keerthi suresh

హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ఊపందుకున్న ‘సామి’

Updated By ManamWed, 09/26/2018 - 16:17
saamy

పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్‌‌లో విక్రమ్, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా.. డైరెక్టర్ హరి దర్శకత్వంలో.. బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన చిత్రం ‘సామి’. సెప్టెంబర్ 21న విడుదలైన ఈ చిత్రం హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది.

ఈ సందర్భంగా నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘సెన్సేషనల్ స్టార్ విక్రమ్, డేరింగ్ డైరెక్టర్ హరిగారి కాంబినేషన్‌లో వచ్చిన ‘సామి’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. వినాయక చవితి ఉత్సవాలు, క్రికెట్ మ్యాచ్‌లతో ఇప్పటి వరకు కలెక్షన్లు కాస్తంత తగ్గినా.. సోమవారం నుంచి హౌస్‌ఫుల్ కలెక్షన్లతో థియేటర్లలో సందడి చేస్తున్నాడు మా ‘సామి’. కలెక్షన్లు అనూహ్యంగా పుంజుకోవడంతో చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంత మంచి విజయం మాకు అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాగే ప్రేక్షకులు థియేటర్స్‌ని హౌస్‌ఫుల్ చేసి సామికి అఖండ విజయం అందిస్తారని కోరుకుంటున్నాము..’’ అని అన్నారు. 

చియాన్ విక్రమ్, కీర్తి సురేష్, ఐశ్వర్య రాజేష్, బాబీ సింహ, సూరి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: వెంకటేష్ అంగురాజ్, ఎడిటర్: వి. టి. విజయన్, టి.ఎస్. జయ్, కథ-డైరెక్షన్: హరి, నిర్మాత: బెల్లం రామకృష్ణారెడ్డి.నువ్వా? నేనా?

Updated By ManamMon, 08/06/2018 - 23:55

విభిన్న కథాంశాలతో సినిమాలను రూపొందించే వెంకట్ ప్రభు ఓ కొత్త సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రస్తుతం అతను చేసిన ‘పార్టీ’ అనే చిత్రం విడుదలకు సిద్ధమైంది. దీని తర్వాత శింబు హీరోగా ‘మానాడు’ అనే చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. రాజకీయ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారు.

imageఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే విషయంలో అందరికీ ఆసక్తి కలిగించే విషయం. హీరోయిన్ కోసం కీర్తి సురేష్, జాన్వీ కపూర్‌లతో సంప్రదింపులు జరుగుతున్నాయని దర్శకుడు వెంకట్ ప్రభు తెలిపారు. త్వరలోనే హీరోయిన్ ఎవరన్నది ఫైనల్ చేస్తారట.

జాన్వీ కపూర్‌ని దక్షిణాది సినిమాల్లో హీరోయిన్ పరిచయం చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి వెంకట్ ప్రభు ఈ విషయంలో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి. జాన్వీ ఈ సినిమాలో హీరోయిన్ నటించే అవకాశం లేదని, కీర్తి సురేష్‌నే ఫైనల్ చేస్తారని కోలీవుడ్ వర్గాల సమాచారం.
 

image

 ప్రేమ పెళ్లే!

Updated By ManamFri, 07/20/2018 - 02:24

imageసాధారణంగా హీరోయిన్స్‌ని పెళ్లి గురించి అడిగితే సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తుంటారు. కానీ కీర్తిసురేశ్ మొహమాటం లేకుండా తన పెళ్లి గురించిన విషయాన్ని చెప్పేసింది. ప్రేమ పెళ్లి చేసుకుంటుందా? పెద్దలు కుదర్చిన సంబంధం చేసుకుంటారా? అని అడిగితే కీర్తి సురేశ్ ఏమాత్రం తడుముకోకుండా ప్రేమ పెళ్లే చేసుకుంటాను అని ఆన్సర్ చెప్పింది.

