excellent drink

‘బ్లూ టీ’ తో బెల్లీ ఫ్యాట్ మటాష్!

Updated By ManamMon, 06/11/2018 - 13:00

Weight loss: blue tea, excellent drink, reducing belly fatవెబ్ ప్రత్యేకం: బ్లాక్ టీ, గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి మంచిదని విన్నాం. మరి బ్లూ టీ గురించి ఎప్పుడైనా విన్నారా? పోనూ ఒకసారైనా తాగారా? అయితే బ్లూ టీ తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు తెలిస్తే రోజూ బ్లూ టీ మాత్రమే తాగుతామనేస్తారు. చైనాలో పండే ఒక రకమైన నల్లని తేయాకు నుంచి లభించే బ్లూ టీని ‘ఊలాంగ్ టీ’ లేదా ‘బ్లాక్ డ్రాగన్ టీ’ అని కూడా పిలుస్తారు. అధిక బరువుతో బాధపడేవారికి ఈ బ్లూ టీ దివ్య ఔషధమనే చెప్పాలి. బ్లూ టీ తాగినవారిలో అధికశాతంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి సహజంగానే బరువును తగ్గించే గుణం ఉంది. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్‌ను కరిగించడంలో బ్లూ టీ అద్భుతంగా పనిచేస్తుంది.

అధ్యయానాల ప్రకారం.. కొన్ని ‘టీ’ లు తాగితే ప్రాణాంతక కేన్సర్ సహా గుండెజబ్బులు, దీర్ఘకాలిక పీడిత వ్యాధి డయాబెటిస్ వంటి పలు అనారోగ్య సమస్యల ముప్పును తగ్గిస్తాయని తెలుసు. టీ పానియాలు కూడా బరువు తగ్గేందుకు దోహదపడతాయి. సాధారణంగా గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలని, దీనివల్ల శరీరంలోని కొవ్వును కరిగించి బరువు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కానీ, బ్లూ తాగితే మాత్రం గ్రీన్ టీ కంటే అధికమొత్తంలో కొవ్వును కరిగించి స్వల్ప వ్యవధిలోనే కిలోల బరువును తగ్గిస్తుందంట. జీవక్రియను మెరుగుపర్చే గుణం దీనిలో పుష్కలంగా ఉన్నాయి.

బ్లూ టీని ఎలా తయారుచేస్తారో తెలుసా?
బటర్‌ఫ్లై పీ ఫ్లవర్ (సీతాకోకచిలుక బఠానీ పువ్వు) లేదా బ్లూ పీ ఫ్లవర్ (క్లైటోరియా టెర్నాటీ) నుంచి తయారు చేస్తారు. బ్లూ టీపై ఎన్నోసార్లు అధ్యయనాలు చేసి ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలను అందిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్లూ టీ‌ని తాగేందుకు డైట్ చేసేవాళ్లు ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తారో చెప్పడానికి ఒక ముఖ్యకారణం ఉంది. బ్లూ టీ తాగిన వారిలో కొవ్వును కరిగి పోవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. బెల్లీ ఫ్యాట్‌ను కరిగించి సహజంగా బరువును తగ్గించడంలో బ్లూ టీ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతోంది. 
 
అద్భుత ప్రయోజనాలెన్నో..
Weight loss: blue tea, excellent drink, reducing belly fat- టీ పానియాల్లో చాలా శక్తిమంతమైన వివిధ యాంటిఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటినే కెటకిన్స్ అని కూడా పిలుస్తారు. ఇందులో ఎపిగలోకెటకిన్ గాలేట్ (ఈజీసీజీ) ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీరంలోని జీవక్రియ (మెటబాలిజం)ను మెరుగుపర్చి అధిక సంఖ్యలో కేలరీలను కరిగిస్తుంది. గ్రీన్ టీ తో పోలిస్తే ఊలాంగ్ టీ అద్భుతమైన పానియంగా చెప్పవచ్చు. విశ్రాంతి సమయంలో కూడా శరీరంలోని జీవక్రియను మెరుగుపర్చి కొవ్వును క్షణాల్లో కరిగించే గుణాలు పుష్కలంగా ఉన్నాయని ఎన్నో అధ్యయనాల్లో రుజువైంది.   
- కేలరీలను కరిగించడంలో కెఫిన్ అద్భుతంగా పనిచేస్తుంది. బ్లూ టీ కూడా జీవక్రియను మెరుగుపర్చడంలో సాయపడుతుంది. ఇందులో థానేన్, అమైనో ఆమ్లం ఉండటం వల్ల కేఫిన్ నుంచి ఉత్పన్నమయ్యే హానికర దుష్ప్రభావాలను నివారిస్తుంది. 
- ఇంటర్నేషనల్ జనరల్ ఆఫ ఓబెసిటీ అండ్ రిలేటెడ్ మెటబాలిక్ డిజార్డర్స్‌లో బ్లూ టీకి సంబంధించి ఒక అధ్యయనాన్ని ప్రచురించారు. అందులో బ్లూ టీ రోజూ తాగితే స్థూలకాయత్వం, కొవ్వు కాలేయ వ్యాధులు రాకుండా నిరోదిస్తుందని పేర్కొంది. 
- సహజంగా బ్లూటీతో కాలేయంలోని కొవ్వును కరిగించడమే కాకుండా అధికమొత్తంలో కేలరీలను సహజంగా కరిగించి హెపాటిక్ మెటబాలిజాన్ని వృద్ధిచేస్తుంది. కాలేయంలో కొవ్వు నిల్వ కాకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు.. మధుమేహం ముప్పు నుంచి కూడా రక్షిస్తుంది. బెల్లీ ఫ్యాట్‌కు కాలేయంలో కొవ్వుకు దగ్గరి సంబంధం ఉంది. దీనివల్ల కాలేయ పనితీరు మందగించడమే కాకుండా అధిక బరువు పెరిగేందుకు (ప్రత్యేకించి మధ్యభాగంలో) కారణమవుతుంది. అంతర్భాగంలో పేరుకుపోయిన మొండి కొవ్వును కూడా కరిగించడంలో బ్లూ టీ అద్భుతంగా పనిచేస్తుంది. 
బ్లూ టీ యాంటియాక్సిడెంట్‌గా మాత్రమే కాకుండా రోగ నిరోధక శక్తిని మెరుగు పరచడంలోనూ, మూత్రవిసర్జన సాఫీగా సాగేలా చూస్తూ శరీరంలోని  అనవసరమైన కొవ్వు, విష పదార్థాలను బయటకు పంపించేస్తుంది. 

Related News