cm chandrababu

మిమ్మల్ని గెలిపిస్తా

Updated By ManamWed, 10/03/2018 - 04:10
  • అందుకే యువనేస్తం పథకం.. నిరంతరాయంగా కొనసాగిస్తాం

  • ఎన్నికల కోసం పెట్టింది కాదు.. మనసుకు బాగా నచ్చినది ఇదే

  • 2.10 లక్షల మందికి నేడే భృతి.. ప్రతి నెలా ఖాతాలలోకి జమ

  • ఐఏఎస్ అవుదామని అనుకున్నా.. కుదరక.. ఎమ్మెల్యేపై దృష్టిపెట్టా

  • మీరూ కష్టపడితే ఫలితాల సాధన.. యువతకు చంద్రబాబు సూచనలు

అమరావతి: ఎన్నికల కోసమో, అధికారం దక్కించుకోవడానికో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు భృతి ఇవ్వడం లేదని, దశా దిశా లేక నిరాశలో ఉన్న యువతను జీవితంలో గెలిపించాలన్న తపనతోనే ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకాన్ని ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నిరుద్యోగ భృతి నిరంతరాయంగా కొనసాగే పథకమని, అర్హులందరినీ అక్కున చేర్చుకుంటుందని చెప్పారు. యువత కష్టానికి మించిన ప్రోత్సాహం తమ ప్రభుత్వం నుంచి ఎప్పుడూ ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. సానుకూల దృక్పథంతో ఆలోచిస్తే ఏదైనా సాధించగలమని, అనునిత్యం లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకునేందుకు చిత్తశుద్ధితో, వినూత్నంగా ప్రయ త్నించాలని ముఖ్యమంత్రి యువతకు సూచించారు. ఈ విషయంలో గాంధీజీని ఆదర్శంగా చేసుకోవాలన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ పోషించిన పాత్ర అందరికీ ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని చెప్పారు. ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకాన్ని గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి లాంటి మహనీయుల జయంతి రోజున మొదలుపెట్టినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకాన్ని యువతీయువకులు, లబ్ధిదారుల నడుమ ముఖ్యమంత్రి ప్రారంభించారు.
 

image

 ముందుగా జాతిపిత గాంధీజీ చిత్రపటానికి అంజలి అర్పించిన సీఎం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాలుగున్నరేళ్ల తన పాలనలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా.. తన మనసుకు బాగా నచ్చింది మాత్రం ఇదేనని వివరించారు. ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకానికి సెప్టెంబరు 14 నుంచి అక్టోబరు 1 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని అర్హత సాధించిన రాష్ట్రంలోని సుమారు 2.10 లక్షల మందికి నిరుద్యోగ భృతిని ఈనెల నుంచి ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎంపికైన అందరి ఖాతాలో బుధవారం రూ.వెయ్యి జమ చేస్తామని, నెలనెలా దీనిని కొనసాగిస్తామని చెప్పారు. ఈ పథకానికి తమ పేర్లను కొత్తగా నమోదు చేసుకునేందుకు యువతకు ఎప్పుడూ అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. 2029 నాటికి భారతదేశ సగటు యువత వయస్సు 29 సంవత్సరాలని ముఖ్యమంత్రి చెప్పారు. దీంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం, ఇంగ్లీష్ భాషపై పట్టు మనకు కలిసొచ్చే అంశాలుగా తెలిపారు.  

ప్రభుత్వానికి పెట్టుబడిదారుల ప్రశంసలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాలు imageకల్పించడం, యువత కు నైపుణ్య శిక్షణ, ఉద్యోగావకాశాలు పొందేలా అవకాశాలు పెంపొందిస్తున్న తీరుపై ఫాక్స్‌కాన్ ఇండియా లిమిటెడ్, కియా మోటర్స్, బ్రాండెక్స్ ప్రతినిధులు ప్రశంసలు కురిపించారు. ‘ముఖ్యమంత్రి యువనేస్తం’తో తమకు కావాల్సిన మానవ వనరుల లభ్యత సులభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం లబ్ధిదారులు, యువతీ,యువకులతో ముఖ్యమంత్రి ముఖాముఖి సమావేశం నిర్వహించారు. యువత అడిగిన పలుప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.  