దానికి కారణం వివరిస్తూ ‘‘నేను భవిష్యత్‌తో ప్రేమ పెళ్లే చేసుకుంటాను. ఎందుకంటే మా తల్లిదండ్రులు, అక్కయ్యలది కూడా ప్రేమ వివాహమే. వారు సంతోషంగా ఉన్నారు. కాబట్టి నేను కూడా ప్రేమ పెళ్లినే చేసుకుంటాను. అయితే ఎవరా? వ్యక్తి అని అడక్కండి? ఎందుకంటే.. నేను ప్రస్తుతం ఎవరినీ ప్రేమించలేదు. ప్రేమిస్తే మా అమ్మనాన్నలకు చెప్పే పెళ్లి చేసుకుంటాను’’ అంటూ సమాధానం చెప్పింది కీర్తి సురేశ్. అంతకు మించి ఆశించను

Updated By ManamTue, 07/17/2018 - 23:45

imageమహానటి సావిత్రి పాత్రను అత్యద్భుతంగా పోషించి అందరి ప్రశంసలు పొందింది హీరోయిన్ కీర్తి సురేష్. ‘మహానటి’ చిత్రంతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కీర్తికి ఇప్పుడు అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. ఇక తమిళ చిత్ర పరిశ్రమ కీర్తిని ఆకాశానికి ఎత్తేస్తోంది. ఈ సినిమా తర్వాత ఆమె తన పారితోషికాన్ని కూడా బాగా పెంచేసిందని తెలుస్తోంది.

 ఈ విషయంపై కీర్తి సురేష్ స్పందిస్తూ ‘‘కేవలం డబ్బు సంపాదించడానికి నేను సినిమాల్లోకి రాలేదు. నటిగా మంచి పేరు తెచ్చుకోవాలి, అందరికీ గుర్తుండిపోయే పాత్రలు చేయాలి. ఇదీ నా ఆలోచన. హీరోయిన్‌గా డిమాండ్ ఉన్నప్పుడే సంపాదించుకోవాలి అని అంటూంటారు. కానీ, నేను దాన్ని నమ్మను. మనం చేసిన పనికి తగిన ప్రతిఫలం వస్తే చాలు. అంతకుమించి నేను ఆశించను. నటనకే ప్రాధాన్యమిస్తాను తప్ప పారితోషికానికి కాదు’’ అని స్పష్టం చేసింది. ప్రస్తుతం కీర్తి సురేష్ తమిళ సినిమాల్లోనే ఎక్కువ నటిస్తోంది. విక్రమ్‌తో ‘స్వామి స్క్వేర్’, విజయ్‌తో ‘సర్కార్’, విశాల్‌తో ‘సండైకోళి 2’ చిత్రాలు చేస్తోంది.'మ‌హాన‌టి'.. ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌

Updated By ManamWed, 05/16/2018 - 16:12

keerthy sureshఅల‌నాటి మేటి న‌టి సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం 'మ‌హాన‌టి'. కీర్తి సురేశ్ ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన ఈ సినిమాకి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్రియాంక ద‌త్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న తెర‌పైకి వ‌చ్చింది. తొలి ఆట నుంచే బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా..  విడుద‌లైన ప్ర‌తి చోటా మంచి వ‌సూళ్ళు రాబ‌డుతోంది. ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం.. తొలి వారం రోజులకిగానూ (మంగ‌ళ‌వారం నాటికి) తెలుగు రాష్ట్రాల్లో రూ.10.52 కోట్ల షేర్ రాబ‌ట్టుకున్న ఈ సినిమా.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.19.62 కోట్ల షేర్ ఆర్జించింద‌ని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.12 కోట్ల వ‌ర‌కు థియేట్రిక‌ల్ రైట్స్ వాల్యూ ఉన్న ఈ మూవీ.. గురువారం నాటికి ఆ వ‌సూళ్ళు రాబ‌ట్టుకునే అవ‌కాశ‌ముంద‌ని ట్రేడ్ పండితులు అంచ‌నా వేస్తున్నారు. 'మహానటి' రివ్యూ

Updated By ManamWed, 05/09/2018 - 15:39

mahanatiచిత్రం: మహానటి 

నటీనటులు: కీర్తి సురేశ్‌, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్, తనికెళ్ళ భరణి, భానుప్రియ, మాళవికా నాయర్, షాలిని పాండే, తులసి, దివ్యవాణి, జ‌బ‌ర్ద‌స్త్‌ మ‌హేశ్.. అతిథి పాత్ర‌ల్లో నాగ చైతన్య, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, నరేశ్‌, క్రిష్, శ్రీనివాస్ అవసరాల, సందీప్ రెడ్డి వంగ, తరుణ్ భాస్కర్, మ‌నోబాల‌ తదితరులు

ఛాయాగ్రహణం: డాని సంచేజ్-లోపెజ్

కళ: కొల్లా అవినాష్

కూర్పు: కోటగిరి వెంకటేశ్వర రావు

సంగీతం: మిక్కీ జె. మేయర్

మాటలు: సాయి మాధవ్ బుర్రా

సాహిత్యం: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, రామ‌జోగ‌య్య శాస్త్రి

