harish rao

మహాకూటమి చిత్తుగా ఓడుతుంది

Updated By ManamFri, 10/12/2018 - 01:24
 • తెలంగాణ అభివృద్ధిని చూసి ఓటెయ్యండి

 • ఆందోల్ అభ్యర్థి క్రాంతికుమార్‌ను గెలిపించండి

 • ఆపధ్ధ్దర్మ మంత్రి తన్నీరు హరీష్‌రావు

harish raoరాయికోడ్: రాష్ట్రంలో మహాకూటమి చిత్తుగా ఓడుతుందని, తెరాస హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఆందోల్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతికిరణ్‌ను గెలిపించాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ ఆపధర్మ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. రాయికోడ్ మండల కేంద్రంలోనిచౌరస్తా (చిమ్నాపూర్) శివారులో ఆందోల్ నియోజక వర్గ స్థాయి తెరాస కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  హాజరైన మంత్రి మాట్లాడుతూ సమైఖ్య పాలనలో రైతులకు సాగు నీరందక పంటలు ఎండిపోయాయని, తెరాస పాలనలో రైతులకు రెండు పంటలకు నీరందించామన్నారు. కాళేశ్వరం గోదావరి నుండి జలాలను తెచ్చి సింగూరు ప్రాజెక్టును నింపుతామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యప్తంగా మహాకూటమి చిత్తు చిత్తుగా  ఓడిపోతుందని  చెప్పారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ తెలంగాణ రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్  ఆదర్శమైన పథకాలను ప్రవేశపెట్టి,  అభివృద్దిని చేసి చూపించారని అన్నారు.  ఎన్నికల్లో ప్రజలు తెరాసకు అండగా నిలవాలని కోరారు. ఎమ్మెల్సీ ఎండీ ఫరీదొద్దిన్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం షాదీముబారక్ సహా తదితర పథకాలతో ప్రజలకు అండగా నిలిచారన్నారు. ఈ సందర్భంగా అందోల్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ ప్రజలు ఆశీర్వదించి నన్ను గెలిపిస్తే అన్ని వర్గాల ప్రజలు అండగా నిలిచి అభివృద్ది చేసి చూపిస్తా అని అన్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుండి పలువురు తెరాసలో చేరారు. జాగృతి ఆధ్వర్యంలో కళాకారులు సంక్షేమ పథకాలను వివరిస్తు ధూంధాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి, జాగృతి రాష్ట్ర నాయకులు భిక్షపతి, సినీ నిర్మాత మల్కాపురుం శివకుమార్, రాయికోడ్ టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు చేవెళ్ల విఠల్, ఏఎంసీ చైర్మెన్ ఏసయ్య, రై.స.స కన్వినర్ బస్వరాజ్ పాటిల్, నాయకులు మల్లికార్జున్ పాటిల్, టీఆర్‌ఎస్ మండల యువత నాయకులు కాశీ బస్వరాజ్ పాటిల్, గంప చంద్ర శేఖర్, సాయిపేట మానిక్యం, మహ్మద్ సలీం, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.ఉత్తమ్‌ కుమార్‌వి పగటి కలలు..

Updated By ManamThu, 10/11/2018 - 13:29
 • అమరావతి నుంచి వచ్చిన స్ర్కిప్ట్‌ను ఉత్తమ్ చదివారు

 • చంద్రబాబు మోచేతి కింద నీళ్లు తాగుతున్నారు

 • నాలుగు సీట్లు గెలవడం కోసం రాజకీయ వ్యభిచారం

Karne Prabhakar slams Uttam kumar reddy

హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, ఎంఎస్ ప్రభాకర్ రావు కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో వారు గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘ఉత్తమ్ కుమార్ రెడ్డి అమరావతి నుంచి వచ్చిన స్ర్కిప్ట్‌ను చదివారు. టీడీపీకి కట్టుబానిసలమని ఉత్తమ్ రుజువు చేసుకున్నారు. విభజన హామీల అమలు కోసం టీఆర్ఎస్ ఎప్పటి నుంచో అడుగుతోంది.

హరీశ్ రావు సంధించిన 12 ప్రశ్నలపై ఉత్తమ్ డొంక తిరుగుడు సమాధానం ఇచ్చారు. నదీ జలాల పంపకంపై ఉత్తమ్‌కు కనీస అవగాహన లేదని తేలిపోయింది. సైన్యంలో కెప్టెన్‌గా పనిచేశానని చెప్పుకునే ఆయనకు కనీస పరిజ్ఞానం లేదు. నదీ జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు వస్తే పరిష్కరించడానికి అపెక్స్ బాడీ ఉంది. ఆ అపెక్స్ బాడీ ముందు చంద్రబాబు తెలంగాణ నీటి కేటాయింపులకు ససేమిరా అన్నారు. ఉత్తమ్ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి చంద్రబాబుకు వత్తాసు పలికారు. అన్ని అనుమతులున్న సాగునీటి ప్రాజెక్టులకు చంద్రబాబు అడ్డుపడుతున్నారు.

