polavaram

మేం చేసిన తప్పేంటి: చంద్రబాబు

Updated By ManamSat, 09/29/2018 - 17:19

 

 • పోల ‘వరం’ పూర్తి చేసి తీరుతా

chandrababu naidu in west godavari district

తాడేపల్లిగూడెం : ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోలవరం ప్రాజెక్ట్ ఆగదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇప్పటివరకూ పోలవరం  పనులు 57 శాతం పూర్తయ్యాయని ఆయన తెలిపారు. నదుల అనుసంధానం చేసిన ఘటన దేశంలో ఒక్క టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ప్రత్తిపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన  ‘టీడీపీ ధర్మపోరాట దీక్ష’ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఆర్థికంగా వెనకబడిందని, సాయం చేస్తామన్న కేంద్రం అన్ని విషయాల్లో వివక్ష చూపుతోందని ఆయన విమర్శించారు. తెలుగు జాతి చేసిన తప్పేంటో చెప్పాలని చంద్రబాబు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. 2019లోగా ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. అమరావతిని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని, దేశంలో అన్ని నగరాల కంటే ధీటుగా నిర్మాణం చేస్తామని చంద్రబాబు అన్నారు. ఏపీ రాజధాని నిర్మాణానికి కేవలం పరిమితంగా నిధులు ఇచ్చిన కేంద్రం అదే అహ్మదాబాద్  బుల్లెట్ రైలు కోసం పెద్ద ఎత్తున సాయం చేసిందన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని మాట తప్పారని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా ఎన్డీయే సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

విశాఖ రైల్వే జోన్ విషయంలోనూ కేంద్రం మొండిచేయి చూపించిందన్నారు. కడపలో స్టీల్ ఫ్లాంట్ విషయంలోనూ కేంద్రం మోకాలడ్డుతోందన్నారు. 11 విద్యాసంస్థలు ఇస్తామని, కేవలం తొమ్మిది మాత్రమే పేపర్ మీద పెట్టారని, అరాకొర నిర్మాణం చేసిందన్నారు. ఇవన్నీ పూర్తవ్వాలంటూ ముప్పై ఏళ్లు పడుతుందన్నారు. దుగ్గిరాజుపట్నం పోర్టు విషయంలోనూ మోసం చేశారన్నారు.

ఢిల్లీ, ముంబయి కారిడార్లకు నిధులు ఇచ్చారని, అదే విశాఖకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. చివరికి అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలోనూ అన్యాయం చేశారన్నారు. అలాగే విజయవాడ, విశాఖలో మెట్రో రైలు అంశాన్ని పెండింగ్ లో పెట్టారన్నారు. వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని చంద్రబాబు అన్నారు. భయపెడితే భయపడేది లేదని, తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేకపోయారని ఆయన వ్యాఖ్యానించారు. ఏడాదిలోగా పోలవరం పూర్తి చేస్తాం

Updated By ManamMon, 07/16/2018 - 22:20

babu అమరావతి: ఏడాదిలోగా పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన కృష్ణా నీళ్లు రాకున్నా పట్టిసీమ ద్వారా సాగునీరు ఇస్తున్నామని అన్నారు. మనమేమి కేంద్రానికి బానిసరం కాదని, కేంద్రానికి మనం కూడా ట్యాక్సులు కడుతున్నామని, అభివృద్ధికి సహకరించనందు వల్లే కేంద్రం నుంచి బయటకు వచ్చామని చెప్పారు.

ఈ రోజుతో ప్రభుత్వం ఏర్పడి 1500 రోజులు పూర్తైందని.. ఇంతవరకు చేసిన పనులపై సమీక్షించి ఇంకా ప్రజల అవసరాలను తెలుసుకోవాలని అధికారులకు సూచించారు. వర్షాకాలం పూర్తయ్యేటప్పటికి 3మీటర్లకు భూగర్భజలం చేరాలని, అందుకు తగ్గట్లుగా జల సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఇక రాష్ట్రంలో పడవ ప్రమాదాలు మరో పెద్ద సమస్యగా మారాయని, ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తాజాగా వంశధార వరదలో చిక్కుకున్న కూలీలను రక్షించిన సిబ్బందిని చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు.