స్క్రీన్ ప్లే: సిద్ధార్థ్ శివస్వామి

నిర్మాణ సంస్థలు: వైజయంతి మూవీస్, స్వప్న సినిమా

నిర్మాత:  ప్రియాంక దత్ 

ర‌చ‌న‌, దర్శకత్వం: నాగ్ అశ్విన్

విడుదల తేది: 09 మే 2018
నిడివి: 176 నిమిషాల 36 సెకండ్లు 

తెలుగు సినిమా స్వ‌ర్ణ‌యుగంలో మహానటిగా రాణించిన తార సావిత్రి. ఓ తరం జ్ఞాపకంగా నిలిచిపోయిన సావిత్రికి సంబంధించి.. న‌ట‌, నిజ జీవితాల్లో ఎన్నో ఎన్నెన్నో మలుపులు ఉన్నాయి. అలాంటి సావిత్రి జీవితంలోని కీలక ఘట్టాల‌కు తెర రూపం ‘మహానటి’ చిత్రం. యువ క‌థానాయిక‌ కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రలో.. యువ ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ రూపొందించిన‌ ఈ బయోపిక్ బుధవారం తెరపైకి వచ్చింది. ఈ సినిమాపై 'మనం' అందిస్తున్న సమీక్ష మీ కోసం:

క‌థాంశం
mahanatiఓపెన్ చేస్తే.. బెంగ‌ళూరులోని చాళుక్య హాస్పిట‌ల్‌. అప‌స్మార‌క స్థితిలో ఉన్న ఓ పెద్దావిడ‌ని ఆ హాస్పిట‌ల్‌లో చేరుస్తారు. నెమ్మ‌దిగా కోమాలోకి వెళ్ళిపోయిన ఆమెని.. మ‌హాన‌టి సావిత్రి (కీర్తి సురేశ్‌)గా అక్క‌డ సిబ్బంది గుర్తిస్తారు. దాదాపు ఏడాది పాటు ఆమె కోమాలోనే ఉండిపోతుంది. క‌ట్ చేస్తే.. అదే స‌మ‌యంలో ప్ర‌జావాణి ప‌త్రికకి చెందిన మ‌ధుర‌వాణి (స‌మంత‌).. జ‌ర్న‌లిస్ట్‌గా త‌న‌ను తాను నిరూపించుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తుంటుంది. ఆడ‌పిల్ల అయిన త‌న‌ను ఇంట్లో ఉండే నాన్న ద‌గ్గ‌ర్నుంచి.. కార్యాల‌యంలో ఉండే ప‌త్రిక య‌జ‌మాని (త‌నికెళ్ళ భ‌ర‌ణి) వ‌ర‌కు అందరూ చిన్న చూపు చూస్తుంటారు. ఈ నేప‌థ్యంలో.. త‌న‌ను తాను నిరూపించుకునే ఓ అవ‌కాశం దొరుకుతుంది. అదేమిటంటే.. త‌న‌కు అంత‌గా తెలియ‌ని సావిత్రి క‌థ‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ళ‌డం. ఫొటోగ్రాఫ‌ర్ విజ‌య్ ఆంటోని (విజ‌య్ దేవ‌ర‌కొండ‌)తో క‌లిసి సావిత్రి జీవితానికి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు సేక‌రిస్తుంది మ‌ధుర‌వాణి. ఆమె బాల్య ద‌శ‌నుంచి.. సినిమాల్లోకి ప్ర‌వేశించిన రోజులు, స్టార్‌గా వెలిగిపోయిన రోజులు, జెమినీ గణేశ‌న్‌తో ర‌హ‌స్య వివాహం,  వైవాహిక జీవితంలో ఒడుదొడుకులు, చివ‌రి రోజులు.. ఇలా అనేక విష‌యాల‌ను ఆమెతో అనుబంధం ఉన్న వాళ్ళ నుంచి సేక‌రిస్తుంది వాణి. అంతేగాకుండా సావిత్రి గురించి తెలుసుకునే ప్ర‌యాణంలో.. త‌న గురించి తాను తెలుసుకుంటుంది. తెర‌పై న‌టించ‌డ‌మే త‌ప్ప నిజ‌జీవితంలో న‌టించ‌డం చేత‌కాని, క‌ష్టాల్లో మ‌రొక‌రి స‌హాయం తీసుకునే అల‌వాటు లేని సావిత్రిని స్ఫూర్తిగా తీసుకుని త‌ను తీసుకునే నిర్ణ‌యాలేంటి? త‌న‌లాంటి ఎంద‌రికో స్ఫూర్తిగా నిలిచిన సావిత్రికి మ‌ధుర‌వాణి అందించిన చిరు కానుక ఏమిటి? ఇలాంటి అంశాల‌కు స‌మాధానం 'మ‌హాన‌టి' చిత్రం. 

