cricket betting racket

బుకీల్లో ఎక్కువమంది ఇండియన్లే

Updated By ManamFri, 10/19/2018 - 23:49
  • ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ వెల్లడి  

imageన్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌లో అవినీతికి పాల్పడుతున్న బుకీల్లో చాలా మంది భారతీయులే ఉన్నట్టు అనేక సర్వేల్లో తేలిందని ఐసీసీ ఉన్నాతాధికారి చెప్పారు. శ్రీలంక క్రికెట్ అవినీతికి సంబంధించిన దర్యాప్తు చేస్తున్న ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ (ఏసీయూ) జీఎం అలెక్స్ మార్షల్ మాట్లాడుతూ.. ఈ అవినీతిలో స్థానికులతో పాటు భారత బుకీలు కూడా ఉన్నారని చెప్పారు. ‘శ్రీలంకలో స్థానిక, భారత అవినీతిపరులు ఉన్నారు. ప్రపంచంలోని ఇతర దేశాల్లో చాలా మంది బుకీలు భారతీయులే’ అని మార్షల్ చెప్పినట్టు ఓ ఆంగ్ల క్రికెట్ వెబ్‌సైట్ పేర్కొంది. శ్రీలంక మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో లెజెండ్ సనత్ జయసూర్య సహకరించడం లేదని ఆయనపై ఐసీసీ చర్యలకు సిద్ధమైన విషయం విదితమే.

ఇంగ్లాండ్, శ్రీలంక వన్డే సిరీస్‌ల్లో ఆయా దేశాల క్రికెటర్లను ప్రలోభ పెట్టిన వారి వివరాలను ఐసీసీ ఏసీయూ తెలిపింది. 2000 సంవత్సరంలో ప్రపంచ క్రికెట్‌ను కుదిపేసిన మ్యాచ్ ఫిక్సింగ్‌లో భారత బుకీల హస్తముండటం మార్షల్‌ను ఆశ్చర్యపరచలేదు. ‘ఇంగ్లాండ్, శ్రీలంక ప్లేయర్స్‌తో మాట్లాడేటప్పుడు మేము కొన్ని పేర్లను చెబుతూ ఫొటోలు కూడా చూపించాం. వీళ్లు శ్రీలంక, ఇంగ్లాండ్ జట్లు ఎక్కడ ఆడినా ఆ మ్యాచ్‌లను ఫిక్సింగ్ చేసేందుకు క్రికెటర్లతో సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేము ఈ బుకీల తాజా సమాచారాన్ని కనుగొన్నాం. వాళ్ల ఫొటోలను, పేర్లను, వివరాలను క్రికెటర్లకు తెలిపాం. ఈ విధంగా క్రికెటర్లకు తగినంత సమాచారం ముందే ఇవ్వాలని భావించాం. క్రికెటర్లు కూడా మరికొంత సమాచారం ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు’ అని మార్షల్ వివరించారు. ప్రస్తుతం ఐసీసీ 12 నుంచి 20 మంది బుకీల కదలికలను గమనిస్తున్నామన్నారు. అందులో ప్లేయర్స్ బాగా భయపడుతున్న ఆరుగురు ఉన్నారని ఆయన చెప్పారు. ‘మేము ఆరుగురిని చూపించాం. ఆ ఆరుగురూ పురుషులే. కానీ ఇద్దరు మహిళల కూడా ఉన్నారు’ అని మార్షల్ అన్నారు. 

