krish

కృష్ణ కుమారి పాత్రలో మలయాళ బ్యూటీ

Updated By ManamThu, 11/15/2018 - 13:05
Malavika, Krishna Kumari

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాలలో ఎన్టీఆర్ బయోపిక్ ఒకటి. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా క్లైమాక్స్‌కు వచ్చేసింది. ఇక ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తుండగా.. తాజాగా ఇందులో భాగం అవ్వనుంది మలయాళ బ్యూటీ మాళవిక.

అలనాటి నటి కృష్ణ కుమారి పాత్ర కోసం మాళవికను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, కృష్ణ కుమారి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు అప్పట్లో మంచి విజయాలను సాధించాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ జీవితంలో ఆమె పాత్ర కూడా కీలకం అవ్వనుండగా.. అందుకోసం మాలవికను ఎంపిక చేసినట్లు టాక్. అంతేకాదు త్వరలోనే బాలకృష్ణ, మాళవికలపై సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు సమాచారం. కాగా ఈ బయోపిక్‌కు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.దర్శకుడు క్రిష్‌కు గురజాడ విశిష్ఠ పురస్కారం

Updated By ManamSun, 11/04/2018 - 15:45

Jagarlamudi krish, Gurajada Award, Prakash, Jagarlamudi, Krishవిజయనగరం: సినీ దర్శకుడు జాగర్లమూడి క్రిష్‌కు ఈ ఏడాది గురజాడ విశిష్ఠ పురస్కారంను ఇస్తున్నామని విజయనగరం గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి ప్రకాష్ తెలిపారు. ఈ నెల 30న మహాకవి గురజాడ 103వ వర్థంతి జరుపుకోనున్నారు. విజయనగరంలోని గురజాడ గృహాంలో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవంబర్ 30వ తేదీన గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో మహాకవి గురజాడ వర్థంతిని నిర్వహిస్తున్నామని చెప్పారు. 

ఈ సంవత్సరం కూడా గురజాడ కార్యక్రమాన్ని చేపడుతన్నామని తెలిపారు. వర్థంతి నాడు గురజాడ పురస్కారాన్ని వివిధ రంగాల్లో ప్రఖ్యాతి గాంచిన ప్రముఖులకు అంజేస్తునమన్నారు. ఈ నెల 30న గురజాడ వర్ధంతిని పురస్కరించుకొని ఈ సంవత్సరం సినీ దర్శకులు జాగర్లమూడి క్రిష్‌కు ఈ పురస్కారంను ప్రధానం చేయనున్నట్లు ప్రకాశ్ తెలిపారు.‘యన్‌టిఆర్‌’లో వినాయక్..?

Updated By ManamFri, 11/02/2018 - 09:58

V.V.Vinayakబాలకృష్ణ ప్రధానపాత్రలో క్రిష్ దర్శకత్వంలో భారీ తారాగణంతో తెరకెక్కుతున్న చిత్రం ‘యన్‌టిఆర్’. నటసార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం గురించిన మరో వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే ఈ చిత్రంలో సెన్సేషనల్ దర్శకుడు వినాయక్ నటించనున్నారట. లెజండరీ దర్శకుడు దాసరి నారాయణ రావు పాత్రలో వినాయక్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు, మనుషులంతా ఒక్కటే, సర్కస్ రాముడు, విశ్వరూపం, ప్రేమ సింహాసనం వంటి హిట్ చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వ్యక్తిగతంగానూ ఎన్టీఆర్‌తో దాసరికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పాత్ర కూడా కీలకం అవ్వనుండగా.. దాసరి పాత్రలో వినాయక్ కనిపించనున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఈ చిత్రాన్ని బాలకృష్ణ, విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.వాయిదా పడనున్న ‘యన్‌టిఆర్’..?

Updated By ManamWed, 10/31/2018 - 10:40

NTRనటసార్వభౌమ ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘యన్‌టిఆర్’. ఎన్టీఆర్ వారసుడు బాలకృష్ణ ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘యన్‌టిఆర్-కథానాయకుడు’, ‘యన్‌టిఆర్-మహానాయకుడు’ అనే రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మొదటి భాగంలో ఎన్టీఆర్ సినీ చరిత్రను, రెండో భాగంలో ఆయన రాజకీయ జీవితాన్ని చూపించనున్నారు.

