bonalu

మెల్ బోర్న్‌లో ఘనంగా బోనాల పండుగ

Updated By ManamSun, 08/12/2018 - 18:48

bonalu in melbourne
ఆస్ట్రేలియా: ఖండాంతరాలు దాటినా మన తెలంగాణ సంస్కృతి చెక్కుచెదరడం లేదనటానికి నిదర్శనంగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ప్రతిఏడులానే ఈ సంవత్సరం కూడా బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు.  రాక్ బాంక్ ప్రాంతంలోని దుర్గామాత ఆలయలో జరిగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రవాస తెలంగాణ బిడ్డలు పాల్గొని నృత్యాలతో, ఆటపాటలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. 

bonalu in melbourne

తెలంగాణ రాష్ట్రం పచ్చని పైరులతో సుభిక్షమవ్వాలనీ, సర్వమాన సౌబ్రాత్రుత్వంతో ప్రపంచమంతా విలసిల్లాలని వేడుకున్నారు. ఆస్ట్రేలియాలోని వివిధ ప్రవాస భారతీయ మరియు ప్రవాస తెలంగాణ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని బోనాల పండుగను విజయవంతం చేశారు, తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పుతూ, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్న నిర్వాహకులైన తెలంగాణ మధు, రాజు వేముల, ప్రజీత్ రెడ్డి కోతి, దీపక్ గద్దె గార్లను ఆలయ కమిటీ ప్రశంసించింది.

bonalu in melbourneఅసెంబ్లీ ఆవరణలో అమ్మవారి బోనాలు

Updated By ManamSat, 08/04/2018 - 00:23
  • హజరైన స్వామి గౌడ్, మధుసూదనా చారి

bonalu-asemblyహైదరాబాద్:  తెలంగాణ అసెంబ్లీలో బోనాలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న బంగారు మైసమ్మ(అమ్మవారి) దేవాలయంలో శాసన సభ స్పీకర్, మండలి చైర్మన్, అసెంబ్లీ కార్యదర్శి, మీడియా అడ్వైజరీ కమిటీ చైర్మన్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం. స్పీకర్ మధుసూదనా చారి, మండలి చైర్మన్ స్వామి గౌడ్, కార్యదర్శి డా. నర్సింహచార్యులు, మీడియా కమిటీ చైర్మన్ సూరజ్  వి. భరద్వాజ్‌ల ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు జరగింది. ఈ ఊరేగింపు అసెంబ్లీ గేట్ నెంబర్ 1 నుంచి బంగారు మైసమ్మ గుడి వరకు డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాల మధ్య అమ్మవారి  బోనాలను ఆట పాటలతో అమ్మవారికి సమర్పించారు. అసెంబ్లీలోని మహిళ ఉద్యోగులంతా బోనం ఎత్తి అమ్మవారి పట్ల తమ భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. కొంత మంది మహిళలు అత్యంత ఉత్సాహంగా నృత్య ప్రదర్శన చేశారు. వారి నృత్యాలు చూపరులను ఆకట్టుకోవడం విశేషం. ఈ ఊరేగింపులో దాదాపు 100 మంది ఉద్యోగులతో పాటు, పలువురు జర్నలిస్టులు, ప్రముఖులు పాల్గొన్నారు.జోగిని శ్యామల అలా అనడం సరికాదు: మంత్రి

Updated By ManamMon, 07/30/2018 - 11:58

talasaniహైదరాబాద్: బోనాలు ఘనంగా జరిగాయని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. ఈ సంవత్సరం చిన్న చిన్న అసౌకర్యాలు కలిగాయని, వీఐపీల తాకిడి వల్ల భక్తులకు ఇబ్బందులు కలిగాయని శ్రీనివాస యాదవ్ చెప్పారు. స్వచ్ఛంద సంస్థలు కూడా బాగా సహకరించాయని ఆయన పేర్కొన్నారు. జోగిని శ్యామలకు ఆలయ పరిస్థితులు తెలుసని, ప్రభుత్వంపై కామెంట్ చేయడం సరికాదని పేర్కొన్నారు.

