FIFA World Cup 2018

లైంగిక వేధింపులుంటే... ఫిర్యాదు చేయండి

Updated By ManamThu, 07/19/2018 - 01:13
  • మహిళలకు పారిస్ పోలీసుల విజ్ఞప్తి  

imageపారిస్: వరల్డ్ కప్ గెలుపు సంబరాల్లో భాగంగా ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడివుంటే ఫిర్యాదు చేయాల్సిందిగా పారిస్ మహిళలను స్థానిక పోలీసులు బుధవారం కోరారు. చాలా మంది పాల్పడినట్టు ఇటీవల సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ అవుతున్నాయి. ‘ఇటువంటి సంఘటనలను మా దృష్టికి తెస్తే విచారణ జరిపి నిజాలు తేలుస్తాం. ఆ వ్యక్తిని మేము గుర్తించ గలిగితే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం’ పోలీస్ చీఫ్ మైఖెల్ డెల్పెచ్ అన్నారు.

ఆదివారం రాత్రి క్రొయేషియాతో జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్ గెలిచిన తర్వాత కొంత మంది యువకులు మహిళలను బలవంతంగా ముద్దు పెట్టుకోవడం, అసభ్యంగా ప్రవర్తించడం వంటి సంఘటనలు జరిగినట్టు పోలీసులకు నివేదిక అందింది. అంతేకాకుండా సోమవారం విజేత జట్టుతో జరిగిన పెరేడ్ ర్యాలీలో కొంత మంది లైంగికంగా వేధించినట్టు కూడా తెలుస్తోంది. ‘నాక్కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది. బహుశా మూడో గోల్ సమయంలో అనుకుంటా నా స్కర్ట్‌ను ఎవరో తాకినట్టు అనిపించింది’ అని ఇశా అనే మహిళ పోస్ట్ చేసింది. అయితే ఇతర బాధితులు మాత్రం పోలీసుల మాటలు నమ్మడం లేదు. తాము కేసులు పెట్టినా పోలీసులు విచారణ జరుపుతారన్న నమ్మకం లేదని.. ఆ వ్యక్తులు వేగంగా జనాల్లో కలిసిపోయారని ఆ బాధితులు అంటున్నారు. సాకర్ సామ్రాట్

Updated By ManamTue, 07/17/2018 - 01:03

నెలరోజులకు పైగా యావత్ ప్రపంచాన్ని ఆవహించిన సాకర్ ఫీవర్ ప్రపంచ కప్‌ను  ఫ్రాన్స్  కైవసం చేసుకోవడంతో ముగిసింది. 1998 ఫిఫా చాంపియన్‌గా నిలిచిన ఫ్రాన్స్ రెండు దశాబ్దాల తర్వాత 2018లో మళ్ళీ సాకర్ సామ్రాట్‌గా అవ తరించింది. ఈసారి రష్యాలో జూన్ 14 నుంచి జూలై 15 వరకు జరిగిన ఫిఫా (ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్‌బాల్ అసోసియేషన్) 2018 ప్రపంచ కప్‌లో అద్భుతాలు చోటు చేసుకున్నాయి. సాకర్‌లో అగ్రగామిగా కొనసాగుతూ వచ్చిన లాటిన్ (దక్షిణ) అమెరికా దేశాలేవీ ఈసారి సెమీ ఫైనల్స్ దాకా కూడా రాలేకపో గా, యూరప్ దేశాలు అద్భుతంగా రాణించాయి. ఫిఫా పుట్టిల్లు అయిన ఫ్రాన్స్ కు, 1992లో ఫిఫా సభ్యురాలుగా చేరి, సాకర్‌లో పసికూన దిగ్గజాలతో పోరాడి నెగ్గుకొచ్చిన క్రొయేషియాకు మధ్య ఫైనల్స్ అత్యంత వినోదభరితంగా, మహా ఉత్కంఠభరితంగా సాగింది. సొంతగడ్డ మీద 1998 ఫిఫా సెమీఫైనల్స్‌లో మొట్ట మొదటసారి సాకర్ ప్రపంచకప్ పోటీల్లో పాల్గొన్న క్రొయేషియాను ఓడించి తర్వా త 2018 ఫైనల్స్‌లో మళ్ళీ తలపడిన ఫ్రాన్స్ ప్రపంచ విజేతగా నిలిచింది.
 