తప్పు చేశాను.. క్షమించండి: కనేరియా
imageనిషేధిత పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా చివరికి తన తప్పును ఒప్పుకున్నాడు. తప్పు చేశానని.. క్షమించమని ఆ దేశ క్రికెట్ వర్గాలను, అభిమానులను వేడుకున్నాడు. ‘క్రికెట్ బోర్డు, నా అభిమానులు, పాకిస్థాన్ ప్రజలు నా పరిస్థితిని అర్థం చేసుకుని క్షమిస్తారని భావిస్తున్నాను. బుక్ మేకర్ (అను భట్)తో కలిసి నేను తప్పు చేశాను. ఆ విషయాన్ని అధికారులకు చెప్పకపోవడంతో ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నాను’ అని గురువారం కనేరియా మీడియాతో మాట్లాడాడు. కనేరియా పశ్చాత్తాపం పాక్ క్రికెట్ వర్గాలను షాక్‌కు గురిచేసింది. ‘నేను షాక్ తిన్నాను. ఎందుకంటే మొదట్లో డానిష్ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకుని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారుల వద్దకు వెళ్లాను. డానిష్ వాదన వినాలని.. అతను నిర్దోషి అని వాళ్లకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించాను’ అని మాజీ టెస్టు కెప్టెన్ రషీద్ లతీఫ్ అన్నారు. అల్ జజీరా చానెల్‌లో కనేరియా తన తప్పును ఒప్పుకుని పాక్ క్రికెట్ వర్గాన్ని కించ పరిచాడని లతీఫ్ చెప్పారు. 2012 ఇంగ్లీష్ కౌంటీ మ్యాచ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినప్పటి నుంచి కనేరియాపై నిషేధం కొనసాగుతోంది. 

కనేరియా తప్పును ఒప్పుకోవడం వల్ల పాకిస్థాన్ క్రికెట్ పరువు ప్రతిష్ట దెబ్బతిందని మాజీ లెగ్ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ అన్నారు. ‘వీళ్లేం మాట్లాడుతున్నారో దేవునికే తెలియాలి. స్పాట్ ఫిక్సింగ్, డోపింగ్ కేసులు వంటి తప్పుడు పనుల వల్ల మాకు పబ్లిసిటీ వస్తోంది. కనేరియా అందరి ముందు తప్పును ఒప్పుకోవడం చాలా బాధకలిగించింది’ అని ఖాద్రి చెప్పారు.



జూద ‘క్రీడలు’

Updated By ManamWed, 07/11/2018 - 00:55

దేశంలో విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ జూదాన్ని (గాంబ్లింగ్)/పందాల్ని (బెట్టింగ్) అరికట్టడంలో విఫలమవుతున్న ప్రభుత్వం ఒకవైపు నానాపాట్లు పడుతుంటే, లా కమిషన్ ఆఫ్ ఇండియా వాటిని చట్టబద్ధం చేయవలసిందిగా సిఫా ర్సు చేసింది. క్రికెట్‌తో పాటు ఆటల పోటీలపై సాగుతున్న బెట్టింగ్‌లను, జూదానికి సంబంధించిన వివిధ కార్యకలాపాల్ని  కొన్ని నియంత్రణలకు లోబడి చట్ట బద్ధం చేయాలని, వీటిని నిషేధించడం కంటే చట్టబద్ధంగా కొన్ని పరిమితుల్లో ని యంత్రిస్తూ అనుమతించడమే మేలని కమిషన్ అభిప్రాయపడింది.

‘ఆనాడు ధర్మ రాజు జూదంలో భార్యా సోదరుల్ని పణంగా పెట్టాడు. ఎందుకంటే జూదంపై అ ప్పట్లో నియంత్రణలు లేవు. ఉండుంటే అంతటి మహాభారత కథ ఉండదు. జూ దం ఆడితే ఆదాయం పెరుగుతుంది. దానిపై పన్నూ విధిస్తే ప్రభుత్వానికీ ఆదా యం సమకూరుతుంది. గ్లోబల్ స్థాయిలో వివిధరకాల ఆన్‌లైన్ జూద కార్యక లాపాలు పెరిగిపోయి, వాటిని అరికట్టడం ప్రభుత్వాలకు అసాధ్యంగా మారిన నే పథ్యంలో వాటికి చట్టబద్ధత కల్పించడమే సరైనదని’ అంటూ పురాణాలను వల్లె వేస్తూ లా కమిషన్ వాదించడం విడ్డూరం.