ఓ యువకుడు: వేరే రాష్ట్రాల్లో నిలిపివేసినట్టు ఇక్కడా దీన్ని మధ్యలో నిలిపేస్తారా? లేదా ఎన్నికల వరకే ఇది పరిమితమా?
సీఎం సమాధానం: మిగిలిన రాష్ట్రాలలో మధ్యలో నిలిపేయడానికి కారణం ఫ్రేమ్‌వర్క్‌లో లోపం. ఇక్కడ అలాంటి ప్రమాదం లేదు. ఎన్నికల కోసం చేపట్టిన కార్యక్రమం కాదు. మీ స్వయం ఉపాధికి మార్గం. 

మరో యువకుడు : డేర్ టు డ్రీమ్ అని మీరు అంటారు. కానీ మాకు 25 ఏళ్ల వయసులోనూ ఏం చేయాలో తెలియడం లేదు. మీరు ముఖ్యమంత్రి అవ్వాలని చిన్నప్పటి నుంచే అనుకున్నారా?
ముఖ్యమంత్రి: నేను చదువుకునేటప్పుడు ఐఏఎస్ కావాలని అనుకున్నాను. అందుకు తగ్గట్టు కృషిచేశాను. కానీ మన కష్టం ఆ స్థాయికి సరిపోదేమో అనిపించింది. దానికన్నా ఎమ్మెల్యే అవుదామని అనుకున్నాను. ఎమ్మెల్యే అయితే ఐఏఎస్‌లనే నియంత్రించవచ్చని అనిపించింది. కష్టపడ్డాను కాబట్టే ఈ స్థాయికి వచ్చాను. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నాను. 

మరో యువకుడు: రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమలు, సంస్థలలో స్థానికులకే ఉద్యోగాలు ఇస్తారా? 
ముఖ్యమంత్రి
: చాలావరకు స్థానికులకే ఉద్యోగాలు వస్తాయి. సమర్ధత లేకపోతే ఏమీ చేయలేం. నైపుణ్యం మీరు సాధించాలి. నైపుణ్యం అందిపుచ్చుకుంటే ఎక్కడ ఉన్నా చెల్లుబాటు అవుతాం.  

ఓ యువకుడు : తిరుపతి వేదికగా అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు వచ్చాయి. కానీ వాటిలో స్థానికేతరులకు ఉద్యోగాలు ఇస్తున్నారు. స్థానిక రిజర్వేషన్లు ఇవ్వాలని మా కోరిక.
ముఖ్యమంత్రి: నూటికి 90 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇస్తున్నాం. ఈ విషయంలో నేను అందరితో సమన్వయం చేస్తున్నాను. ఎక్కడైనా ఉల్లంఘిస్తే చెప్పండి, చర్యలు తీసుకుంటాం.
    
యువకుడు: డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎన్నికల లోపు వాటిని భర్తీ చేస్తారా? ప్రభుత్వ ఉద్యోగం అంటే లంచం ఇవ్వాల్సిందే అంటారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ముడుపులు ఇవ్వాలా? 
ముఖ్యమంత్రి: ఎవరైనా లంచం అడిగితే 1100కు ఫోన్ చేయండి. కఠిన చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో ఎక్కడా అవినీతికి చోటులేదు.  
కార్యక్రమంలో చివరిగా సీఎం ‘ఆంధ్రప్రదేశ్ యువ జన విధానం-2018’ను విడుదల చేశారు. అనంతరం ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథాకానికి ఎంపికైన లబ్ధిదారులకు అభినందన పత్రం అందించారు.ఏపీ పర్యాటకంపై ప్రత్యేక తపాలా బిళ్లలు

Updated By ManamFri, 08/24/2018 - 14:41

cmఏపీ పర్యాటకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక తపాలా బిళ్లలను విడుదల చేశారు. రాష్ట్రంలోని 12 ప్రముఖ పర్యాటక స్ధలాలను ఆ స్టాంప్‌లో రూపొందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఏపీ పర్యాటకంలో తపాలా శాఖ భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 3వ స్ధానంలో ఉన్న ఏపీ పర్యాటకం మొదటి స్ధానానికి చేరాలి. రాష్ట్రంలో పర్యాటక రంగం ద్వారా భారీగా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. పర్యాటక రంగంలో యువతరం ఉపాధిని సద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు. ఈ సమావేశంతో ముఖ్యమంత్రితో పాటు మంత్రి అఖిల ప్రియా, టూరిజం అధికారులు తదితరులు పాల్గొన్నారు.కాంగ్రెస్-టీడీపీ దోస్తానా..? పొత్తుపై బాబు భేటీ!

