ktr

ఎల్లలు దాటిన అభిమానం

Updated By ManamMon, 10/15/2018 - 06:26
 • టీఆర్‌ఎస్ సర్కారు చేస్తున్న అభివృద్ధి ఆకర్షించిందన్న రోహిత్ రెడ్డి

 • వ్యవహార శైలే ఎంతోమందిని కేటీఆర్‌కు ఫ్యాన్స్‌గా మార్చిందని వెల్లడి

 • ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపిన మంత్రి

 • తెలంగాణలో ప్రచారం చేయడానికి ఓకే..

ktrహైదరాబాద్:  అభివృద్ది ఎక్కడైనా అభివృద్దే.. ప్రగతికి ప్రాంతాలు అడ్డు కూడా కాదు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చాయి. అలాంటిది అన్ని చోట్లా జరిగితే బాగుంటుందని భావించాడు. వాటి గురించి ప్రచారం చేయాలనుకున్నాడు. టీఆర్‌ఎస్ సర్కారు చేస్తున్న కృషిని గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వివరించడం కోసం పాదయాత్ర చేపట్టాడు. విజయవాడ నుంచి కాలినడకన బయలుదేరి బాటలోని ఊళ్లు, ప్రజలకు కేసీఆర్ కార్యక్రమాలు, వాటి వల్ల ప్రయోజనం గురించి చెబుతూ హైదరాబాద్ దాకా వచ్చాడు. తన పాదయాత్రతో ఇరు రాష్ట్రాల్లోనూ ఎంతో మందిని ఆకర్షించిన ఆ యువకుడి పేరు రోహిత్ కుమార్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఈ యువకుడు టీఆర్‌ఎస్ గెలుపును ఆకాంక్షిస్తూ గత 17 రోజులుగా పాదయాత్ర చేస్తూ హైదరాబాద్ చేరుకున్నాడు. టీఆర్‌ఎస్‌వీ నేతలతో కలిసి మంత్రి కేటీఆర్‌ను ఆదివారం ప్రగతి భవన్‌లో కలిశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాకఉద్యమ సారథి, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు తనకు తెలంగాణ రాష్ట్రం పట్ల ఆసక్తిని, అభిమానాన్ని పెంచాయని రోహిత్ కుమార్‌రెడ్డి కేటీఆర్‌కు వివరించారు. అదే క్రమంలో కేటీఆర్ వంటి నాయకుడు తె లంగాణ రాష్ట్రానికి ఒక గొప్పవరం అని ప్రశంసించారు. కేటీఆర్ ప్రసంగించే తీరు, ఒక రాజకీయ నాయకుడిగా ప్రజల్లో అభిమానం పొందేలా చేసిందన్నారు. ప్రజా సమస్యల పట్ల అవగాహనతో, వాటి పరిష్కారానికి కృషిచేస్తూ దూసుకుపోతున్న తీరు తనవంటి ఎందరినో కేటీఆర్‌కు అభిమానులుగా మార్చాయని ఆయన తెలిపారు. అందుకే ఆయనను తమ గుండెల్లో పెట్టుకుంటున్నారని చెబుతూ తన గుండెలపై టాటూ వేయించుకున్న కేటీఆర్ చిత్రాన్ని చూపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణాలో అభివృద్ధి బాగుంది, ముఖ్యంగా రైతుల కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు అద్భుతం అని రోహిత్ తెలిపారు. సుదూర ప్రాంతం నుండి గుండెల నిండా అభిమానం నింపుకుని వచ్చిన రోహిత్‌ను మంత్రి కేటీఆర్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని కుశల ప్రశ్నలు అడిగారు. ఎల్లలు దాటిన ఆ యువకుడి అభిమానానికి మంత్రి కేటీఆర్ ముగ్ధుడయ్యారు. శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ తరపునా తనకు ఇక్కడ ప్రచారం చేసే అవకాశం కల్పించాలని రోహిత్ కేటీఆర్‌కు చేసిన విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.  అభ్యర్థనకు కేటీఆర్ సానుకూలంగా స్పందించారని కొందరూ టీఆర్‌ఎస్‌వీ నేతలు చెప్తున్నారు. రోహిత్ వెంట తాజా మాజీ ఎమ్మెల్యేలు వీ. శ్రీనివాస్ గౌడ్, పైళ్ల శేఖర్ రెడ్డి, శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, బీసీ కార్పోరేషన్ సభ్యులు ఆంజనేయ గౌడ్, టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌లున్నారు.వేములవాడను టెంపుల్ సిటీగా మారుస్తాం

Updated By ManamSun, 10/14/2018 - 00:49
 • అభివృద్ధిని చూసి కాంగ్రెస్ ఓర్వడం లేదు

