Anam Ramanarayana Reddy

సెప్టెంబర్ 2న వైఎస్సార్ సీపీలోకి ఆనం

Updated By ManamSat, 08/25/2018 - 13:30

Anam Ramanarayana Reddyనెల్లూరు : మాజీమంత్రి, టీడీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి ...వైఎస్సార్ సీపీలో చేరికకు ముహుర్తం ఖరారైంది. ఆయన తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి సెప్టెంబర్ 2న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ఆనం శనివారం మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీలో చేరికతో పాటు, జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

కాగా వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి నిన్న (శుక్రవారం) ఆనంతో భేటీ అయ్యారు. ఆనం కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కాకాణి...ఆయనను కలవడం విశేషం. కాగా కాంగ్రెస్‌కు రాజీనామా చెప్పిన తర్వాత మూడేళ్ల పాటు తెలుగుదేశం పార్టీలో కొనసాగిన ఆనం రాంనారాయణ రెడ్డి నెలక్రితం టీడీపీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. 

అనంతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కలిసి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. తొలుత ఈ నెల 13న పార్టీలో చేరాలని భావించినప్పటికీ, సెప్టెంబర్ 2న ముహుర్తం ఖరారు చేసుకున్నారు.  అందులో భాగంగా వైఎస్సార్ సీపీలో చేరే సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆనం సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. కాకాణి...ఆయనను మర్యాదపూర్వకంగా కలిసినప్పటికీ వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధంతో పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.



త్వరలో టీడీపీకి ఆనం గుడ్ బై..?

Updated By ManamWed, 06/13/2018 - 08:39

anam అమరావతి: పార్టీని మారుతున్నట్లు వస్తున్న వార్తలపై టీడీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. గుర్తింపు, గౌరవం లేని చోట తాను ఉండలేనని ఆయన తేల్చి చెప్పారు. దీంతో ఆయన టీడీపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఏ పార్టీలో చేరాలి అనే విషయంపై నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తమ కుటుంబానికి సన్నిహితులు, అనుచరులు, అభిమానులందరితో చర్చించి మాత్రమే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. గతంలో తాను ఎన్నో పదవులు చేపట్టానని, సమర్థవంతంగా పనిచేశానని కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే మంగళవారం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో పలువురు టీడీపీ, కాంగ్రెస్ నేతలను ఆనం కలవడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.

 





Related News