telecom

నెట్ న్యూట్రాలిటీకే సై!

Updated By ManamWed, 07/11/2018 - 23:34
  •  ట్రాయ్ సిఫారసులకు ఆమోదం .కొన్నింటికి మినహాయింపులు.. 

  • ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు.. అందరికీ సమానంగా నెట్: కేంద్రం

net-nuetralityన్యూఢిల్లీ: ఇంటర్నెట్ సమానత్వనికే (నెట్ న్యూట్రాలిటీ) కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ మేరకు ట్రాయ్ ప్రతిపాదించిన సిఫారసులను ఆమోదించింది.  ఇందుకు సంబంధించి కొత్త నిబంధనలకు ఆమోదం తెలిపింది. నెట్ న్యూట్రాలిటీకే కేంద్రం అంగీకరించినందున.. ఇకపై టెలికం కంపెనీలు ఇంటర్నెట్ వాడకందార్లందరికీ ఒకేరకమైన వేగం(స్పీడ్), డౌన్‌లోడింగ్ సామర్థ్యంతో సేవలందించాల్సి ఉంటుంది.

కొందరికి వేగంగా, మరికొందరికి మందకొడిగా.. కొందరికి అపరిమితంగా, మరి కొందరికి పరిమితంగా, ఒకే వెబ్‌సైట్లో కొన్ని అంశాలు తొందరగా, మరికొన్ని ఆలస్యంగా తెరుచుకోవడం లాంటివి ఇకపై ఉండదు. ఒకవేళ ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కొత్త నిబంధనల ప్రకారం టెలికం కంపెనీలకు, మొబైల్ కంపెనీలకు. ఇంటర్నెట్ ప్రొవైడర్లు భారీగా జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే.. ఇందుకు విరుద్ధంగా ఏవైనా కంపెనీలు లేదా సంస్థలు ఆయా సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.

ఇంటర్నెట సేవలు అందించడంలో ఒకరికి  ఒకరికి ఎక్కువ, వేరొకరికి తక్కువ ప్రాధాన్యం లభించేలా చేయకూడదు. అయితే కొన్ని అటానమస్ సంస్థలు, టెలీమెడిసిన్ వంటి వాటికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఈ సంస్థల అవసరాల నేపథ్యంలో సాధారణం కన్నా వాటికి ఎక్కువ వేగంతో సేవలు అందించొచ్చు. బుధవారం జరిగిన టెలికం కమిషన్ సమావేశంలో ‘నెట్ న్యూట్రాలిటీ’కి సానుకూలంగా నిర్ణయం తీసుకున్నామని, ఇది తక్షణమే అమలులోకి వస్తుందని కేంద్ర టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ వెల్లడించారు. ఆశలు రేపుతున్న టెలికాం ముసాయిదా

Updated By ManamWed, 05/02/2018 - 22:00

telecomన్యూఢిల్లీ: స్పెక్ట్రమ్ చార్జీలతో సహా లెవీలను హేతుబద్ధీకరించి, రుణాలతో కుంగుతున్న టెలికాం రంగంలో తిరిగి జవజీవాలు నింపుతామని నూతన టెలికాం విధాన ముసాయిదా వాగ్దానం చేసింది. అందరికీ 50 ఎంబీపీఎస్ స్పీడ్‌తో బ్రాడ్‌బ్యాండ్ యాక్సెస్, 5జి సర్వీసులు కల్పించాలని ప్రతిపాదించింది. ఈ రంగంలో 2022 నాటికి 40 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించవచ్చని తెలిపింది. ‘జాతీయ డిజిటల్ కమ్యూనికేషన్ల విధానం 2018’ అనే శీర్షికతో విధాన ముసాయిదాను ప్రభుత్వం మంగళవారంనాడు ఆవిష్కరించింది. రెగ్యులేటరీ సంస్కరణల సహాయంతో 2022 నాటికి డిజిటల్ కమ్యూనికేషన్ల రంగంలో 100 బిలియన్ అవెురికన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. లెసెన్సు ఫీజులు, స్పెక్ట్రమ్ వాడక చార్జీలు, యూనివర్శల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ లెవీ వంటివన్నీ టెలికాం సర్వీసుల ఖరీదును పెంచుతున్నాయి. వాటిని సమీక్షించనున్నట్లు ముసాయిదా ప్రకటించింది. భారతదేశపు జి.డి.పికి ఈ రంగ కంట్రిబ్యూషన్ 2017లో సుమారు 6 శాతంగా ఉంది. దాన్ని 8 శాతానికి పెంచాలని సంకల్పించింది. డిజిటల్ కమ్యూనికేషన్లకు సరసమైన ధరకు స్థిరమైన యాక్సెస్ కల్పించేందుకు ‘‘స్పెక్ట్రమ్ ధరను సర్వోత్తమమైన’’ రీతిలో రూపొందించాలని ప్రతిపాదించింది. అధిక స్పెక్ట్రమ్ ధర, సంబంధిత చార్జీలు టెలికాం సర్వీసుల విభాగానికి ప్రధాన సమస్యగా ఉన్నాయి. టెలికాం సర్వీసుల రంగం దాదాపు రూ. 7.8 లక్షల కోట్ల రుణ భారంతో కునారిల్లుతోంది. మిడ్-బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను గుర్తించాలని, ముఖ్యంగా తదుపరి నెట్‌వర్క్‌లకు 3గెగాహెర్ట్జ్, 24 గెగాహెర్ట్జ్ రేంజ్ కల్పించాలని ముసాయిదా ప్రతిపాదించింది. ‘ఇ’, ‘వి’ బ్యాండ్లలో మొబైల్ టవర్ల మధ్య సిగ్నల్స్ ప్రసారానికి బ్యాక్‌హాల్ స్పెక్ట్రమ్‌కి డిమాండ్ విపరీతంగా ఉంది. అంతర్జాతీయంగా అమలులో ఉన్న ఉత్తమ ప్రమాణాలకు అనుగుణంగా దాన్ని తెచ్చేందుకు స్థూలంగా ఒక రోడ్‌మ్యాప్‌ను ఈ ముసాయిదా అందించింది. పెట్టుబడులు, పరికల్పనలు, వినియోగదార్ల ప్రయోజనాలకు భంగకరంగా ఉన్న  రెగ్యులేటరీ ప్రతిబంధకాలను తొలగించేందుకు, రెగ్యులేటరీ భారాన్ని తగ్గించేందుకు కృషి చేస్తామని ముసాయిదా వాగ్దానం చేసింది. హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌లను నిర్మించేందుకు నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ ప్రారంభించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఆప్టికల్ ఫైబర్ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు వీలు కల్పించే నిబంధనలను దీనిలో పొందుపరుస్తారు. అన్ని వాణిజ్య, నివాస, కార్యాలయ ఆవరణల్లో టెలికాం సదుపాయాలు ఏర్పాటు చేయాలని, అనుబంధ కేబ్లింగ్, ఇన్-బిల్డింగ్ సొల్యూషన్లను తప్పనిసరి చేయాలని ముసాయిదా ప్రతిపాదించింది. దీనికోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ద్వారా నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియాకు సవరణ తీసుకురావాలని సంకల్పించింది. ఉపగ్రహ కమ్యూనికేషన్ విధానాన్ని సవరించాలని కూడా ముసాయిదా ప్రతిపాదించింది. దేశంలో రిజిస్టరైన మేధాపరమైన ఆస్తి హక్కులతో కూడిన ఉత్పత్తుల వాడకాన్ని ప్రోత్సహించాలని ప్రతిపాదించింది. 

Related News