Ramana Deekshithulu

సుప్రీంకు చేరిన టీటీడీ వివాదం

Updated By ManamWed, 06/13/2018 - 14:19

supreme, ttdన్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన టీటీడీ వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. టీటీడీ ప్రధానార్చకులు వేణు గోపాల దీక్షితులు ఎన్నికపై మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు సుప్రీంను ఆశ్రయించాలని భావిస్తుండగా.. ఆయన కంటే ముందే సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు వేణు గోపాల దీక్షితులు. తన నియామకాన్ని సవాల్ చేస్తూ ఎవరైనా కోర్టుకు ఎక్కితే తనకు సమాచారం ఇవ్వకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయవద్దని కేవియట్ పిటిషన్‌లో కోరారు. కాగా అక్రమంగా అర్చక పదవి నుంచి తొలగించాలని, స్వామి వారి ఆభరణాలు కూడా కనిపించడం లేదని ఆరోపిస్తూ వచ్చే నెల మొదటి వారంలో సుప్రీం కోర్టులో పిటిషన్ వేయబోతున్నారు రమణ దీక్షితులు.



 



రమణ దీక్షితులు, విజయసాయి రెడ్డిలకు టీటీడీ నోటీసులు

Updated By ManamWed, 06/13/2018 - 12:56
Vijaya Sai Reddy

తిరుమల: శ్రీవారి మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు, వైసీపీ నేత విజయసాయిరెడ్డిలకు తిరుమల తిరుపతి దేవస్థాన సంస్థ(టీటీడీ) నోటీసులు జారీ చేసింది. పరువుకు భంగం కలిగేలా వారు చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆ నోటీసులలో కోరింది. వివరణ ఇవ్వకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నోటీసులలో తెలిపింది.

కాగా గత కొన్ని రోజులుగా టీటీడీపై రమణ దీక్షితులు ఆరోపణలు చేస్తున్నారు. టీటీడీలో రాజకీయాలు ఎక్కువ అయ్యాయని, స్వామి వారి నగలను అమ్మేశారని ఆయన ఆరోపణలు చేశారు. మరోవైపు టీటీడీకి చెందిన కొన్ని ఆభరణాలు సీఎం చంద్రబాబు నివాసంలో ఉన్నాయని విజయసాయి రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.





Related News