Designer chain

శారీ..రివర్స్!

Updated By ManamThu, 07/12/2018 - 01:23

designerఆరు గజాల చీరపై ప్రయోగాలు కొత్తేం కాదు. అయినా చీరలపై ప్రయోగాలు మాత్రం నిత్యనూతనంగా కొనసాగుతూనే ఉన్నాయి.  కానీ ఒక చీరను ఒకేలా కడితే.. కొన్ని రోజుల తరువాత బోర్ కొడుతుంది. ఖరీదైన చీర అనుకొండి.. బోరుకొడితే తీసి పక్కన పెట్టలేం..అలాగని పదేపదే ఎలా కట్టగలం? అందుకే చీరలంటే ప్రాణం పెట్టే డిజైనర్ పాయల్ ఖండ్వాలా ఇందుకు ఓ విరుగుడు కనిపెట్టారు. ఒక చీరను రెండు రకాలుగా ధరించవచ్చు..దీంతో ఆ మోనోటనీ పోతుంది. పైపెచ్చు న్యూ లుక్ వస్తుంది. ఇందుకు ప్రత్యేకంగా ఖర్చు అయ్యేదేం లేదు కానీ రివర్సిబుల్ సారీస్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ..అంతే సింపుల్!


రెండు కొంగులు
గతంలో చీరను ఉల్టా అయినా కట్టొచ్చు, సీదా అయినా కట్టచ్చు.. ‘టూ ఇన్ వన్’లా రెండు వేర్వేరు రంగులు, డిజైన్లలో వచ్చేవి.. దానికి భిన్నంగా ఈ చీరలు ఉంటాయి. అంటే రెండు పల్లూలు, రెండు బాడీలుంటాయన్నమాట. బ్లౌజ్‌తో ఎన్నైనా ప్రయోగాలు చేయచ్చు కనుక ఆపోజిట్, మ్యాచింగ్, మిక్స్డ్ బ్లౌజులతో ఈ చీరను ఆకట్టుకునేలా ధరించవచ్చు. ఒక చీరకు రెండు కొంగులున్న కారణంతో అందునా కాంట్రాస్ట్ కాంబినేషన్స్ ఉన్నందున ఈ శారీ చాలా స్పెషల్‌గా కనిపిస్తుంది. ఇందుకు తగ్గట్టుగా మీరు యాక్సెసరీస్ ధరిస్తే ఎథ్నిక్ లుక్‌తో పాటు ఫ్యాషన్ ఈస్తెటిక్స్ ఉట్టిపడేలా కనిపించడం ఖాయం. ఇది ఎంత మాడ్రన్ ఐడియా అయినా వచ్చే లుక్ మాత్రం క్లాసిక్‌గా ఉంటుందన్న విషయం మరిచిపోకండి. ముఖ్యంగా ఫొటో సెషన్స్‌కు ఇలాంటివి అదిరిపోయేలా ఉంటాయి.  కిట్టీ పార్టీలు, గెట్‌టుగెదర్‌లు, పెళ్లిళ్లు, పేరంటాలు  అకేషన్ ఏదైనా అందుకు అతికినట్టు సరిపోయే ఇలాంటి ట్రెండీ చీరలు మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిందే. మీరు ఫ్యాషన్ ప్రియులైతే ఇలాంటి ప్రయోగాలు ఎంజాయ్ చేసితీరాలని శారీ ప్రియులైన సెలబ్రిటీలు టిప్స్ ఇస్తున్నారు.  పట్టు మొదలు కాటన్, షిఫాన్, జార్జిట్, ప్రింట్స్, వర్క్ ఇలా ఒక్కటేమిటి మీ టేస్ట్‌కు తగ్గ స్టైల్స్‌లో, ధరల్లో ఈ రివర్సిబల్ చీరలు మార్కెట్లో ఊరిస్తున్నాయి.  



డిజైనర్ మంగళసూత్రం

Updated By ManamWed, 05/23/2018 - 02:50

chainమంగళసూత్రాన్ని స్పెషల్‌గా డిజైన్ చేయించుకుని సోనమ్ కపూర్, ఆనంద్ అహూజాలు సరికొత్త ట్రెండ్ సృష్టించారు.  స్టైల్ ఐకన్‌గా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన సోనమ్ ఇంతటితో ఆగక.. ఇంకా చాలా స్టైలిష్, క్రేజీ ట్రెండ్స్‌ను క్రియేట్ చేసి వివాహం అయిపోయాక కూడా సెన్సేషనల్ కపుల్‌గా నిలుస్తున్నారు.  వివాహ తతంగమంతా పూర్తయ్యాక తన మణికట్టుపై మంగళసూత్రాన్ని కట్టుకున్న సోనమ్ ఇతర సెలబ్రిటీల్లా మంగళసూత్రాన్ని తీసేయకుండా జాగ్రత్త పడడం విశేషం.  ఫేమస్ జువెలరీ డిజైనర్ ఉషీతా దేవ్నాని రావ్తాని వీరి అభిరుచికి తగ్గట్టుగా వీరిద్దరి రాశులనే మంగళసూత్రాలుగా రూపొందించారు.  ఆనంద్ రాశి సింహ రాశి, సోనమ్‌ది మిథున రాశి కనుక వాటి సింబల్స్‌తో పవిత్రమైన మంగళసూత్రం తయారు చేశారు. 





Related News