ఇక మొదటి చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9, రెండో భాగాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 24వ తేదిన విడుదల చేయనున్నట్లు అధికారికంగా కూడా ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం రెండో భాగం విడుదలను వాయిదా వేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. మొదటి భాగం తరువాత రెండో భాగ ప్రమోషన్లలో సమయం తక్కువగా ఉన్నందున ఫిబ్రవరికి యన్‌టిఆర్-మహానాయకుడును వాయిదా వేయాలని అనుకుంటున్నట్లు టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.‘యన్‌టిఆర్’ కోసం వచ్చిన బసవతారకం

Updated By ManamWed, 10/17/2018 - 13:57

Vidya Balanఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా బాలకృష్ణ నటిస్తున్న చిత్రం ‘యన్‌టిఆర్’. కథానాయకుడు, మహానాయకుడు అనే రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ కనిపించనుంది. ఇక ఈ చిత్ర షూటింగ్‌లో ఆమె పాల్గొనగా.. ఆమె పాత్రకు సంబంధించి తాజాగా ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అందులో అందంగా ముస్తాబైన విద్యాబాలన్ అద్దం ముందు కూర్చొని ఉండగా.. నేను ఏమీ చూడాలి అన్న క్యాప్షన్‌ను పెట్టింది. 

కాగా ఈ చిత్రంలో రానా, ప్రకాశ్ రాజ్, రకుల్ ప్రీత్ సింగ్, నిత్యామీనన్, కల్యాణ్ రామ్, నరేశ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి, బాలకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో ఈ రెండు భాగాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.జ‌య‌ప్రద పాత్ర‌లో టాప్ హీరోయిన్

Updated By ManamThu, 10/11/2018 - 12:44
Tamannaah as jaya prada  in NTR biopic

అల‌నాటి అందాల తార జ‌య‌ప్ర‌ద పాత్ర‌లో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా న‌టించనుంద‌ట‌. దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ `య‌న్‌.టి.ఆర్‌` ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. రెండు భాగాలుగా సినిమా విడుద‌ల కానుంది. జ‌న‌వ‌రి 9న `య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు`, జ‌న‌వ‌రి 24న `య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు` విడుద‌ల కానున్నాయి. అగ్ర క‌థానాయ‌కుడు ప్ర‌జ‌ల్లో ఎన్టీఆర్ చాలా ప్ర‌భావం చూపారు. ఆయ‌న న‌టించిన పాత్ర‌లు ప్ర‌జ‌ల్లో నిలిచిపోయాయి. ఆయ‌నతో శ్రీదేవి, జ‌య‌ప్ర‌ద‌, జ‌య‌సుధ‌లు ఎక్కువ సినిమాల్లో న‌టించారు. శ్రీదేవి పాత్ర‌లో ర‌కుల్ ప్రీత్ న‌టిస్తుందనే సంగ‌తి తెలిసిందే. కాగా ఇప్పుడు జ‌య‌ప్ర‌ద పాత్ర‌లో త‌మన్నా న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. శ్రీదేవి ర‌కుల్‌, జ‌య‌ప్ర‌ద‌గా త‌మ‌న్నా పాత్ర.. ఇవ‌న్నీ ఎన్టీఆర్ సినిమా కెరీర్‌కి సంబంధించిన‌వి కావ‌డంత సినిమా ఫ‌స్ట్ పార్ట్‌లోనే ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేస్తాయ‌డ‌నంలో సందేహం లేదు. మ‌రి త‌మ‌న్నా సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌పై ఏమ‌ని స్పందిస్తారో చూడాలి. ‘యన్‌టిఆర్’ పేరు మారింది

Updated By ManamThu, 10/04/2018 - 09:53
NTR

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యన్‌టిఆర్’. సెట్స్ మీదకు వెళ్లినప్పుడే ఈ చిత్రానికి ‘యన్‌టిఆర్’ అనే టైటిల్‌నే ఫిక్స్ చేయగా.. తాజాగా ఈ టైటిల్‌లో స్వల్ప మార్పును చేసింది చిత్రయూనిట్. యన్‌టిఆర్‌తో పాటు కథానాయకుడు అనే పదాన్ని టైటిల్‌‌‌కు చేర్చారు. దీనిపై అధికారిక ప్రకటన చేసిన మూవీ యూనిట్‌ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో బందిపోటు చిత్రంలో ఎన్టీఆర్‌ను గుర్తుచేస్తున్నాడు బాలకృష్ణ.