అయితే మహంకాళి బోనాల సందర్భంగా సికింద్రాబాద్‌లోని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించేందుకు శ్యామల క్యూలో వెళుతుండగా.. పోలీసులు తనపై అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసులు, ప్రభుత్వంపై ఆమె శాపనార్ధాలు పెట్టారు.లండన్‌లో ఘనంగా బోనాలు

Updated By ManamMon, 07/23/2018 - 13:06

bonaluసకల లోకాలను సల్లంగ జూసే అమ్మకు భోజనం పెట్టడమే బోనం! అటువంటి బోనాల జాతరను తెలంగాణ ఆడపడుచు ఎక్కడున్నా మరువలేదు. సముద్రాలు దాటి లండన్‌లో అడుగుపెట్టిన మన రాష్ట్ర ఆడ బిడ్డలు ఆదివారం బోనవెుత్తారు. తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో ఈ జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో బ్రిటన్ నలుమూలల నుంచి సుమారు 700 తెలంగాణ కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి. రాష్ట్రం నుంచి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, లండన్ ఎంపీలు వీరేంద్రశర్మ, సీమ మల్హోత్రా, భారత హైకమిషన్ ప్రతినిధి రాజన్, లండన్ బారౌ మేయర్ సమియా చౌదరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సందడి చేశారు. లండన్ వీధుల్లో సాగిన బోనాల జాతరను స్థానికులు కూడా సంబరంగా చూశారు. ఈ సందర్భంగా కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి ప్రచారంలో తెలంగాణ బిడ్డలు ముందు వరసలో ఉన్నారని కొనియాడారు. మహిళా సాధికారత మాటల్లో కాకుండా ఇంటినుంచేమొదలవ్వాలని అన్నారు. లండన్ ఎంపీలు  వీరేంద్ర శర్మ , సీమా మల్హోత్రా మాట్లాడుతూ  లండన్‌లో భారతీయ పండుగలు అంటే బోనాలు, బతుకమ్మ, దీపావళి గుర్తొస్తాయని, ఈ వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంతామని చెప్పారు. తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షుడు ప్రమోద్, వ్యవస్థాపక చైర్మన్  గంప వేణుగోపాల్, కార్యదర్శి భాస్కర్ పిట్ల తదిరులు ముందుండి ఈ సంబరాలను జరిపించారు.జగదంబకు బోనం

Updated By ManamMon, 07/09/2018 - 23:26

శక్తి ఆరాధనలో జానపదులు జరుపుకునే అతిపెద్ద జాతర బోనాలు. ఆషాఢ మాసంలో బోనాల సందర్భంగా దుర్గతి, దుఃఖం నశింపచేసే శక్తి జగన్మాతను ఆరాధిస్తారు. ఆషాఢ జాతర ఈ వారమే ప్రారంభం కాబోతోంది. గోల్కొండ జగదంబిక బోనాల సందర్భంగా ఘటం ఎదుర్కోళ్లు నిర్వహిస్తారు. అప్పటి నుంచి ఆషాఢ మాసం పూర్తయ్యేవరకు ప్రతి గురు, ఆదివారాల్లో గోల్కొండ కోట దగ్గర బోనాల జాతర నిర్వహిస్తారు.
 

image


సకల జీవకోటికి ఆధారం అన్నం. జీవుల ఉత్పత్తి, పోషణ జీవద్రవ్యమైన అన్నం వల్లే జరుగుతాయి. ప్రకృతి శక్తులకు అన్నాన్ని సమర్పించడమంటే కృతజ్ఞతను తెలియజెప్పడమే. కొత్త కుండలో జగన్మాతకు అన్నం పెట్టడమే ఈ అపూర్వ సంబురం ముఖ్య ఉద్దేశ్యం. ఉత్సాహభరితమైన డప్పుల విన్యాసాలు, పోతురాజుల హంగామాలు, పడతుల తలలపై పసుపు రాసిన బోనాలు, ఆలయాల్లో ప్రతిధ్వనించే భవిష్యవాణి బోనాల్లో ప్రధానఘట్టాలు.

