆయన చెప్పారు. ‘‘ప్రపంచంలో భారతదేశం నాల్గవ పెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా ఉంది. త్వరలోనే మనం మూడవ స్థానంలో ఉంటాం. మనం ఇప్పుడు సరిగ్గా అడుగులు వేస్తే, నాయకత్వ స్థానానికి కూడా ఎదగగలం’’ అని ఆయన అన్నారు. ‘‘గత ఏడాది నేను అన్న మాటలకి పరిశ్రమలో చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ, నేను మీకు వ్యతిరేకం కాదని స్పష్టం చేయదలచుకున్నాను. మేం ఏ పరిశ్రమా మూతపడేట్లు చేయం’’ అని గడ్కరీ అన్నారు. ‘మూవ్’ శిఖరాగ్ర సమావేశాలు సెప్టెంబర్ 7-8 తేదీల్లో జరుగనున్నందున, ప్రభుత్వం వైపు నుంచి అనేక చర్యలు, విధానాలు ఉంటాయని భావిస్తున్నారు. ముఖ్యంగా హైబ్రీడ్, ఎలక్ట్రిక్ (ఫేమ్ 2) వాహనాల తయారీ, సత్వర వాడుక పథకం రెండవ దశను అమల్లోకి తెస్తారని భావిస్తున్నారు.వాహన జీవితకాల పరిమితిపై చర్చలు

Updated By ManamMon, 08/06/2018 - 22:56

Nitin-Gadkari-FBన్యూఢిల్లీ: ఇరవై ఏళ్ళు నిండిన కమర్షియల్ వాహనాలను వాడకుండా పక్కన పెట్టేయాలన్న ప్రతిపాదిత విధానంపై ప్రధాన మంత్రి కార్యాలయం (పి.ఎం.ఓ) ఆదేశాల మేరకు దానితో ప్రమేయం ఉన్నవారితో మరో విడత సంప్రదింపులు జరుపనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. అటువంటి వాహనాలన్నింటినీ 2020 ఏప్రిల్ 1 నుంచి తప్పనిసరిగా తుక్కుగా మార్చేందుకు బాటలుపరచడాన్ని ఆ ప్రతిపాదన లక్ష్యంగా పెట్టుకుంది. ‘‘దీనితో ప్రమేయం ఉన్నవారితో మరో విడత సంప్రదింపులు జరుపవలసిందిగా  పి.ఎం.ఓ మమ్మల్ని కోరింది. ఆ విధంగా మేం పరిశ్రమలవారు, వినియోగదారులతోపాటు ఈ అంశంతో ప్రయోజనాలు ముడిపడిన వారందరితోను సంప్రదింపులు జరుపుతాం’’ అని రోడ్డు రవాణా మంత్రి గడ్కరీ ఇక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మీడియా ప్రతినిధులకు విడిగా చెప్పారు. ‘‘ప్రతి ఒక్కరి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకున్నాక’’ దాన్ని ఆమోదం నిమిత్తం పి.ఎం.ఓకు తిరిగి పంపుతామని ఆయన చెప్పారు. ఒకసారి ఈ విధానం ఆమోదం పొందితే,  మోటారు వాహనాల తయారీకి ఇండియా ప్రధాన కేంద్రంగా అవతరిస్తుంది. పాత వాహనాలను తుక్కుగా చేయడం వల్ల ఉక్కు, అల్యూమినియం, ప్లాస్టిక్ ముఖ్యమైన ముడి పదార్థాలు అందుబాటులోకి వస్తాయి. అవి పునర్వినియోగంలోకి వస్తూంటాయి. ఫలితంగా ఆటోమొబైల్ ధరలు ‘‘20 నుంచి 30 శాతం వరకు’’ తగ్గుతాయని గడ్కరీ అన్నారు. రూ. 4.5 లక్షల కోట్ల టర్నోవరుతో ఆటోమొబైల్ పరిశ్రమకు ఇండియా ఇప్పటికే ఒక అగ్ర స్థాయి ప్రదేశంగా ఉందని ఆయన తెలిపారు. ‘‘అపారమైన అవకాశాలుంటాయని అనుకుంటున్నాను’’ అని ఆయన అన్నారు. ప్రభుత్వం 2016లో స్వచ్ఛంద వాహన శ్రేణి ఆధునికీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దశాబ్దాలుగా వాడుకలో ఉన్న 2 కోట్ల 80 లక్షల వాహనాలను రోడ్డుపై నుంచి తప్పించాలని ఆ కార్యక్రమం ప్రతిపాదించింది. దీనిలో రాష్ట్రాలు ఎక్కువ పాలుపంచుకునేటట్లు, కేంద్రంగా నుంచి పాక్షికంగా సహాయ సహకారాలుండేట్లు ఆ పథకాన్ని రీడిజైన్ చేయవలసిందని కార్యదర్శుల కమిటీ ఒకటి రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసింది. వాహనాల జీవిత కాలంపై పరిమితి విధించడానికి, ఉద్గారాల విడుదల నియంత్రణకు సంబంధించిన నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు దశవారీగా ఒక క్రమపద్ధతితో కూడిన వైఖరిని అనుసరించాలని నిర్దేశిస్తున్న  సవరించిన సంప్రదింపుల పత్రానికి పి.ఎం.ఓ నుంచి సూత్రప్రాయంగా ఆమోదం లభించిందని,  ఈ కొత్త ప్రతిపాదన కూడా ఆ లక్ష్య సాధనకు తోడు కాగలదని కార్యదర్శుల కమిటీ పేర్కొంది. పోలవరంపై ఇంకా అభ్యంతరాలు, అనుమానాలు!

