FEDARAR

ఫెదరర్ ఔట్

Updated By ManamThu, 07/12/2018 - 00:10
  • అల్లాడించి ఓడించిన అండర్సన్

imageలండన్ః వింబుల్డన్‌లో పెను సంచలనం నమోైదెంది.  టాప్ సీడ్, వరల్డ్ నంబర్ టూ రోజర్ ఫెదరర్‌కు ఊహించని రీతిలో ఓటమి ఎదురైంది. ద క్షిణాఫ్రికా ఆటగాడు కెవిన్ అండర్స్‌న్ చేతిలో గ్రాస్‌కోర్ట్ కింగ్ ఫెదరర్ 6-2, 7-6(7-5),5-7,4-6,11-13 చిత్తయిపోయాడు.  నువ్వానేనా అన్నట్టు  నాలుగుగంటలు పైగా  సాగిన ఈ మ్యాచ్‌లో  ఫెదరర్ తొలి సెట్‌ను సునాయాసంగానే గెలుచుకున్నా.. ఆ తర్వాత అండర్సన్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది.

చివరి సెట్ వరకూ ఫెదరర్‌కు చెమటలు పట్టించిన అండర్సన్ చివరకు విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టాడు.మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో  సెర్బియా స్టార్, మాజీ చాంపియన్ నోవాక్ జకోవిచ్ వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో సెమీస్‌లోకి అడుగుపెట్డాడు. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 12వ సీడ్ జకోవిచ్ (సెర్బియా) 6-3, 3-6, 6-2, 6-2తో జపాన్‌కు చెందిన 24వ సీడ్ నిషికొరిని చిత్తుచేసి దర్జాగా సెమీస్‌కు దూసుకెళ్లాడు.



ఫెదరర్ నంబర్ వన్ ర్యాంకుకు ముప్పు

Updated By ManamMon, 03/26/2018 - 04:50

175వ ర్యాంక్ ఆటగాడి  చేతిలో ఓటమి
FEDARARమియామి:  
స్విస్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ నంబర్ వన్ ర్యాంకు ప్రమాదంలో పడింది. మియామిలో జరుగుతున్న మియామి  మాస్టర్స్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ రెండో రౌండ్‌లో ఫెదరర్  ప్రపంచ 175వ ర్యాంక్ ఆటగాడు కోకినాస్ చేతిలో 6-3, 3-6, 7-6(7-4) స్కోరుతో ఓటమి పాలయ్యాడు.   ఈ టోర్నీలో వైల్డ కార్డ్ ఎంట్రీ తో ఆడుతున్న కోకినాస్ 20 గ్రాండ్‌శ్లామ టైటిళ్లను గెలుచుకున్న ఫెదరర్‌ను ఓడించటం పెను సంచలనమైంది.  ఈ ఏడాది  ఫిబ్రవరిలో  రోటర్‌డామ్ ఓపెన్‌లో విజయం సాధించి మళ్లీ నంబర్ వన్ స్థానానికి చేరుకున్న ఫెదరర్‌కు ఈ ఓటమి  పెద్ద షాకిచ్చింది. తాజా ఓటమితో ఫెదరర్ నంబర్ వన్ ర్యాంక్ ప్రమాదంలో పడింది.





Related News