uday kiran

ఉదయ్ కిరణ్ బయోపిక్‌పై తేజ స్పందన

Updated By ManamFri, 05/18/2018 - 10:30

teja, uday సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ బాక్సాఫీస్ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరో ఉదయకిరణ్ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇక ఈ చిత్రానికి ఉదయ్‌ కిరణ్ సినిమాలకు పరిచయం చేసిన తేజ దర్శకత్వం వహించనున్నట్లు, అందుకోసం ‘కాబోయే అల్లుడు’ అనే టైటిల్‌ను కూడా అనుకుంటున్నట్లు గాసిప్‌లు వినిపించాయి. ఇవన్నీ తేజ వరకు వెళ్లడంతో వాటిపై తాజాగా స్పందించారు ఆయన.

తాను ఎలాంటి బయోపిక్‌లు తెరకెక్కించడం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి వదంతులను ఎవరు సృష్టిస్తున్నారో తెలీదని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా బాలకృష్ణ ప్రధానపాత్రలో ఎన్టీఆర్ బయోపిక్‌కు మొదట తేజ దర్శకుడిగా పనిచేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్‌ నుంచి ఆయన తప్పుకున్నారు. దీంతో ఆ బయోపిక్ వాయిదా పడ్డ విషయం తెలిసిందే.


 ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ రానుందా?

Updated By ManamWed, 05/16/2018 - 20:43

udayతెలుగునాట బ‌యోపిక్‌ల ట్రెండ్‌కు శ్రీ‌కారం చుట్టిన చిత్రం ‘మహానటి’. ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో..  అదే బాట‌లో మ‌రిన్ని బ‌యోపిక్ చిత్రాలు తెర‌పైకి రావ‌డానికి ముస్తాబవుతున్నాయి. వాటిలో.. ఒక‌ప్పటి యువ సంచలనం ఉదయ్ కిరణ్ బయోపిక్ కూడా ఉంద‌ని తెలుస్తోంది. కాస్త‌ వివరాల్లోకి వెళితే..  ‘చిత్రం’, నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’.. ఇలా కెరీర్ ఆరంభంలోనే హ్యాట్రిక్ విజయాలను చవి చూసి.. తెలుగు సినీ పరిశ్రమలో క‌థానాయ‌కుడిగా సంచలనాన్ని సృష్టించారు యంగ్ హీరో ఉదయ్ కిరణ్. అంతేగాకుండా..  ఫిల్మ్‌ఫేర్‌ను (‘నువ్వు నేను’ చిత్రానికి గాను) అందుకున్న అతి పిన్న వయస్కుడిగా (21 సంవత్సరాలు) కమల్ హాసన్ తర్వాత ఆ జాబితాలో చేరారు ఉదయ్ కిరణ్.  అలా వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న ఈ హీరో కెరీర్, లైఫ్‌..  ఒక్కసారిగా ఒడిదుడుకులకు లోనయింది. అవి ఎంతవరకు తీసుకుని వెళ్ళాయంటే.. ఆఖరికి ఈ యువ కథానాయకుడు బతుకు భారం మోయలేక తనువు చాలించే స్థాయికి దిగజార్చేసాయి.

మహానటి సావిత్రి జీవితానికి కాస్త అటు ఇటుగా ఉదయ్ కిరణ్ జీవితం కూడా ఉండడంతో.. ఇప్పుడు ఈ యంగ్ హీరో జీవితాన్ని కూడా బయోపిక్‌గా తీయడానికి దర్శకుడు తేజ ప్లాన్ చేస్తున్నారు. ఉదయ్ కిరణ్‌తో మంచి అనుబంధం ఉండడం.. అంతేగాక వీరిద్దరి కెరీర్ కూడా ‘చిత్రం’ సినిమాతోనే ప్రారంభం కావడంతో.. ఉదయ్ కిరణ్ బయోపిక్‌ను తేజ తెరకెక్కించడానికి నిశ్చయించుకున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమాని తేజ ఎప్పుడు సెట్స్ పైకి తీసుకుని వెళ్తారో చూడాలి. అన్న‌ట్టు.. ఇటీవ‌లే 'య‌న్‌.టి.ఆర్‌' బ‌యోపిక్ నుంచి తేజ బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.ఉద‌య్ కిర‌ణ్ ద‌ర్శ‌కుడితో సన్నీ లియోన్ సినిమా