Updated By ManamWed, 07/11/2018 - 19:20

Central govt Still Arguments and Doubts On Polavaram project

పోలవరం: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి పోలవరం పనుల పరిశీలనకు ఏపీకి వచ్చారు. ఈ సందర్భంగా ఏపీ  సీఎం చంద్రబాబుతో కలిసి సుమారు అరగంటపాటు పనులను పరిశీలించారు. పనుల పురోగతిని కేంద్రమంత్రికి బాబు వివరించడం జరిగింది. కేంద్ర మంత్రి రాకతో ఓ వైపు టీడీపీ.. మరోవైపు బీజేపీ వేర్వేరుగా వేదికలను ఏర్పాటు చేసి ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 2019 డిసెంబర్ నాటికి డెడ్‌లైన్ పెట్టుకున్నామని  టార్గెట్‌గా పెట్టుకొని పనులు చేస్తున్నామన్నారు. ఫిబ్రవరి నాటికి కాంక్రీట్ పనుల్ని పూర్తిచేస్తామన్నారు. మెజార్టీ పనులన్నీ ఏప్రిల్ కల్లా పూర్తి చేసేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. డీపీఆర్-2ను కూడా వీలైనంత త్వరగా క్లియర్ చేయాలని కేంద్రాన్ని ఈ సందర్భంగా బాబు కోరారు. 2013 చట్టం ప్రకారం ఖర్చు అంచనాలు పెరిగాయన్నారు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరానికి రూ. 57,940 కోట్లు అవసరమని కేంద్రమంత్రికి బాబు వివరించారు. భూ సేకరణకు రూ. 33వేల కోట్లు అవసరమన్నారు. పెండింగ్‌లో ఉన్న నిధులన్ని విడుదల చేయాలని ఈ సందర్భంగా బాబు కేంద్ర మంత్రికి వివరించారు. కాగా బాబు మాట్లాడుతున్నంత సేపు గడ్కరీ తథేకంగా ఆయనవైపే చూడసాగారు.

నితిన్ గడ్కరీ మాట్లాడుతూ..
"
పోలవరం ఏపీకే కాదు దేశానికి కీలకమైన ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్టు రైతులకు కొత్త జీవితాన్నిస్తుంది. పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉంది. ప్రాజెక్టు పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. పోలవరం ఏపీకే కాదు.. దేశానికి కీలకమైన ప్రాజెక్ట్. పనులు పూర్తి చేసేందుకు నిధుల్ని అడ్వాన్స్‌గా చెల్లించాలని సీఎం కోరారు. పోలవరం పూర్తి చేయడానికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారు. ప్రాజెక్ట్ ఏపీకి కొత్త జీవితాన్నిస్తుంది.