ఉత్తమ్ దాన్ని సమర్థిస్తూ, అవివేకిలా చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నారు. హరీశ్ లేఖకు స్పందిస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నదని టీఆర్‌ఎస్ నిర్ధారించిందని అడ్డగోలుగా మాట్లాడుతూ పగటి కలలు కంటున్నారు. చంద్రబాబు ఎజెండానే కాంగ్రెస్ ఎజెండా అని ఉత్తమ్ చెప్పకనే చెప్పారు. అపుడు ఆంధ్రా కాంగ్రెస్ నేతల మోచేతి కింద నీళ్లు తాగారు. ఇపుడు చంద్రబాబు మోచేతి కింద నీళ్లు తాగుతున్నారు. 

తెలంగాణ ఆత్మగౌరవాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టే కుతంత్రాల కూటమే మహాకూటమి. తెలంగాణ ప్రజల కోసమే ఆ అపవిత్ర కూటమిని ఎండగడుతున్నాం. తెలంగాణ ప్రజలు మహాకూటమికి సరయిన సమాధానం చెబుతారు. ప్రజలకు మహాకూటమి ప్రాతిపదికలు చెప్పాలి. కేవలం నాలుగు సీట్లు గెలవడం కోసం రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు. మీ కుట్రలను తెలంగాణ సమాజం ఆమోదించదు. 

హరీశ్ రావు పన్నెండు ప్రశ్నలు ఏమున్నాయో కనీసం చదవకుండానే అమరావతి ఆదేశాలతో ఉత్తమ్ స్పందించారు. ఉత్తమ్ అజ్ఞానానికి చింతిస్తున్నాం. మేము గతంలో పెట్టుకున్న పొత్తులకు సిద్ధాంత ప్రాతిపదిక ఉంది. నల్గొండ జిల్లాలో దామరచర్ల పవర్ ప్లాంట్‌ను కోమటి రెడ్డి, ఉత్తమ్ వ్యతిరేకించడం దారుణం. తెలంగాణకు మేలు చేసే ప్రాజెక్టును వ్యతిరేకించడం సిగ్గు చేటు. కాంగ్రెస్ నేతలు ఎంత వ్యతిరేకించినా దామరచర్ల ప్లాంట్ కట్టి తీరుతాం.’ అని స్పష్టం చేశారు. నర్సారెడ్డికి హరీశ్ బుజ్జగింపు

Updated By ManamThu, 10/11/2018 - 06:37
 • అన్యమనస్కంగా ప్రచారంలో నర్సారెడ్డి

 • ఎప్పటికైనా ఆయనది‘చేతి’వాటమే?

narsareddyసిద్దిపేట: టీఆర్‌ఎస్ అగ్ర నాయకత్వంపై అలిగి కాంగ్రెస్ వైపు చూస్తున్న గజ్వేల్ ముఖ్య నాయుకుడు తూంకుంట నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. గజ్వేల్ నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక క్యాడర్, మాస్ ఇమేజ్ ఉన్న లీడర్‌గా గుర్తింపు ఉన్న నర్సారెడ్డికి టీఆర్‌ఎస్ పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడం మూలంగానే పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నాడని ఆయన అనుచరులు చెబుతున్నారు.  రోడ్ కార్పొ రేషన్ ఛైర్మన్‌గా ఉన్న నర్సారెడ్డి ఉన్నప్పటికీ పార్టీలో గుర్తింపు లేకుండా పోవడంతో ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరిగింది.  అంతే వెంటనే సీఎం ఆదేశాల మేరకు ట్రబుల్ షూటర్ మంత్రి హరీశ్‌రావు రంగంలోకి దిగి సమస్య సమసి పోయేలా సంప్రదింపులు చేశారు. బుధవారం మంత్రి హరీశ్‌రావుతో కలిసి గజ్వేల్ నియోజక వర్గం జగదేవ్‌పూర్‌లో ప్రచారంలో సైతం పాల్గొన్నారు. దీంతో నర్సారెడ్డి కాంగ్రెస్‌లో చేరిక ఆగిపోయినట్లయింది. అయితే హరీశ్‌రావుతో చర్చలు జరిపినపప్పటికీ ఆయన అన్యమనస్కంగానే ప్రచారంలో పాల్గొన్నారని సన్నిహిత వర్గాల సమాచారం. ఎవరు ఎన్ని  ప్రచారాలు చేసినా నర్సారెడ్డి మాత్రం కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయం అయిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తనను టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఎవరూ పరామర్శించాడనికి రాలేదని తీవ్ర మనస్తాపం చెందినట్లు  నర్సారెడ్డి సన్నిహితుల సమాచారం. కాగా  గత ఎన్నికల్లో చివరి నిమిషంలో కేసీఆర్‌కోసం పోటీ నుంచి తప్పుకొని  పరోక్షంగా కేసీఆర్ గెలుపునకు సహకరించిన నర్సారెడ్డికి  33 వేల పైచిలుకు ఓట్లు సాధించారు. దీన్ని బట్టి నర్సారెడ్డికి నియోజకవర్గంలో ఎంత పట్టుందో తెలుస్తుందని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటువంటి నాయకుడికే  టీఆర్‌ఎస్ పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో నియోజకవర్గంలో తనకున్న పట్టును నిరూపించుకోవాలన్న ఆలోచనలో భాగంగా తూప్రాన్ మండలం కాళ్లకల్ నుండి భారీ బైక్ ర్యాలీని   ర్యాలీని నిర్వహించారు. ర్యాలీ విషయమై పలువురు ప్రశ్నించగా లక్ష్మీనర్సింహా స్వామి దయతోనే చికిత్స విజయవంతమయిందని అందులో భాగంగా స్వామివారికి మొక్కుతీర్చుకున్నాని చెప్పినట్లు సమాచారం. ఏది ఏమైన తూంకుంట నర్సారెడ్డి పార్టీని వీడి కాంగ్రెస్ చేరడం దాదాపు పూర్తయిందనేది విశ్వసనీయ సమాచారం.హరీశ్‌ మీ మామను అడుగు...

