GAMBLING

జూదంలో హైటెక్ మోసం

Updated By ManamFri, 07/27/2018 - 23:43
  • కోతముక్కలో గెలుపెవరిదో ముందే చేప్పే స్కానర్

  • ఢిల్లీ నుంచి కొనుగోలు.. టెక్నాలజీతో మోసం

  • తెనాలిలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి

  • హైటెక్ ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు

imageగుంటూరు: గుట్టు చప్పుడు కాకుండా ఆడుకునే పేకాటలో హైటెక్ టెక్నాలజీ వచ్చేసింది. స్నేహితులను పేకాటలోకి దించి అత్యాధునిక స్కానర్‌తో కూడిన మొబైల్ ఫోన్ ద్వారా కోత ముక్కలో గెలిచేది ఎవరో ముందుగానే తెలుసుకుంటూ డబ్బులు దండుకుంటున్నాడు తెనాలికి చెందిన ఓ ప్రబుద్ధుడు. ఈ పరికరం కంప్యూటర్ కార్డు సెన్సార్‌తో పనిచేస్తుంది. ఇది పేక ముక్కలను స్కాన్ చేసి ఆ ముక్క లోపల పడుతుందా, బయట పడుతుందా అని ముందే చెబుతోంది. డిస్‌ప్లే కన బడకుండా ఉండటం దీని ప్రత్యేకత. తెనాలి పట్టణంలోని నందులపేట- విద్యానగర్‌కు చెందిన 33 సంవత్సరాల వ్యక్తి పేకాటకు అలవాటు పడి, క్రమంగా హైటెక్ జూదానికి పాల్పడుతున్నట్లు తెనాలి టూ టౌన్ పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు దాడి జరపడంతో హైటెక్ పేకాట ముఠా గుట్టు రట్టయింది. ప్రజలకు కుచ్చుటోపి పెడుతూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మెక్రో సెన్సార్లు, డిజిటల్ కనెక్షన్లు, మొబైల్ ఫోన్లతో ట్యాంపరింగ్ చేసి అత్యాధునిక రీతిలో ఈ ముఠా పేకాటను నిర్వహిస్తోంది. హైటెక్ విధానం ద్వారా లక్షల రూపాయలను నిర్వహకులు దండుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి నుంచి రూ. రెండు లక్షల నగదు, డిజిటల్ స్కానర్‌లను స్వాధీనం చేసుకున్నారు. 

మోసం ఎలా చేస్తారు?
పేకాట ఆడుతున్న సమయంలో కార్డులు పంచేందుకు ముందుగా టేబుల్ మీద పెట్టినప్పుడు సెల్‌ఫోన్‌లో ఉన్న స్కానర్, పేకలను స్కాన్ చేస్తుంది. స్కానర్ ముందుగానే ఆ ముక్క ఎటు వైపు పడుతుందో అన్న విషయాన్ని మైక్రో ఫోన్ ద్వారా తెలియజేస్తుంది. సెల్‌ఫోన్‌లో వచ్చే నంబర్ ఆధారంగా గెలిచే వ్యక్తిపై భారీగా డబ్బులు పెట్టడం , ఒక వేళ వేరే వ్యక్తి గెలుస్తాడని తేలితే తక్కువ మొత్తంలో పందెం కాయడం ద్వారా డబ్బులు దండుకున్నామని నిందితులు పోలీసులకు వివరించారు. ఫోన్ లాంటి పరికరానికి కుడిైవెపు ఓ సెన్సార్ ఉన్నట్లు తేలింది. దానితో పాటు పేకాటకు ఉపయోగించిన కార్డులు కూడా విభిన్నంగా (మాగ్నటిక్ రీడర్) ఉన్నట్లు గుర్తించారు. 

ఎక్కడ నుంచి కొనుగోలు చేస్తారు?
తెనాలి విద్యానగర్‌కు చెందిన వ్యక్తికి కొల్లూరు వద్ద పేకాట ఆడుతున్న సమయంలో కృష్ణా జిల్లా పామర్రు గ్రామానికి చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తాను ఆన్‌ైలెన్ ద్వారా పేకాటకు చెందిన ఎలక్ట్రానిక్ వస్తువులను తెప్పించుకుని అమ్ముతుంటానని, వాటి ద్వారా పేకాటలో తర్వాత ఏ ముక్క వస్తుందో ఎదుటి వారి పేకలో ఏయే ముక్కలు ఉన్నాయో తెలుస్తాయని చెప్పాడు. తెనాలికి చెందిన వ్యక్తి పామర్రుకు చెందిన వ్యక్తి అసిస్టెంట్ ద్వారా సెల్‌ఫోన్లు (స్కానర్లు ఉన్నవి), బ్లూటూత్, ప్రత్యేకంగా తయారుచేసిన పేకలు, క్యాష్ కెవెురాలు, రిస్ట్ బ్యాండ్ కెవెురాలు, పవర్‌బ్యాంక్సు, మరికొన్ని వస్తువులను ఢిల్లీ నుంచి తెప్పించుకుని వాటి ద్వారా మిగిలిన వారిని మోసం చేస్తూ అక్రమంగా డబ్బులు సంపాదించేవాడు. తెనాలికి చెందిన వ్యక్తి తన ఇంట్లోనే జూదం, కోతముక్క ఆడిస్తూ ఉంటారు. తెనాలి టూ టౌన్, సీసీఎస్ సిబ్బందికి వచ్చిన ముందస్తు సమాచారం మేరకు తెనాలికి చెందిన వ్యక్తిని, కృష్ణా జిల్లా గుడ్ల వల్లేరు మండలం అంగలూరు గ్రామానికి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 