త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను కోరాము. భూసేకరణ, పరిహారం కోసం నిధులు చెల్లించాలంటే ఫైనాన్స్ కమిషన్ అనుమతి కావలి. పోలవరం భూసేకరణ ఖర్చు దాదాపు రెట్టింపు అయింది. పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రాజెక్ట్ వేరు.. రాజకీయాలు వేరు. ప్రాజెక్టును పూర్తి చేసే విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావు లేదు. ముందుగా గిరిజనులకు పరిహారం విషయాన్ని సెటిల్ చేయాల్సి ఉంది. కేంద్ర, రాష్ట్ర అధికారులు మూడు రోజుల పాటు ఇక్కడే మకాం వేసి సమస్యలను పరిష్కరించాలని సూచించాను. పెరిగిన ప్రాజెక్టు అంచనాను ఆర్థిక శాఖకు పంపిస్తాము. నీటి సదుపాయం ఉంటే ఎంతమేలు జరుగుతుందో నాకు తెలుసు" అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.

మొత్తానికి చూస్తే.. పోలవరం విషయంలో కేంద్రం ఎలాంటి హామీలివ్వకపోగా కొర్రీలు పెట్టడం గమనార్హం. తాజా డీపీఆర్‌పై అభ్యంతరాలు, అనుమానాలు కేంద్రం వ్యక్తం చేయడమేంటో అర్థం కాని పరిస్థితి. కనీసం అడ్వాన్స్ ఇచ్చేందుకు కూడా కేంద్రం ముందుకురాకపోవడం విచిత్రం. ఇవన్నీ అటుంచితే పునరావసంపై కూడా గడ్కరీ అనుమానాలు వ్యక్తం చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్యాకేజీ భారం పెరిగిందని సీఎం చంద్రబాబు కేంద్రానికి విన్నవించుకున్నా ఎలాంటి ఫలితం లేకపోయిందన్నది స్పష్టంగా అర్థమవుతోంది. పెరిగిన ప్యాకేజీతో పాటు సేకరించిన భూమి కూడా పెరుగుతోందని గడ్కరీ.. సీఎం బాబునే నిలదీయడాన్ని పలువురు విశ్లేషకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.బీజేపీలో చేరిన మాధవీ లత

Updated By ManamSat, 05/05/2018 - 15:24

Madhavi latha హైదరాబాద్: సినీ నటి మాధవి లత బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో ఆమె శనివారం బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆమెతో పాటు కార్వాన్ కాంగ్రెస్ నేత అమర్ సింగ్, కేయూ మాజీ వీసీ వైకుంఠం పలువురు బీజేపీ కండువాను కప్పుకున్నారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. వీరందరూ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నానని, వీరి రాకతో తెలంగాణ పార్టీ మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒక వర్గంలో మంచి పట్టున్న నేతలు బీజేపీలో చేరడం శుభపరిణామంగా భావిస్తున్నామని తెలిపారు. మరి రానున్న ఎన్నికల్లో మాధవీ లత బీజేపీ తరఫున ఎక్కడి నుంచైనా పోటి చేస్తుందేమో చూడాలి.

Actress Madhavi Latha Joins in BJPమరో నేతకు క్షమాపణ చెప్పిన కేజ్రీవాల్

Updated By ManamMon, 03/19/2018 - 17:17

arvind kejriwalన్యూఢిల్లీ: పరువు నష్టందావా కేసుల చిక్కుల నుంచి బయటపడేందుకు ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ బెట్టువీడి దిగివస్తున్నారు. ఓ పరువు నష్టం దావా కేసులో రాజీ కుదుర్చుకునేందుకు పంజాబ్ మాజీ మంత్రి బిక్రం సింగ్ మజితియాకు క్షమాపణ చెప్పిన కేజ్రీవాల్...తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీకి క్షమాపణ చెప్పారు. గతంలో ఆయనపై చేసిన అవినీతి ఆరోపణల పట్ల కేజ్రీవాల్ క్షమాపణ చెప్పారు. నిర్ధారణ చేసుకోకుండా తాను చేసిన అవినీతి ఆరోపణల పట్ల విచారం వ్యక్తంచేస్తున్నట్లు గడ్కారీకి పంపిన లేఖలో పేర్కొన్నారు. రాజకీయ విభేదాలున్నా... వ్యక్తిగతంగా మీపై తనకు ఎలాంటి వ్యతిరేక భావన లేదని స్పష్టంచేశారు. తాను గతంలో చేసిన ఆరోపణల పట్ల చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. గతాన్ని మర్చిపోయి...కోర్టులో నడుస్తున్న పరువు నష్టం దావాను ఉపసంహరించుకుందామని కోరారు.