image


1957లో బాంబే రాష్ట్రం వర్సెస్ చామ ర్‌బాగ్వాలా మధ్య నడచిన కేసు సందర్భంగా కౌటిల్యుడు కూడా జూద కార్య కలాపాలపై పన్నుల ద్వారా ఖజానాకు వస్తున్న ఆదాయాన్ని ప్రోత్సహించిన విష యాన్ని సుప్రీంకోర్టు కూడా ఉటంకించడం విదితమే. వ్యసనాలను చట్టబద్ధం చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని మాత్రమే చూస్తూ, ప్రజలను దివాలా తీయించి, చివరికి పూర్తిస్థాయిలో పతనం కావడానికి, కేసినో కార్పొరేట్లు మరింత సంపన్నులయ్యేందుకు హేతువైన వ్యసనాలను ప్రోత్సహించడం ప్రజాప్రభుత్వాలకు తగనిపని. అమెరికాలోని ‘ప్రపంచ జూదశాల’గా పేరొందిన ‘లాస్ వెగాస్’ నగరాన్ని ‘సిన్ సిటీ’ (పాపాల నగరం)గా అక్కడి ప్రజలు పిలుస్తుండడంలోని ఆంతర్యాన్ని గుర్తించలేని అమాయకులు కారు మన పాలకులు. 2016లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ పోటీల సందర్భంగా వెలుగులోకి వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ అక్రమాలను అధ్యయనం చేసి క్రీడలపై బెట్టింగ్ కార్యకలాపాలను చట్టబద్ధం చేయాలని జస్టిస్ ఆర్ లోథా కమిటీ సిఫార్సులపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆ విషయంపై సమగ్రంగా పరిశీలించి నివేదిక రూపొందించాలని లా కమిషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. బెట్టింగ్/గ్యాంబ్లింగ్‌లను చట్టబద్ధం చేసేందుకు సంబంధిత చట్టాలను సవరిం చాలని సిఫార్సు చేస్తూ గతవారం లా కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించడంతో వివాదం చెలరేగింది. 

జూదం మనదేశంలో చట్టవిరుద్ధమైనది. 1867 పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ప్రకారం పందెం (లేదా అదృష్టం) ద్వారా జరిగే ఏ ఒప్పందమైన చట్ట విరుద్ధై వ్యవహారమవుతుంది. అయితే దేశవ్యాప్తంగా చిన్న, పెద్ద జూద గృహాలు నిరాటంకంగా, చట్టానికి సమాంతరంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కార్యకలాపాలపై ఎలాంటి నియంత్రణ లేదు కాబట్టి ప్రభుత్వ ఆదాయానికి ఆ మేరకు గండి పడుతోందని ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తల అభిప్రాయం. దేశంలో ఏడాదికి 3 లక్షల కోట్ల బెట్టింగ్ పారిశ్రామిక కార్యకలాపాలు నడుస్తున్నాయనే సంచలనాత్మక సమాచారాన్ని 2013లో ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) నివేదిక  వెల్లడించింది. ఇంత పెద్ద ఆదాయ ఒనరును ప్రభుత్వాలు వదలుకోవడం సమంజసం కాదని పలువురి అభిప్రాయం. ఈ నేపథ్యంలో బెట్టింగ్ లావాదేవీలు పాన్, ఆధార్ కార్డులతో అనుసంధానం చేయడం; కేసినోలు, ఆన్‌లైన్ గేమింగ్ ఇండస్ట్రీల్లో విదేశీ ప్రత్యక్ష మదుపు(ఎఫ్‌డీఐ)లను అనుమతించేందుకు చట్టాన్ని సవరించడం వల్ల ఖజానాకు ఆదాయం సమకూరుతుందని లా కమిషన్ సిఫార్సు చేసింది. బ్రిటిష్ రాజ్యం రూపొందించిన జూద చట్టాల్నే ఇండియా ఇప్పటికే అనుసరిస్తోందనీ, ఆ దేశం దశాబ్దాల క్రితమే జూదం/బెట్టింగ్ కార్యకలాపాల్ని చట్టబద్ధం చేసిన విషయాన్ని మన పాలకులు గుర్తించక పోవడం వల్ల ఆర్థికంగా చాలా నష్టం వాటిల్లిందనే వాదన రోజురోజుకు బలపడుతోంది. ఇప్పటికే ఉనికిలో ఉన్న లక్షల కోట్ల రూపాయల అక్రమ వ్యాపారాన్ని చట్టబద్ధం చేయడం దేశ, విదేశీ కార్పొరేట్ శక్తులకు చాలా అవసరం. గుర్రపు పందేలు, బైక్, సైకిల్, బోట్ రేసింగ్‌ల నుంచి జూదగృహాల దాకా లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు నడిచే మార్కెట్‌ను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదని, అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాల్లోని గ్యాంబ్లింగ్ చట్టాలను భారత్ కూడా రూపొందించాలని దేశ, విదేశీ కార్పొరేట్ శక్తులు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. 