 • చెన్నమనేని గెలుపు ఖాయం: కేటీఆర్

ktrహైదరాబాద్: వేములవాడను టెంపుల్ సిటీగా మారుస్తామని, ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను, రాష్ట్ర అభివృద్ధిని చూసి కాంగ్రెస్ ఓర్వలేక పోతున్నదని ఆపధర్మ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేసి ఆపుతుందన్నారు. శనివారం బేగంపేటలోని ప్రగతి భవన్‌లో వేములవాడ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలకు అధిష్టానం ఢిల్లీలో ఉందని తమ అధిష్టానం ప్రజలేనని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు అభివృద్ధికి రెఫరెండమని అన్నారు. వేములవాడలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ను గెలవడం ఖాయమని తెలిపారు.  కరీంనగర్ బీజేపీ పార్లమెంటరీ కన్వీనర్ యచన్నేని శ్రీనివాసరావు,  కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీధర్ రావ్, రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేవైఎం కార్యదర్శి శశాంక్‌తో దాదాపు 300 మంది కాంగ్రెస్, బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం

Updated By ManamSun, 10/07/2018 - 19:38
KTR to Attened Bloomberg New Economy Forum

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది.  ఇప్పటికే పలు ప్రపంచ స్థాయి సంస్థలు దేశాల నుంచి ఆహ్వానాలు అందుకున్న మంత్రికి ఈసారి బ్లూంబర్గ్ న్యూ ఎకానమీ ఫోరం నుంచి ఆహ్వానం లభించింది. ప్రపంచంలో మారుతున్న ఆర్థిక పరిస్థితులు , వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల మార్పులను చర్చించేందుకు నూతనంగా ఏర్పాటు చేయనున్న న్యూ ఎకానమీస్ ఫోరం ప్రారంభానికి వ్యవస్థాపక ప్రతినిధిగా ఉండాలంటూ మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం పలికారు.

నవంబర్ 6,  7 తేదీల్లో సింగపూర్‌లో జరగనున్న ఫోరం సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశంలో నగరీకరణ , పట్టణ మౌలిక వసతులు, ఐటీ రంగాలపై మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు.  ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి సుమారు మూడు వందల కంపెనీల ముఖ్య కార్య నిర్వాహక అధికారులు, వివిధ దేశాల రాజకీయ నాయకులు, వక్తలు హాజరు కానున్నారు. గత నాలుగు సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక అభివృద్ధితోపాటు, తన పరిపాలనా విధానాల ద్వారా సమాజంలోని అసమానతలను అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై కేటీఆర్ ఈ ఫోరం సదస్సులో ప్రసంగిస్తారు. 

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తాలూకు సవాలును చర్చించేందుకు ఏర్పాటు అవుతున్న న్యూ ఎకానమీ ఫోరం వ్యవస్థాపక ప్రతినిధిగా హాజరు కావాలంటూ అందిన ఆహ్వానంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాల్లో ప్రజల సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రగతి కోసం తీసుకున్న అనేక చర్యలకు దక్కిన గౌరవంగా మంత్రి పేర్కొన్నారు.రూ.3వేల కోట్ల భారీ పెట్టుబడి