letter

దీనిపై నితిన్ గడ్కారీ కూడా సానుకూలంగా స్పందించారు. దీంతో ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో నడుస్తున్న పరువు నష్టం దావా కేసును ఉపసంహరించుకుంటున్నట్లు గడ్కారీ, కేజ్రీవాల్ జాయింట్ పిటిషన్ దాఖలు చేశారు.

మరో పరువునష్టం దావా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్‌కు కూడా అర్వింద్ కేజ్రీవాల్ క్షమాపణ చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి కూడా క్షమాపణ లేఖను పంపి పరువు నష్టం దావా కేసును ఉపసంహరించుకోవాలని కేజ్రీవాల్ కోరనున్నట్లు తెలుస్తోంది. పరువునష్టం దావా కేసులో కోర్టు చిక్కుల కారణంగా ప్రజాసమస్యలపై దృష్టి పెట్టడం ఇబ్బందికరంగా మారడంతోనే కేజ్రీవాల్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. చార్జింగ్ స్టేషన్ల ప్రారంభం

Updated By ManamFri, 02/16/2018 - 01:41
  • ఎలక్ట్రిక్ కార్ల తయారీలో జోష్ రావాలి

charge stationsన్యూఢిల్లీ: సరసైమెన ధరలకు నాణ్యైమెన వాహనాలు తయారు చేయడం ద్వారా, ఎలక్ట్రిక్ వాహనాలకు భారతదేశం ఎంతో దూకుడుతో ఇస్తున్న ప్రాధాన్యం నుంచి మోటారు వాహనాల తయారీ సంస్థలు ప్రయోజనాలు కూడగట్టుకోవాల్సిన సమయం వచ్చిందని కేంద్ర మంత్రి గడ్కరీ అన్నారు. ‘‘భారతదేశంలో మోటారు వాహనాల పరిశ్రమ వెల ప్రధానైవెునదేకానీ, నాణ్యత ప్రధానైవెునది కాదు. అందుకనే వారు (సంస్థలు) హెచ్చు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. విదేశీ సంస్థలు మాత్రం ఈ సిద్ధాంతాన్ని అనుసరించి బాగా ప్రాచుర్యం పొందాయి’’ అని ఆయన అన్నారు. ‘‘ప్రమాణాలతో కూడిన ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి ఆటోవేుకర్లు ముందుకు రావాల్సిన సమయం ఆసన్నైమెంది. మొదట ఎవరు అడుగుపెడతారో వారు తప్పకుండా విజేతలుగా నిలిచే, లాభాలు మూటగట్టుకునే అవకాశం ఉంది. వెలపై దృష్టి పెడుతున్నవారు వెనుకనే మిగిలిపోతారు’’ అని మంత్రి అన్నారు. ఎలక్ట్రిక్ కార్ల ధరలను తగ్గించేందుకు ఈ విభాగంలో ‘‘గట్టి పోటీ’’ అవసరమని గడ్కరీ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో జోరు పెంచేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుందని ఆయన చెప్పారు.