ఇక ఇందులో బాలకృష్ణ సరసన విద్యాబాలన్ నటిస్తుండగా.. సుమంత్, రానా, ప్రకాశ్ రాజ్, కైకాల సత్యనారాయణ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. బాలకృష్ణ, విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళం, హిందీలో క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.విడుదలైన ‘మణికర్ణిక’ టీజర్

Updated By ManamTue, 10/02/2018 - 11:04
Manikarnika

వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత కథ ఆధారంగటా తెరకెక్కిన చిత్రం ‘మణికర్ణిక: ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. బాలీవుడ్ బ్యూటీ కంగనా ప్రధానపాత్ర పోషించిన ఈ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలైంది. అమితాబ్ బచ్చన్‌ వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ టీజర్‌లో ఝాన్సీ రాణిగా కంగనా ఆకట్టుకోగా.. ఫుల్ యాక్షన్‌తో టీజర్‌ అందరినీ మెప్పిస్తోంది. ఇక ఈ చిత్రంలో జిస్సు సేన్‌గుప్తా, అతుల్ కులకర్ణి, సురేశ్ ఒబెరాయ్, అంకిత లోఖండే తదితరులు కీలక పాత్రలో నటించగా.. జీ స్టూడియోస్ పతాకం నిర్మించింది. శంకర్- ఇషాన్- లాయ్ సంగీతం అందించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.‘మ‌ణిక‌ర్ణిక’ టీజర్‌కి ముహుర్తం ఫిక్స్‌

Updated By ManamSat, 09/29/2018 - 11:48

Manikarnikaబాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం 'మణికర్ణిక'. జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. అయితే సినిమా రీ షూటింగ్స్‌, వి.ఎఫ్‌.ఎక్స్‌ కారణాలతో ఈ చిత్ర విడుదల ఆలస్యమవుతూ వస్తుండగా.. ఎట్టకేలకు వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. సినిమాలో ప్యాచ్ వ‌ర్క్ స‌హా కొంత పార్ట్‌ను కంగ‌నాయే డైరెక్ట్ చేయ‌డం విశేషం. లెటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్ర టీజ‌ర్‌ను గాంధీ జ‌యంతి రోజున విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మ‌హిళ‌ల్లో ఝాన్సీ ప్రాంతానికి చెందిన వీర‌నారి ఝాన్సీ ల‌క్ష్మీబాయ్ జీవిత‌గాథే ఈ చిత్రం. అచ్చు ‘అక్కినేని’లాగే.. ఆకట్టుకుంటున్న సుమంత్

Updated By ManamThu, 09/20/2018 - 09:58

Sumanthఉమ్మడి ఆంధ్రప్రదేశ్  మాజీ ముఖ్యమంత్రి, నటసార్వభౌమ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘యన్‌టిఆర్’. బాలకృష్ణ ఇందులో ఎన్టీఆర్‌గా ప్రధానపాత్రలో నటిస్తుండగా.. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఆయన మనవడు సుమంత్ నటిస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌లో సుమంత్ పాల్గొనగా.. ఇవాళ అక్కినేని జయంతి సందర్భంగా మొదటి లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

అందులో అక్కినేని నాగేశ్వరరావు లుక్‌లో నిజంగానే ఆయనేనా అన్నట్లుగా అచ్చు దిగిపోయాడు సుమంత్. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ నటిస్తుండగా.. రానా, ప్రకాశ్ రాజ్, నరేశ్, కైకాల సత్యనారాయణ, కీర్తి సురేశ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రంపై అటు అభిమానుల్లో పాటు ఇటు విమర్శకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.

Related News