England Team

ఐదో టెస్టు: ఇంగ్లండ్ ఆలౌట్.. 332

Updated By ManamSat, 09/08/2018 - 20:13

England Team, Team India, First Innings, 5th Test Match, ENG vs INDలండన్: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 332 పరుగులకు ఆలౌట్ అయింది. 198/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు మ్యాచ్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్‌కు రషీద్ (15) పరుగులు సాధించగా, అతని తోడుగా బట్లర్ 89 పరుగులు చేసి స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. అంతకుముందు అలిస్టర్ కుక్ 71, మొయీన్ అలీ హాఫ్ సెంచరీ నమోదు చేశారు. ఇక జెన్నింగ్స్ (23)పరుగులకే పరిమితం కాగా, బెన్ స్టోక్స్ (11), జేసీ బ్రాడ్ (38) పరుగులకే చేతులేత్తేశారు. దాంతో ఇంగ్లండ్ 122 ఓవర్లలో 332 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో జడేజా నాలుగు వికెట్లు, బుమ్రా, ఇశాంత్ శర్మలు తలో మూడు వికెట్లు పడగొట్టారు. 

తొలి వికెట్ కోల్పోయిన భారత్..
ఐదో టెస్టులో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా జట్టు ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ శిఖర్ ధావన్ తొలి ఓవర్‌లోనే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ధావన్ స్థానంలో వచ్చిన పుజారా (15), మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (33) పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. ఇంగ్లండ్ బౌలర్ బ్రాడ్ తొలి వికెట్ తీసుకున్నాడు. టాస్ గెలిచి ఇంగ్లండ్ బ్యాటింగ్

Updated By ManamFri, 09/07/2018 - 15:37
 • టీమిండియాతో ఆఖరి టెస్టు మ్యాచ్ 

England Team, Team India, 5th Test, India tour, JE Root, Virat Kohliఓవల్: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఓవల్ వేదికగా ఇంగ్లండ్, టీమిండియా జట్ల మధ్య ఆఖరి ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోయ్ రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న ఇంగ్లండ్ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతుండగా టీమిండియా జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి.

హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో విహారి, రవీంద్ర జడేజాలకు తుదిజట్టులో చోటు దక్కింది. మరోవైపు ఇంగ్లండ్ క్రికెటర్ అలెస్టర్ కుక్ భారత్‌తో జరిగే ఐదో టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకనున్నాడు. ఆఖరి టెస్టు మ్యాచ్‌కే కుక్ చివరి టెస్టు మ్యాచ్ కానుంది. ఇంగ్లండ్ ఓపెనర్లుగా అలెస్టర్ కుక్, జెన్నింగ్స్ బరిలోకి దిగగా, భారత బౌలర్ బుమ్రా తొలి ఓవర్ అందుకున్నాడు. రెండోరోజూ మ్యాచ్ కొనసాగేనా..!

Updated By ManamFri, 08/10/2018 - 16:40
 •  రెండో టెస్టుకు మళ్లీ వర్షం అడ్డంకి.. 

 • టాస్ పడిన కాసేపటికే మళ్లీ వర్షం.. మ్యాచ్ ఆలస్యం

 • రెండు వికెట్లు కోల్పోయిన భారత్.. 

 • తొలిరోజు మ్యాచ్‌ రద్దు చేసిన ఆంపైర్లు 

2nd Test, Team India, Lodnon, Toss, England team, Rain లార్డ్స్: రెండో టెస్టుకు మళ్లీ వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. తొలిరోజు వర్షం కారణంగా టాస్ ఆలస్యం కాగా, ఒక బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దు అయిన సంగతి తెలిసిందే. శుక్రవారం రోజున రెండో టెస్టు మ్యాచ్‌కు ఆరంభంలో కాస్తా శాంతించిన వరుణుడు.. టాస్ పడి ఆరు ఓవర్లు పూర్తయ్యేలోపే మళ్లీ ఆటంక పరిచాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ జే రూట్ కోహ్లీసేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తొలుత ఓపెనర్లుగా బరిలోకి దిగిన మురళీ విజయ్ ఆండర్సన్ బౌలింగ్‌లో డకౌట్‌గా (0) చేతులేత్తేయగా, కేఎల్ రాహుల్ (8) పరుగులకే మరోసారి ఆండర్సన్ బౌలింగ్‌లో బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా వెనుదిరిగాడు.