Updated By ManamSun, 10/07/2018 - 01:37
 • కోకాపేటలో క్వాల్కామ్ మెగా క్యాంపస్

 • 5జీ, వైర్‌లెస్ టెక్నాలజీపై పరిశోధనలు

 • 10వేల మందికి ఉపాధి

 • త్వరలోనే మరిన్ని పెట్టుబడులు: మంత్రి కేటీఆర్

ktrహైదరాబాద్: హైదరాబాద్ నగరం మరో భారీ పెట్టుబడికి వేదిక కానుంది. మరో ప్రపంచ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ క్వాల్కామ్ పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. క్వాల్కామ్ సంస్థ మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడిని హైదరాబాద్ నగరంలో తన డెవలప్‌మెంట్ సెంటర్ పైన పెట్టుబడి పెట్టనుంది. హైదరాబాదులోని కోకాపేటలో తన క్యాంపస్‌నుఏర్పాటు చేయనున్నట్టు సంస్థ ప్రకటించింది. బేగంపేట క్యాంపు కార్యాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ శశిరెడ్డి బృందం కలిసింది. ఇప్పటికే భారతదేశంలో హైదరాబాద్ , బెంగళూరు, చెన్నై నగరాల్లో తన కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ హైదరాబాద్ నగరంలో కంపెనీ అభివృద్ధి పట్ల సానుకూలంగా ఉన్నామని, ఇక్కడి పరిశ్రమ అనుకూల ప్రభుత్వ విధానాలు, పారదర్శకత , అందుబాటులో ఉన్న నాణ్యమైన మానవ వనరుల లభ్యత ను పరిగణలోకి తీసుకొని హైదరాబాద్ నగరాన్ని తమ క్యాంపస్ ఏర్పాటుకు ఎంపిక చేసుకున్నామని మంత్రిని కలిసిన క్వాల్కామ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం నగరంలో తమ సంస్థ తరఫున నాలుగు వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని రాబోయే సంవత్సరాలలో ఇది 10 వేలకు చేరే అవకాశం ఉందని తెలిపింది. క్వాల్కామ్ సంస్థ మెగా క్యాంపస్ ఏర్పాటు చేయడం పట్ల మంత్రి కేటీ రామారావు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే తమ కేంద్ర కార్యాలయాలకు అవతల అతిపెద్ద క్యాంపస్ లను హైదరాబాద్ నగరంలో కలిగి ఉన్న ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్ ఆమెజాన్, గూగుల్, ఆపిల్ వంటి దిగ్గజ కంపెనీల సరసన క్వాల్కమ్  చేరిందన్నారు. క్వాల్కామ్ సంస్థ ఏర్పాటు చేయనున్న మెగా క్యాంపు ద్వారా రాష్ట్రంలోని ఎలక్ట్రానిక్స్ మరియు సెమీకండక్టర్ పరిశ్రమకు పెద్ద ఊతం లభించినట్లు అవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్న అనేక అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ నగరాన్ని తమ కార్యకలాపాలకు కేంద్రంగా ఎంచుకుంటున్నాయని, త్వరలో మరిన్ని కంపెనీలు హైదరాబాద్ నగరంగా తమ కార్యకలాపాలను విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నాయని వాటి వివరాలను త్వరలో అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ టెక్నాలజీలో విప్లవాత్మకమైన 5జీ సాంకేతికత పైన ప్రధానంగా దృష్టి సారిస్తున్నదన్న సంస్థ, ఈ క్యాంపస్ ద్వారా 5జీ సాంకేతికత పైన పరిశోధనలు, టెస్టింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. దీంతో పాటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మొబైల్ ప్లాట్ఫామ్స్ పైన పరిశోధనలు, వైర్లెస్ సాంకేతికత పరికరాల తయారీ వంటి అంశాల పైన పెద్ద ఎత్తున ఈ మెగా క్యాంపస్ నుంచి కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు సంస్థ ప్రకటించింది.అది జఫ్ఫా కూటమి

Updated By ManamSat, 10/06/2018 - 23:55
 • ఢిల్లీ బలుపుకు...తెలంగాణ ఆత్మ గౌరవానికి మధ్య పోటీ

 • విద్యార్థి విభాగం విసృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్ 

ktrహైదరాబాద్: ప్రస్తుత ఎన్నికలు రాహుల్‌గాంధీ కుటుంబానికి...తెలంగాణ ప్రజలకు పోటీగా జరుగుతున్నాయని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ బలుపుకు... తెలంగాణ ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్న పోటీయేనని స్పష్టం చేశారు. మంత్రి శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం బిక్షకాదని, కుక్కకాటుకు చెప్పు దెబ్బలా కాంగ్రెస్‌కు ఓటు దెబ్బ తగిలిందని అందుకే తెలంగాణ ఇచ్చారని చెప్పారు. తెలంగాణ ప్రజలకు ఈ ఎన్నికల్లో ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలను కొట్టే అవకాశం వచ్చిందన్నారు. అది మహాకూటమి కాదు...జఫ్ఫా కూటమి అంటూ..కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ డొల్ల మాటలను ప్రజలు విశ్వసించరన్నారు. పెళ్లి కాని వాళ్ళకు పిల్లను చూసి పెళ్లి చేస్తాం ...చిన్న పిల్లలకు డైపర్లు మారుస్తామని కూడా కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెడతారేమో అంటూ విమర్శించారు. ఈ విద్యార్థుల ఊపు చూస్తుంటే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ సెంచరీ కొట్టడం ఖాయమనిపిస్తొందని ధీమా వ్యక్తం చేశారు.