Updated By ManamWed, 10/10/2018 - 20:50
 • హరీశ్‌‌రావుకు ఎల్.రమణ కౌంటర్

L.ramana Counter To Harish Rao Comments

హైదరాబాద్ : మహాకూటమికి సంబంధించి టీవీల్లో, సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న అభ్యర్థుల జాబితా టీఆర్‌ఎస్ కుట్రలో భాగమేనని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. కూటమి భాగస్వామ్య పార్టీల నాయకుల ఉమ్మడి సమావేశంలో అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని, అంతవరకూ వదంతులను నమ్మవద్దని ఆయన కార్యకర్తలకు సూచించారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలనుకుంటున్న టీఆర్‌ఎస్ కుట్రలు ఇక సాగవని, ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు. 

బీజేపీ, ఎంఐఎంతో లోపాయికారి ఒప్పందం చేసుకున్న టీఆర్‌ఎస్‌కు మహాకూటమిని ప్రశ్నించే నైతిక అర్హతలేదన్నారు. హరీశ్‌రావుకు నిజాయితీ ఉంటే ఆ లోపాయికారి ఒప్పందం ఏమిటో తన మామ కేసీఆర్‌ను అడగాలని రమణ దుయ్యబట్టారు. అప్పు తెచ్చిన రూ.లక్ష 50 వేల కోట్లు ఎవరి జేబులోకి వెళ్లాయో హరీశ్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం, ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ నాయకులు బుచ్చిలింగం, సామా రంగారెడ్డితో కలిసి రమణ మీడియా సమావేశంలో మాట్లాడారు.తెలంగాణకు అడ్డుపడ్డ ఆంధ్రాబాబుతో పొత్తా?

Updated By ManamWed, 10/10/2018 - 00:51
 • వందలాది మందిని బలిగొన్న టీడీపీతో కూటమి దేనికి సంకేతం?

 • అమరుల ఆత్మ క్షోభ మీకు పట్టదా? 

 • 12 అంశాలతో ఉత్తమ్, కోదండలకు  హరీశ్‌రావు బహిరంగ లేఖ

 • వెంటనే జవాబు చెప్పాలని డిమాండ్

harish raoహైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పదేపదే అడ్డుకుని, వంద లాది మంది ప్రాణాలను బలితీసుకొన్న ఆంధ్రబాబుతో పొత్తు పెట్టుకోవడమేందని మంత్రి హరీశ్‌రావు కూటమి నేతల తీరును విమర్శించారు. మలిదశ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న అమరుల ఆత్మలు క్షోభించేలా శిఖండి చంద్ర బాబుతో మీరు పొతె్తలా పెట్టుకుంటారని హరీశ్ కాంగ్రెస్, టీజేఎస్ పార్టీలను నిలదీశారు. టీపీసీసీతో పొతును తప్పుబడుగూ ఆయన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి 12 అంశాలతో కూడిన బహిరంగ లేఖ రాశారు. వీటికి వెంటనే జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం టీఆర్‌ఎస్‌ఎల్పీలో ఎర్పాటుచేసిన మీడియా సమావేశంలో మహకూటమి పొత్తులపై హరీశ్‌రావు తనదైన శైలీలో తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఉద్యమాన్ని నీరుగార్చేటందుకు తన రెండు కండ్ల సిద్దాంతం తెచ్చిన చంద్రబాబు పార్టీలో తెలంగాణ పార్టీలు పెట్టుకుంటున్నది షరతులతో కూడిన పొత్తా? సిగ్గులేని పొత్తా స్పష్టం చేయాలంటూ తీవ్ర వాఖ్యలు చేశారు. గతంలో తాము పొత్తు పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్,టీడీపీలతో షరతులతో కూడిన పొత్తు పెట్టుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా తెలంగాణ పట్ల చంద్రబాబు వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారని హరీశ్‌రావు నిలదీశారు.