image


బంతి ఎక్కువ సేపు క్రొయేషియా చేతిలో ఉన్నా, చివరికి 4-2తో విజయం ఫ్రాన్స్‌నే వరించింది. మ్యాచ్ ప్రారంభం నుంచే తడబడుతూ వచ్చిన క్రొయేషియా ఆట గాళ్ళు అనవసరపు తప్పిదాలకు తగిన మూల్యం చెల్లించుకున్నారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ ప్రపంచ కప్ ఫైనల్స్‌లోనే అత్యధికంగా ఆరు గోల్స్ నమోదు అయ్యాయి. గత నాలుగు ప్రపంచకప్‌ల్లోనూ (2002-14) ఫైనల్స్‌లో ఇన్ని గోల్స్ నమోదు కాకపోవడం ఒక రికార్డు. 1966లో అదనపు సమయం తర్వాత పశ్చిమ జర్మనీని ఇంగ్లాండ్ 4-2 తోను, 60 ఏళ్ళ క్రితం స్వీడన్‌ను బ్రెజిల్ 5-7 స్కోర్‌తో ఓడించిన తర్వాత కాలంలో జరిగిన ఫిఫా పోటీల్లో అతిపెద్ద స్కోరు మళ్ళీ ఈసారి నమోదు కావడం విశేషం.

ఫుట్‌బాల్‌లో శైలి కంటే వ్యవహారిక సత్తావాదం (ప్రాగ్మటిజం) విజయాన్ని చేకూరుస్తుందనడం కద్దు. ఆధునిక ఫుట్‌బాల్‌లో ఇది నిజమేననిపిస్తోంది. సంప్ర దాయ ప్రతిపక్షాలను చిత్తు చేసేందుకు ఫుట్‌బాల్ టీంలు విభిన్నమైన శైలిని ప్రయ త్నించవలసి వస్తోంది. శక్తిమంతమైన అభిమానులు, మీడియా ప్రచారం, కోలా హలంతో ప్రతిఘాతుకంగా పోరాడే ఫ్రెంచ్ టీంతో తలపడడం అంతమాత్రంగా శిక్షణగల క్రొయేషియా టీంలకు అసాధ్యం. క్రొయేషియా ఆట శైలికి అడగడుగునా చెక్ పెడుతూ ఫ్రెంచ్ టీం ఆట సాగింది. ఆట ప్రారంభం నుంచి ఫ్రాన్స్ దూకుడు గా ఆడటంతో క్రొయేషియా ఒత్తిడిలో ఆ చిత్తయి ఫ్రాన్స్‌కు తొలి గోల్‌ను అందిం చింది.