ఉద్యమాలతో తెచ్చుకొన్న తెలంగాణ రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణిగా తయారుచేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అన్ని ఉప ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారని గుర్తు చేశారు. ఉత్తమ్ నీవు సైనికుడివా...ఎప్పుడు సైనికుడు అయినవ్ అంటూ కేటీఆర్ వాఖ్యానించారు. కేటీఆర్ బచ్చా అంటున్నావ్...ఈ బచ్చాగాళ్ళు ఉద్యమం చేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడ పడుకున్నావ్  అంటూ ఉత్తమ్‌పై విరుచుకుపడ్డారు. 2004లో తెలంగాణ ఇస్తామని సోనియా మాట ఇస్తే కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నామని గుర్తు చేశారు. 2009లో చంద్రబాబును తెలంగాణకు అనుకూలంగా లేఖ రాయించి పొత్తుపెట్టుకున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. కోదండరామ్ పెద్ద పెద్ద డైలాగ్‌లు కొట్టిండని...ప్రగతి భవన్ గడీలు బద్దలు కొడతానన్న...కోదండరాం వాటి గోడలు గీకుతుండన్నారు. తెలంగాణ జన సమితి... కాంగ్రెస్ భజన సమితి అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మహాకూటమి గెలిస్తే ప్రాజెక్టులు ముందుకు పడతాయా అని నిలదీశారు. ఓ దొంగకు నోరెక్కువ అన్నట్లు ఒకాయన ధూమ్ ధూమ్ అంటున్నాడంటూ పరోక్షంగా రేవంత్‌పై తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబుతో కలవటానికి సిగ్గు,లజ్జ లేకపోయినా...తెలంగాణ ప్రజలకు మాత్రం స్వాభిమానం ఉందన్నారు.హైదరాబాద్ కేంద్రంగా ‘క్వాల్కామ్’ మెగా క్యాంపస్..

Updated By ManamSat, 10/06/2018 - 19:17
 • నగరంలో మూడు వేల కోట్ల భారీ పెట్టుబడి

 • హైదరాబాద్ కేంద్రంగా క్వాల్కామ్ సంస్థ మెగా క్యాంపస్ ఏర్పాటు

 • ప్రపంచంలోని అతిపెద్ద పెట్టుబడి ఇదే

 • హైదరాబాదులోని కోకాపేట ఐటి క్లస్టర్లో ఏర్పాటు

 • తొలి దశలోనే 17 లక్షల చదరపు అడుగుల క్యాంపస్ ఫెసిలిటీ నిర్మాణం

 • 10 వేల మంది ఉద్యోగులు పని చేసేందుకు అవకాశం

 • బేగంపేట క్యాంపు ఆఫీసులో కేటీఆర్‌ను కలిసిన క్వాల్కామ్ ప్రతినిధి బృందం

Qualcomm company, largest campus, US, Hyderabad, Telangana , KTR, Qualcomm Deligates teamహైదరాబాద్: హైదరాబాద్ నగరం మరో భారీ పెట్టుబడికి వేదిక కానుంది. మరో ప్రపంచ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ క్వాల్కామ్ పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. క్వాల్కామ్ సంస్థ మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడిని హైదరాబాద్ నగరంలో తన డెవలప్మెంట్ సెంటర్ పైన పెట్టుబడి పెట్టనుంది. హైదరాబాదులోని కోకాపేటలో తన క్యాంపస్ను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ఈ రోజు ప్రకటించింది. సుమారు నాలుగు వందల మిలియన్ డాలర్లతో ఏర్పాటు చేయడం ద్వారా సుమారుగా 10 వేల మంది ఉద్యోగులు ఈ క్యాంపస్ ద్వారా పనిచేసే అవకాశం ఉంటుందని సంస్థ తెలిపింది. వివిధ దశల్లో ఏర్పాటు చేయబోయే ఈ క్యాంపస్ ద్వారా అనేక వేల పరోక్ష ఉద్యోగాలు కూడా ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

మొదటి దశలో భాగంగా సుమారు 17 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం గల క్యాంపస్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అమెరికాలోని శాన్ డియాగో తన కేంద్ర కార్యాలయం అవతల ఏర్పాటు చేయబోయే అతిపెద్ద క్యాంపస్ కూడా హైదరాబాద్ లో నిర్మించబోయే క్యాంపస్ అవుతుందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో పెట్టిన పెట్టుబడుల్లో ఇదే అతిపెద్ద పెట్టుబడి అవుతుందని కూడా సంస్థ ప్రకటించింది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో నిర్మాణ పనులను కూడా చేపట్టనున్నట్లు కంపెనీ తెలియజేసింది. ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ టెక్నాలజీలో విప్లవాత్మకమైన 5 జీ సాంకేతికత పైన ప్రధానంగా దృష్టి సారిస్తున్నదన్న సంస్థ, ఈ క్యాంపస్ ద్వారా 5 జి సాంకేతికత పైన పరిశోధనలు మరియు టెస్టింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది.