గతంలో సమాజం నీతిబాహ్యమైన చర్యలుగా (కనీసం బహిరంగంగా) పరి గణిస్తున్న వ్యభిచారం, అవినీతి కార్యకలాపాలను చట్టబద్ధం చేయాలని పలువురు అభిప్రాయపడ్డారు. రానురాను డబ్బు తప్ప మరే ఇతర విలువ కూడా మిగల కుండా పోతున్న ప్రపంచంలో చట్టవిరుద్ధమైనవి, సామాజికంగా అనైతికమైనవి, అక్రమ/చీకటి వ్యవహారాలన్నీ రానురాను అత్యున్నత సంప్రదాయాలుగా, విలు వలుగా చట్టబద్ధతను సంతరించుకుంటున్నాయి. వడ్డీ వ్యాపారం, మత్తుమందు వ్యసనాలు, స్వలింగ సంపర్కం వంటి వ్యక్తిగత, సామాజిక విషయాలు ఒకప్పు డు అనైతికమైనవిగా పరిగణించేవారు. ప్రపంచ మతాలన్నీ ఒకప్పుడు వ్యతిరేకిం చిన వడ్డీ వ్యాపారం ఆ తర్వాత క్రమంలో లాభసాటి చట్టబద్ధ కార్యకలాపంగా సమాజంలో విస్తరించింది. మత్తుమందు వ్యసనం ప్రస్తుతం ఒక ఫ్యాషన్‌గా, హో దాగా మారిందనడంలో ఆశ్చర్యపోవలసిన పనిలేదు. ప్రపంచంలో కొన్ని దేశాల్లో గంజాయి తాగడాన్ని, ఇళ్ళ పెరడులో సైతం సాగుచేసుకోవడం చట్టబద్ధమైంది. అదే విధంగా స్వలింగ సంపర్కుల హక్కులను గుర్తిస్తూ అనేక దేశాల్లో ఉద్యమా లు వచ్చాయి, పర్యవసానంగా చట్టాలూ ఉనికిలోకి వచ్చాయి. స్వలింగ సంపర్కం వంటి చారిత్రకంగా సామాజిక అపార్థానికి గురైన కొన్ని విషయాలను పునఃసమీక్షించుకుని, పునర్నిర్వచించుకొని సమాజాలు అందుకు అనుగుణమైన విలువలను, హక్కులను రూపొందించుకోవలసిన అవసరాన్ని కాదనలేము.

