vyjayanthi movies

చిరు సినిమాను మేం నిర్మించట్లేదు

Updated By ManamThu, 10/11/2018 - 15:15

Chiranjeevi, Koratala Sivaమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’లో నటిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించనుండగా.. ఈ చిత్రానికి వైజయంతీ మూవీస్ సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నట్లు వార్తలు షికార్లు చేశాయి. ఇవి కాస్త వైజయంతీ మూవీస్ సంస్థ వరకు వెళ్లడంతో ఆ సంస్థ అధికారిక ప్రకటనను ఇచ్చింది.

‘‘చిరంజీవి గారి తదుపరి చిత్రాన్ని మేము నిర్మిస్తున్నాం అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. మేము మెగాస్టార్‌కు 4 గుర్తుండిపోయే చిత్రాలను ఇచ్చాము. మెగాస్టార్‌తో ఐదో చిత్రాన్ని తీయాలనుకున్నప్పుడు దాన్ని గర్వంగా ప్రకటిస్తాం’’ అంటూ కామెంట్ పెట్టారు. కాగా చిరంజీవి కోసం కొరటాల శివ ప్రస్తుతం స్ర్కిప్ట్‌ను సిద్ధం చేస్తుండగా.. జనవరి నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొరటాల శివ సంయుక్తంగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. 

 ‘దేవదాస్‌’కు సెన్సార్ పూర్తి

Updated By ManamTue, 09/25/2018 - 11:18

Devadasనాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన చిత్రం ‘దేవదాస్’. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సెన్సార్ పూర్తైంది. చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్‌లు లేకుండా ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ను ఇచ్చారు. ఇక ఈ చిత్రంలో నాగార్జున డాన్ పాత్రలో కనిపిస్తుండగా.. నాని డాక్టర్‌గా నటించాడు. వీరిద్దరి సరసన ఆకాంక్ష సింగ్, రష్మిక కనిపించనున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌, ఆడియోతో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.‘మహానటి’ సావిత్రి డబ్బింగ్‌ను చూశారా..?

Updated By ManamSun, 05/20/2018 - 13:12

Savitri సావిత్రి జీవితకథ ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం ‘మహానటి’. ఈ చిత్రంలో సావిత్రి పాత్రకు తన నటనతో ప్రాణం పోసింది కీర్తి సురేశ్. సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో అయితే కీర్తి, సావిత్రిని గుర్తుచేసింది పలువురు విమర్శకులు ప్రశంసలు కురిపించారు. కాగా ఈ చిత్రం కోసం కీర్తి సురేశ్ చెప్పిన డబ్బింగ్‌కు సంబంధించిన వీడియోను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆ వీడియోలో కూడా తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మరోసారి అందరినీ ఆకట్టుకుంటోంది కీర్తి సురేశ్. ఇదిలా ఉంటే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 ఎన్టీఆర్‌, వైజ‌యంతి మూవీస్.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

Updated By ManamWed, 05/16/2018 - 15:51

ntrయంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో తొలి విజ‌యంగా నిలిచిన చిత్రం 'స్టూడెంట్ నెం.1'. ఆ సినిమాని వైజ‌యంతి మూవీస్ సంస్థ‌కి అనుబంధ సంస్థ అయిన స్వ‌ప్న సినిమా నిర్మించింది. ఆ త‌రువాత తార‌క్‌, వైజ‌యంతి మూవీస్ కాంబినేష‌న్‌లో 'కంత్రి', 'శ‌క్తి' చిత్రాలు వ‌చ్చాయి. త్వ‌ర‌లోనే మ‌రో సినిమా ప‌ట్టాలెక్క‌నుంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం.. 'రాజా రాణి', 'పోలీస్‌', 'అదిరింది' వంటి త‌మిళ అనువాద చిత్రాల‌తో తెలుగు వారికి చేరువైన యువ ద‌ర్శ‌కుడు అట్లీ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ని తెలిసింది. 2019 ద్వితీయార్థంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవ‌కాశ‌ముంది. వైజ‌యంతి మూవీస్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించ‌నున్న ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా ఆ చిత్రం తెర‌పైకి రానుంది. అక్టోబ‌ర్ నుంచి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ పట్టాలెక్క‌నుంది. రామ్ చ‌ర‌ణ్ ఇందులో మ‌రో హీరోగా న‌టించ‌నున్నారు.

Related News