దీంతో పాటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మొబైల్ ప్లాట్ఫామ్స్ పైన పరిశోధనలు, వైర్లెస్ సాంకేతికత మరియు పరికరాల తయారీ వంటి అంశాల పైన పెద్ద ఎత్తున ఈ మెగా క్యాంపస్ నుంచి కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు సంస్థ ఈ రోజు ప్రకటించింది. ఈరోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ శశి రెడ్డి బృందం కలిసింది. ఇప్పటికే భారతదేశంలో హైదరాబాద్ , బెంగళూరు, చెన్నై నగరాల్లో తన కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ హైదరాబాద్ నగరంలో కంపెనీ అభివృద్ధి పట్ల సానుకూలంగా ఉన్నామని, ఇక్కడి పరిశ్రమ అనుకూల ప్రభుత్వ విధానాలు, పారదర్శకత , అందుబాటులో ఉన్న నాణ్యమైన మానవ వనరుల లభ్యత ను పరిగణలోకి తీసుకొని హైదరాబాద్ నగరాన్ని తమ క్యాంపస్ ఏర్పాటుకు ఎంపిక చేసుకున్నామని ఈరోజు మంత్రిని కలిసిన క్వాల్కామ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం నగరంలో తమ సంస్థ తరఫున నాలుగు వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని రాబోయే సంవత్సరాలలో ఇది 10 వేలకు చేరే అవకాశం ఉందని తెలిపింది.

క్వాల్కామ్ సంస్థ మెగా క్యాంపస్ ఏర్పాటు చేయడం పట్ల మంత్రి కేటీ రామారావు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే తమ కేంద్ర కార్యాలయాలకు అవతల అతిపెద్ద క్యాంపస్ లను హైదరాబాద్ నగరంలో కలిగి ఉన్న ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ ఆమెజాన్, గూగుల్, ఆపిల్ వంటి దిగ్గజ కంపెనీల సరసన క్వాల్కమ్ చేరిందన్నారు. క్వాల్కామ్ సంస్థ ఏర్పాటు చేయనున్న మెగా క్యాంపు ద్వారా రాష్ట్రంలోని ఎలక్ట్రానిక్స్ మరియు సెమీకండక్టర్ పరిశ్రమకు పెద్ద ఊతం లభించినట్లు అవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్న అనేక అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ నగరాన్ని తమ కార్యకలాపాలకు కేంద్రంగా ఎంచుకుంటున్నాయని, త్వరలో మరిన్ని కంపెనీలు హైదరాబాద్ నగరంగా తమ కార్యకలాపాలను విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నాయని వాటి వివరాలను త్వరలో అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు.అజాత శత్రువు కాకా

Updated By ManamSat, 10/06/2018 - 01:53
 • రాజకీయాల్లో ఆయనది అత్యంత క్రియాశీలక పాత్ర.. మంత్రులు కేటీఆర్, హరీశ్

ktrహైదరాబాద్: పేద ప్రజల గుండెల్లో కె.వెంకటస్వామి (కాకా) ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని పేదల మనిషిగా గుర్తింపు పొందారని ఆపదర్మ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు చెప్పారు. కాకా 89వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కాకా సేవలు ఎనలేనివని కొనియాడారు. తెలంగాణ రావాలని బలంగా ఆకాంక్షించిన వ్యక్తుల్లో కాకా కూడా మొదటి వరుసలో ఉంటారన్నారు. పేదలకు సేవ చేయాలన్నా తపనతో పని చేశారని అందుకే పేద ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని కేటీఆర్ పేర్కోన్నారు. ఆయన సేవలను వారి కుమారులు వివేక్, వినోద్‌లు ఇద్దరు ముందకు తీసుకెళ్లడం..వివేక్ పారిశ్రామిక వేత్తగా, ఎంపీగా  పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలతో పాటు తెలంగాణ యువతకు ఉపాది అవకాశాలు కల్పిస్తున్నారని కేటీఆర్ పేర్కోన్నారు. 

మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..ఆజాత శత్రువు కాక అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే బలమైన ఆకాంక్ష ఆయన లో ఉండేదని హరీశ్ పేర్కోన్నారు. రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక పాత్ర వెంకటస్వామిదన్నారు. 1969లో విద్యార్థి నాయకుడిగా ఉద్యమ నాయకుడిగా ఆయన పనిచేశారని గుర్తు చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన పాత్ర కీలకమన్నారు. అయితే, సికింద్రాబాద్‌లో కేసీఆర్ మీటింగ్ పెట్టినప్పుడు..అ మీటింగ్ ఏ స్థాయిలో జరుగతుందొ చూసేందుకు వెంకటస్వామి గొంగడి కప్పుకొని వచ్చినట్లుగా వచ్చినట్లుగా నాడు నాకు అవిషయం  చెప్పారని..హరీశ్ కాకా జ్ఞాపాకాలను యాదిచేశారు. ఇక, వెంకటస్వామి ఆశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టులో తీసుకొస్తున్నారని ఆయన చెప్పారు. కాలేశ్వరం ప్రాజెక్టు పనులు 90% పూర్తయ్యాయి రాబోయే కొద్ది నెలల్లోనే నీళ్లు అంద బోతున్నాయన్నారు. విపక్షాలవి దిగజారుడు రాజకీయాలు

Updated By ManamFri, 10/05/2018 - 04:42
 • సంక్షేమం అభివృద్ధి మేళవింపుగా పార్టీ మేనిఫెస్టో