పోలవరం ప్రాజెక్టు పనులు 57 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను ఆరు నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలోని 11 గ్రామాల రైతులకు సాగు నీరందించేందుకు నిర్మించిన పోతార్లంక ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి సోమవారం ప్రారంభించారు. పథకం నిర్మాణానికి రూ.50 కోట్లు ఖర్చు చేశారు. ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన 1500 రోజులు పూర్తి అయిన సందర్భంగా దోనేపూడి గ్రామంలో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కృష్ణా నది నీళ్లు రాకపోయినా, పట్టిసీమ ద్వారా రైతులకు సాగునీరు ఇస్తున్నామని, రైతులకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధికి  కేంద్రం సహకరించనందునే ఎన్‌డీయే నుంచి బయటకు వచ్చామన్నారు. రాష్ట్ర ప్రగతి కోసం ఏం చేయడానికైనా సిద్ధమన్నారు. తెలుగు ప్రజలు బీజేపీ బానిసలు కాదని అన్నారు. నిర్లక్ష్య వైఖరితో కేంద్రం నిధులు ఇవ్వకుండా అభివృద్ధిని అడ్డుకుంటుందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కేంద్రానికి పన్నులు కడుతున్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. మన రాష్ట్ర హక్కుల కోసం పోరాడుదామని, పోరాటాన్ని మరింత ఉదృతంగా చేయబోతున్నట్లు తెలిపారు. దేశంలో ఏరాష్ట్రంలో లేని ప్రగతి మన రాష్ట్రంలోనే ఉందని, ఇప్పటికే అన్ని రంగాల్లోనూ దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్న తనకు ప్రజలందరూ అండగా నిలవాలని కోరారు. అభివృద్ధి అంటే టీడీపీ అని తెలుగుదేశం పార్టీతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే ఇదే ప్రభుత్వం కొనసాగాలని, ప్రజలు పూర్తి మద్దతు అందించాలని, అలా కాకుండా ఒక్క ఓటు వేరేవారికి వేసినా రాష్ట్రానికి అన్యాయం చేసినట్లు అవుతుందని చంద్రబాబునాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.పోలవరంపై ఇంకా అభ్యంతరాలు, అనుమానాలు!

Updated By ManamWed, 07/11/2018 - 19:20

Central govt Still Arguments and Doubts On Polavaram project

పోలవరం: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి పోలవరం పనుల పరిశీలనకు ఏపీకి వచ్చారు. ఈ సందర్భంగా ఏపీ  సీఎం చంద్రబాబుతో కలిసి సుమారు అరగంటపాటు పనులను పరిశీలించారు. పనుల పురోగతిని కేంద్రమంత్రికి బాబు వివరించడం జరిగింది. కేంద్ర మంత్రి రాకతో ఓ వైపు టీడీపీ.. మరోవైపు బీజేపీ వేర్వేరుగా వేదికలను ఏర్పాటు చేసి ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 2019 డిసెంబర్ నాటికి డెడ్‌లైన్ పెట్టుకున్నామని  టార్గెట్‌గా పెట్టుకొని పనులు చేస్తున్నామన్నారు. ఫిబ్రవరి నాటికి కాంక్రీట్ పనుల్ని పూర్తిచేస్తామన్నారు. మెజార్టీ పనులన్నీ ఏప్రిల్ కల్లా పూర్తి చేసేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. డీపీఆర్-2ను కూడా వీలైనంత త్వరగా క్లియర్ చేయాలని కేంద్రాన్ని ఈ సందర్భంగా బాబు కోరారు. 2013 చట్టం ప్రకారం ఖర్చు అంచనాలు పెరిగాయన్నారు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరానికి రూ. 57,940 కోట్లు అవసరమని కేంద్రమంత్రికి బాబు వివరించారు. భూ సేకరణకు రూ. 33వేల కోట్లు అవసరమన్నారు. పెండింగ్‌లో ఉన్న నిధులన్ని విడుదల చేయాలని ఈ సందర్భంగా బాబు కేంద్ర మంత్రికి వివరించారు. కాగా బాబు మాట్లాడుతున్నంత సేపు గడ్కరీ తథేకంగా ఆయనవైపే చూడసాగారు.