2nd Test, Team India, Lodnon, Toss, England team, Rain 6.3 ఓవర్లలో టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 11 పరుగులు చేయగా, చతేశ్వర పూజారా (1), కెప్టెన్ విరాట్ కోహ్లీ (1) పరుగుతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ ఆండర్సన్‌కు రెండు వికెట్లు దక్కాయి. కాగా, తొలి టెస్టులో పరాజయం పాలైన టీమిండియా ఇంగ్లండ్‌పై బదులు తీర్చుకునేందుకు ఎదురుచూస్తోంది. కానీ, వరుణుడు భారత్ ఆశలపై నీళ్లు జల్లినట్టయింది. ఈ రోజైన వర్షం అనుకూలిస్తే మ్యాచ్ ప్రారంభమవుతుంది. లేదంటే ఈ రోజు కూడా రద్దు అయ్యే అవకాశం ఉంది.  జేమ్స్ ఆండర్సన్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం

Updated By ManamMon, 08/06/2018 - 21:46
 • గోల్ఫ్ ఆడిన ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్.. బంతి కొట్టడంతో ఘటన

 • వీడియో వైరల్.. ట్విట్టర్ ద్వారా స్టువర్ట్ బ్రాడ్‌ వెల్లడి

Anderson, golf mishap, England bowler, England Team (20100), team india (1146)లార్డ్స్: ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్‌ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఆండర్సన్ ఆదివారం కాస్తా విశ్రాంతి దొరకడంతో సరదాగా గోల్ఫ్ ఆడాడు. ఈ క్రమంలో అండర్సన్ కొట్టిన బంతి వేగంగా దూసుకెళ్లి చెట్టుకి తగిలి మళ్లీ అది వెనక్కి వచ్చి అతని ముఖాన్ని బలంగా తాకింది. అంతే ఒక్కసారిగా జేమ్స్ అల్లాడిపోయాడు. అయితే అదృష్టవశాత్తూ అండర్సన్‌కి ఎలాంటి గాయమవ్వలేదని, బాగానే ఉన్నట్టు అతని స్నేహితుడు ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించాడు.

ఇప్పటికే గాయంతో ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌ రెండో టెస్టుకి దూరమైన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ జట్టులో కీలకమైన ఆండర్సన్ కూడా గాయమై జట్టుకు దూరమైతే.. భారత్‌ను కట్టడి చేయడం కష్టంగా మారే పరిస్థితి ఉండేది. కాగా, ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్ గురువారం నుంచి లార్డ్స్‌ వేదికగా ప్రారంభంకానుంది. కోహ్లీనే నెం.1.. 

Updated By ManamSun, 08/05/2018 - 15:03
 • ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ విడుదల 