 • తెరాస పాలనకే మరో సారి పట్టం కట్టబోతున్న ప్రజలు

 • ట్విట్టర్ ద్వారా నెటిజన్ల ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు

ktrహైదరాబాద్: దశాబ్ధాల పాటు తెలంగాణకు ద్రోహనంచేసిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు జత కట్టడం ద్వారా తమ అవకాశవాద, దిగజారుడు రాజకీయాలను మరోసారి నిరూపించుకున్నాయని ఐటీ శాఖ మంత్రి కే.టీ. రామారావు అన్నారు. వందల మంది తెలంగాణ యువత ప్రాణాలను బలికొన్న పార్టీలు, మరోసారి తెలంగాణ ప్రజలను ముంచేందుకు జట్టుకట్టాయని విమర్శించారు. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీల రాజకీయ విమర్శలు ఎన్నడూ లేనంత  స్ధాయికి దిగజారాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ గురువారం ట్విట్టర్ ద్వారా నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సుమారు గంటపాటు సాగిన ఈ సంభాషణలో అనేక అంశాలనైన నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన అభిప్రాయాలను తెలియచేశారు.  ప్రస్తుత రాజకీయాలతో పాటు గత నాలుగు సంవత్సరా ల ప్రభుత్వ పనితీరుపై ఆయన వివరణ ఇచ్చారు. రాజకీయాల్లో కనీస విలువలు, మర్యాద పాటించాలన్న సంస్కారాన్ని  సైతం ప్రతిపక్ష పార్టీలు మర్చిపోయాయని అన్నారు.  ప్రతిపక్షాల స్థాయి దిగజారుడు రాజకీయాలకు తాము సిద్ధంగా లేమన్నారు. తెలంగాణ ప్రజలకు తాము చేసిన అభివృద్ధిని వివరించామని, ప్రజలే తమ పాలనపైన ఓట్ల రూపంలో నిర్ణయం తీసుకుంటారని అన్నారు. తాజాగా ఢిల్లీలో  రైతులపై జరిగిన లాఠీఛార్జీపైన మంత్రి స్పందించారు. ఇలాంటి సంఘటనలను తాము పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పారు. రైతాంగానికి, వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయం అని అన్నారు.  తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయంతో పాటు రైతు బీమా వంటి వినూత్న పథకాలు దేశ చరిత్రలో నిలిచిపోతాయన్నారు. ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్న తెలంగాణ ప్రభుత్వం, రానున్న ఎన్నికల సందర్భంగా ప్రకటించే మేనిఫెస్టో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల మేళవింపుగా ఉంటుందని తెలిపారు. తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించామన్నారు. రానున్న సంవ త్సరాల్లోనూ ఈ కార్యక్రమాన్ని ప్రాధాన్యతా రంగంగా ఎంచుకొని కొనసాగిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.  దుబాయ్‌లో ఇబ్బంది పడుతున్న వారిలో మరింత ఎక్కువ మందిని తెలంగాణకు రప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. సుమారు 500 మంది తెలంగాణకు తిరిగి వస్తారని  మంత్రి తెలియ చేశారు.  నకిలీ ఏజెంట్ల ఆగడాల పైన ప్రభుత్వం ఎప్ప టికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటుందని రానున్న రోజుల్లో వారిపైన మరింత కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. హైదరాబాద్ నగరంపైన పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో చేపట్టిన రోడ్ల అభి వృద్ధిని  మరింత వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తు న్నామని తెలిపారు. ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే నగరాలు, పట్టణాలలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తామన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నామని, ప్రత్యేకంగా ఐటీ కారిడార్ పైన దృష్టి సారించామన్న విషయంలో వాస్తవం లేదన్నారు.అన్నదమ్ముల్లా కలిసి పెరిగినం