నితిన్ గడ్కరీ మాట్లాడుతూ..
"
పోలవరం ఏపీకే కాదు దేశానికి కీలకమైన ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్టు రైతులకు కొత్త జీవితాన్నిస్తుంది. పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉంది. ప్రాజెక్టు పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. పోలవరం ఏపీకే కాదు.. దేశానికి కీలకమైన ప్రాజెక్ట్. పనులు పూర్తి చేసేందుకు నిధుల్ని అడ్వాన్స్‌గా చెల్లించాలని సీఎం కోరారు. పోలవరం పూర్తి చేయడానికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారు. ప్రాజెక్ట్ ఏపీకి కొత్త జీవితాన్నిస్తుంది.

త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను కోరాము. భూసేకరణ, పరిహారం కోసం నిధులు చెల్లించాలంటే ఫైనాన్స్ కమిషన్ అనుమతి కావలి. పోలవరం భూసేకరణ ఖర్చు దాదాపు రెట్టింపు అయింది. పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రాజెక్ట్ వేరు.. రాజకీయాలు వేరు. ప్రాజెక్టును పూర్తి చేసే విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావు లేదు. ముందుగా గిరిజనులకు పరిహారం విషయాన్ని సెటిల్ చేయాల్సి ఉంది. కేంద్ర, రాష్ట్ర అధికారులు మూడు రోజుల పాటు ఇక్కడే మకాం వేసి సమస్యలను పరిష్కరించాలని సూచించాను. పెరిగిన ప్రాజెక్టు అంచనాను ఆర్థిక శాఖకు పంపిస్తాము. నీటి సదుపాయం ఉంటే ఎంతమేలు జరుగుతుందో నాకు తెలుసు" అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.

మొత్తానికి చూస్తే.. పోలవరం విషయంలో కేంద్రం ఎలాంటి హామీలివ్వకపోగా కొర్రీలు పెట్టడం గమనార్హం. తాజా డీపీఆర్‌పై అభ్యంతరాలు, అనుమానాలు కేంద్రం వ్యక్తం చేయడమేంటో అర్థం కాని పరిస్థితి. కనీసం అడ్వాన్స్ ఇచ్చేందుకు కూడా కేంద్రం ముందుకురాకపోవడం విచిత్రం. ఇవన్నీ అటుంచితే పునరావసంపై కూడా గడ్కరీ అనుమానాలు వ్యక్తం చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్యాకేజీ భారం పెరిగిందని సీఎం చంద్రబాబు కేంద్రానికి విన్నవించుకున్నా ఎలాంటి ఫలితం లేకపోయిందన్నది స్పష్టంగా అర్థమవుతోంది. పెరిగిన ప్యాకేజీతో పాటు సేకరించిన భూమి కూడా పెరుగుతోందని గడ్కరీ.. సీఎం బాబునే నిలదీయడాన్ని పలువురు విశ్లేషకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.11న కేంద్రమంత్రి గడ్కరీ పోలవరం సందర్శన

