delhi

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

Updated By ManamThu, 11/15/2018 - 09:50

Fire Accidentన్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వాయువ్య ఢిల్లీలోని బవానా పారిశ్రామిక వాడలోని ఓ కర్మాగారంలో గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అనంతరం చట్టుపక్కల ప్రాంతాలకు ఆ మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న 22 ఫైరింజన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఇంకాస్త సమయం పట్టొచ్చని అధికారులు అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత వివరాలు తెలియాల్సి ఉంది.షాపింగ్‌కు తీసుకెళ్లలేదని.. హత్య!

Updated By ManamSat, 11/10/2018 - 11:33
 • పొరుగింటి వ్యక్తిని చంపిన యువకుడు

Delhi Teen yogesh Killed Allegedly For Refusing To Take Neighbour Shopping

న్యూఢిల్లీ : దీపావళి షాపింగ్‌కు స్కూటర్‌పై తీసుకెళ్లలేదన్న కోపంతో పొరుగింటి వ్యక్తిని ఓ యువకుడు పొడిచి చంపేశాడు. నిందితుడు యోగేశ్ (19)ని అరెస్టు చేశారు. డీసీపీ అస్లాంఖాన్ కథనం ప్రకారం... దీపక్ అలియాస్ బల్లీ పొరుగింట్లో యేగేశ్ కుటుంబం కూడా ఉంటోంది. కశ్మీరీగేట్ సమీపంలో ఉన్న టిబెటన్ మార్కెట్‌కు వెళ్లి కొన్ని దుస్తులు కొనుగోలు చేసేందుకు వెళదామంటూ దీపక్‌ను యోగేశ్ కోరాడు. అయితే, అందుకు దీపక్ నిరాకరించడంతో వాళ్లిద్దరి మధ్య గొడవ జరిగింది. 

ఈ విషయం తెలిసిన యోగేశ్ తల్లిదండ్రులు అక్కడకు వచ్చి, అందరిముందు కొడుకుపై చేయి చేసుకున్నారు. దీన్ని అవమానంగా భావించిన యోగేశ్.. ఎలాగైనా దీపక్ మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో దీపక్, యేగేశ్ కుటుంబీకులు సర్ధిచెప్పి, వివాదాన్ని ఇంతటితో ముగించాలని సూచించారు.  అయితే, యోగేశ్ మాత్రం తీవ్ర అవమాన భారంతో రగిలిపోతూ అవకాశం కోసం ఎదురుచూశాడు.

గురువారం మధ్యాహ్న సమయంలో దీపక్ ఒంటరిగా కనిపించాడు. తనను ఎందుకు తిట్టావని యోగేశ్ అడగ్గా, దీపక్ మరోసారి అసభ్యకరంగా తిట్టాడు. దాంతో యోగేశ్‌ ఆగ్రహంతో జేబులో ఉంచుకున్న కత్తితీసి, దీపక్‌ను గుండెల్లో పొడిచి అక్కడినుంచి పరారయ్యాడు. గాయపడిన దీపక్‌ను వెంటనే బాబూ జగ్‌జీవన్‌రాం ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. యోగేశ్‌పై హత్యకేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.ఆదేశాలు తుస్.. కాలుష్యం బుస్