Updated By ManamMon, 04/16/2018 - 20:04

sunny leoneహాట్ గర్ల్ సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఓ సినిమా రూపొందనుంది. ఈ చిత్రాన్ని తెలుగులో మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. రివెంజ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకి రఘురాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఉదయ్‌కిరణ్‌తో ‘కలుసుకోవాలని’ చిత్రాన్ని రూపొందించిన రఘురాజ్.. దాదాపు ప‌ద‌హారేళ్ళ‌ గ్యాప్ తర్వాత ఈ బహు భాషా చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను మ‌రికొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారు.16 ఏళ్ల 'మ‌న‌సంతా నువ్వే'

Updated By ManamThu, 10/19/2017 - 09:56

'క‌ల్మ‌షం లేని రెండు మ‌న‌సుల స్నేహం.. అనుకోకుండా విడిపోయాక కూడా మ‌ళ్లీ క‌ల‌వాల‌నుకుంటుంది. తీరా క‌లిసే స‌మ‌యానికి.. త‌మ మ‌ధ్య స్నేహం త‌మ‌తో పాటు పెరిగి పెద్ద‌యి ప్రేమ‌గా మారింద‌ని గుర్తించే స‌మ‌యంలో కొన్ని ఊహించ‌ని సంఘ‌ట‌న‌లు జ‌రుగుతాయి. చివ‌రికి ఆ రెండు మ‌న‌సులు ఒక్క‌ట‌య్యాయా లేదా' అన్న‌దే 'మ‌న‌సంతా నువ్వే' చిత్రం క‌థాంశం.

'చిత్రం' సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క్యూట్ పెయిర్ ఉద‌య్‌కిర‌ణ్‌, రీమాసేన్ మ‌రోసారి జోడీ క‌ట్టిన ఈ సినిమాని మెగా ప్రొడ్యూస‌ర్ ఎమ్మెస్ రాజు నిర్మించారు. వి.ఎన్‌. ఆదిత్య ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన ఈ చిత్రానికి ఆర్‌.పి.ప‌ట్నాయ‌క్ అందించిన సంగీతం వెన్నెముక‌గా నిలిచింది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం ఆ పాట‌ల‌కు బ‌లంగా నిలిచింది. అంతేకాకుండా సిరివెన్నెల ఓ కీల‌క పాత్ర‌లో తళుక్కున మెరిసారు కూడా.

స‌కుటుంబ స‌ప‌రివార స‌మేతంగా చూడ‌ద‌గ్గ ఈ సినిమాలో సునీల్‌, త‌నూ రాయ్‌, చంద్ర మోహ‌న్‌, సుధ‌, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, సిజ్జు, త‌నికెళ్ల భ‌ర‌ణి, మాస్ట‌ర్ ఆనంద్ వ‌ర్థ‌న్‌, బేబి జీబా త‌దిత‌రులు న‌టించారు. హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ‌, బెంగాలి, ఒరియా భాష‌ల్లో ఈ సినిమా రీమేక్ అయ్యింది. సుమంత్ ఆర్ట్స్ ప‌తాకంపై నిర్మిత‌మైన ఈ చిత్రం.. 2001లో ఇదే అక్టోబ‌ర్ 19న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. అంటే.. నేటితో 'మ‌న‌సంతా నువ్వే' విడుద‌లై 16 వ‌సంతాలు పూర్త‌వుతున్నాయ‌న్న‌మాట‌.

Related News