Updated By ManamTue, 08/21/2018 - 21:11

tdp-congress

అమరావతి: 2019 ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు ఇప్పట్నుంచే ఎన్నికలకు ఎలా వెళ్లాలి..? ఒంటరిగా వెళ్లాలా..? పొత్తులతో ముందుకెళ్లాలా? అనే విషయాలపై కీలక చర్చలు జరుపుతున్నాయి. ఏపీ విషయానికొస్తే సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం రాత్రి అందుబాటులో ఉన్న మంత్రులు, ముఖ్య నేతలతో అత్యవసరంగా భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాలు, జాతీయ రాజకీయాలపై కీలక సమావేశం నిర్వహించారు. ఏపీతో పాటు తెలంగాణలో ఇతర పార్టీలతో పొత్తులపై చర్చ జరిగింది. తాము అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఏపీ ప్రత్యేక హోదాపైనే అని కాంగ్రెస్ పెద్దలు ఊదరగొడుతున్న సంగతి తెలిసిందే.

ఈ తరుణంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుందామా..? వద్దా..? అసలు ఎన్నికలు సింగిల్‌గా వెళ్లాలా..? పొత్తు పెట్టుకోవాలా..? అనే అంశంపై నిశిత చర్చ జరిగింది. సుమారు గంటకుపైగా ఈ కీలక చర్చ జరిగింది. హోదా ఇస్తామంటున్న కాంగ్రెస్‌తో ఎలా వ్యవహరించాలి..? వారితో ఎలా ముందుకెళ్లాలన్న తీరుపై నేతలతో చంద్రబాబు సమాలోచనలు చేస్తున్నారు. కాగా.. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందని సంకేతాలున్నాయి. ఈ విషయాన్ని నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. పొత్తు విషయంలో తెలంగాణ నేతల అభిప్రాయాన్ని తీసుకోవాలని పార్టీలోని కొందరు ముఖ్యులను చంద్రబాబు ఆదేశించారు.

AP Cabinet Meeting

కాగా.. తెలుగు రాష్ట్రాల్లో పొత్తులుంటేనే బాగుంటుందని తెలుగు తమ్ముళ్లు బాబుకు స్పష్టంగా వివరించినట్లుగా తెలుస్తోంది. గతంలో పోల్చుకుంటే ఏపీలో కాంగ్రెస్‌పై వ్యతిరేకత తగ్గిందని నేతలు సీఎంకు వివరించారని సమాచారం. జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభావం తగ్గుతోందని నేతలు ప్రభావం తగ్గుతోందన్న ప్రస్తావన కూడా సమావేశంలో చర్చించారని సమాచారం. వీటన్నింటినీ విన్న సీఎం చంద్రబాబు త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుందామని నేతలతో బాబు చెప్పినట్లు సమాచారం.

tdp-congress 01

ఇదిలా ఉంటే... గత కొద్దిరోజులుగా సీఎం చంద్రబాబు కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నట్లు మెలిగిన సందర్భాలు చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్ మద్దతు, కర్ణాటక సీఎం కుమార స్వామి ప్రమాణ స్వీకారంలో రాహుల్‌‌తో కలయిక, నారా బ్రాహ్మణి రాహుల్‌ భేటీలో ప్రత్యక్ష మవ్వడం ఈ సందర్భాలన్నింటినీ పరిగణనలోనికి తీసుకుంటే ముందు నుంచే చంద్రబాబు దాదాపు ఫిక్సయ్యారనే తెలుస్తోంది. అందుకే గత కొద్దిరోజులుగా కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారని ఇట్లే అర్థం చేసుకోవచ్చు.