విశ్లేష‌ణ‌
mahanatiమ‌హాన‌టి సావిత్రి జీవితం ఓ తెరిచిన పుస్త‌కం. న‌ట‌న‌లో అత్యున్న‌త శిఖ‌రాలకు చేరుకున్న సావిత్రి.. నిజజీవితంలో త‌నకు ఎదురైన చేదు అనుభ‌వాల‌తో.. అదే సినిమా జీవితంలో ప‌త‌న ద‌శ‌ను కూడా చూశారు. అయితే.. ఆమెతో ప్ర‌యాణించిన వారిని మిన‌హాయిస్తే మిగిలిన వారికంద‌రికి ఆమె జీవితం గురించి తెలిసిన విష‌యాల‌న్నీ పుస్తకాల‌కే ప‌రిమితం. ఇక ఆమె న‌ట‌న గురించి.. ఆమె 5 భాష‌ల్లో న‌టించిన 300 సినిమాలు చెప్ప‌క‌నే చెప్పాయి. అయితే పుస్తకాల‌కు ప‌రిమిత‌మైన సావిత్రి నిజ జీవితానికి దృశ్య రూపం ఇవ్వ‌డం అనేది ఓ సాహ‌స‌మే. అలాంటి సాహ‌సాన్ని ఓ యువ ద‌ర్శ‌కుడు చేయ‌డం ఇంకా సాహ‌సం. ఇక సావిత్రి పాత్ర కోసం.. నిండా ఐదేళ్ళ‌యినా యాక్టింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ లేని కీర్తి సురేశ్ లాంటి వ‌ర్థ‌మాన తార‌ను ఎంచుకోవ‌డం సాహ‌సాల‌కు మించిన సాహ‌సం. అయితే.. ఆ సాహ‌సాల‌న్నింటిని విజ‌య‌వంతంగా చేసింది 'మ‌హాన‌టి' చిత్ర బృందం. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు.. వీరిలో సింహ‌భాగం యువ బృంద‌మే అయినా.. ఓ మ‌హాన‌టికి నివాళి అందించిన తీరుని ప్ర‌శంసించ‌కుండా ఉండ‌లేం. ముఖ్యంగా.. ద‌ర్శ‌కుడిగా త‌న రెండో ప్ర‌య‌త్నంలోనే ఇంత సాహ‌సానికి దిగిన నాగ్ అశ్విన్ గురించి మెచ్చుకోకుండా ఉండ‌డం మ‌న వ‌శం కాదు. ఇక ద‌ర్శ‌కుడు సినిమాని నేరేట్ చేసిన విధానం కూడా బాగుంది.