Updated By ManamFri, 10/05/2018 - 03:51
 • అభివృద్ధిలో మాత్రమే పోటీ పడ్తున్నం

 • సిరిసిల్లను సిరుల ఖిల్లాగా మార్చాం

 • నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్, హరీశ్

harish raoహైదరాబాద్: అన్నదమ్ముల్లా కలిసి పెరిగాం, అభివృద్ధిలో పోటీ పడుతున్నాం, ముఖ్య మంత్రి అప్పజెప్పిన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఆయన కలలుగన్న బంగారు తెలంగాణలో భాగస్వాములవుతున్నాం, ఫలితంగా అభివృద్ధి పథంలో సిరిసిల్ల, సిద్ధిపేట నియోజక వర్గాలు పోటీపడి ముందుకు సాగుతున్నాయి అని ఆపధ్ధర్మ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ కీలక కార్య కర్తల సమావేశం గురువారం బేగంపేటలోని మంత్రి కేటీఆర్ నివాసంలో జరిగింది. సమావేశంలో మంత్రులిద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రాబోవు ఎన్నికల్లో  భారీ మెజార్టీతో  కేటీఆర్ ను గెలిపిం చాలన్నారు. తాము అభివృద్దిలో పోటీ పడుతున్న తీరుగానే కార్యకర్తలు ఓటింగ్ శాతం పెంచి భారీ మెజార్టీతో గెలిపించడానికి  కృషి చేయాలని కోరారు.  అత్మహత్యల సిరిసిల్లను సిరుల ఖిల్లాగా మార్చిన ఘనత మంత్రి కేటీఆర్‌కు దక్కుతుందని కితాబిచ్చారు. ఒకవైపు కాళేశ్వరం నీరు, మరో వైపు టెక్స్‌టైల్ పార్క్ ద్వారా సిరిసిల్ల రానున్న రోజుల్లో పూర్తిగా రూపాంతరం చెంది సిరుల ఖిల్లాగా మారుతుందన్నారు. ప్రతినిత్యం ఆత్మహత్యలతో వార్తల్లోకెక్కిన సిరిసిల్ల ఈ రోజు తెలంగాణ బిడ్డలకు బతుకమ్మ చీరలు నేస్తూ వార్తల్లోకి ఎక్కుతుందని హరీశ్ అన్నారు. సిరిసిల్లలో ఆత్మహత్యలను నివారించగలిగిన ఘనత కేటీఆర్‌కు దక్కుతుందన్నారు. 

మంత్రి కేటీఆర్ పనితీరు, సిరిసిల్ల అభివృద్దిపైన హరీశ్‌రావు ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ మరో 15 ఏండ్లపాటు కొనసాగాలని తామిద్దరం కోరుకుంటున్నామని అన్నారు. లక్షలాది మంది తెరాస కార్యకర్తల బలంతో పార్టీ మరింత బలోపేతమై అధికారంలోకి రాబోతుందని పేర్కొన్నారు. అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా ఉన్నామని వివరించారు. కాలంతో పోటీ పడి కాళేశ్వరాన్ని పరుగెత్తిస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి ప్రారంభించిన అభివృద్ధి యజ్ఞాన్ని సిద్దిపేటలో తాను కొనసాగిస్తున్నానని ఈ సందర్భంగా హరీశ్‌రావు వివరించారు. సిద్ధిపేట అభివృద్ధ్ది వెనుక 30 ఏళ్ల శ్రమ ఉందన్నారు. అయితే గత 30 ఏళ్లలో జరగని అభివృద్ధిని మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో చేసి చూపించే ప్రయత్నం చేశారని అభినందించారు. ఒక వైపు తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడుల కోసం దేశ విదేశాల్లో పర్యటిస్తూ  విజయవంతంగా తన శాఖను నిర్వహిస్తూనే మరో వైపు సిరిసిల్ల అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారని అన్నారు. ముఖ్యమంత్రి అప్పచెప్పిన బాధ్యతలను తమ పరిధిలో తాము నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సిరిసిల్ల అభివృద్దిని హరీశ్‌రావు వివరించారు. గత నాలుగేళ్ల కాలంలో సిరిసిల్ల గుర్తుపట్టలేనంతగా మారిపోయిందన్నారు. సిరిసిల్ల పట్టణ అభివృద్ధితో పాటుగా మండలాలు, గ్రామాల అభివృద్దిపై కేటీఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని వివరించారు. కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్ మండలాల వారీగా ముఖ్యనాయకులతో భేటీ అయ్యారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఇప్పటిదాకా తాము చేసిన పనులను ప్రజలకు తెలిసేలా వివరించాలని కోరారు. ఓటింగ్ శాతాన్ని పెంచే ప్రయత్నం చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రసంగించిన మంత్రి హరీష్‌రావుకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తాము కేవలం అభివృద్ధిలో మాత్రమే పోటీ పడుతున్నామని అన్నారు. సొంత అన్నదమ్ముల్లా కలిసి పెరిగామని వివరించారు. ఉద్యమ కాలం నుంచి కేవలం తెలంగాణ కోసం పనిచేస్తున్నామని తెలియచేశారు. ఇద్దరం కలిసి ఒకే మంత్రివర్గంలో పని చేసే సువర్ణావకాశం లభించిందన్నారు. ముఖ్యమంత్రి కంటున్న బంగారు తెలంగాణ కల కోసం తామిద్దరమూ సైనికుల్లా పని చేస్తామన్నారు. ఇందులో భాగంగానే కాలంతో పోటీపడి కాళేశ్వరం ప్రాజెక్టును హరీశ్‌రావు పరుగెత్తిస్తున్నారని వివరించారు. ఆయన ఆధ్వర్యంలో ప్రాజెక్టులన్నీ  పరుగులెత్తుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.