Updated By ManamSat, 07/07/2018 - 01:06
 • పోలవరం సందర్శించనున్న కేంద్ర మంత్రి

 • త్వరలో పురుషోత్తపట్నం రెండో దశకు నీరు

 • ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి శంకుస్థాపన

 • పాల్గొననున్న చంద్రబాబు: దేవినేని ఉమా

umaవిజయవాడ: రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ నాయకులు వివిధ పార్టీల్లో చేరి అభివృద్ధికి ఆటంకంగా మారారని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శక్రవారం స్థానిక జలవనరుల శాఖ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 11 న కేంద్ర మంత్రి గడ్కరీ పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వస్తున్నారని తెలిపారు. గోదావరి నదికి ఇప్పటి వరకు 43.4 టీఎంసీల నీళ్లు వచ్చాయని, అందులో పట్టిసీమ లిఫ్ట్ ద్వారా 7.5 టీఎంసీల నీటిని విడుదల చేసినట్టు వెల్లడించారు. గోదావరి రైతులు గత నాలుగేళ్లుగా ఖరీఫ్, రబీ సీజన్‌లలో పంటలను వేస్తూ, నిరుడు మూడో పంటను పండించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో దూరదృష్టితో సీలేరు, బలిమెల ముంపు మండలాలను మన ప్రాంతాలలో కలపడంతో పోలవరం ప్రాజెక్టు కల సాకారం అవుతోందని చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంత చేస్తుంటే వైసీపీ, కాంగ్రెస్ నాయకులు రాళ్లు వేసే కార్యక్రమం చేపడుతున్నారన్నారు. దశాబ్దకాలంగా కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాన్ని పాలించి, చివరికి విడదీసి ఇప్పుడు వేరే పార్టీలలో చేరి మాట్లాడుతున్నారన్నారు.

త్వరలోనే పురుషోత్తపట్నం రెండో దశకు ముఖ్యమంత్రి నీటిని విడుదల చేయనున్నట్టు తెలిపారు. ప్రకాశం బ్యారేజ్‌కి 23 కిలోమీటర్లు ఎగువన వైకుంఠపురం వద్ద రూ. 2,169 కోట్ల రూపాయలతో బ్యారేజ్ నిర్మిస్తున్నామని తెలిపారు. ఇందులో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద 772 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. రాష్ట్ర ఇరిగేషన్ చరిత్రలో పట్టిసీమకు ముందు తర్వాత కాలం అని చరిత్రలో లిఖితమవుతుందని, ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టును 33,500 మంది రైతులు సందర్శించారన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో శంకుస్థాపన చేయించనున్నట్టు మంత్రి దేవినేని ఉమా తెలిపారు. ప్రేమోన్మాది ఘాతుకం.. వేరొకరితో వివాహానికి ఒప్పుకుందని

Updated By ManamWed, 06/20/2018 - 10:44

murder రాజమండ్రి: పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తాను ప్రేమించిన అమ్మాయి వేరొకరితో వివాహానికి ఒప్పుకుందని ఆమెను నరికి చంపి, తరువాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా పోలవరం గ్రామం కమ్మరగూడెంకు చెందిన లహరిని కిరణ్ అనే ఆటో డ్రైవర్ గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దానిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతడిని మందలించిన పోలీసులు ఇంకెప్పుడు లహరి జోలికి రానని హామీపత్రం రాయించారు. దాంతో లహరిపై కక్ష పెంచుకున్నాడు కిరణ్.

కాగా లహరి మూడు నెలల నుంచి సురేశ్ అనే వ్యక్తిని ప్రేమిస్తుండగా.. వారిద్దరి పెళ్లికి ఇంట్లో వాళ్లు కూడా ఒప్పుకోవడంతో బుధవారం వివాహం చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కిరణ్ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పోలవరం వచ్చి లహరిని కత్తితో నరికి చంపాడు.

 ఆమె మెడపై, చేతులపై కత్తితో దాడి చేశాడు. ఆ క్రమంలో అడ్డువచ్చిన సురేశ్ తమ్ముడు సతీశ్‌పై కూడా కత్తితో దాడి చేశాడు కిరణ్. అనంతరం ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన కిరణ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కిరణ్ దాడిలో గాయపడ్డ సతీశ్‌కు ప్రస్తుతం రాజమండ్రిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభిస్తున్నారు.పోలవరం పనులపై ఎక్స్‌పర్ట్ కమిటీ నివేదిక