mahanatiసావిత్రి అప‌స్మార‌క స్థితిలో వెళ్ళే షాట్‌తో సినిమాని ఆరంభించి..  ఆమె ఎందుకు మ‌హాన‌టి అయ్యిందో అలాంటి దృశ్యాన్ని (ఒకే కంటి నుంచి క‌న్నీళ్ళు రావ‌డం.. అది కూడా రెండే చుక్కలు) క‌ళ్ళారా చూసిన ఫొటోగ్రాఫ‌ర్ (న‌రేశ్‌) ద్వారా మ‌ధుర‌వాణికి చెప్పించ‌డంతో,  న‌టిగా ఆమె గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. చిన్న‌ప్ప‌ట్నుంచి సావిత్రిలో ఉండే అమాయ‌క‌త్వం, మొండిత‌నం, దాన గుణం (కొబ్బ‌రి లౌజుల కోసం రిక్షా కూడా ఎక్క‌కుండా స్నేహితురాలు సుశీల‌తో న‌డిచి వ‌చ్చిన చిన్న‌ప్ప‌టి సావిత్రి.. తీరా వాటిని కొనే స‌మ‌యంలో ఆక‌లితో ఉన్న ఓ తాత‌కి అడ‌గ‌కుండానే ఆ డ‌బ్బులు ఇచ్చివేయ‌డం), చిలిపి త‌నం.. ఇలా ఎన్నో గుణాల‌ను ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు. అలాగే న‌టిగా త‌ను మార‌డానికి గ‌ల సంద‌ర్భాల‌ను, జెమినీ గ‌ణేశ‌న్‌తో ఉన్న అనుబంధాన్ని (గ‌ణేశ‌న్ తీసిన ఫొటోనే సావిత్రి జీవితాన్ని మార్చివేస్తుంది. అలాగే నాన్న ఉప్పెకాల‌నుకునే త‌న తీర‌ని ముచ్చ‌ట‌ని పెద్ద‌య్యాక జెమినీ ఓ సంత‌లో తీర్చ‌డంతో.. అత‌నిపై మ‌రింత ప్రేమ పెంచే దృశ్యాన్ని ద‌ర్శ‌కుడు చూపిన విధానం సింప్లీ సూప‌ర్బ్‌),  'దేవ‌దాస్' విడుద‌ల‌కు ముందే గ‌ణేశ‌న్‌తో ర‌హ‌స్య వివాహం - దానికి ముందు సావిత్రిని అప్ప‌టికే పెళ్ళ‌యిన‌ గ‌ణేశ‌న్ పెళ్ళికి ఒప్పించే సీన్‌, అది తెలిసి ఇంట్లో పెద్ద గొడ‌వ‌ అవ‌డం, గ‌ణేశ‌న్‌తో క‌లిసి బ‌య‌ట క‌నిపించిన సావిత్రి గురించి జ‌నాలు త‌ప్పుగా మాట్లాడుతుంటే దానికి గ‌ణేశ‌న్ స్పందించే తీరు.. పెళ్ళ‌య్యాక సావిత్రి స‌క్సెస్‌కు గ‌ణేశ‌న్ అసూయ‌ చెంద‌డం (ఈ   నిజ‌జీవిత దృశ్యాలు చూస్తే 'ఆషిఖీ', 'ఆషిఖీ 2' గుర్తుకు రాక మాన‌వు),  కూతురుకి విజ‌య చాముండేశ్వ‌రి అనే పేరు పెట్ట‌డం వెన‌క కార‌ణాన్ని సావిత్రి చెప్ప‌డం, గ‌ణేశ‌న్‌తో మ‌న‌స్ప‌ర్థ‌లు, జీవితంలో ఎన్ని ఒడుదొడుకులు చూసినా కెరీర్‌లో రాణించ‌డం, గ‌ణేశ‌న్ నుంచి విడిపోయాక న‌మ్మిన‌వాళ్ళే వంచ‌న చేయ‌డం, త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో తాగుడుకి అల‌వాటు పడ‌డం,  చివ‌రి రోజుల్లోనూ దాన‌గుణం వ‌దులుకోక‌పోవ‌డం.. ఇలా ఒక‌టేమిటి ప్ర‌తి దృశ్య‌మూ ఓ ఆణిముత్య‌మే.

స్క్రీన్ ప్లే విష‌యంలో ద‌ర్శ‌కుడు తీసుకున్న శ్ర‌ద్ధ ముచ్చ‌ట‌గొలిపేలా ఉంటుంది. సావిత్రి నిజ జీవితాన్ని, న‌ట జీవితాన్ని సమాంత‌రంగా చూపిన‌ట్టే.. సావిత్రి క‌థ‌తో మ‌ధుర‌వాణి క‌థ‌ను స‌మాంత‌రంగా న‌డ‌ప‌డం చాలా బాగుంది. జెమినీ గ‌ణేశ‌న్ స్ఫూర్తితో విజ‌య్ ఆంటోని కూడా వాణికి ల‌వ్ ప్ర‌పోజ‌ల్ చేసే సీన్‌.. రేడియోలో సావిత్రి మాట‌లు విని మ‌ధుర‌వాణి చ‌ర్చ్‌లో ఆంటోనికి ప్ర‌పోజ‌ల్ చేయ‌డం.. వంటివి బాగా టేకాఫ్ చేశారు.  మ‌హాన‌టి క‌థ‌ను ముగించిన తీరు కూడా అభినంద‌నీయం. చూసే ప్రేక్ష‌కుల‌ను సావిత్రి జీవితంతో ట్రావెల్ చేయించ‌డంలో ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ నూటికి నూరు శాతం మార్కులు పొందింద‌నే చెప్పాలి.