కార్లు, వాణిజ్య వాహనాలతోపాటు, ట్రాక్టర్ల విభాగంలో కూడా ఎలక్ట్రిక్ వినియోగాన్ని పరీక్షించి చూస్తున్నట్లు తెలిపారు. ఎలక్ట్రిక్ మొబిలిటీకి ఇస్తున్న ప్రాధాన్యం ‘‘రవాణా రంగంలో నూతన శకానికి, చారిత్రక, విప్లవాత్మక అధ్యాయానికి నాంది పలుకుతుంది...మనం రూ. 7 లక్షల కోట్ల విలువ చేసే ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నాం. అది ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవుస్యగా పరిణమిస్తోంది. (ఎలక్ట్రిక్ వినియోగంతో) మనం దాన్ని అరికట్టవచ్చు. కాలుష్యాన్ని నిరోధించవచ్చు’’ అని గడ్కరీ అన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘మేడ్ ఇన్ ఇండియా’ కార్యక్రమాలు వాహనాల ధరలను తప్పకుండా తగ్గిస్తాయని ఆయన చెప్పారు. టాటాలు తయారు చేసిన ఎలక్ట్రిక్ బస్సును ఆయన ప్రశంసించారు. ఎలక్ట్రిక్, బయో-ఇంధనాల చోదిత వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు వాటిపై జి.ఎస్.టిని నావుమాత్రంగా 12 శాతంగానే ఉంచినట్లు ఆయన తెలిపారు. నీతి ఆయోగ్ ప్రాంగణంలో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్లను కేంద్ర రోడ్డు, ఉపరితల రవా ణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ప్రారం భించారు.

కొత్త పెట్రోలు, డీజిలు వాహనాల అమ్మకాలను 2030 తర్వాత దశల వారీగా నిలిపివేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. వాతావరణ మార్పు, రవా ణా రంగం శిలాజ ఇంధనాలపై ఆధారపడడంపై పె రుగుతున్న ఆందోళనలకు ప్రతిస్పందనగా చార్జింగ్ స్టేషన్లు తీసుకువస్తున్నట్లు అధికారిక ప్రకటన ఒకటి వెల్లడించింది. భారతదేశానికి, ఎలక్ట్రిక్ సంచార విప్లవం భవిష్యత్ దృశ్యాన్ని నాటకీయంగా మార్చివేయుగల శక్తిగలది. కానీ, ఈ విప్లవాన్ని తీసుకొచ్చేందుకు ప్రేరణ, బలం చార్జింగ్ మౌలిక సదుపాయాలు తగినన్ని అందుబాటులో ఉంటేనే లభిస్తాయని ఆ ప్రకటన తెలిపింది. ఎలక్ట్రిక్ మొబిలిటీకి సవున్వ య సంస్థగా నీతి ఆయోగ్ వ్య వహరిస్తోంది. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ సి.ఇ.ఓ అమితాబ్ కాంత్ కూడా పాల్గొన్నారు. ఏప్రిల్ 1 నుంచి జీపీఎస్, పానిక్ బటన్ తప్పనిసరి!

Updated By ManamThu, 01/18/2018 - 15:23

GPS, panic buttons, public vehicles, MRTH, Nitin gadkariన్యూఢిల్లీ: ప్రజా రవాణా వాహనాలు, టాక్సీలు, బస్సుల్లో ఏప్రిల్ 1, 2018 నాటికి జీపీఎస్, పానిక్ బటన్ పరికరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కేంద్ర రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రోడ్డు రవాణాల మంత్రిత్వ శాఖ (ఎంఆర్‌టీహెచ్) నితిన్ గడ్కరీ ట్వీట్‌ ద్వారా వెల్లడించారు. ఈ నిబంధనల విషయంలో గతంలోనే రవాణా మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొన్ని రాష్ట్రాలు నిబంధనల అమలు విషయంలో జాప్యం వహించాయి. దీంతో ఆయా రాష్ట్రాలపై రవాణా మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1లోగా జీపీఎస్, పానిక్ బటన్‌లు తప్పనిసరిగా ప్రజా రవాణా వాహనాల్లో ఏర్పాటు చేయాలని, ఇదే ఆఖరు తేదీని, మళ్లీ పొడిగించబోయేది లేదని స్పష్టం చేసింది. 

ముఖ్యంగా వాహనాల్లో మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజా భద్రతా దృష్ట్యా వారి భద్రతను పెంచేందుకు రవాణా శాఖ ఈ దిశగా చర్యలు చేపట్టింది. బస్సులు, ట్యాక్సీల్లో జీపీఎస్‌, పానిక్‌ బటన్ ఏర్పాటు చేయడం వ‌ల్ల ప్ర‌మాదాల‌ను నివారించే అవ‌కాశం ఉందని భావిస్తోంది. ప్రమాదంలో ఉన్న ప్రయాణికులు పానిక్‌ బటన్‌ను నొక్కగానే విషయం పోలీసులకు, రవాణాశాఖకు చేరుతుంది. అందులో భాగంగానే ఈ జీపీఎస్‌, పానిక్‌ బటన్‌ను తప్పనిసరిగా చేస్తున్నట్టు పేర్కొంది. అయితే మూడు చక్రాల వాహనాలు, ఈ-రిక్షాలకు మాత్రం ఈ నిబంధనల నుంచి మినహాయింపు కల్పించింది. జీపీఎస్, పానిక్ బటన్ పరికారాలు అమర్చిన వాహనాలు రవాణా శాఖ, పోలీస్ కంట్రోల్ రూంకు అనుసంధానించి ఉంటాయి. భారత నేవీపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

