Secret

టికెట్ ఒప్పందం ముందే జరిగింది..!

Updated By ManamWed, 07/11/2018 - 17:09

sv mohan reddy reveals Secret While joining in Tdp

కర్నూలు: జిల్లాలో తెలుగు తమ్ముళ్లు మధ్య సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ చిచ్చు పెట్టిన సంగతి తెలిసిందే.! దీంతో ఇప్పటికే బద్ధశత్రువులుగా ఉన్న టీజీ వెంకటేశ్- ఎస్వీ మోహన్‌రెడ్డిల మధ్య అగ్గిరాజేసినంత పనైంది. కర్నూలు ఎంపీగా బుట్టా రేణుక, ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్‌‌రెడ్డిని అభ్యర్థులుగా టీడీపీ తరఫున బరిలోకి దింపుతున్నట్లు నారా లోకేశ్‌ జిల్లాలో పర్యటనలో చెప్పిన విషయం విదితమే. మంత్రి ప్రకటనతో టీజీ వర్గం తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతోంది. అసలు పార్టీలో ఉండాలా.. వద్దా..? అనే డైలామాలో టీజీ వర్గీయులు ఉన్నట్లుగా తెలుస్తోంది. తన కుమారుడ్ని కర్నూలు నుంచి పోటీ చేయించాలని ఎన్నోరోజులుగా టీజీ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. అయితే లోకేశ్ ప్రకటనతో టీజీ ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఎవరెన్ని కుట్రలు పన్నినా టీజీ భరత్ కర్నూలు నుంచి పోటీ చేస్తారని.. గతంలో టీజీ వర్గీయులు మీడియా ముందుకొచ్చి స్పష్టంగా చెప్పిన విషయం విదితమే. 

నాకు ముందే ఒప్పందం జరిగింది!
నారా లోకేశ్ ప్రకటనపై ఇటు టీజీ.. అటు ఎస్వీ మోహన్ రెడ్డి ఇరువురూ స్పందించారు. తాజాగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. టీజీతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేశ్ అభ్యర్థులను ప్రకటించారన్నారు. టీజీకి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన సమయంలోనే ఎమ్మెల్యే టికెట్ తనకు ఇచ్చేలా ఒప్పందం జరిగిందని ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మొత్తానికి టికెట్ హామీ మేరకే టీడీపీ కండువా కప్పుకున్నానని ఎస్వీ తన నోటితోనే మీడియా ముందు నిజం ఒప్పుకున్నారన్న మాట.

నాకంత అవసరం లేదు..!
అభ్యర్థులను ముందు ప్రకటించడం మంచి సంప్రదాయమని మంత్రిని ఆయన మెచ్చుకున్నారు. లోకేశ్‌ను హిప్నటైజ్ చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. రాజకీయాల్లో లోకేష్ కొత్త పంథాను అనుసరిస్తున్నారని... పార్టీ జాతీయ కార్యదర్శి హోదాలోనే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ఆయన ప్రకటించారని చెప్పారు. చంద్రబాబాబు చెప్పనదాన్నే లోకేష్ ప్రకటించారని ఈ సందర్భంగా ఎస్వీ చెప్పుకొచ్చారు. కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే స్థానంతో పాటు.. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా జయనాగేశ్వరరెడ్డిని కూడా లోకేష్ ప్రకటించినట్టు తెలిపారు. ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించడం వల్ల అభ్యర్థుల గెలుపు అవకాశాలు పెరుగుతాయన్నారు. పార్టీ గెలుపు కోసం తాను ఎవరితోనైనా కలిసి పని చేస్తానని ఈ సందర్భంగా ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఎస్వీ వ్యాఖ్యలపై టీజీ వెంకటేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆ ర‌హ‌స్యాన్ని చెప్పిన స‌మంత‌

Updated By ManamTue, 07/03/2018 - 10:45

chai, samantha ఇప్పుడు హీరోయిన్స్, హీరోలు అని తేడాలు లేకుండా టాటూలు వేయించుకుంటున్నారు. ఒక్కొక్క‌రు ఒక్కొక్క స్టైల్ టాటూలు త‌మ శ‌రీరంలో ముద్రింప చేసుకుంటారు. అయితే ఒక్కొక్క టాటూకి ఒక్కో అర్థం ఉంటుంది. ఇప్పుడు అలాంటి టాటూల బ్యాచ్‌లో ఇటీవ‌ల అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత కూడా చేరిన సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రూ చేతిపై బాణాల‌ను టాటూలుగా వేయించుకున్నారు. మ‌రి దీనికి అర్థ‌మేంట‌ని ఇటీవ‌ల ఎవ‌రో అడిగితే.. `నిజ జీవితంలోనే మీరు మీలా ఉండండి` అనే అర్థం వ‌స్తుంద‌ని స‌మంత టాటూ వెనుక సీక్రెట్‌ని రివీల్ చేసింది. ప్ర‌స్తుతం చైత‌న్య స‌వ్య‌సాచి, శైలజారెడ్డి అల్లుడు సినిమాల‌తో బిజీగా ఉండ‌గా.. స‌మంత త‌మిళ చిత్రాల‌తో బిజీగా ఉంది. వీరిద్ద‌రూ క‌లిసి `నిన్ను కోరి` ఫేమ్ శివ నిర్వాణ సినిమాలో న‌టించ‌బోతున్నారు. 

Related News