bramhini and rahul

మొత్తానికి చూస్తే.. కాంగ్రెస్‌తో పొత్తుకు దాదాపు టీడీపీ ఫిక్స్ అయిపోయినట్లేనని తెలుస్తోంది. ఇందుకు తార్కాణమే ఇటీవల మాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ వ్యాఖ్యలే. టీడీపీకి కాంగ్రెస్ దగ్గరవుతోందన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పోరాటం ఒక్క వైసీపీతో మాత్రమే టీడీపీ కాదని పరోక్షంగా మాట్లాడుతూ కుండబద్ధలు కొట్టారు. దీంతో అసలు ఆయన మాటల వెనుక ఆంతర్యమేంటో తెలుసుకోవచ్చు. మొత్తానికి చూస్తే అటు తెలంగాణ, ఇటు ఏపీలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం మాత్రం కన్ఫామ్ అని తెలిసిపోతోంది. అయితే టీడీపీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటన చేయడమే తరువాయి..! అయితే ఇది వరకు సాధ్యమవుతుందో..? పొత్తు పెట్టుకుండే టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుందో..? పొత్తు టీడీపీకి కలిసొస్తుందో.. లేదో? తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే మరి.

Congress And Tdp Deal For 2019 Electionsఏపీ సర్కార్ కీలక నిర్ణయంపై అంబికా స్పందన

Updated By ManamTue, 08/21/2018 - 19:30

APFDC Chairman Ambica Krishna On AP Govt Key Decision

అమరావతి: స్టేట్ జీఎస్టీ నుంచి చిన్న తెలుగు సినిమాలకు మినహాయింపు ఇస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. సర్కార్ ప్రకటనపై ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అంబికా కృష్ణ స్పందించారు. " చిన్న సినిమాల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నందకు ధన్యవాదాలు. చిన్న సినిమాలకు అన్ని రకాల టాక్స్‌లు ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చిన్న సినిమా బ్రతికించడం ద్వారా ఎంతో మంది ఉపాధి  పొందుతారు. పెద్ద హీరోలు  వాళ్ళ రెమ్యూనిరేషన్, మార్కెట్ కారణంగా ఏడాదికి ఒకటి, రెండు సినిమాల కంటే ఎక్కువ రావడం లేదు. పెద్ద హీరోలు ఏడాది ఒక సినిమాలు చేయడం వల్ల, థియేటర్స్ యాజమాన్యం చాలా ఇబ్బందులు పడుతోంది. కనీసం సైకిల్ స్టాండ్‌లో పని చేసే వారికి జీతాలు కూడా ఇవ్వకపోతున్నారు. పల్లెటూర్లలో, పట్టణాల్లో, మల్టీప్లెక్స్‌లో పెద్ద హీరోల సినిమాల రిలీజ్ అయితే.. అన్ని షోలలో వారి సినిమాలు అడుతున్నాయి.. దీని కారణంగా చిన్న సినిమాలు బ్రతలేకపోతున్నాయి. చిన్న సినిమాలకు అండగా ఉండాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. 

4 కోట్ల లోపు తీసిన  అన్ని చిన్న సినిమాలకు టాక్స్‌లు తొలగిస్తాం.. దీని కోసం కొన్ని నిబంధనలు పెడుతున్నామని చంద్రబాబు చెప్పారు. జీఎస్టీ 18 శాతంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 9 శాతం కూడా తొలగిస్తామని ఏపీలో షూటింగ్‌లో కోసం ఎలాంటి ఖర్చులు లేకుండా సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తాం. చిన్న సినిమాలకు ఏపీలోనే పోస్ట్ ప్రొడక్షన్ చేయాలనే నిబంధన పెడుతున్నాం. వాణిజ్య పన్నుల శాఖ ఇచ్చే లెక్కల ప్రకారం  రిఎంబెర్స్  చేస్తాం. మన సంస్కృతి, సాంప్రదాయాలు చక్కగా చూపించిన 10 చిన్న సినిమాలను ఎంపిక చేసి.. ప్రతి ఏడాది వాటికి ప్రోత్సాహకాలు అందిస్తామని.. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. సినిమా థియేటర్స్ కొందరి చేతిలోనే ఉన్న విషయం వాస్తవమే. చిన్న సినిమాల విషయంలో నిర్మాతలను, హీరోలను కలసి వివరించాను. ఏపీలో షూటింగ్ జరపాలని అందరి హీరోలను కోరాను.. వారంతా సానుకూలంగానే స్పందించారు" అని అంబికా కృష్ణ స్పష్టం చేశారు.