పోలీసుల ప్రతిభ...
నిందితులను పట్టుకోవడంలో పోలీసులు ప్రimageతిభ కనబర్చారని గుంటూరు రూరల్ ఎస్పీ సి.హెచ్. అప్పలనాయుడు వెల్లడించారు. తెనాలి టూ టౌన్ ఎస్‌ఐ పి. సురేష్, గుంటూరు సీసీఎస్ ఏఎస్‌ఐ శివయ్య, గుంటూరు టాస్క్‌ఫోర్స్ వి.బాబు, ఎస్.కె. నాజర్‌వలి, కె. సురేష్‌లను ఎస్పీ అభినందించారు. ప్రస్తుతానికి ఇద్దరిని అరెస్ట్ చేశామని, కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన మరొక వ్యక్తి అనారోగ్యంతో ఉండటం వల్ల అరెస్ట్ చేయాల్సి ఉందని ఎస్పీ అప్పలనాయుడు వెల్లడించారు.జూద ‘క్రీడలు’

Updated By ManamWed, 07/11/2018 - 00:55

దేశంలో విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ జూదాన్ని (గాంబ్లింగ్)/పందాల్ని (బెట్టింగ్) అరికట్టడంలో విఫలమవుతున్న ప్రభుత్వం ఒకవైపు నానాపాట్లు పడుతుంటే, లా కమిషన్ ఆఫ్ ఇండియా వాటిని చట్టబద్ధం చేయవలసిందిగా సిఫా ర్సు చేసింది. క్రికెట్‌తో పాటు ఆటల పోటీలపై సాగుతున్న బెట్టింగ్‌లను, జూదానికి సంబంధించిన వివిధ కార్యకలాపాల్ని  కొన్ని నియంత్రణలకు లోబడి చట్ట బద్ధం చేయాలని, వీటిని నిషేధించడం కంటే చట్టబద్ధంగా కొన్ని పరిమితుల్లో ని యంత్రిస్తూ అనుమతించడమే మేలని కమిషన్ అభిప్రాయపడింది.

‘ఆనాడు ధర్మ రాజు జూదంలో భార్యా సోదరుల్ని పణంగా పెట్టాడు. ఎందుకంటే జూదంపై అ ప్పట్లో నియంత్రణలు లేవు. ఉండుంటే అంతటి మహాభారత కథ ఉండదు. జూ దం ఆడితే ఆదాయం పెరుగుతుంది. దానిపై పన్నూ విధిస్తే ప్రభుత్వానికీ ఆదా యం సమకూరుతుంది. గ్లోబల్ స్థాయిలో వివిధరకాల ఆన్‌లైన్ జూద కార్యక లాపాలు పెరిగిపోయి, వాటిని అరికట్టడం ప్రభుత్వాలకు అసాధ్యంగా మారిన నే పథ్యంలో వాటికి చట్టబద్ధత కల్పించడమే సరైనదని’ అంటూ పురాణాలను వల్లె వేస్తూ లా కమిషన్ వాదించడం విడ్డూరం.