Updated By ManamFri, 03/23/2018 - 12:21

Polavaramఅమరావతి: ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలించిన ఎక్స్‌పర్ట్ కమిటీ, పనులపై నివేదికను ఇచ్చింది. అందులో పోలవరం పనులు బాగా జరుగుతున్నాయని చెప్పిన ఈ కమిటీ.. స్పిల్ వే, స్పిల్ చానల్ పనులు వేగం పుంజుకున్నాయని తెలిపాయి. స్పిల్ వే కాంక్రీట్ పనులు 17వందల నుంచి 3వేల క్యూబిక్ మీటర్లకు చేరాయని వివరించింది.అలాగే 74శాతం డయా ఫ్రంవాల్, కాఫర్ డ్యామ్ పనుల్లో పురోగతి ఉందని తెలిపింది. ఇక నవయుగ చేపట్టిన పనులు కూడా సంతృప్తిగా ఉన్నాయంటూ ఎక్సపర్ట్ టీం నివేదకను ఇచ్చింది.


 బాబూ.. నిజాలు చెప్పండి!

Updated By ManamWed, 03/21/2018 - 12:01

Undavalli Arun Kumar Firing Questions to CM Chandrababu

అమరావతి: పోలవరం ప్రాజెక్టు మొదలుపెట్టినరోజు నుంచి పట్టిసీమ టేకప్ చేసిన వరకూ ప్రభుత్వం అన్నీ అబద్ధాలే చెబుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలవరంపై బాబు రోజుకోమాట మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం  చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకే పోలవరం ప్రాజెక్టు పనులు ఇచ్చారని చెప్పుకొచ్చారు. 

" నేను పలుమార్లు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడాను. ఆఖరికి ఆఫీసర్లు లేఖలు కూడా రాశాను ఇంతవరకూ రిప్లైలు రాలేదు. ఐదుపేజీలతో కూడిన లేఖరాస్తే ఇంత వరకూ ఎవ్వరూ సమాధానమివ్వలేదు. చంద్రబాబు అడిగారు గనుకే కేంద్రం ప్రాజెక్టు పనులు అప్పగించింది.. కానీ ఇవాళ గడ్కరీ ఇచ్చారని సీఎం అబద్దాలు చెబుతున్నారు.  రాష్ట్రప్రభుత్వం అభ్యర్థన మేరకే పోలవరం ప్రాజెక్టు ఇచ్చారు. మేము అడగలేదని చంద్రబాబు చెప్పడం దారుణం. పోలవరంపై మొదట్నుంచి చంద్రబాబు లాలూచీనే. పట్టిసీమ ప్రారంభించగానే మీ వ్యవహారం బయటపడింది. పోలవరంపై మీ వైఖరిని ఎప్పటికప్పుడు ప్రశ్నించాం. కేంద్రం చేపడితేనే పూర్తవుతుందని పోలవరం అథారిటీ చెప్పింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత మీరెందుకు చేపట్టారు.?.. పనులు చేస్తామని చెప్పి ఇప్పుడు చేతులెత్తేస్తారా!. 2016 వరకు పనులే ప్రారంభించలేదు. పట్టిసీమ మొదలుపెట్టిన తర్వాత పోలవరం పనులు చేపట్టారు. పది మంది కూలీలు, రెండు డంపర్లతో పోలవరం పూర్తవుతుందా?. ప్రజలను ఇంకా ఎన్నిరోజులు మభ్యపెడతారు?. పోలవరం వైఫల్యానికి టీడీపీ, బీజేపీలదే ఉమ్మడి బాధ్యత. పోలవరంపై ఇప్పటికైనా చంద్రబాబు నిజం చెప్పాలి" అని ఉండవల్లి డిమాండ్ చేశారు.బిరబిర.. చకచక!

Updated By ManamFri, 02/16/2018 - 09:19

polavaram works speed up

 • హైస్పీడ్‌గా పోలవరం పనులు.. 

 • ఇప్పటికే 53 శాతం పూర్తి

 • వేసవిలో డయాఫ్రం వాల్ సిద్ధం

 • జూలైకి 60% కాంక్రీటు పనులు

 • 2019 నాటికి గ్రావిటీ ద్వారా నీరు..