 • టెస్టు బ్యాట్స్‌మన్‌గా టాప్ ర్యాంకు.. ఏడో భారత క్రికెటర్‌గా విరాట్

 • స్టీవ్ స్మిత్‌ను వెనక్కి నెట్టేసిన టీమిండియా కెప్టెన్ 

 • కోహ్లీ టెస్టు కెరీర్‌లో అగ్రస్థానంలో చేరడం ఇదే తొలిసారి

Team India, England Team, Virat Kohli, Top Spot, Steve Smith, ICC Test Rankings, Test Batsmenఎడ్జ్‌బాస్టన్‌: టీమిండియా కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శనతో ప్రపంచ నంబర్‌వన్‌ టెస్ట్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. తాజాగా విడుదల చేసిన ఐసీసీ టెస్ట్ బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ టాప్ ర్యాంకులో నిలిచాడు. తద్వారా ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ నంబర్‌వన్ రికార్డును దాటేసి అగ్రస్థానాన్ని అధిరోహించాడు. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో పరాజయం పాలైనప్పటికీ.. విరాట్‌ కోహ్లీ అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. టెస్టుల్లో నంబర్‌వన్‌ స్థానానికి చేరుకోవడం కోహ్లీ కెరీర్‌లో ఇదే తొలిసారి కావడం విశేషం. టెస్టు క్రికెట్‌లో అగ్రస్థానాన్ని (తొలిసారి 2011లో జూన్ 11లో సచిన్ టెండూల్కర్) తర్వాత దక్కించుకున్న ఏడో భారతీయ క్రికెటర్‌గా కోహ్లీ అవతరించాడు. 

స్మిత్‌ను వెనక్కి నెట్టేసి..
ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో శతకంతో చెలరేగి రెండు ఇన్నింగ్స్‌లో కలిపి మొత్తం 200 పరుగులు సాధించిన కోహ్లీ.. 31 పాయింట్లను సాధించి స్మిత్‌పై 5 పాయింట్లతో ఆధిక్యంలో నిలిచాడు. తద్వారా టెస్టు క్రికెట్‌లో నంబర్‌వన్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. గత 32 నెలల్లో టెస్టు క్రికెట్‌లో టాప్ ర్యాంకు బ్యాట్స్‌మన్‌గా ఉన్న స్మిత్‌ను వెనక్కి నెట్టేసి అతని స్థానంలో నిలిచి కోహ్లీ రికార్డు తిరగరాశాడు. గతంలో టెస్టు క్రికెట్‌లో నంబర్‌వన్ ర్యాంకులో నిలిచిన మిగతా భారత బ్యాట్స్‌మన్లలో సచిన్‌ టెండూల్కర్, రాహుల్‌ ద్రవిడ్‌, గౌతమ్ గంభీర్‌, సునీల్‌ గవాస్కర్‌, వీరేందర్ సెహ్వాగ్‌, దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ ఉన్నారు. అంతేకాక, ఆడిన 67 టెస్టుల్లో మొత్తం జాబితాలో 14వ స్థానంలో నిలిచిన కోహ్లీ.. ఆల్‌టైం ట్యాలీ 934 పాయింట్లతో గవాస్కర్‌కు ముందున్నాడు. టెస్టు బౌలింగ్‌ ర్యాంకింగ్స్ లో ఇంగ్లండ్‌కు చెందిన జేమ్స్ అండర్సన్‌ తొలి స్థానంలో కొనసాగుతుండగా.. స్పిన్ బౌలర్లు రవీంద్ర జడేజా మూడు, అశ్విన్‌ ఐదో స్థానాల్లో కొనసాగుతున్నారు.భారత్ విజయలక్ష్యం 269 పరుగులు

Updated By ManamThu, 07/12/2018 - 21:22
 • 268 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్

 • మణికట్టుతో స్పిన్ మాయాజాలం.. కుల్‌దీప్ యాదవ్ (25/6)

 • ఇంగ్లాండ్‌తో భారత్ తొలివన్డే 

1st ODI, Team India  tour, Ireland, England Team, Nottinghamనాటింగ్‌హమ్‌: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌యాదవ్‌ తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లాండ్‌కు ముచ్చెమటలు పట్టించాడు. తొలి ఓవర్‌ నుంచే విజృంభించిత కుల్‌దీప్ 25 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా ఇంగ్లాండ్ ఆరు వికెట్లను తీసి జట్టు పతనాన్ని శాసించాడు. దీంతో 49.5ఓవర్లలో ఇంగ్లాండ్‌ 268పరుగులకే ఆలౌట్‌ అయింది. దాంతో భారత్‌కు ఇంగ్లాండ్ 269 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. 