లేఖలోని అంశాలు... 
(1) తెలంగాణ రాకుండా చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ అభివృద్ధికి ఆటంకం కల్పించారు. ఇకపై అయినాతెలంగాణ అభివృద్ధిని అడ్డుకోకుండా ఉండేందుకు టీడీపీ పొలిట్ బ్యూరోలో ఏమైనా తీర్మానం చేయిస్తారా?
(2) హైకోర్టు విభజన, సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యోగుల విభజనలో చంద్రబాబు వ్యతిరేకంగా ఉన్నట్లు మనకు కనబడుతున్నది. ఆయన వాదనలు కూడా అలాగే వినిపిస్తున్నారు. తెలంగాణ వ్యతిరేక వైఖరి విడనాడతానని బాబు నుంచి ఏమైనా హామీ తీసుకున్నారా?
(3) కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేసి 7 మండలాలను ఆంధ్రాలో కలుపుకున్నారు. ఆ 7 మండలాలను తిరిగి తెలంగాణలో కలిపేందుకు హామీ తీసుకున్నారా?
(4) 150 మీటర్ల ఎత్తులో పోలవరం కడుతున్నారు. ఈ ప్రాజెక్టు డిజైన్ మార్పును తెలంగాణ కోరుతున్నది. దీనికి బాబు ఒప్పుకున్నరా? 
(5) చంద్రబాబు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో కట్టనే కట్టొద్దు, ఇది అక్రమ ప్రాజెక్టు అని కేంద్రానికి 30 లేఖలు రాశారు. ఆయన స్వయంగా వెళ్లి ఫిర్యాదు కూడా చేశారు కేంద్రానికి. ఈ ప్రాజెక్టు నల్లగొండ, రంగారెడ్డి, పాలమూరు ప్రజల కోసం కడుతున్నది. మరి ఆ లేఖలు వాపస్ తీసుకుని ప్రాజెక్టు నిర్మాణానికి బాబు సహకరిస్తానని ఏమైనా హామీ ఇచ్చారా?
(6) కాళేశ్వరం, తుమ్మిడిహట్టి, పెన్ గంగ, రామప్ప పాకాల, ప్రాజెక్టుల మీద చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులన్నీ బాబు ఉపసంహరించుకున్నారా? బాబు ఏమైనా లేఖ ఇచ్చారా?
 (7) కృష్ణా, గోదావరి నదుల మీద అప్పటి ట్రిబ్యునళ్లు తీర్పులు చెప్పాయి. పోలవరానికి 2009లో అనుమతులు వచ్చాయి. పోలవరం లో 45 టిఎంసిల నీరు తెలంగాణకు కేటాయించాలని అపెక్స్ కమిటీలో కేసిఆర్ కోరారు. అప్పుడు బాబు ఇవ్వడానికి వీలు లేదు అని అడ్డంగా వాదించారు. దానిపై చంద్రబాబు సుప్రీంకోర్టులో కేసు వేశారు. 45 టిఎంసిల నీరు తెలంగాణకు ఇవ్వడానికి బాబును ఒప్పిస్తారా?
(8) తెలుగు జాతి అన్నది బాబుకు వర్కవుట్ కాదు. ఎన్టీఆర్ కు చెల్లుతుంది తెలుగు జాతి అన్న నినాదం. మిషన్ భగీరథ ప్రారంభించింది తెలంగాణ సర్కారు. దానికి కృష్ణా, గోదావరి నుంచి నీళ్లు వాడుకుంటున్నాము.  భగీరథ మీద కూడా బాబు ఫిర్యాదు చేశారు. తాగే నీళ్లకు హక్కు లేదన్న చంద్రబాబు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారా?
(9) విభజన చట్టంలో లేకపోయినా బీజేపీ పొత్తులో భాగంగా అక్రమంగా 460 మెగావాట్ల లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును బాబు గుంజుకున్నారు. ఐదు వేల కోట్ల విలువైన లోయర్ సీలేరు ప్రాజెక్టులో తెలంగాణకు వాటా లేకుండా రాత్రికి రాత్రే అక్రమంగా లాక్కున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 365రోజులు జల విద్యుత్ జరుగుతున్నది. జనరల్ గా ఏ ప్రాజెక్టులో అయినా 50 రోజులో, 60 రోజులో నీటి విద్యుత్ వస్తది. కానీ సీలేరు అలా కాదు. రాత్రికి రాత్రి లోయర్ సీలేరు లాక్కోవడం వల్ల రోజుకు కోటి రూపాయల నష్టం తెలంగాణకు జరుగుతున్నది. దీన్ని వెనక్కు ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకుంటరా?
(10) విద్యుత్ వివాదంలో 1200 మంది విద్యుత్ ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేశారు. వారిని చేర్చుకోకుండా కోర్టుకు పోయి పెండింగ్ లో పెట్టారు చంద్రబాబు. వారికి తెలంగాణ సర్కారే జీతం ఇస్తున్నది. కోర్టులో కేసులు ఉపసంహరించుకుంటాం. 1200 మందిని చేర్చుకుంటామని బాబు హామీ ఇస్తారా? (11) నిజాం కాలంలో తెలంగాణకు సంక్రమించిన వారసత్వ సంపదలో వాటా కావాలని బాబు అడుగుతున్నాడు. కోర్టుల్లో కేసులు వేసి వాదిస్తున్నారు. వాటిని ఉపసంహరించుకుని ఆ సందప తెలంగాణకే దక్కాలని బాబు అంగీకరించారా? (12) హైకోర్టు విభజనతోపాటు అనేక ప్రభుత్వ రంగ సంస్థల విభజనలో ఎపి సర్కారు సహాయ నిరాకరణ అవలంభిస్తున్నది. సచివాలయం, అసెంబ్లీ కట్టుకున్నారు కానీ హైకోర్టు కట్టుకోకుండా హైకోర్టు విభజనకు అడ్డుకుంటున్నారు. హైకోర్టు విభజనకు, సత్వర ఆస్తుల విభజనకు బాబు హామీ ఇచ్చారా? దీనికి ఉత్తమ్ సమాధానం చెప్పాలి. అయితే, ఈ పన్నెండు అంశాలను మీరు ఏర్పాటు చేయబోయే కామన్ మినిమం ప్రోగ్రాంలో చేరుస్తారా లేదా ? ఉత్తమ్ సమాధానం చెప్పాలని హరీశ్‌రావు వారిని కోరారు. దీనిపై చంద్రబాబు సంతకాలు చేస్తారా? అనేది స్పష్టం చేయాలన్నారు. దీనిపై తెలంగాణ ప్రజల్లో భయాందోళనలు, అనుమానాలు ఉన్నాయన్నారు. వాటిని నివృత్తి కావాలంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ లో ఈ అంశాలు పెట్టాలని కోరుతున్నామన్నారు. పొత్తులు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు కానీ.. పొత్తుల వల్ల రాజకీయ ప్రయోజనాలు ఉంటాయేమో కానీ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలగరాదన్నది మా లక్ష్యమన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి,చింతా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.ఉత్తమ్‌కు హరీశ్‌రావు 12 సూటి ప్రశ్నలు..