image


1957లో బాంబే రాష్ట్రం వర్సెస్ చామ ర్‌బాగ్వాలా మధ్య నడచిన కేసు సందర్భంగా కౌటిల్యుడు కూడా జూద కార్య కలాపాలపై పన్నుల ద్వారా ఖజానాకు వస్తున్న ఆదాయాన్ని ప్రోత్సహించిన విష యాన్ని సుప్రీంకోర్టు కూడా ఉటంకించడం విదితమే. వ్యసనాలను చట్టబద్ధం చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని మాత్రమే చూస్తూ, ప్రజలను దివాలా తీయించి, చివరికి పూర్తిస్థాయిలో పతనం కావడానికి, కేసినో కార్పొరేట్లు మరింత సంపన్నులయ్యేందుకు హేతువైన వ్యసనాలను ప్రోత్సహించడం ప్రజాప్రభుత్వాలకు తగనిపని. అమెరికాలోని ‘ప్రపంచ జూదశాల’గా పేరొందిన ‘లాస్ వెగాస్’ నగరాన్ని ‘సిన్ సిటీ’ (పాపాల నగరం)గా అక్కడి ప్రజలు పిలుస్తుండడంలోని ఆంతర్యాన్ని గుర్తించలేని అమాయకులు కారు మన పాలకులు. 2016లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ పోటీల సందర్భంగా వెలుగులోకి వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ అక్రమాలను అధ్యయనం చేసి క్రీడలపై బెట్టింగ్ కార్యకలాపాలను చట్టబద్ధం చేయాలని జస్టిస్ ఆర్ లోథా కమిటీ సిఫార్సులపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆ విషయంపై సమగ్రంగా పరిశీలించి నివేదిక రూపొందించాలని లా కమిషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. బెట్టింగ్/గ్యాంబ్లింగ్‌లను చట్టబద్ధం చేసేందుకు సంబంధిత చట్టాలను సవరిం చాలని సిఫార్సు చేస్తూ గతవారం లా కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించడంతో వివాదం చెలరేగింది. 

జూదం మనదేశంలో చట్టవిరుద్ధమైనది. 1867 పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ప్రకారం పందెం (లేదా అదృష్టం) ద్వారా జరిగే ఏ ఒప్పందమైన చట్ట విరుద్ధై వ్యవహారమవుతుంది. అయితే దేశవ్యాప్తంగా చిన్న, పెద్ద జూద గృహాలు నిరాటంకంగా, చట్టానికి సమాంతరంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కార్యకలాపాలపై ఎలాంటి నియంత్రణ లేదు కాబట్టి ప్రభుత్వ ఆదాయానికి ఆ మేరకు గండి పడుతోందని ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తల అభిప్రాయం. దేశంలో ఏడాదికి 3 లక్షల కోట్ల బెట్టింగ్ పారిశ్రామిక కార్యకలాపాలు నడుస్తున్నాయనే సంచలనాత్మక సమాచారాన్ని 2013లో ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) నివేదిక  వెల్లడించింది. ఇంత పెద్ద ఆదాయ ఒనరును ప్రభుత్వాలు వదలుకోవడం సమంజసం కాదని పలువురి అభిప్రాయం. ఈ నేపథ్యంలో బెట్టింగ్ లావాదేవీలు పాన్, ఆధార్ కార్డులతో అనుసంధానం చేయడం; కేసినోలు, ఆన్‌లైన్ గేమింగ్ ఇండస్ట్రీల్లో విదేశీ ప్రత్యక్ష మదుపు(ఎఫ్‌డీఐ)లను అనుమతించేందుకు చట్టాన్ని సవరించడం వల్ల ఖజానాకు ఆదాయం సమకూరుతుందని లా కమిషన్ సిఫార్సు చేసింది. బ్రిటిష్ రాజ్యం రూపొందించిన జూద చట్టాల్నే ఇండియా ఇప్పటికే అనుసరిస్తోందనీ, ఆ దేశం దశాబ్దాల క్రితమే జూదం/బెట్టింగ్ కార్యకలాపాల్ని చట్టబద్ధం చేసిన విషయాన్ని మన పాలకులు గుర్తించక పోవడం వల్ల ఆర్థికంగా చాలా నష్టం వాటిల్లిందనే వాదన రోజురోజుకు బలపడుతోంది. ఇప్పటికే ఉనికిలో ఉన్న లక్షల కోట్ల రూపాయల అక్రమ వ్యాపారాన్ని చట్టబద్ధం చేయడం దేశ, విదేశీ కార్పొరేట్ శక్తులకు చాలా అవసరం. గుర్రపు పందేలు, బైక్, సైకిల్, బోట్ రేసింగ్‌ల నుంచి జూదగృహాల దాకా లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు నడిచే మార్కెట్‌ను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదని, అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాల్లోని గ్యాంబ్లింగ్ చట్టాలను భారత్ కూడా రూపొందించాలని దేశ, విదేశీ కార్పొరేట్ శక్తులు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. 