క్రొయేషియా ఫార్వర్డ్ ప్లేయర్ సెల్ఫ్ గోల్ చేయడంతో ఫ్రాన్స్ ఖాతాలో తొలిగోల్ నమోదైంది. అనంతరం క్రొయేషియా ఫార్వర్డ్ ప్లేయర్ పెరిసిచ్ 28వ ని మిషంలో గోల్ చేసి 1-1ని సాధించాడు. ఆట 38వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ రూపంలో వచ్చిన అవకాశాన్ని ఫ్రాన్స్ సరిగా ఉపయోగించుకోగలిగింది. ద్వితీ యార్థంలో ధాటిగా ఆడిన ఫ్రాన్స్, క్రొయేషియా డిఫెన్స్ వలయాన్ని ఛేదించు కుంటూ గోల్ పోస్ట్‌లపై దాడి చేసింది. 59వ నిమిషంలో ఒకటి, 65వ నిమిషంలో మరొకటి ఫ్రాన్స్ విజయవంతంగా గోల్స్ చేయగలిగింది. ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు విజృంభించినప్పటికీ, ఫ్రాన్స్ దూకుడుకు అడ్డుకట్టవేస్తూ 69వ నిమిషంలో క్రొయే షియా గోల్‌చేసి ఓటమి అంతరాన్ని తగ్గించుకోగలిగింది. ఆట ముగిసేదాకా ఎవ రూ గోల్ చేయలేకపోవడంతో ఫ్రాన్స్ విశ్వవిజేతగా నిలిచింది. క్రొయేషియా ఆట గాళ్ళ స్ఫూర్తి సాకర్ ప్రపంచ కప్ పోటీలన్నిటిలో ఏనాడూ చెదరకపోవడమే కాక, ప్రత్యర్థులపై నిరంతరాయంగా ఆటలో ఒత్తిడి పెంచడం ద్వారా ఫైనల్స్‌కు చేరుకో గలిగింది. అయితే ప్రత్యర్థుల శైలిని అనుక్షణం గుర్తిస్తూ, దానికి తగినట్లుగా వేగం గా ఆట తీరును మార్చుకునే అనువర్తన యోగ్యత కలిగి ఉండడం వలన ఫ్రాన్స్ ప్రపంచకప్ విజేతగా నిలిచింది.

ఇండియా ఇప్పటివరకూ ప్రపంచకప్‌లో ఆడనేలేదు. మయన్మార్, ఇండోనేసి యా, ఫిలిప్పైన్స్ దేశాలు బ్రెజిల్ ప్రపంచ కప్ అర్హత పోటీ నుంచి విరమించు కోవడం వల్ల 1950లో భారత్‌కు ఆ అవకాశం దక్కింది. అయితే చివరి నిమి షంలో బ్రెజిల్‌కు ఫుట్‌బాల్ టీంను పంపించేందుకు ఖర్చు ఎక్కువవుతుందని టో ర్నమెంట్‌కు హాజరు కాకుండా ఇండియా విరమించుకోవడం విడ్డూరం. మరొక కారణమేమంటే బ్రెజిల్ టోర్నమెంట్‌లో షూలు వేసుకోకుండా ఉత్త కాళ్ళతో ఆడేం దుకు భారత టీంను ఫిఫా అంగీకరించకపోవడమే కాకుండా, ఫుట్‌బాల్ ప్రపంచ కప్ కంటే ఒలింపిక్స్‌లో ఆడడమే ప్రతిష్టాత్మకమని ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడ రేషన్ భావించడం. 1954 నుంచి 1982 దాకా ఫిఫా అర్హత పోటీల్లో భారత జట్టు పాల్గొనలేదు. ఆ తర్వాత పాల్గొన్నప్పటికీ క్వాలిఫై కాలేదు.

 1948 లండన్ ఒలిం పిక్స్‌లో, 1952 హెల్సింకీ ఒలింపిక్స్‌లో, 1956లో మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో భారత్ పాల్గొనింది. రోవర్స్ కప్, డ్యూరాండ్ కప్, నిజాం గోల్డ్ కప్ లాంటి ప్రతిష్టాత్మక కప్‌లు మనదేశంలో ఫుట్‌బాల్ ఆటకు ప్రసిద్ధి. రహీంలీగ్, డివిజన్ లీగ్ అని హైద రాబాద్‌లో ఫుట్‌బాల్ పోటీలు జరిగేవి. కానీ తెలుగు రాష్ట్రాలు ఫుట్‌బాల్ పోటీలు నిర్వహించి ప్రోత్సహించేందుకు సుముఖంగా లేకపోవడం దురదృష్టకరం. కామన్ వెల్త్ దేశాల్లో అత్యంత ప్రాచుర్యం ఉన్న క్రికెట్‌తోపాటు ప్రపంచమంతా ఆసక్తి చూపించే ఫుట్‌బాల్‌ను ప్రోత్సహించడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. నాలుగేళ్ళకొకసారి జరిగే ఫిఫా టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు దేశ యువతను ప్రోత్సహించి, కనీసం 2022లో ఖతర్‌లో జరగబోయే పోటీలలో కనీసం అర్హత సంపాదించేందుకైనా భారత్ కృషిచేయాలి. మరో చరిత్రకు ముందడుగు