mahanatiన‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే.. సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేశ్ ఒదిగిపోయారన‌డం కంటే జీవించార‌నే చెప్పాలి. అందం, అమాయ‌క‌త్వం, చిలిపి త‌నం, మొండిత‌నం, ఆరాటం (ముఖ్యంగా 'పాతాళ భైర‌వి' తెర‌పై చూస్తూ.. ప‌క్క‌వాళ్ళ‌కి అది త‌నే అని చెప్పే ప్ర‌య‌త్నం చేసే సీన్‌), మూతివిరుపులు, కోపం ప్ర‌ద‌ర్శించ‌డం, బాధను వ్య‌క్తం చేసే సంద‌ర్భాలు,  ప్రేమ త‌త్వం, దాన గుణం.. ఇలా ప్ర‌తి విష‌యంలోనూ, ప్ర‌తి హావాభావాల్లోనూ ఆ మ‌హాన‌టిని గుర్తు చేయ‌డంలో కీర్తి స‌క్సెస్ అయ్యారు. అలాగే సావిత్రి జీవితాన్ని మ‌లుపు తిప్పిన కొన్ని సినిమాల్లోని దృశ్యాల్లో మ‌రోసారి సావిత్రిని గుర్తుకు తెచ్చారు. త‌న‌కు దొరికిన ఈ 'వ‌న్స్ ఇన్ లైఫ్ టైమ్ ఆఫ‌ర్చునిటీ'ని కీర్తి చ‌క్క‌గా స‌ద్వినియోగం చేసుకున్నారు. ఆమె డ‌బ్బింగ్ కూడా చాలా బాగుంది. ఇక జెమినీ గ‌ణేశ‌న్ పాత్ర‌లో దుల్క‌ర్ స‌ల్మాన్ ఒదిగిపోయారు. 'అమ్మాడి' అంటూ సావిత్రిని ముద్దు చేసే స‌న్నివేశాలలోనూ, న‌టిగా ఆమెని ప్రోత్స‌హించే స‌న్నివేశాల‌లో త‌న న‌ట‌న బాగుంది. ఎమోష‌న‌ల్ సీన్స్‌లోనూ రాణించారు. డ‌బ్బింగ్ కొన్ని చోట్ల త‌న తండ్రి మ‌మ్మూట్టిని గుర్తుకు చేసింది.

samసినిమాకి కీల‌క‌మైన మ‌ధుర‌వాణి పాత్ర‌లో స‌మంత అద‌ర‌గొట్టేసింది. న‌త్తిని అధిగ‌మించే స‌న్నివేశంలో మెప్పిస్తుంది. సినిమాకి కీల‌క‌మైన పతాక దృశ్యంలో త‌న అభిన‌యంతో గుండె బ‌రువెక్కిస్తుంది. విజ‌య్ దేవ‌ర‌కొండది చిన్న పాత్రే అయినా.. త‌న ప‌రిధి మేర మెప్పించారు. సావిత్రి త‌ల్లిగా దివ్య‌వాణి, పెద్ద‌మ్మ‌గా భాను ప్రియ‌, సావిత్రి న‌టి కావ‌డంలో ముఖ్య పాత్ర పోషించిన పెదనాన్న కె.వి.చౌద‌రి పాత్ర‌లో రాజేంద్ర ప్ర‌సాద్‌, చిన్న నాటి స్నేహితురాలు సుశీల‌గా షాలిని పాండే, గ‌ణేశ‌న్ మొద‌టి భార్య అల‌మేలుగా మాళ‌వికా నాయ‌ర్‌తో పాటు అతిథి పాత్ర‌ల్లో (ఏఎన్నార్‌గా నాగ‌చైత‌న్య‌, ఎస్వీ రంగారావుగా మోహ‌న్ బాబు, ఆలూరి చ‌క్ర‌పాణిగా ప్ర‌కాశ్ రాజ్‌, కె.వి.రెడ్డిగా క్రిష్‌, సింగీతం శ్రీ‌నివాస‌రావుగా త‌రుణ్ భాస్క‌ర్‌, ఎల్వీ ప్ర‌సాద్‌గా అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, పింగ‌ళిగా సాయిమాధ‌వ్ బుర్రా) న‌టించిన తార‌లు అంతా వంక పెట్ట‌ని విధంగా త‌మ త‌మ‌ ప‌రిధుల్లో చ‌క్క‌గా న‌టించారు. 