Updated By ManamTue, 10/09/2018 - 15:07
 • మహాకూటమి ఏర్పాటుపై తెలంగాణ పీీసీసీకి బహిరంగ లేఖ

Harish rao, PCC, Uttam kumar reddy (2173), TRS party (2221), హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా విపక్షాలన్నీ మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఈ విషయంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి హరీశ్ రావు పన్నెండు ప్రశ్నలతో బహిరంగ లేఖను సంధించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పొత్తు వల్ల తెలంగాణ ప్రజల్లో ఉన్న భయాందోళనలను నివృత్తి చేయాలని ప్రధానంగా లేఖలో ప్రస్తావించినట్టు హరీశ్‌రావు పేర్కొన్నారు. మీది షరతులతో కూడిన పొత్తా ? సిగ్గులేని పొత్తా స్పష్టం చేయాలన్నారు. గతంలో టీఆర్ఎస్.. కాంగ్రెస్, టీడీపీలతో షరతులతో కూడిన పొత్తు పెట్టుకున్నాం. పదవులను గడ్డి పోచలాగా వదలుకున్నాం. చంద్రబాబు చివరి దాకా తెలంగాణను అడ్డుకున్నారు. రాష్ట్రం ఏర్పాటు అయ్యాక కూడా వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. అదేమైనా మార్చుకున్నా అని టీడీపీ పొలిట్ బ్యూరోలో తీర్మానం చేశారా? అని ఉత్తమ్‌ను సూటిగా ప్రశ్నించారు.

తెలంగాణ వ్యతిరేక వైఖరి వీడానని బాబు హామీ ఇచ్చారా? పోలవరం ఏడు మండలాలు తిరిగి ఇచ్చేస్తామని బాబు హామీ ఇచ్చారా? పోలవరం డిజైన్ మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారా? అని లేఖలో వరుస ప్రశ్నలు సంధించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వద్దని బాబు కేంద్రానికి 30 లేఖలు రాశారని, బాబు వైఖరి మార్చుకుని మళ్లీ కేంద్రానికి లేఖ ఇచ్చారా? కాళేశ్వరం, సీతారామ తదితర ప్రాజెక్టులపై కేంద్రానికి ఇచ్చిన లేఖను బాబు వాపసు తీసుకున్నారా? కృష్ణా, గోదావరి జిల్లాల్లో వాటాకు సంబంధించి ట్రిబ్యునళ్లలో జరుగుతున్న వాదనల విషయంలో చంద్రబాబు వైఖరి మార్చుకుంటున్నారా? తెలంగాణకు రావాల్సిన 45 టీఎంసీల కృష్ణా జలాలను బాబు రాకుండా అడ్డుకుంటున్నారని లేఖలో హరీశ్ రావు విమర్శించారు. 

