indian-bank

ఇండియన్ బ్యాంకు లాభాలు 44శాతం డౌన్ 

Updated By ManamThu, 08/09/2018 - 23:22

indian-bankన్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంకు 2018-19 జూన్ త్రైమాసికంలో నికర లాభం   రూ. 209.31 కోట్లకు తగ్గినట్లు ప్రకటించింది. అది 2017-18 మొదటి త్రైమాసికంలో రూ. 372.41 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో గడించిన లాభాలు 44 శాతం తక్కువ. మొత్తం ఆదాయం 2018-19 క్యూ1లో  రూ. 5,131.97 కోట్లుగా ఇండియన్ బ్యాంకు పేర్కొంది. అది 2017-18 మొదటి త్రైమాసికంలో రూ. 4,788.04 కోట్ల మొత్తం ఆదాయాన్ని గడించింది. బ్యాంకు మొండి బాకీలు గత ఆర్థిక సంవత్సరం కంటే తగ్గినట్లు బ్యాంకు పేర్కొంది. మొండి బాకీలు, అత్యవసరాలకు కేటాయించిన మొత్తం 2018-19 జూన్ త్రైమాసికంలో రూ. 1,029.56 కోట్లుగా బ్యాంకు పేర్కొంది. ఈ మొత్తం 2017-18 క్యూ1లో రూ. 715.56 కోట్లుగా ఉంది. కేవలం మొండి బాకీలకు ప్రస్తుతం రూ. 456.60 కోట్లు కేటాయించినట్లు బ్యాంకు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో కేవలం మొండి బాకీలకు రూ. 681.94 కోట్లను బ్యాంకు కేటాయించింది.అనాథాశ్రమానికి పాడి ఆవు

Updated By ManamWed, 07/11/2018 - 22:13

Indian-Bankహైదరాబాద్: ఇండియన్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.కె. భట్టాచార్య ఇటీవల జంట నగరాల లోని ఇండియన్ బ్యాంక్ శాఖలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన న్యూ నల్లకుంటలో జూలై 9 నూతన ప్రాంగణాన్ని ఆవిష్కరించారు.   కోఠిలో స్ట్రెస్‌డ్ అసెట్ మేనేజ్‌మెంట్ శాఖను కూడా అదే రోజు ప్రారంభించారు. తారా ఫౌండేషన్ నిర్వహిస్తున్న అనాథ శరణాలయాన్ని సందర్శించి అక్కడ చిన్నారులతో ముచ్చటించారు. వారికి పుస్తకాలు, ఇతర స్టేషనరి సామాగ్రిని అందజేశారు. ఆశ్రమ దైనందిన పాల అవసరాలు తీర్చేందుకు ఒక పాడి ఆవును కూడా ఇచ్చారు.  ఇండియన్ బ్యాంకు మైక్రోసేట్ శాఖ ద్వారా ఎస్‌హెచ్‌జీ రుణాల పంపిణీ కార్యక్రమంలో 520 మంది మహిళా లబ్ధిదార్లతో కూడిన 50 సంఘాలకు రూ. 5 కోట్లను మంజూరు చేశారు. నగరంలోని పలు శాఖల నుంచి రూ. 15 కోట్ల గృహ రుణాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాంకు హైదరాబాద్ జోనల్ మేనేజర్ ఆర్. మనోహర్ పాల్గొన్నారు.ఇండియన్ బ్యాంక్ డిపాజిట్ల రేటు పెంపు

Updated By ManamMon, 06/11/2018 - 22:23

indian-bankహైదరాబాద్: ఇండియన్ బ్యాంక్ నిర్ణీతకాల డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ బ్యాంక్, ఏడాదికి పైన, 3 ఏళ్ళకు తక్కువ వ్యవధి కలిగిన కోటి రూపాయలకన్నా తక్కువ దేశీయ/ఎన్.ఆర్.ఇ టర్మ్ డిపాజిట్లైపె వడ్డీ రేట్లలో 25 బేసిస్ పాయింట్ల పెంపుదలను తీసుకుచ్చింది. కోటి రూపాయల నుంచి రూ. 5 కోట్లను మూడేళ్ళు అంతకు మించిన కాలానికి డిపాజిట్ చేస్తే ఇచ్చే వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచుతూ సవరణ తీసుకొచ్చింది. పర్యవసానంగా ఫండ్ల మార్జినల్ కాస్ట్ ఆధారిత వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచుతూ ఎగువ గతిన సవరించింది. పెరిగిన వడ్డీ రేట్లు 2018 జూన్ 11 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. 

Related News