కుల్‌దీప్ స్పిన్ మాయ.. 
1st ODI, Team India  tour, Ireland, England Team, Nottinghamటాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు జాసన్ రాయ్ (38), బెయిర్‌స్టో (38) శుభారంభం ఇచ్చారు. అయితే వీరిద్దరిని (38) పరుగులకే పెవిలియన్ పంపించిన కుల్‌దీప్.. ఆ తరువాత వచ్చిన బ్యాట్స్‌మన్‌ను సైతం మణికట్టు మాయాజాలంతో దడపుట్టించాడు. మిడిల్‌ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ జోస్ బట్లర్‌(53; 51బంతుల్లో 5×4), బెన్‌ స్టోక్స్(50; 103బంతుల్లో 2×4) ఇరువురు హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఇంగ్లాండ్‌ గౌరవప్రదమైన స్కోరు పూర్తి చేసింది. మిగతా ఆటగాళ్లలో ఎంఎం అలీ (24), రషీద్ (22) పరుగులకే చేతులేత్తేయగా, ప్లంకెట్ (10), కెప్టెన్ మోర్గాన్ (19) పరుగులకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో చైనామన్ బౌలర్ కులదీప్ యాదవ్ ఒక్కడే ఒంటిచేత్తో 6 వికెట్లు పడగొట్టగా, పేసర్ ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు, యుజువేంద్ర చాహల్‌కు ఒక వికెట్ దక్కింది. 

లక్ష్య ఛేదనలో భారత్..
ఇంగ్లాండ్ నిర్దేశించిన 269 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు కోహ్లీసేన బరిలోకి దిగింది. ముందుగా భారత్ ఓపెనర్లుగా రోహిత్ శర్మ (2), శిఖర్ ధావన్ (1) పరుగుతో క్రీజులో కొనసాగుతున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో వుడ్ తొలి ఓవర్ అందుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా 1 ఓవర్ ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 3 పరుగులతో కొనసాగుతోంది. టాస్ గెలిచి టీమిండియా ఫీల్డింగ్.. 

Updated By ManamSun, 07/08/2018 - 19:28

3rd T20I, India tour of Ireland, England Team, Bristol బ్రిస్టల్: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య బ్రిస్టల్‌ వేదికగా ఆదివారం మూడో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. ముందుగా టాస్‌ గెలిచిన భారత కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకొని ఇంగ్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పిచ్‌పై తేమగా ఉండటంతో తొలుత బౌలింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నట్లు కోహ్లీ చెప్పాడు. భారత్ తుదిజట్టులో దీపక్‌ చాహర్‌, సిద్ధార్ధ్‌ కౌల్‌‌కు చోటు దక్కింది. టాస్ గెలిచినట్టయితే తామే ముందుగా ఫీల్డింగ్ చేయాలనుకున్నట్లు ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్‌ చెప్పాడు.

ఇంగ్లాండ్ తుదిజట్టులో రూట్‌ స్థానంలో బెన్‌ స్టోక్స్‌కు చోటు దక్కింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలిటీ20 మ్యాచ్‌ను భారత్ గెలుచుకోగా, రెండో టీ20మ్యాచ్‌ను ఇంగ్లాండ్ గెలుపొందింది. దాంతో ఇరుజట్లు తలో మ్యాచ్‌ను గెలిచి 1-1 సిరీస్‌ను సమం చేశాయి. ఇక మిగిలిన ఫైనల్, ఆఖరి మూడో టీ20 మ్యాచ్‌లో గెలిచే జట్టుకే సిరీస్ దక్కుతుంది. కాగా, విజయోత్సవంతో ఉన్న ఇరుజట్లు సిరీస్‌ను దక్కించుకునేందుకు తహతహలాడుతున్నాయి.  

Related News