Updated By ManamWed, 07/11/2018 - 23:30
  • ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ఫైనల్లో ఫ్రాన్స్

  • పన్నెండేళ్ల తర్వాత తొలిసారి

ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో ఫ్రాన్స్ జట్టు సంచలనం సృష్టించింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత తుది పోరుకు సిద్ధమైంది. 2006లో జర్మనీలో జరిగిన మెగా ఈవెంట్‌లో జిదానే నేతృత్వంలోని ఫ్రాన్స్ ఫైనల్‌కు చేరుకుంది. ఆ తర్వాత మళ్లీ ఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. యూరప్‌కే చెందిన మరో జట్టు బెల్జియం నిరాశతో వెనుదిరిగింది. 

imageసెయింట్ పీటర్స్‌బర్గ్: సెంటర్ బ్యాక్ ఆటగాడు సామ్యూల్ ఉవ్‌ుటిటి అద్భుతమైన హెడింగ్ చేయడం, గోల్ కీపర్ హ్యుగో లోరిస్ అనేకసార్లు జట్టును కాపాడటంతో వెరసి ఫిఫా వరల్డ్ కప్‌లో ఫ్రాన్స్ జట్టు సంచలనం సృష్టించింది. మంగళవారం అర్ధ రాత్రి జరిగిన సెమీఫైనల్లో ఫ్రాన్స్ 1-0తో బెల్జియంను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. దీంతో ‘గోల్డెన్ జెనరేషన్’ బెల్జియం జట్టు తీవ్ర నిరాశతో వెనుదిరిగింది. 2016 యూరో కప్ ఫైనల్లో ఓటమిపాలుకావడంతో బాధపడిన ఫ్రెంచ్ అభిమానులను ఆదివారం జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్లో గెలిచి ఓదార్చేందుకు ఫ్రాన్స్ జట్టు సిద్ధమైంది. తొలి అర్ధ భాగంలో ఇరు జట్లూ గోల్స్ చేయలేకపోయాయి. అయితే రెండో అర్ధ భాగం ప్రారంభమైన ఆరో నిమిషంలో ఫ్రాన్స్‌కు కార్నర్ లభించింది. గ్రీజ్‌మన్ కొట్టిన ఈ కార్నర్ షాట్‌ను ఉవ్‌ుటిటి సరైన సమయానికి అందుకుని హెడింగ్ చేశాడు. 

దీంతో ఫ్రాన్స్‌కు గోల్ లభించింది. ఈ ఊహించని పరిణామానికి షాక్ తిన్న బెల్జియం మరింత దూకుడుగా ఆడింది. బెల్జియం కొట్టిన గోల్ టార్గెట్ షాట్స్‌ను ఫ్రాన్స్ గోల్ కీపర్ హ్యుగో లోరిస్ అనేకసార్లు అడ్డుకున్నాడు. బెల్జియంకు చెందిన కెవిన్ డి బ్రుయిన్, ఫ్రాన్స్‌కు చెందిన కైలియన్ ఎంబప్పే మధ్య హోరా హోరీ పోరు కొనసాగింది. ఒకరినొకరు సవాల్ చేసుకున్నారు. కానీ ఫుట్‌బాల్ చరిత్రలో తానెందుకు అత్యంత విలువైన ఆటగాడో ఎంబప్పే మరోసారి నిరూపించాడు. ఎంబప్పే బెల్జియం ఆటగాడు జాన్ వెర్టాంఘెన్‌ను తప్పించి బంతిని గ్రీజ్‌మన్‌కు అందించాడు. కానీ చివరి సెకన్లలో గ్రీజ్‌మన్ ప్రయత్నాని విన్సెంట్ అడ్డుకున్నాడు. 12వ నిమిషంలో ఎంబప్పే చేతిలో నుంచి వెర్టాంఘెన్‌ను సేవ్ చేసేందుకు బెల్జియం గోల్ కీపర్ థైబాట్ కోర్టొయిస్ తన గోల్ బాక్స్‌ను వదిలి ముందుకు పరుగెత్తాడు. ఆ సమయంలో బెల్జియం అద్భుతంగా ఆడుతోంది. ఈడెన్ హజార్డ్ కొట్టిన షాట్ గోల్ బాక్స్‌కు కొద్ది దూరంలో వెళ్లింది. మరోసారి ఈ చెల్సీ ఫార్వర్డ్ ప్రయత్నం వృథా అయింది. హజార్డ్ కొట్టిన షాట్‌కు రాఫెల్ వరనె హెడింగ్ చేశాడు. కానీ అదికూడా ఫ్రాన్స్ గోల్ బాక్స్‌కు దూరంగా వెళ్లింది. ఇరు జట్ల గోల్ కీపర్లు క్వార్టర్ ఫైనల్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు సెమీఫైనల్ మ్యాచ్‌లో తొలి అర్ధ భాగంలో ఒక్క గోల్ కూడా కాకుండా అద్భుత ప్రతిభ కనబరిచారు. 