మొత్తానికి చూస్తే ఇది టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏపీ సర్కార్ ఇచ్చిన బంపరాఫర్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. అయితే ఈ ప్రకటన ఎంత వరకు అమల్లోకి వస్తుందో రెండు సినిమాలు రిలీజ్ చేస్తే పరిస్థితి ఏంటనేది అర్థం చేసుకోవచ్చు.టాలీవుడ్‌కు ఏపీ సర్కార్ బంపరాఫర్

Updated By ManamTue, 08/21/2018 - 18:16

AP Government Gives Bumper Offer To Tollywood

అమరావతి: తెలుగు సినీ ఇండస్ట్రీకి (టాలీవుడ్‌) ఏపీ సర్కార్ బంపరాఫర్ ఇచ్చింది. ఇన్ని రోజులూ చిన్న సినిమాలు తీసి పెద్ద ఎత్తున ట్యాక్స్‌లు కట్టడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిర్మాతలకు చంద్రన్న ప్రభుత్వం శుభవార్త అందించింది. చిన్నబడ్జెట్‌ సినిమాల విషయంలో మంగళవారం సాయంత్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్టేట్ జీఎస్టీ నుంచి చిన్న సినిమాలకు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రూ. 4 కోట్ల బడ్జెట్‌తో తీసే సినిమాలకు స్టేట్ జీఎస్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. చిన్న సినిమాలకు కేవలం సింగిల్ విండో విధానంలోనే అనుమతులివ్వనుంది.

ఇదిలా ఉంటే.. ఓ వైపు ఇండస్ట్రీకి శుభవార్త చెప్పినట్లే చెప్పిన సర్కార్ చిన్నపాటి మెలిక కూడా పెట్టడం గమనార్హం. చిన్న సినిమాలకు ఏపీలోనే పోస్ట్ ప్రొడక్షన్ చేయాలనే నిబంధన పెట్టింది. సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబిస్తూ తీసే 10 చిన్న సినిమాలకు ప్రతీ ఏడాది ప్రోత్సాహకాలుంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

కాగా.. ఏపీ సర్కార్ ప్రకటనతో టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేస్తోంది. కాగా టాలీవుడ్‌పై కీలక నిర్ణయం తీసుకున్నందుకు గాను త్వరలో సీఎం చంద్రబాబును నిర్మాతల మండలి సభ్యులు కలిసి ధన్యవాదాలు తెలపి.. శాలువా కప్పి సన్మానించనున్నట్లు సమాచారం.‘జగన్ సీఎం అయితే.. ఆ ముగ్గురు జైలుకే!’

Updated By ManamSun, 08/19/2018 - 21:54

yv subba reddy

ఒంగోలు: వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డి అధికారంలోకి వస్తే ప్రస్తుత సీఎం చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమాల అవినీతిపై విచారణ చేపడతామని... వీళ్లంతా జైలు యాత్ర చేయాల్సిందేనని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన..." తెలుగుదేశం ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టును పూర్తి చేస్తాం. వైఎస్ హయాంలో నేను అవినీతికి పాల్పడినట్టు రుజువు చేస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను" అని వైవీ సుబ్బారెడ్డి సవాల్ చేశారు.ముస్లింలకు శుభవార్త చెప్పిన చంద్రబాబు!

Updated By ManamFri, 08/10/2018 - 15:02

CM Chandrababu Tells Good News For Muslims

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముస్లిం సోదరులకు శుభవార్త చెప్పారు.! ఎన్నో రోజులుగా తమ సామాజిక వర్గానికి మంత్రి పదవి వస్తుందని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. మంత్రివర్గ విస్తరణ జరిగినప్పడు ఇక అన్నీ అయిపోయాయ్.. మంత్రిగా ఆయన పేరు ప్రకటించడమే ఆలస్యమని కూడా వార్తలు వచ్చాయి. వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌కు లేదా కర్నూల్‌కు చెందిన ఎమ్మెల్సీకి మంత్రి పదవి ఇవ్వాలని అధిష్ఠానం యోచించింది. అయితే అప్పట్లో అవన్నీ సాధ్యం కాలేదు. 

తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఈ ముస్లింలకు మంత్రి పదవి అనే విషయాన్ని ప్రస్తావనకు తెచ్చారు. ముస్లింలకు మంత్రి పదవి ఇచ్చే అంశంపై కసరత్తు చేస్తున్నామని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలో పేరు ప్రకటిస్తామన్నట్లుగా బాబు చెప్పుకొచ్చారు. వక్ఫ్ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని బాబు హెచ్చరించారు. వక్ఫ్ భూములను కాపాడుతాం.. అక్రమదారులపై ఉక్కుపాదం మోపుతామని సీఎం స్పష్టం చేశారు.‘సూర్యలత సరే.. లోకేష్ సంగతేంటి..!?’

Updated By ManamFri, 08/10/2018 - 13:14

BJP Leader uma maheswararaju Stright Question To CM Chandrababu Over Lokesh

విజయవాడ: గత కొద్దిరోజులుగా టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని బయటపెడుతూ.. ప్రాంతీయ మీడియాతో పాటు జాతీయ మీడియాలో కూడా బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబును మొదలుకుని మంత్రుల వరకూ అందర్నీ విమర్శిస్తుండటంతో అంతే రీతిలో తెలుగు తమ్ముళ్లు సైతం కౌంటర్లు పేలుస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై తాజాగా బీజేపీ అధికార ప్రతినిధి ఉమామహేశ్వర రాజు స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జీవీఎల్‌పై టీడీపీ దాడిని సీరియస్‌గా తీసుకుంటున్నామని ఆయన చెప్పుకొచ్చారు. టీడీపీకి ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..? అని రాజు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చరిత్ర ప్రజలందరికీ తెలుసు.. మేం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు. జీవీఎల్ రూ. 100 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆరోపిస్తున్న వారు చర్చకు రావాలని ఈ సందర్భంగా ఆయన ఛాలెంజ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి దమ్ముంటే సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారాయన.

టీడీపీ బీసీలకు వ్యతిరేకం.. అందుకే దుర్గమ్మ పాలకమండలి సభ్యురాలైన సూర్యలతపై చర్యలు తీసుకున్నారని విమర్శలు గుప్పించారు. మరి తాంత్రిక పూజల విషయంలో మంత్రి లోకేష్‌పై ఆరోపణలు వచ్చాయి వాటి సంగతేంటి.. అసలు లోకేష్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని మహేశ్వర్రాజు సూటి ప్రశ్న సంధించారు. తాంత్రిక పూజలు చేసిన ఈఓ సూర్యకుమారికి మాత్రం మంచి పోస్టింగ్ ఇచ్చారన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. లోకేష్‌ కోసం తాంత్రిక పూజలు చేయడం వల్ల ఆ నివేదిక ఇంత వరకూ బయటికి రాలేదని అది బయటపెడితే నిజానిజాలేంటో తెలుస్తాయని.. బీజేపీ నేత చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై టీడీపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే.ఏపీలో నామినేటెడ్ పోస్టులు భర్తీ..

Updated By ManamSun, 08/05/2018 - 20:18

CM Chandrababu Filled Nominated Posts In Andhrapradesh

అమరావతి: ఏపీలో పలు నామినేటెడ్ పోస్టులను సీఎం చంద్రబాబు నాయుడు భర్తీ చేశారు. 