గతంలో సమాజం నీతిబాహ్యమైన చర్యలుగా (కనీసం బహిరంగంగా) పరి గణిస్తున్న వ్యభిచారం, అవినీతి కార్యకలాపాలను చట్టబద్ధం చేయాలని పలువురు అభిప్రాయపడ్డారు. రానురాను డబ్బు తప్ప మరే ఇతర విలువ కూడా మిగల కుండా పోతున్న ప్రపంచంలో చట్టవిరుద్ధమైనవి, సామాజికంగా అనైతికమైనవి, అక్రమ/చీకటి వ్యవహారాలన్నీ రానురాను అత్యున్నత సంప్రదాయాలుగా, విలు వలుగా చట్టబద్ధతను సంతరించుకుంటున్నాయి. వడ్డీ వ్యాపారం, మత్తుమందు వ్యసనాలు, స్వలింగ సంపర్కం వంటి వ్యక్తిగత, సామాజిక విషయాలు ఒకప్పు డు అనైతికమైనవిగా పరిగణించేవారు. ప్రపంచ మతాలన్నీ ఒకప్పుడు వ్యతిరేకిం చిన వడ్డీ వ్యాపారం ఆ తర్వాత క్రమంలో లాభసాటి చట్టబద్ధ కార్యకలాపంగా సమాజంలో విస్తరించింది. మత్తుమందు వ్యసనం ప్రస్తుతం ఒక ఫ్యాషన్‌గా, హో దాగా మారిందనడంలో ఆశ్చర్యపోవలసిన పనిలేదు. ప్రపంచంలో కొన్ని దేశాల్లో గంజాయి తాగడాన్ని, ఇళ్ళ పెరడులో సైతం సాగుచేసుకోవడం చట్టబద్ధమైంది. అదే విధంగా స్వలింగ సంపర్కుల హక్కులను గుర్తిస్తూ అనేక దేశాల్లో ఉద్యమా లు వచ్చాయి, పర్యవసానంగా చట్టాలూ ఉనికిలోకి వచ్చాయి. స్వలింగ సంపర్కం వంటి చారిత్రకంగా సామాజిక అపార్థానికి గురైన కొన్ని విషయాలను పునఃసమీక్షించుకుని, పునర్నిర్వచించుకొని సమాజాలు అందుకు అనుగుణమైన విలువలను, హక్కులను రూపొందించుకోవలసిన అవసరాన్ని కాదనలేము.

అయితే వ్యక్తిత్వం రీత్యా, వ్యక్తిగత ఆరోగ్యం రీత్యా హానికరమైన, సామాజికంగా ప్రజల జవజీవాలను, ఉత్పాదక శక్తిసామర్థ్యాలను, మానసిక ప్రతిభా పాటవాలను నిర్వీర్య పరచే మత్తుమందుల వంటి నిర్ధారిత వ్యసనాలకు తిరిగి పట్టం కట్టడం చారిత్రక మహాపవాదు అవుతుందని పాలకులు గుర్తించడం లేదు. మత్తుమందులు వ్యక్తుల, సామాజిక సమర్థతలను శారీరకంగా నిర్వీర్య పరచేం దుకు దోహదం చేస్తే, జూదం/పందెం వంటి అక్రమ కార్యకలాపాలు ద్రవ్య పరమైన ‘మాదక ద్రవ్య వ్యసనం’గా మారి ఆర్థిక వ్యవస్థను డొల్ల చేస్తుంది. ఇప్పటికే షేర్ల కొనుగోలు, అమ్మకాల వ్యవహారాల రూపంలోని అతి పెద్ద జూద క్రీడ ఆర్థిక వ్యవస్థకు చీడగా మారింది. సమాజంలో వస్తూత్పత్తి రంగంలో ఆదాయాల కంటే ద్రవ్య వ్యాపార రంగంలో లాభాల రేటు పెరుగుతున్న కొద్దీ సమాజంలోని ప్రబల ఆర్థిక శక్తులు కేసినోలు, పర్యాటకం వంటి అనుత్పాదక, సేవా రంగాలవైపు మరలుతాయి. ప్రైవేట్ వ్యాపారాలు, ముఖ్యంగా బ్యాంకులు, మదుపులు, షేర్లు వగైరాలపై పెద్ద మొత్తాలను వెచ్చిస్తున్న ఆర్థిక వ్యవస్థ ఒక పెద్ద జూదగృహంలా తయారవుతుంది. ‘వడ్డీ భుక్త రాజ్యాలు’  (అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రబలంగా ఉనికిలోకి వచ్చిన ‘జూద పెట్టుబడిదారీ విధానం’-కేసినో కేపిటలిజం) ప్రపంచమంతా ఆవరించడంతో ప్రపంచ ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది.

వ్యవసాయ- పారిశ్రామిక రంగాలను సమన్వయించి, వస్తూత్పత్తిపై ప్రధానంగా కేంద్రీకరిస్తూ, స్థానిక మార్కెట్లపై ఆధారపడిన వ్యాపార లావాదేవీల పునాదిగా, స్థానిక ప్రజల కొనుగోలు శక్తిని పెంపొందించే ఆర్థిక విధానాలను రూపొందించడాన్ని మన పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దేశాన్ని ఆర్థిక అంధకారంలోకి కూరుకుపోయేందుకు దోహదం చేసే అభివృద్ధి చెందిన దేశాల ‘జూద పెట్టుబడిదారీ విధానాల’ను పాలకులు గుడ్డిగా అనుసరించడాన్ని ప్రతిఘటించక తప్పదు. 

Related News