ఆషాఢ జాతరలో జగన్మాతకు బోనాలు సమర్పించడం వల్ల శారీరక, ఆధ్యాత్మిక, మానసిక శక్తులు వృద్ధి చెందుతా యని భక్తులు విశ్వసిస్తారు.  బోనం కుండలను శిరస్సులపై ధరించి పసుపు కలిపిన నీటిని వేపకొమ్మలతో చిలకరిస్తూ అమ్మ తల్లి ఆలయాలకు వెళతారు. మొక్కుబడుల్ని అనుసరించి పాత్రల్లో బోనాల ను సిద్ధంచేస్తారు. బోనాల ఘటాలను పసుపు కుంకుమలతో, కళాత్మక నగిషీలతో అమ్మవారి రూపాలను తీర్చిదిద్దుతారు. కొత్త కుండను, దానిపై ఉంచే చిన్న ముంతను, ముంతపై మూకుడుని తెస్తారు. కుండకు సున్నం పూసి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ఇప్పుడు చిత్రచి త్రాలుగా వీటిని అలంకరిస్తున్నారు.
 

image


 కుండ అంచుకు వేప రెమ్మలు కడతారు. ఒక తెల్లని వస్త్రంలో నవ ధాన్యాలు పోసి చిన్న మూట కట్టి నాలుగు కొంగుల్ని కలిపి వత్తిగా మలుపుతారు. పైన ఉండే మూకుడు మూతలో నూనె పోసి, మూటతో సహా వత్తిని అందులో ఉంచుతారు. బోనం తలకెత్తుకునే ముందు వత్తిని వెలిగిస్తారు. కుండలో అమ్మవారి నైవేద్యాలు ఉంటాయి.  వండిన అన్నంతో పాటు పాలు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయల తో కూడిందే బోనం. వ్యాధి నిరోధకశక్తిని పెంచే పసుపు కలిపిన నీరు, వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు తరలివెళ్లి బోనాలు సమర్పిస్తారు. బోనంతో పాటుగా ఈ సందర్భంలోనే తొట్టెలను సమర్పించే ఆచారం ఉంది. కొత్తగా అమ్మనాన్న అయిన దంపతులు అమ్మతల్లికి తొట్టెలు సమర్పిస్తారు. నట్టింట తొట్టె ఉంచితే నీకు తొట్టె సమర్పిస్తానని మొక్కుకుంటారు. అలాగే, గుర్రాలు, ఏనుగులు, సంకెళ్లు మొక్కును బట్టి సమర్పించుకుంటారు. పిల్లలకు అనారోగ్యాలు వచ్చినప్పుడు గుర్రంలాగా అయితే గుర్రం, బిడ్డ ఏనుగులాగైతే ఏనుగును సమర్పించుకుంటామని మొక్కుకుంటారు. సంకటాల సంకెళ్లు చుట్టుకున్నప్పుడు సంకెళ్లు మొక్కుకుంటారు. మొక్కుబడి గుర్రాలను ఏనుగుల్ని కొయ్యతో గానీ, మట్టి బొమ్మలుగా గానీ సమర్పించుకుంటారు.

బోనాల చరిత్ర
కాకతిని ఆరాధ్య దేవతగా పూజించేవారు కాకతీయులు. వారు అమ్మవారికి ఆషాఢ ఉత్సవాలను నిర్వహించేవారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, రాజ్యం సుభిక్షంగా ఉండాలని ఆషాఢ మాసంలో ప్రతినిత్యం ఉత్సవాల్ని నిర్వహించేవారు. భాగ్యనగరంలో పదిహేనో శతాబ్దం నుంచి బోనాలు నిర్వహిస్తున్నట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్లో ప్రతి సంవత్సరం భారీవర్షాల వల్ల తరచుగా కలరా వ్యాపించేది. ఆ వ్యాధి కారణంగా చాలామంది చనిపోయేవారు. ఆ నేపథ్యంలోనే జానపదులు బోనం పేరిట భోజన పదార్థాలను అమ్మకు నైవేద్యంగా సమర్పించేవారు. అన్నాన్ని దేవత ముంగిట రాశిగాపోసి బోనం పేరిట నైవేద్యాన్ని సమర్పించేవారు. అప్పటినుంచి బోనాల సంప్రదాయం కొనసాగుతూ వస్తుంది.