ఏపీ మీద మేము పోరాడుతున్నాం. తెలంగాణకు నీళ్లు వద్దంటున్న బాబుతో నీళ్లు ఇప్పిస్తామని చెప్పించగలరా? అని ఉత్తమ్‌ను సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు తెలుగు జాతి అని మాట్లాడుతుంటారని, అది ఆయనకు అతకదన్నారు. తెలంగాణలో అన్ని ప్రాంతాల వారు ఉంటే మిషన్ భగీరథ ద్వారా అందరికీ నీళ్లిచ్చే ప్రాజెక్టును బాబు వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. దానిపై ఆయన వైఖరి మారిందా? బీజేపీ మద్దతుతో 460 మెగావాట్ల సీలేరు హైడెల్ కేంద్రాన్ని బాబు లాక్కున్నారని దుయ్యబట్టారు. దాన్ని తెలంగాణకు బాబుతో తిరిగి ఇప్పిస్తారా? త్రిశంకు స్వర్గంలో ఉన్న 1350 మంది ఉద్యోగులను ఏపీ తీసుకోవడానికి బాబును ఒప్పిస్తున్నారా? నిజాం వారసత్వంగా తెలంగాణకు సంక్రమించాల్సిన ఆస్తులపై బాబు వాదన ఏమైనా మార్చుకున్నారా? హైకోర్టు, మిగతా విభజన హామీలపై బాబుతో హామీ తీసుకున్నారా? మహా కూటమి కనీస ఉమ్మడి ప్రణాళికలో చంద్రబాబుతో ఈ పన్నెండు అంశాలపై సంతకం పెట్టిస్తారా? అని ఉత్తమ్‌కు హరీశ్ బహిరంగ లేఖలో ప్రశ్నలను లేవనెత్తారు. ఆఖరి ఢక్కా, ఏక్ లాక్ పక్కా ...

Updated By ManamSun, 10/07/2018 - 17:49

Harish Rao-Manam Telugu Newsసిద్ధిపేట : ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ నేతలు ‘కారు’వేగంతో దూసుకువెళుతున్నారు. ప్రతిపక్షంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హరీశ్ రావు ఆదివారం మాట్లాడుతూ... ‘ఆఖరి ఢక్కా, ఏక్ లాక్ పక్కా అనేలా పని చేయాలి. సచిన్ 99 దగ్గర ఔట్ అయినట్టు మనం 90 వేల దగ్గర మెజారిటీ ఆగుతుంది.  ఈసారి లక్ష మెజారిటీ రావాలి. అభివృద్ధిలో సిద్దిపేట ముందుంది, మెజారిటీలో కూడా ముందుండాలి.  ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి.

వానాకాలం వస్తే ఉసిళ్లు వస్తాయి. ఎన్నికలు వస్తే కాంగ్రెస్ వాళ్లు వస్తారు. ఎన్నికలు అయిపోతే మళ్లీ కనబడరు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఫ్రెండ్స్ టూ వీలర్స్ అసోసియేషన్ వారు మద్దతు తెలిపారు. మీ ఆశీర్వాదంతో తెలంగాణ సాధించాం. కేసీఆర్ ఆశీస్సులతో సిద్ధిపేట జిల్లా ఏర్పడింది. త్వరలో సిద్ధిపేటకు రైల్వే లైన్, జాతీయ రహదారులు వస్తాయి. ఎంత అభివృద్ధి జరిగితే టూ వీలర్స్‌కు అంత పని దొరుకుతుంది. 

కోటి ఎకరాల మాగాణిగా  మార్చే క్రమంలో మీకు భవిష్యత్తు ఉంటుంది.  డబుల్ బెడ్ రూం ఇండ్లలో మీకు అవకాశం కల్పిస్తాం. మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం. మీకు ఏ అవసరం ఉన్న తీరుస్తాం. టూ వీలర్స్ అసోసియేషన్ భవనానికి అవసరమయ్యే నిధులు సమకూరుస్తాం. ’ అని హామీ ఇచ్చారు.'కూటమికి ఓటు అడిగే హక్కు లేదు'

Updated By ManamSat, 10/06/2018 - 18:47
 • కూటమికి ఇక ఓటమే.. ఇంటి పార్టీకే ఓటు వేయండి..

 Massive Allaince, Harish Rao, Vote Right, TRS Party, Congress, Telangana Assembly elections హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రాన్ని ఎన్నికల సెగ తాకింది. దాంతో తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపుందుకుంది. టీఆర్ఎస్‌పై మహాకూటమి, కూటమిపై టీఆర్ఎస్ విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మహాకూటమికి ఇక ఓటమి తప్పదన్నారు. అభివృద్ధి మీ కళ్ళ ముందు ఉందని, ఇంటి పార్టీ టీఆర్‌ఎ‌స్‌కు ఓటు వేయండని కోరారు. అందోల్ అభ్యర్తి క్రాంతి కారు గుర్తుకు 
ఓటేయండని పిలుపినిచ్చారు. శనివారం హైదరాబాద్ మంత్రి నివాసంలో టీఆర్ఎస్‌కి మద్దతుగా అన్ని పార్టీల నాయకులు గులాబీ గూటికి చేరారు. టీడీపీ నుంచి పెద్దఎత్తున టీఆర్ఎస్‌లో చేరారు. 