 • 2018లో నీళ్లు ఇవ్వడం కష్టమే

 • లెక్కలు రూపొందించిన అధికారులు

అవురావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి.. లక్షల ఎకరాలకు సాగునీరు, వేల గ్రామాలకు తాగునీటితో పాటు విద్యుత్ ఉత్పత్తిలో కూడా కీలకపాత్ర పోషించే పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూలైలో గోదావరికి వరద ప్రవాహం ప్రారంభమయ్యే నాటికి దాదాపు 70 శాతానికి పైగా పనులు పూర్తిచేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందు కోసం ప్రస్తుతం పనిచేస్తున్న భారీ మట్టి తవ్వకం యంత్రాలు, కాంక్రీటు యంత్రాలకు తోడుగా ఏప్రిల్‌లో అదనపు యంత్రాలు రానున్నాయి. మరో రూ. 3000 కోట్లు ఖర్చు చేస్తే 2019 నాటికి స్పిల్‌వే ద్వారా వరద ప్రవాహాన్ని మళ్లించొచ్చని లెక్కలు రూపొందించారు. 

ఈ ఏడాది జూన్ ఆఖరుకు మట్టి పనులు, డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తిచేయుడంతో పాటు, దాదాపు 6 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు కూడా పూర్తి చేయునున్నారు. 2019 ఎన్నికల నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి కాలువలకు నీటిని విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే సోవువారం ప్రాజెక్టును స్వయంగా సందర్శించనున్నారు. ఈ సందర్భంగా జరగాల్సిన పనులపై అధికారులు, కాంట్రాక్టర్లకు ఆయన దిశానిర్దేశం చేయునున్నారు.

2018 జూన్ నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం నీళ్లు అందిస్తామని ముఖ్యమంత్రి పలు సందర్భాలలో చెప్పారు. కానీ.. అది సాధ్యమయ్యే లక్షణాలు లేవు. జూన్ నాటికి మట్టి తవ్వకాలు పనులు, కాంక్రీటు లైనింగ్ పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌండింగ్ పనులు వేగంగానే జరుగుతున్నాయి. అయినా ప్రధాన డ్యాం నిర్మాణ పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదు. ఇది పూర్తయితేనే గ్రావిటీ ద్వారా కాలువలకు నీరివ్వచ్చు. దీని నిర్మాణం 2019లో పూర్తవుతుందని అధికారుల అంచనా. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో 2018లో నీళ్లివ్వడం మాత్రం కుదరని పనే. 

స్పిల్ చానల్..
జూన్ చివరి నాటికి స్పిల్ చానల్ మట్టి తవ్వకం పనులు పూర్తి చేయునున్నారు. స్పిల్ చానల్ కాంక్రీట్ బ్లాక్‌ల నిర్మాణానికి ఏజెన్సీ ద్వారా డిజైన్లు సవుర్పించారు. కాంక్రీటు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. 2019 మార్చి నాటికి స్పిల్ చానల్ కాంక్రీటు పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. 2019 జూన్ నాటికి స్పిల్ చానల్ బ్రిడ్జి పనులు పూర్తిచేయునున్నారు.

స్టిల్లింగ్ బేసిన్..
స్పిల్‌వే స్టిల్లింగ్ బేసిన్‌లో 4.44 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులకు గాను.. ఫిబ్రవరి 12 నాటికి 1.26 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తయ్యాయి. 2019 మార్చి నాటికి స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీటు పనులు కూడా పూర్తి చేయునున్నారు.

కుడి, ఎడమ కాలువలు..
ఇప్పటివరకు కుడి కాలువ తవ్వకం పనులు 91 శాతం, ఎడమ కాలువ తవ్వకం పనులు 60 శాతం పూర్తయ్యాయి. ఎడమ కాలువ కాంక్రీట్ లైనింగ్ పనులు 14.63 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను 9.821 లక్షల క్యూబిక్ మీటర్లు పూర్తయ్యాయి. కుడి కాలువ కాంక్రీటు లైనింగ్ పనులు 18.697 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను 15.853 లక్షల క్యూబిక్ మీటర్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది జూన్ కల్లా మట్టి తవ్వకం, కాంక్రీటు లైనింగ్ పనులు పూర్తిచేయాలని చూస్తున్నారు.