సాంకేతిక నిపుణుల విష‌యానికి వ‌స్తే.. మిక్కీ జే మేయ‌ర్ సంగీతం ఈ సినిమాకి వెన్నెముక‌గా నిలిచింది. పాట‌లు, నేప‌థ్య సంగీతం సినిమా స్థాయిని పెంచాయి. పాట‌ల‌న్నీ కూడా సంద‌ర్భోచితంగా ఉన్నాయి. చిత్రీక‌ర‌ణ ప‌రంగా 'మూగమ‌న‌సులు' పాట గుర్తుండిపోతుంది. డేనీ ఛాయాగ్ర‌హ‌ణం చాలా బాగుంది. ఆనాటి వాతావ‌ర‌ణాన్ని ప్ర‌తిబింబించే దృశ్యాలు, బ్లాక్ అండ్ వైట్ సినిమా రోజుల‌ను గుర్తుకు తెచ్చే దృశ్యాలు.. స‌మంత ఎపిసోడ్స్ కోసం వాడిన కెమెరా వ‌ర్క్‌.. ఇలా ప్ర‌తి చోట త‌న ప‌నిత‌నంతో మెప్పించారు. అవినాష్ ఆర్ట్ వ‌ర్క్‌.. పాత రోజుల్లోకి తీసుకెళ్ళ‌డంలో ప‌రిపూర్ణంగా స‌క్సెస్ అయ్యింది.

సాయిమాధ‌వ్ బుర్రా మాట‌ల్లో 'వ్య‌క్తిత్వం గురించి రాయాలంటే అర్హ‌త ఉండాలి', 'పెద్ద వాళ్ళ‌ని గౌర‌వించాలి.. సావిత్రిలాంటి వారిని పెద్ద‌వాళ్ళు కూడా గౌర‌వించాలి', 'క‌థ ప్రేమ‌లాంటిది - మ‌న‌కు కావాల్సిన‌పుడు దొర‌క‌దు.. దానికి కావాల్సిన‌ప్పుడు వెతుక్కుంటూ వ‌స్తుంది', 'నాట్యం అంటే క్ర‌మ‌శిక్ష‌ణ‌', 'క‌ళ్ళు నాట్యం చేశాయి', 'భాష రాక‌పోతేనేం.. నీ క‌ళ్ళు ఎన్ని భాష‌లైనా మాట్లాడుతాయి', 'ఈ సారి సినిమా సావిత్రిని వెదుక్కుంటూ వ‌చ్చింది', 'మాట‌ల‌కు భాష కావాలి - మ‌న‌సుకు కాదు', 'ప్ర‌తిభ ఇంటిప‌ట్టున ఉంటే ప్ర‌పంచానికి పుట్ట‌గ‌తులు ఉండ‌వు', 'ప్రేమించిన వాడి కోసం అంద‌ర్నీ వ‌దులుకున్నాను.. ప్రేమ కోసం ప్రేమించిన వాడిని వ‌దులుకున్నాను.. ', 'ఆడ‌వాళ్ళు బాధ‌ప‌డితే అంద‌రికి తెలుస్తుంది.. మ‌గ‌వాళ్ళు బాధ‌ప‌డితే మందు బాటిల్‌కే తెలుస్తుంది', 'క‌థ‌ను వెతుక్కుంటూ వెళితే.. చ‌రిత్ర దొరికింది' వంటివి అల‌రిస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్‌
న‌టీన‌టులు
ద‌ర్శ‌క‌త్వం
సంభాష‌ణ‌లు 
సాంకేతిక బృందం
భావోద్వేగాలు
ప‌తాక స‌న్నివేశాలు

మైన‌స్ పాయింట్‌
ద్వితీయార్థంలో.. కాస్త నెమ్మ‌దించిన క‌థ‌నం

చివ‌ర‌గా.. ఓ 'మ‌హాన‌టి' జీవిత ప్ర‌యాణం
రేటింగ్‌: N/A
                                                                                                 -మ‌ల్లిక్ పైడి

 

 'మ‌హాన‌టి'.. ర‌న్ టైమ్‌

Updated By ManamMon, 05/07/2018 - 20:22

mahanatiఅల‌నాటి న‌టి సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం 'మ‌హాన‌టి'. కీర్తి సురేశ్ టైటిల్ రోల్‌లో నటించిన ఈ సినిమాకి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. భారీ తారాగ‌ణంతో తెర‌కెక్కిన ఈ సినిమా ఈ బుధ‌వారం (మే 9న‌) తెర‌పైకి రానుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్ర నిడివికి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేమిటంటే.. ఈ సినిమా 176 నిమిషాల 36 సెకండ్లు అంటే 2 గంట‌ల 56 నిమిషాల 36 సెకండ్లు ఉంటుంద‌ని స‌మాచారం. దాదాపు మూడు గంట‌ల పాటు సాగే ఈ సినిమా.. సావిత్రి జీవితాన్ని ఏ స్థాయిలో ఆవిష్కరిస్తుందో తెలియాలంటే మ‌రో రెండు రోజులు ఆగాల్సిందే.సెన్సార్ పూర్తిచేసుకున్న 'మ‌హాన‌టి'