మంత్రి హరీష్ రావు, అందోల్ అభ్యర్థి క్రాంతి సమక్షంలో టీడీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు గులాబీ కండువ కప్పుకున్నారు. అందోల్ అభ్యర్థి క్రాంతికి రాష్ట్ర టీడీపీ కార్యదర్శి, జిల్లా టీడీపీ కార్యదర్శి, జోగినాథ్, విజయ్‌లు జై కొడుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ ‘‘కూటమి‌కి ఓటు అడిగే హక్కు  లేదు. ఇది ఆరంభమమే.. క్రాంతి గెలుపు కోసం రానున్న రోజుల్లో మహాకూటమి నుంచి భారీ వలసలు కానున్నాయి. పరాయి వద్దు.. స్థానికుడే ముద్దు. పరాయి పాలనకు ఇక చరమగీతం పడతాం. అందోల్ ప్రజలకు బాసటగా నిలుస్తున్న రాజకీయ నాయకులకు ధన్యవాదాలు’’అని తెలిపారు అందరూ కలసి కట్టుగా పని చేసి క్రాంతి కిరణ్ ను భారీ మెజారిటీ‌తో గెలిపించాలని కోరారు.అజాత శత్రువు కాకా

Updated By ManamSat, 10/06/2018 - 01:53
 • రాజకీయాల్లో ఆయనది అత్యంత క్రియాశీలక పాత్ర.. మంత్రులు కేటీఆర్, హరీశ్

ktrహైదరాబాద్: పేద ప్రజల గుండెల్లో కె.వెంకటస్వామి (కాకా) ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని పేదల మనిషిగా గుర్తింపు పొందారని ఆపదర్మ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు చెప్పారు. కాకా 89వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కాకా సేవలు ఎనలేనివని కొనియాడారు. తెలంగాణ రావాలని బలంగా ఆకాంక్షించిన వ్యక్తుల్లో కాకా కూడా మొదటి వరుసలో ఉంటారన్నారు. పేదలకు సేవ చేయాలన్నా తపనతో పని చేశారని అందుకే పేద ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని కేటీఆర్ పేర్కోన్నారు. ఆయన సేవలను వారి కుమారులు వివేక్, వినోద్‌లు ఇద్దరు ముందకు తీసుకెళ్లడం..వివేక్ పారిశ్రామిక వేత్తగా, ఎంపీగా  పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలతో పాటు తెలంగాణ యువతకు ఉపాది అవకాశాలు కల్పిస్తున్నారని కేటీఆర్ పేర్కోన్నారు. 

మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..ఆజాత శత్రువు కాక అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే బలమైన ఆకాంక్ష ఆయన లో ఉండేదని హరీశ్ పేర్కోన్నారు. రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక పాత్ర వెంకటస్వామిదన్నారు. 1969లో విద్యార్థి నాయకుడిగా ఉద్యమ నాయకుడిగా ఆయన పనిచేశారని గుర్తు చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన పాత్ర కీలకమన్నారు. అయితే, సికింద్రాబాద్‌లో కేసీఆర్ మీటింగ్ పెట్టినప్పుడు..అ మీటింగ్ ఏ స్థాయిలో జరుగతుందొ చూసేందుకు వెంకటస్వామి గొంగడి కప్పుకొని వచ్చినట్లుగా వచ్చినట్లుగా నాడు నాకు అవిషయం  చెప్పారని..హరీశ్ కాకా జ్ఞాపాకాలను యాదిచేశారు. ఇక, వెంకటస్వామి ఆశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టులో తీసుకొస్తున్నారని ఆయన చెప్పారు. కాలేశ్వరం ప్రాజెక్టు పనులు 90% పూర్తయ్యాయి రాబోయే కొద్ది నెలల్లోనే నీళ్లు అంద బోతున్నాయన్నారు. అన్నదమ్ముల్లా కలిసి పెరిగినం

Updated By ManamFri, 10/05/2018 - 03:51
 • అభివృద్ధిలో మాత్రమే పోటీ పడ్తున్నం

 • సిరిసిల్లను సిరుల ఖిల్లాగా మార్చాం

 • నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్, హరీశ్

harish raoహైదరాబాద్: అన్నదమ్ముల్లా కలిసి పెరిగాం, అభివృద్ధిలో పోటీ పడుతున్నాం, ముఖ్య మంత్రి అప్పజెప్పిన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఆయన కలలుగన్న బంగారు తెలంగాణలో భాగస్వాములవుతున్నాం, ఫలితంగా అభివృద్ధి పథంలో సిరిసిల్ల, సిద్ధిపేట నియోజక వర్గాలు పోటీపడి ముందుకు సాగుతున్నాయి అని ఆపధ్ధర్మ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ కీలక కార్య కర్తల సమావేశం గురువారం బేగంపేటలోని మంత్రి కేటీఆర్ నివాసంలో జరిగింది. సమావేశంలో మంత్రులిద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రాబోవు ఎన్నికల్లో  భారీ మెజార్టీతో  కేటీఆర్ ను గెలిపిం చాలన్నారు. తాము అభివృద్దిలో పోటీ పడుతున్న తీరుగానే కార్యకర్తలు ఓటింగ్ శాతం పెంచి భారీ మెజార్టీతో గెలిపించడానికి  కృషి చేయాలని కోరారు.  అత్మహత్యల సిరిసిల్లను సిరుల ఖిల్లాగా మార్చిన ఘనత మంత్రి కేటీఆర్‌కు దక్కుతుందని కితాబిచ్చారు. ఒకవైపు కాళేశ్వరం నీరు, మరో వైపు టెక్స్‌టైల్ పార్క్ ద్వారా సిరిసిల్ల రానున్న రోజుల్లో పూర్తిగా రూపాంతరం చెంది సిరుల ఖిల్లాగా మారుతుందన్నారు. ప్రతినిత్యం ఆత్మహత్యలతో వార్తల్లోకెక్కిన సిరిసిల్ల ఈ రోజు తెలంగాణ బిడ్డలకు బతుకమ్మ చీరలు నేస్తూ వార్తల్లోకి ఎక్కుతుందని హరీశ్ అన్నారు. సిరిసిల్లలో ఆత్మహత్యలను నివారించగలిగిన ఘనత కేటీఆర్‌కు దక్కుతుందన్నారు. 