Updated By ManamFri, 01/12/2018 - 09:30

Nitin Gadkariన్యూఢిల్లీ: భారత నేవీపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మేం మిమల్ని గౌరవిస్తాం. ఉగ్రవాదులు చొరబడే సరిహద్దుల్లో నేవీ అవసరం ఉంది. నావికాదళ అధికారులు వచ్చి దక్షిణ ముంబైలో స్థలం కావాలని అడిగారు. నేవీకి చెందిన ప్రతి ఒక్కరూ అక్కడే ఎందుకు ఉండాలనుకుంటున్నారు?  ఇకపై అక్కడ ఎవరికీ అంగుళం స్థలం కూడా ఇచ్చేది లేదు. ఈ విషయంలో మీరెవరూ నా దగ్గరకు రావొద్దు. పాక్‌ సరిహద్దుకు వెళ్లి పెట్రోలింగ్‌ చేస్కోండి’’ అంటూ గడ్కరీ వ్యాఖ్యలు చేశారు.

అయితే రోడ్డు మార్గం ప్రయాణాలకు వ్యయాలు భారీగా పెరిగిపోతున్న వేళ  సీ ప్లేన్ సర్వీసులను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రానున్న రెండేళ్లలో 10,000 సీ ప్లేన్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా అందుకు నేవీ విముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆపరేటర్లు బాంబే హైకోర్టులో అప్పీల్‌ చేసుకోగా.. కోర్టు కూడా అందుకు తిరస్కరించింది. దీంతో ‘‘ప్రభుత్వం అంటే నేవీ, డిఫెన్స్‌ మంత్రిత్వ శాఖలు కాదు. మేం.  అలాంటిది మేం చేపట్టే అభివృద్ధి పనులకు అడ్డుతగలటం మంచిది కాదు’’ అంటూ గడ్కరీ వ్యాఖ్యలు చేశారు.అక్కడ 47.. ఇక్కడ ఒక్కటీ లేదు

Updated By ManamSun, 10/29/2017 - 13:49
  • అంత చిన్న దేశంలో అన్నుండి ఇక్కడ లేకపోవడం విచారం