Updated By ManamFri, 05/04/2018 - 15:55

mahanatiఓ త‌రం జ్ఞాప‌కం.. మ‌హాన‌టి సావిత్రి. ఆమె జీవితం ఆధారంగా తెర‌కెక్కిన సినిమా 'మ‌హాన‌టి'. కీర్తి సురేశ్ టైటిల్ రోల్‌లో న‌టించిన ఈ సినిమాకి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స‌మంత‌, మోహ‌న్ బాబు, నాగ‌చైత‌న్య‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, షాలినీ పాండే, భానుప్రియ‌, దివ్య‌వాణి, ప్ర‌కాశ్ రాజ్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకి మిక్కీ జే మేయ‌ర్ స్వ‌రాలందించారు. నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా.. ఈ నెల 9న తెర‌పైకి రానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్య‌క్ర‌మాలు ఈ రోజు (శుక్ర‌వారం) పూర్త‌య్యాయి. సెన్సార్ క‌మిటీ ఈ చిత్రానికి 'క్లీన్ యు' జారీ చేసింది.'మ‌హాన‌టి' జూక్‌బాక్స్ ఇదిగో..

Updated By ManamTue, 05/01/2018 - 21:20

mahanatiన‌టీమ‌ణి సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం 'మ‌హాన‌టి'. కీర్తి సురేశ్ టైటిల్ రోల్‌లో న‌టించిన ఈ సినిమాకి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స‌మంత‌, మోహ‌న్ బాబు, నాగ‌చైత‌న్య‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ, షాలిని పాండే ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకి మిక్కీ జె.మేయ‌ర్ సంగీత‌మందించారు. కాగా, ఈ సినిమా ఆడియో జూక్‌బాక్స్‌ను ఈ రోజు (మంగ‌ళ‌వారం) ప్ర‌ముఖ ఆడియో కంపెనీ ఆదిత్యా మ్యూజిక్ విడుద‌ల చేసింది. మొత్తం ఐదు పాట‌లున్న ఈ ఆల్బ‌మ్‌లో నాలుగు పాట‌ల‌ను సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి ర‌చించ‌గా.. టైటిల్ సాంగ్‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి ర‌చించారు. సునీత‌, శ్రియా ఘోష‌ల్‌, ర‌మ్యా బెహ‌రా, అనురాగ్ కుల‌క‌ర్ణి, చారుల‌త మ‌ణి ఈ పాట‌ల‌ను గానం చేశారు. కాగా.. ఈ నెల 9న ఈ సినిమా తెర‌పైకి రానుంది.'మ‌హాన‌టి' కొత్త పోస్ట‌ర్ అదిరింది

Updated By ManamThu, 04/26/2018 - 10:12

mahanatiన‌టీమ‌ణి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన‌ బ‌యోపిక్ 'మ‌హాన‌టి'. సావిత్రిగా కీర్తి సురేశ్ క‌నిపించ‌నున్నారు. స‌మంత‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ ఇత‌ర ముఖ్య పాత్ర‌లు పోషించారు. అలాగే.. మోహ‌న్ బాబు, నాగ‌చైత‌న్య‌, ప్ర‌కాశ్ రాజ్‌, క్రిష్‌, త‌రుణ్ భాస్క‌ర్ త‌దిత‌రులు అతిథి పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ ఈ సినిమా మే 9న తెర‌పైకి రానుంది. ఇదిలా ఉంటే.. ఈ రోజు (గురువారం) ఈ సినిమాకి సంబంధించిన ఓ కొత్త పోస్ట‌ర్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఇందులో కీర్తి లుక్ సావిత్రి అభిమానుల‌ను అల‌రించేలా ఉంది. కాగా.. మిక్కీ జే మేయ‌ర్ సంగీత సార‌థ్యంలో రూపొందిన‌ 'స‌దా న‌న్ను' అంటూ సాగే సెకండ్ సింగిల్‌ను ఈ రోజు విడుద‌ల చేయ‌బోతున్నారు.

Related News