:- ఏపీ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్: బొడ్డు వేణుగోపాల్ (కృష్ణా జిల్లా)

:- ఏపీ ఖాదీ, గ్రామీణ బోర్డు ఛైర్మన్: దొమ్మేటి సుధాకర్ (పశ్చిమగోదావరి)

:- ఏపీ విత్తనాభివృద్ధి ఛైర్మన్: ఏవీ సుబ్బారెడ్డి (కర్నూలు)

:- అత్యంత వెనుకబడిన తరగతుల సంక్షేమ అభివృద్ధి బోర్డు ఛైర్మన్: కాకి గోవిందరెడ్డి (విశాఖపట్నం)

:- నూర్ బాషా-దూదేకుల ముస్లిం కార్పొరేటివ్ సొసైటీ ఫెడరేషన్ ఛైర్మన్: బబన్ (కర్నూలు)

:- మచిలీపట్నం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్: బూరగడ్డ వేదవ్యాస్ 

కాగా..  ఇప్పటికే పలువురికి హామీలిచ్చిన ప్రకారం చంద్రబాబు ఈ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారని స్పష్టంగా అర్థమవుతోంది. ఏవీ సుబ్బారెడ్డికి నామినేటెడ్ పదవి ఇస్తానంటూ నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏవీ వర్గీయులు, అనుచరులు పటాసులు కాల్చి.. స్వీట్లు పంచుకున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన పలువురు ఎమ్మెల్యేలకు ఇప్పటికే చంద్రబాబు మంత్రి పదవులు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బూరగడ్డ వేద వ్యాస్‌ను టీడీపీలోకి చేర్చుకునే సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం నామినేటెడ్ పదవి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కాగా అప్పట్లో మంత్రి పదవి రాలేదని కొందరు నిరాశపడిన అధికార, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మాత్రం మరోసారి నిరాశే ఎదురైందని చెప్పుకోవచ్చు.పీవీ సింధును మెచ్చుకున్న చంద్రబాబు

Updated By ManamSun, 08/05/2018 - 18:07

CM Chandrababu Praised Shutler PV Sindhu

అమరావతి: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ప్రముఖ భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ పతక విజేత, తెలుగు తేజం పీవీ సింధును ఫైనల్ ఫోబియా వీడటం లేదు. సెమీస్‌లో జపాన్ క్రీడాకారిణి యమగుచిని మట్టికరిపించి ఫైనల్‌కు దూసుకెళ్లిన సింధు.. స్పెయిన్ క్రీడాకారిణి, వరల్డ్ నెంబర్ వన్ కరోలినా మారిన్ చేతిలో పరాజయంపాలైన సంగతి తెలిసిందే. పీవీ సింధు ఓడినా దేశ వ్యాప్తంగా క్రీడాభిమానుల మనస్సును గెలుచుకుంది. ఆమె అహర్నిశలూ శ్రమించిన తీరును క్రీడాకారులు, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు మెచ్చుకుంటున్నారు.

సింధు ఆట తీరుపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. ‘శభాష్ సింధు.. ఓడినా నువ్ చాలా గ్రేట్’ అని సీఎం అభినందించారు. కరోలినా మారిన్ చేతిలో ఓడినప్పటికీ, అద్భుత ప్రదర్శనను ప్రదర్శించారని మెచ్చుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు ఘనతను ఘనంగా చాటిందన్నారు. ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో సిల్వర్ మెడల్‌ను సాధించి భారత షట్లర్ల గొప్పదనాన్ని చాటిందని సీఎం చెప్పుకొచ్చారు. ఛాంపియన్ షిప్‌లో ఇప్పటి వరకు నాలుగు పతకాలు సాధించి సువర్ణాధ్యాయాన్ని సృష్టించిందని సింధును చంద్రబాబు ప్రశంసించారు. ప్రపంచ దిగ్గజ క్రీడాకారులను ఓడించి ఫైనల్ చేరిన సింధు మెగా టోర్నీలో అసామాన్య ప్రతిభ చూపిందని చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. వరుసగా రెండు సార్లు ఫైనల్స్‌కు చేరుకుని ఘన చరిత్రకు శ్రీకారం చుట్టిందని బాబు చెప్పుకొచ్చారు.

కాగా.. కరోలినా మారిన్‌తో ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఐదింటిలో సింధు గెలిచింది. కానీ.. 2014 ప్రపంచ బ్యాడ్మింటన్ సెమీస్‌లో సింధును కరోలినా ఓడించిన విషయం తెలిసిందే. గత రియో ఒలింపిక్స్‌లో సింధును ఓడించిన కరోలినా స్వర్ణాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

Related News