పారిస్‌లో మిన్నంటిన సంబరాలు
imageఫ్రాన్స్ జట్టు ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌కు వెళ్లడంతో పారిస్‌లో ఆ దేశ జాతీయ గీతం మార్మోగింది. కార్ల హారన్లు, టపాకాయల శబ్దాలతో పారిస్ వీధులు దద్దరిల్లాయి. ఈ విజయాన్ని పారిస్‌లోని ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఫ్రాన్స్, బెల్జియం మధ్య జరిగిన మ్యాచ్‌ను పారిస్ చారిత్రాత్మక హోటల్ డి విల్లే లేదా టౌన్ హాల్‌లో ఏర్పాటు చేసిన జెయింట్ స్క్రీన్‌పై దాదాపు 20 వేల మంది వీక్షించారు. ఈ ప్రాంతమంతా అభిమానులతో నిండిపోయింది. అభిమానులు కొంత మంది చెట్లపైకి ఎక్కారు. మరికొంత మంది వ్యాన్‌లపై నిలుచున్నారు. ఇంకొంతమంది డస్ట్‌బిన్‌లు, బస్ షెట్లర్లపైకి కూడా ఎక్కి నిలుచున్నారు. ‘ఫ్రెంచ్ దేశస్థులైనందుకు గర్విస్తున్నాం’ అని అలియా, సాచా అనే ఇద్దరు పర్సియన్ స్కూల్ చిన్నారులు అన్నారు. మోటార్‌సైకిళ్లు, సైకిళ్లు, కార్లు, చివరికి డస్ట్‌బిన్ లారీల్లోనూ అభిమానులు వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఈ సంబరాల్లో పాల్గొన్నారు. 2015 ఉగ్రవాదుల దాడి అనంతరం ఫ్రాన్స్‌లో భద్రత పెరిగింది. ఈ అభిమానులు సంబరాలు చేసుకున్న టౌన్ హాల్ వద్ద 1200 మంది సెక్యూరిటీ సిబ్బంది బాధ్యతలు నిర్వర్తించారు. పారిస్ వీధుల అభిమానులు ర్యాలీగా వెళుతుంటే బాల్కనీలోంచి కుటుంబ సభ్యులు ఫ్రెంచ్ జాతీయ జెండానూ, పిల్లలు లెస్ బ్లూస్ టీ షర్టును ఊపుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