సొంత గూటికి గజ్వేల్ నేతలు
టీపీసీసీ అధ్యక్షులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో బుధవారం కాంగ్రెస్‌లో చేరిన దుబ్బాక, గజ్వేల్ నియోజక వర్గాల తెరాస నేతలు గురువారం మంత్రి టి. హరీశ్‌రావు సమక్షంలో సొంత గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ నేతల ప్రలోభాలు, ఒత్తిళ్ల వ్లలనే ఆ పార్టీ కండువా కప్పుకున్నామని తెరాస నేతలు తెలిపారు. వట్టిపల్లి ఎంపిటీసీ కుంట కవిత, సీనియర్ నేత యాదగిరి, ఇటిక్యాల సర్పచ్ ఐలయ్య వారి అనుచరులతో కలిసి తిరిగి తెరాసలో చేరారు. మంత్రి హరీష్‌రావు వారికి తెరాస కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ నాయకులు తెరాస కార్యకర్తలను ఒత్తిళ్లకు గురి చేసి పార్టీలో చేర్చుకొనే యత్నాలు చేస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడాలని ఆయన తెరాస కార్యకర్తలను కోరారు.కేటీఆర్‌కు నాకు విషయంలో పోటీ: హరీశ్

Updated By ManamThu, 10/04/2018 - 18:22
 • ఒకే వేదికపై బావాబామ్మర్ది

 • కేటీఆర్‌పై హరీశ్ ప్రశంసలు

Harish-KTR-Manam telugu news

హైదరాబాద్: మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు చాలా రోజుల తర్వాత ఒకే వేదిక పంచుకుని, పార్టీ కార్యకర్తలు, అభిమానులకు కనువిందు చేశారు. ఇరువురి మధ్య విబేధాలు ఉన్నట్లు వస్తున్న ఊహాగానాలకు పుల్‌స్టాఫ్ పెట్టారు. ఇదే విషయంపై మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ...కేటీఆర్‌తో తమకు ఎలాంటి విభేదాలు లేవని, తాము ఇద్దరం అన్నదమ్ముల్లా కలిసి పెరిగామన్నారు. ఆయన గురువారం సిరిసిల్ల కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌తో కలిసి  పాల్గొన్నారు. హరీశ్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ...సిరిసిల్లలో రికార్డు స్థాయి మెజారిటీతో కేటీఆర్‌ను గెలిపించాలని ... అభివృద్ధి విషయంలో మాత్రం కేటీఆర్, తాను పోటీ పడతామని అన్నారు.

Harish-KTR-Manam telugu news

అయితే  సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలు అభివృద్ధిలో పోటీపడి ముందుకు వెళుతున్నాయని అన్నారు. అలాగే మెజారిటీ విషయంలో సిరిసిల్ల సిద్దిపేటను దాటాలని కార్యకర్తలకు సూచించారు.  సిద్దిపేట అభివృద్ధి వెనుక 30 సంవత్సరాల శ్రమ ఉన్నదని, అయితే 30 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని గత నాలుగేళ్లలోనే కేటీఆర్ తన నియోజకవర్గం సిరిసిల్లలో చేసి చూపించే ప్రయత్నం చేశారని అభినందించారు. కేసీఆర్ ప్రారంభించిన అభివృద్ధి యజ్ఞాన్ని సిద్దిపేటలో తాను కొనసాగిస్తున్నానని హరీశ్ రావు తెలిపారు.

కేటీఆర్ మాట్లాడుతూ... ఉద్యమ కాలం నుంచి కేవలం తెలంగాణ కోసం పనిచేసిన తాము, ఇద్దరం కలిసి ఇలా ఒకే క్యాబినెట్లో పనిచేసే అవకాశం లభించిందని... ఇదంతా తెలంగాణ ప్రజలు తమకు ఇచ్చిన ఒక సువర్ణవకాశంగా భావిస్తున్నామన్నారు. తామంతా లక్షలాది తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు మాదిరి ముఖ్యమంత్రి మరో పదిహేనేళ్లపాటు రాష్ట్రానికి నాయకత్వం వహించాలన్న కల కోసం పని చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు.

కేసీఆర్ కంటున్న బంగారు తెలంగాణ కల కోసం తామంతా సైనికుల్లా పని చేస్తామని  తెలిపారు. ఇందులో భాగంగానే కాలంతో పోటీపడి కాళేశ్వరం ప్రాజెక్టును హరీష్ రావు పరిగెత్తిస్తున్నారన్నారు. ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ పరుగులెత్తుతూ ఉన్నాయని తెలిపారు. ఆయన పనితీరు తమ నియోజకవర్గ అభివృద్ధిలో ఆదర్శంగా ఉంటుందని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు.

Related News