  • సీప్లేన్ల సరఫరాకు రష్యా, జపాన్‌లు సుముఖం

  • 50 సీట్ల సామర్థ్యమున్న సీప్లేన్లు ఇచ్చేందుకు సంసిద్ధత

  • ఆ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది

  • నవంబరులో వారణాసిలో జపాన్ సంస్థ ట్రయల్ రన్

  • ప్రజా, సరకు రవాణేకాదు వివిధ రకాల ఉపయోగాలు

  • దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో వాటిని ప్రవేశపెడతాం

  • మున్ముందు దేశీయంగానే వాటి తయారీ: గడ్కరీ

sea plane representationalన్యూఢిల్లీ, అక్టోబరు 29: ‘‘మాల్దీవ్స్ లాంటి చిన్న దేశంలో పదుల సంఖ్యలో సీప్లేన్లు నడుస్తున్నాయి. కానీ, భారీ తీరం, జలవనరులున్న పెద్ద దేశం భారత్‌లో మాత్రం ఒక్క సీప్లేన్ కూడా లేదు. ఇది చాలా విచారకరం’’ అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. భారత్‌కు సీప్లేన్లను అందించేందుకు రష్యా, జపాన్‌కు చెందిన సంస్థలు సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నాయని, అందులో 50 సీట్ల సామర్థ్యం కలిగిన సీప్లేన్లూ ఉంటాయని కేంద్ర జలవనరులు, రోడ్లు,రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 111 నదీ మార్గాలను జాతీయ జలమార్గాలుగా మార్చేందుకు కేంద్రం కంకణం కట్టుకుందున్న గడ్కరీ.. గంగ, యమున ఇతర నదీజలాలల్లో సీప్లేన్లను ప్రవేశపెట్టే అంశంపై పరిశీలిస్తోందని చెప్పారు. ‘‘సీప్లేన్ల ద్వారా జల రవాణా మార్గాలను కలిపేందుకు భారత్‌కు భారీ సామర్థ్యం ఉంది. 50 సీట్ల సామర్థ్యం ఉన్న సీప్లేన్లను (అటు నీళ్లు, ఇటు గాలి.. రెండు మార్గాల్లోనూ ప్రయాణించే సామర్థ్యం) సరఫరా చేసేందుకు రష్యా సంస్థ సుముఖంగా ఉంది. అటు ప్రజల ప్రయాణానికి, ఇటు సరకు రవాణాకు ఆ సీప్లేన్లు ఉపయోగపడతాయి. అదేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో సహాయచర్యల్లో పాల్గొనేందుకు, రక్షణ కార్యకలాపాలకూ వాటిని వినియోగించుకోవచ్చు’’ అని గడ్కరీ వివరించారు.

సంస్థ ప్రతిపాదనను ప్రస్తుతం పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. అంతేగాకుండా సీప్లేన్లను సరఫరా చేశాక.. మున్ముందు సరైన భాగస్వామిని చూసుకుని దేశీయంగానే వాటిని తయారుచేసేందుకు సంస్థ అంగీకారం తెలిపిందన్నారు. అయితే, ప్రస్తుతం ఈ అంశం గురించి చర్చించడం తొందరపాటే అవుతుందని, కార్యరూపం దాల్చాలంటే అనేకాకనేక అంశాలు దానితో ముడిపడి ఉన్నాయని గడ్కరీ చెప్పుకొచ్చారు. రెగ్యులేటరీ అనుమతులు, జలమార్గ అంచనా, విమానాశ్రయాలు, సీపోర్టుల్లాగానే ‘హైడ్రోపోర్టు’ల నిర్మాణం వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. జపాన్ సంస్థ కూడా ఇలాంటి ప్రాజెక్టును భారత్‌లో చేపట్టడానికి సిద్ధంగా ఉందని, నవంబరు చివరినాటికి వారణాసిలో దానికి సంబంధించి ట్రయల్ రన్ నిర్వహిస్తుందని గడ్కరీ తెలిపారు. ఒక్కసారి ఈ ప్రాజెక్టులు ఆమోదం పొందాక దేశవ్యాప్తంగా భారీస్థాయిలో దానిని విస్తరిస్తామన్నారు. భారత పర్యాటక రంగ రూపురేఖలను ఈ ప్రాజెక్టులు మార్చడమేకాకుండా సమాచార వ్యవస్థ కూడా మరింత బలోపేతం అవుతుందన్నారు. Nitin Gadkari

దేశంలోని ప్రతి నగరంలోనూ భారీ జల వనరులున్నాయని, కాబట్టి ఆయా నగరాలన్నింటిలోనూ సీప్లేన్లను వినియోగించుకోవచ్చని, ఇటీవలే అహ్మదాబాద్‌కు అలాంటి సర్వీసును పంపించినట్టు చెప్పారు. ఇలాంటి ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు జారీ చేస్తామన్న గడ్కరీ.. దేశ స్థితిగతులను మార్చేసే కొత్తకొత్త ఆలోచనలకు నాంది పలికే తరుణమిది అని వ్యాఖ్యానించారు. దేశంలో భారీగా సీప్లేన్లను ప్రవేశపెడతామని చెప్పారు. మాల్దీవ్స్ లాంటి చిన్న దేశమే 47 సీప్లేన్లను నడుపుతోందని, భారీ తీరం ఉండి, పెద్ద దేశమైన భారత్‌లో మాత్రం ఒక్క సీప్లేన్ కూడా లేకపోవడం విచారకరమన్నారు. పారిశ్రామికవేత్తలు భారత్‌కు తరలివచ్చి ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాల్సిందిగా గడ్కరీ విజ్ఞప్తి చేశారు. 

Related News