థాయ్‌లాండ్ చిన్నారులకు అంకింతం: పోగ్బా
ఇంతటి ఆనందంలోనూ రెండు వారాల పాటు గుహలో ఉండి క్షేమంగా బయటికి వచ్చిన థాయ్‌లాండ్ ఫుట్‌బాల్ చిన్నారులను ఫ్రాన్స్ ఆటగాళ్లు జ్ఞాపకం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన అంతర్జాతీయ కెరీర్‌లోనే అతి పెద్ద విజయంగా భావిస్తున్న సెమీఫైనల్ గెలుపును ఫ్రాన్స్ మిడ్‌ఫీల్డర్ పాల్ పోగ్బా థాయ్‌లాండ్ ఫుట్‌బాల్ చిన్నారులకు అంకితమిచ్చాడు. ట్విట్టర్‌లో ఈ విషయాన్ని తెలియజేశాడు. పిల్లల ఫొటోను పెట్టి పక్కనే ‘ఈ విజయం చిన్నారులకు అంకితం. మీ మనోధైర్యం బలమైంది. వెల్ డన్ బాయ్స్’ అని రాశాడు. ఫుట్‌బాల్ ప్రాక్టీస్ కోసం వెళ్లిన 12 మంది చిన్నారులు, కోచ్ వర్షం కారణంగా ఓ గుహలో తలదాచుకుని అక్కడే ఇరుక్కుపోయారు. దాదాపు రెండు వారాల తర్వాత వారి ఆచూకీని తెలుసుకున్న థాయ్‌లాండ్ ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి అందరినీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చింది. ఈ ఆపరేషన్‌లో థాయ్‌లాండ్ అధికారులతో పాటు బ్రిటన్‌కు చెందిన గజ ఈతగాళ్లు తమ ప్రాణాలను తెగించి శ్రమించారు. బ్రిటన్‌కు చెందిన ఒక గజ ఈతగాడు చిన్నారుల కోసం తన ప్రాణాలను కూడా ఇవ్వడం బాధాకరం. 
 

image

 ‘ఫిఫా ప్రపంచకప్‌‌’ పై కన్నేసిన బెట్టింగ్ రాకెట్!

Updated By ManamFri, 06/15/2018 - 15:24

FIFA World Cup 2018, After rocking IPL, betting racket, football extravaganzaఠాణే: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌లపై బెట్టింగ్‌లకు పాల్పడి బెంబేలిత్తించిన బెట్టింగ్ రాకెట్.. ఇప్పుడు ఫిఫా ప్రపంచకప్‌ 2018 ఫుట్‌బాల్ పోటీలపై కన్నేసింది. ఫిఫా ప్రపంచ కప్ పోటీలకు సంబంధించి ఇప్పటికే బుకీలు బెట్టింగ్‌లను ప్రారంభించినట్టు ఠాణే పోలీసులు వెల్లడించారు. ఐపీఎల్ మ్యాచ్‌ల్లో బెట్టింగ్‌లకు పాల్పడిన కీలక బుకీ సోనూ జలాన్ సహా మరో ముగ్గురిని ఠాణే పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సోనూ జలాన్‌ను పోలీసులు విచారించిన సమయంలో సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ పేరు బయటకు వచ్చింది.

తాజాగా ఫిఫా ప్రపంచ కప్ పోటీలపై కూడా బుకీలు బెట్టింగ్‌లకు సిద్ధమయ్యారనే విషయాన్ని జలాన్ విచారణలో బయటపెట్టాడు. అయితే ఫిఫా టోర్నమెంట్‌లో ఫావరేట్ జట్టుగా బరిలోకి దిగుతున్న బ్రెజిల్ జట్టుపైనే బుకీల కన్ను పడింది. ఈ ఏడాది ఫిఫా ట్రోపీలో కూడా బ్రెజిల్‌ జట్టు ట్రోఫీని దక్కించుకుంటుందని బుకీలు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ముందుగా బ్రెజిల్‌ను తమ ఫెవరేట్ జట్టుగా ఎన్నుకున్నారు. మిగతా టాప్ టీమ్‌లలో జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, ఆర్జెంటీనా ఉన్నాయి. ఫిఫా ఫైనల్ మ్యాచ్‌ల్లో ఆడే టాప్ మూడు జట్లలో జర్మనీ- బ్రెజిల్, జర్మనీ- ఫ్రాన్స్, బ్రెజిల్- స్పెయిన్ తలపడనున్నాయి. 

Related News