అయితే వ్యక్తిత్వం రీత్యా, వ్యక్తిగత ఆరోగ్యం రీత్యా హానికరమైన, సామాజికంగా ప్రజల జవజీవాలను, ఉత్పాదక శక్తిసామర్థ్యాలను, మానసిక ప్రతిభా పాటవాలను నిర్వీర్య పరచే మత్తుమందుల వంటి నిర్ధారిత వ్యసనాలకు తిరిగి పట్టం కట్టడం చారిత్రక మహాపవాదు అవుతుందని పాలకులు గుర్తించడం లేదు. మత్తుమందులు వ్యక్తుల, సామాజిక సమర్థతలను శారీరకంగా నిర్వీర్య పరచేం దుకు దోహదం చేస్తే, జూదం/పందెం వంటి అక్రమ కార్యకలాపాలు ద్రవ్య పరమైన ‘మాదక ద్రవ్య వ్యసనం’గా మారి ఆర్థిక వ్యవస్థను డొల్ల చేస్తుంది. ఇప్పటికే షేర్ల కొనుగోలు, అమ్మకాల వ్యవహారాల రూపంలోని అతి పెద్ద జూద క్రీడ ఆర్థిక వ్యవస్థకు చీడగా మారింది. సమాజంలో వస్తూత్పత్తి రంగంలో ఆదాయాల కంటే ద్రవ్య వ్యాపార రంగంలో లాభాల రేటు పెరుగుతున్న కొద్దీ సమాజంలోని ప్రబల ఆర్థిక శక్తులు కేసినోలు, పర్యాటకం వంటి అనుత్పాదక, సేవా రంగాలవైపు మరలుతాయి. ప్రైవేట్ వ్యాపారాలు, ముఖ్యంగా బ్యాంకులు, మదుపులు, షేర్లు వగైరాలపై పెద్ద మొత్తాలను వెచ్చిస్తున్న ఆర్థిక వ్యవస్థ ఒక పెద్ద జూదగృహంలా తయారవుతుంది. ‘వడ్డీ భుక్త రాజ్యాలు’  (అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రబలంగా ఉనికిలోకి వచ్చిన ‘జూద పెట్టుబడిదారీ విధానం’-కేసినో కేపిటలిజం) ప్రపంచమంతా ఆవరించడంతో ప్రపంచ ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది.

వ్యవసాయ- పారిశ్రామిక రంగాలను సమన్వయించి, వస్తూత్పత్తిపై ప్రధానంగా కేంద్రీకరిస్తూ, స్థానిక మార్కెట్లపై ఆధారపడిన వ్యాపార లావాదేవీల పునాదిగా, స్థానిక ప్రజల కొనుగోలు శక్తిని పెంపొందించే ఆర్థిక విధానాలను రూపొందించడాన్ని మన పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దేశాన్ని ఆర్థిక అంధకారంలోకి కూరుకుపోయేందుకు దోహదం చేసే అభివృద్ధి చెందిన దేశాల ‘జూద పెట్టుబడిదారీ విధానాల’ను పాలకులు గుడ్డిగా అనుసరించడాన్ని ప్రతిఘటించక తప్పదు. 



కర్నూల్‌లో క్రికెట్ బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్ట్

Updated By ManamMon, 04/23/2018 - 22:43

Kurnool police busts cricket betting racket, 10 bookies arrested ...

కర్నూలు: జిల్లాలో జోరుగా క్రికెట్ బెట్టింగులు సాగుతున్నాయి. పోలీసులు పదే పదే బెట్టింగ్‌రాయుళ్లను పట్టుకుని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ పెద్దగా ప్రయోజనంలేకుండా పోతోంది. తాజాగా.. పక్కా సమాచారంతో బెట్టింగ్ స్థావరాలపై దాడిచేసిన పోలీసులు పదిమందిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 10లక్షలు స్వాధీనం చేసుకున్నారు. టీవీలు, ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. అరెస్టయిన వారికి కడప, కర్నూలు, హైదరాబాద్ ముఠాలతో సంబంధాలున్నట్లు విచారణలో తేలింది. గత రెండ్రోజులు బెట్టింగ్ స్థావరాలపై పోలీసులు వరుస దాడులు జరిపినట్లు సమాచారం.





Related News