ఆషాఢమాసంలోనే బోనాలు ఎందుకు సమర్పిస్తారనే దానికి ఓ కారణాన్ని పెద్దలు చెబుతారు.  ఎండలు తగ్గి వానలు మొదలయ్యే సంధికాలం కనుక ఆషాఢంలో రోగాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రోగాలను తట్టుకోవడానికి కూడా జానపదులు గ్రామదేవతారాధనే తరుణోపాయంగా భావిస్తారు. అమ్మతల్లికి బోనం పేరిట భోజనాన్ని భక్తిగా సమర్పిస్తారు. బోనం స్వీకరించిన మాతృశక్తి సంతృప్తి చెంది ప్రజలను చల్లగా చూస్తుందంటారు.15 నుంచి బోనాలు 

Updated By ManamSun, 07/01/2018 - 06:46
  • లంగర్‌హౌజ్ నుంచి ఊరేగింపు: తలసాని

bonaluహైదరాబాద్: గోల్కోండ జగదాంబ మహాంకాళి దేవస్థానం ఆషాడ బోనాల జాతరను జూలై 15 నుంచి ఆగస్టు 12 వరకు నిర్వహించనున్నట్టు రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. శనివారం వివిధ శాఖల అధికారులు, శాంతి కమిటీ సభ్యులతో గోల్కొండ బోనాలకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై గోల్కొండలో సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ పురావస్తు శాఖ సహాకారంతో పర్యావరణ హితంగా జాతరను నిర్వహించనున్నామన్నారు. మంచినీరు తాగేందుకు మట్టి గ్లాసులు, మట్టి చెంబులు, వంటలకు మట్టి గిన్నెలను అందుబాటులో ఉంచేందుకు కుమ్మరి సంఘాలకు బాధ్యతను అప్పగించనున్నట్టు తెలిపారు. తెలంగాణ పండుగల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటే విధంగా అత్యంత వైభవంగా బోనాలను జరిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. జూలై 15న లంగర్ హౌజ్ నుంచి ఊరేగింపు ప్రారంభం అవుతుందని చెప్పారు. జూలై 22, 29 తేదీల్లో గోల్కొండ బోనాల జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్థన్‌రెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత హైదరాబాద్ ఏర్పాట్లలో భాగంగా స్వచ్ఛ బోనాలు- స్వచ్ఛ గోల్కొండ కార్యక్రమాన్ని అమలు చేయనున్నామన్నారు. జూలై 13 నుంచి అంతర్జాతీయ ప్లాస్టిక్ నిషేధ కార్యక్రమం ప్రారంభిస్తున్నందున మొదటగా గోల్కొండలో అమలు చేస్తామని తెలిపారు. బోనాల పండుగ ప్రశాంతంగా జరగాలి

Updated By ManamThu, 06/28/2018 - 06:20
  • అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి

  • అధికారులకు రాష్ట్ర మంత్రుల సూచనలు

imageహైదరాబాద్: బోనాల పండుగను వైభవంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 కోట్లు మంజూరు చేసిందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. డిప్యూటీ సీఎం మహ్మద్ మహమూద్ అలీ, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు గౌడ్, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి హోం మంత్రి నాయిని బోనాల ఏర్పాట్లపై బుధవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ... బోనాల పండుగ జూలై 15 నుంచి ఆగస్టు 6 వరకు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పండుగ ప్రశాతంగా జరగడానికి అందరూ సహకరించాలని కోరారు. బోనాల నిర్వహణ కోసం ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు యంత్రాంగంతో దేవాలయ కమిటీలు సహకరించాలని కోరారు. దేవాలయాల సమీపంలో రహదారులకు మరమ్మతులు చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు అదనపు ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేయాలని ట్రాన్స్‌కో శాఖ ను ఆదేశించారు. ప్రత్యేకంగా 375 ఆర్టీసీ బస్సులను నడుపనున్నట్టు తెలిపారు. బోనాల పండుగను మన రాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీ, విజయవాడక వివిధ దేశాలతోపాటు ఈ సారి ముంబైలో జరుగుతున్నాయని తెలిపారు. మహ మూద్ అలీ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి ఘనంగా నిర్వహిస్తున్నా మన్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఐకే రెడ్డి మాట్లాడుతూ... బోనాల పండుగ జరుపుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు మాట్లాడుతూ... శాంతి యుత వాతావరణంలో పండుగను జరుపుకొనుటకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్టు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... ప్రభుత్వ పరంగా చేయాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దేవాలయ కమిటీలు వివిధ శాఖలతో కలిసి సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ సమావేశంలో మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి, జీఏడీ ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హా, దేవాదాయ శాఖ కమిషనర్ శివశంకర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, మెట్రో వాటర్ వర్క్స్ మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లు పాల్గొన్నారు. 

Related News