మంత్రి కేటీఆర్ పనితీరు, సిరిసిల్ల అభివృద్దిపైన హరీశ్‌రావు ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ మరో 15 ఏండ్లపాటు కొనసాగాలని తామిద్దరం కోరుకుంటున్నామని అన్నారు. లక్షలాది మంది తెరాస కార్యకర్తల బలంతో పార్టీ మరింత బలోపేతమై అధికారంలోకి రాబోతుందని పేర్కొన్నారు. అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా ఉన్నామని వివరించారు. కాలంతో పోటీ పడి కాళేశ్వరాన్ని పరుగెత్తిస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి ప్రారంభించిన అభివృద్ధి యజ్ఞాన్ని సిద్దిపేటలో తాను కొనసాగిస్తున్నానని ఈ సందర్భంగా హరీశ్‌రావు వివరించారు. సిద్ధిపేట అభివృద్ధ్ది వెనుక 30 ఏళ్ల శ్రమ ఉందన్నారు. అయితే గత 30 ఏళ్లలో జరగని అభివృద్ధిని మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో చేసి చూపించే ప్రయత్నం చేశారని అభినందించారు. ఒక వైపు తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడుల కోసం దేశ విదేశాల్లో పర్యటిస్తూ  విజయవంతంగా తన శాఖను నిర్వహిస్తూనే మరో వైపు సిరిసిల్ల అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారని అన్నారు. ముఖ్యమంత్రి అప్పచెప్పిన బాధ్యతలను తమ పరిధిలో తాము నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సిరిసిల్ల అభివృద్దిని హరీశ్‌రావు వివరించారు. గత నాలుగేళ్ల కాలంలో సిరిసిల్ల గుర్తుపట్టలేనంతగా మారిపోయిందన్నారు. సిరిసిల్ల పట్టణ అభివృద్ధితో పాటుగా మండలాలు, గ్రామాల అభివృద్దిపై కేటీఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని వివరించారు. కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్ మండలాల వారీగా ముఖ్యనాయకులతో భేటీ అయ్యారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఇప్పటిదాకా తాము చేసిన పనులను ప్రజలకు తెలిసేలా వివరించాలని కోరారు. ఓటింగ్ శాతాన్ని పెంచే ప్రయత్నం చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రసంగించిన మంత్రి హరీష్‌రావుకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తాము కేవలం అభివృద్ధిలో మాత్రమే పోటీ పడుతున్నామని అన్నారు. సొంత అన్నదమ్ముల్లా కలిసి పెరిగామని వివరించారు. ఉద్యమ కాలం నుంచి కేవలం తెలంగాణ కోసం పనిచేస్తున్నామని తెలియచేశారు. ఇద్దరం కలిసి ఒకే మంత్రివర్గంలో పని చేసే సువర్ణావకాశం లభించిందన్నారు. ముఖ్యమంత్రి కంటున్న బంగారు తెలంగాణ కల కోసం తామిద్దరమూ సైనికుల్లా పని చేస్తామన్నారు. ఇందులో భాగంగానే కాలంతో పోటీపడి కాళేశ్వరం ప్రాజెక్టును హరీశ్‌రావు పరుగెత్తిస్తున్నారని వివరించారు. ఆయన ఆధ్వర్యంలో ప్రాజెక్టులన్నీ  పరుగులెత్తుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.

సొంత గూటికి గజ్వేల్ నేతలు
టీపీసీసీ అధ్యక్షులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో బుధవారం కాంగ్రెస్‌లో చేరిన దుబ్బాక, గజ్వేల్ నియోజక వర్గాల తెరాస నేతలు గురువారం మంత్రి టి. హరీశ్‌రావు సమక్షంలో సొంత గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ నేతల ప్రలోభాలు, ఒత్తిళ్ల వ్లలనే ఆ పార్టీ కండువా కప్పుకున్నామని తెరాస నేతలు తెలిపారు. వట్టిపల్లి ఎంపిటీసీ కుంట కవిత, సీనియర్ నేత యాదగిరి, ఇటిక్యాల సర్పచ్ ఐలయ్య వారి అనుచరులతో కలిసి తిరిగి తెరాసలో చేరారు. మంత్రి హరీష్‌రావు వారికి తెరాస కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ నాయకులు తెరాస కార్యకర్తలను ఒత్తిళ్లకు గురి చేసి పార్టీలో చేర్చుకొనే యత్నాలు చేస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడాలని ఆయన తెరాస కార్యకర్తలను కోరారు.

Related News