డయాఫ్రం వాల్..
నది మధ్యలో దాదాపు 300 అడుగుల లోతులో కడుతున్న డయాఫ్రం వాల్ నిర్మాణం 68 శాతం పూర్తయింది. ఈ ఏడాది జూన్ నాటికి దీనిపి పూర్తిచేయాలని యోచిస్తున్నారు. డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ ఏడాది నవంబర్‌లో ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం ప్రారంభించనున్నారు. 

కాఫర్ డ్యామ్..
కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌండింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. దాదాపు 78 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది నవంబర్‌లో డ్యాం నిర్మాణ పనులు చేపట్టి 2019 నాటికి పూర్తిచేయనున్నారు.

రేడియల్ గేట్ల నిర్మాణం
రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఒక గేటును పూర్తిస్థాయిలో సిద్ధం చేశారు. ఈ ఏడాది చివరి నాటికి మరిన్ని గేట్లను సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. స్పిల్ వే..ఫిబ్రవరి 12 నాటికే స్పిల్ వే మట్టి పనులు 100 శాతం పూర్తయ్యాయి. 11.95 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులకు గాను 3.75 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తయ్యాయి. ఈ వేసవిలో దాదాపు 5 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు చేయాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి స్పిల్‌వే కాంక్రీటు పనులు పూర్తి చేయనున్నారు.

     ఈ ఏడాది అక్టోబర్‌లో స్పిల్ వే బ్రిడ్జి ప్రారంభించి 2019 నాటికి పూర్తిచేయనున్నారు. స్పిల్‌వేకు ముందున్న అప్రోచ్ చానల్‌లో 101.48 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది జూన్ నాటికి వాటిని కూడా పూర్తి చేయునున్నారు. స్పిల్ చానల్ తర్వాత ఉన్న పైలట్ చానల్‌లో మిగిలిన 71 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులను ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించారు.మళ్లీ నిలిచిన పోలవరం పనులు

Updated By ManamThu, 01/11/2018 - 11:36

Polavaramఅమరావతి: ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం ప్రాజెక్ట్ పనులు మళ్లీ నిలిచిపోయాయి. రెండు, మూడు నెలలుగా కాంట్రాక్ట్ సంస్థ ట్రాన్స్ ట్రాయ్ తమకు జీతాలు ఇవ్వడం లేదని సిబ్బంది విధులు బహిష్కరించారు. బుధవారం నుంచి కార్మికులు, ఉద్యోగులు నిరసనను తెలుపుతుండగా.. కాంక్రీట్ పనులు ఆగిపోయాయి.  200మందికి పైగా డ్రైవర్లు, ఆపరేటర్లు, సూపర్‌వైజర్లు ఈ ఆందోళన చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు వెళ్లే దారిలో రాళ్లు, టైర్లు పెట్టి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నా ఇరిగేషన్, కార్మిక శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం కాఫర్ డ్యామ్‌పై రేగిన వివాదం సద్దుమణిగింది అనుకునే లోపే ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చి పడినట్లైంది.పోలవరంపై కుట్ర

Updated By ManamMon, 01/08/2018 - 19:13

babuపోలవరం ప్రాజెక్ట్‌ను అడ్డుకునేందుకు కాంగ్రెస్, వైసీపీ కుట్రపన్నాయని సీఎం చంద్రబాబు విమర్శించారు. మంత్రి దేవినేని ఉమ, అధికారులతో కలిసి చంద్రబాబు పోలవరం పనులను పరిశీలించారు. రాష్ట్రంలో నదులు అనుసంధానం చేపట్టి సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. గోదావరి, పెన్నా, నాగావళి, వంశధార నదులు అనుసంధానం అయితే రాష్ట్రానికి సాగు, తాగునీటి కొరత తీరడమే కాకుండా పరిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రజలను రెచ్చగొట్టేందుకే కాంగ్రెస్‌ పాదయాత్ర చేపట్టిందని ఆరోపించారు. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద పనులు వేగం పుంజుకున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.

Related News