Updated By ManamThu, 11/08/2018 - 23:03
 • సమయాలు పాటించని రాజధాని

 • సాయంత్రం 6 నుంచే పండుగ

 • 10 తర్వాతా టపాసుల కాల్పులు

 • విపరీతంగా పెరిగిన కాలుష్యం

 • ఫలితం ఇవ్వని సర్కారు ప్రచారం

delhi-crackersన్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాలను ఎవరూ పాటించలేదు. దీపావళి సందర్భంగా రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని, అవి కూడా శబ్దం, పొగ ఎక్కువ రాని ‘హరిత టపాసులు’ మాత్రమే కాల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించినా.. ఫలితం లేకపోయింది. సాయంత్రం 6 గంటల నుంచే మొదలైన దీపావళి సంబరాలు రాత్రి 10 గంటల తర్వాత కూడా యథేచ్ఛగా కొనసాగాయి. ఫలితంగా కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. ఢిల్లీలో సగటున ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 329గా ఉన్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. అది ‘అత్యంత దారుణం’ అనే కేటగిరీలోకి వస్తుంది. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (సఫర్) సంస్థ కూడా ఢిల్లీ గాలి ‘దారుణం’ అనే పేర్కొంది. సఫర్ అంచనాల ప్రకారం ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఏక్యూఐ రాత్రి 7 గంటలకు 281, 8 గంటలకు 291, 9 గంటలకు 294, 10 గంటలకు 296 చొప్పున ఉన్నట్లు తెలిసింది. ఆనంద్ విహార్, ఐటీఓ, జహంగీర్‌పురీ ప్రాంతాలలో కాలుష్యం అత్యధిక స్థాయిలో ఉంది. అలాగే ఇంకా మయూర్ విహార్ ఎక్స్‌టెన్షన్, లజ్‌పత్‌నగర్, లుట్యెన్స్ ఢిల్లీ, ఐపీ ఎక్స్‌టెన్షన్, ద్వారక, నోయిడా సెక్టార్ 78 తదితర ప్రాంతాలలో కూడా సుప్రీం ఆదేశాలను యథేచ్ఛగా ఉల్లంఘించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. చాలాచోట్ల ఈ ఆదేశాలను ఉల్లంఘించారని వారు అంగీకరించారు. ఢిల్లీతో పాటు ఇరుగుపొరుగు ప్రాంతాలైన నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్ ప్రాంతాల్లో కూడా టపాసులను పెద్ద ఎత్తున కాల్చారు. దాంతో అక్కడ కూడా సుప్రీంకోర్టు నిషేధాన్ని ఉల్లంఘించినట్లయింది. 

ప్రచారంతో ఫలితం నిల్
కేంద్రప్రభుత్వం, ఢిల్లీ సర్కారు కలిసి నవంబరు 1 నుంచి పదో తేదీ వరకు ‘క్లీన్ ఎయిర్ క్యాంపెయిన్’ పేరుతో ప్రచారం నిర్వహిస్తున్నాయి. దాదాపు 52 బందాలను ఢిల్లీ, ఫరీదాబాద్, గురుగ్రామ్, ఘజియాబాద్, నోయిడా ప్రాంతాలలో నియమించి కాలుష్యం వల్ల కలిగే ప్రమాదాల గురించిన ప్రచారం చేశారు. కానీ, ఇదంతా బూడిదలో పోసిన పన్నీరే అయింది. టపాసుల మోతలు చెవులకు చిల్లులు పొడవడంతోపాటు వాయు కాలుష్యం కూడా విపరీతంగా పెరిగి శ్వాసకోశ సమస్యలకు కారణమైంది.తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు 

Updated By ManamSun, 11/04/2018 - 11:41

Petrol, diesel prices, dip across India, Delhi, Dieselఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆదివారం మరోసారి తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్న నేపథ్యంలో దేశీయంగా కూడా చమురు ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో నేడు లీటరు పెట్రోల్‌పై 21పైసలు, లీటరు డీజిల్‌పై 17పైసలు తగ్గింది. దీంతో పెట్రోల్‌ ధర లీటరుకు రూ.78.78గా, లీటరు డీజిల్‌ ధర రూ.73.36కు చేరుకున్నాయి. శనివారం పెట్రోల్‌ ధర రూ.78.99గా, డీజిల్‌ ధర రూ.73.35గా ఉన్నాయి.

ఢిల్లీలో గత 15రోజుల్లో పెట్రోల్‌ ధర రూ.3.48పైసలు తగ్గగా డీజిల్‌పై రూ.2 మేర తగ్గింది. ముంబైలో నేడు లీటరు పెట్రోల్‌ ధర 21పైసలు తగ్గి రూ.84.28కి చేరింది. లీటరు డీజిల్‌ ధర 18పైసలు తగ్గి రూ.76.88గా ఉంది. అలాగే చెన్నై, కోల్‌కతాలో వరుసగా పెట్రోల్‌ ధరలు రూ.81.84గా, రూ.80.68గా ఉన్నాయి. డీజిల్‌ ధరలు రూ.77.55గా, రూ.75.22కు చేరుకున్నాయి.ఢిల్లీకి బయల్దేరనున్న చంద్రబాబు

Updated By ManamThu, 11/01/2018 - 09:28

Chandrababu Naiduఅమరావతి: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కాసేపట్లో ఢిల్లీకి బయల్దేరనున్నారు. ‘సేవ్ నేషన్’ నినాదంతో నాన్ బీజేపీ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా చంద్రబాబు హస్తిన టూర్ సాగనుంది. ఈ క్రమంలో ఇవాళ మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చంద్రబాబు కీలక భేటీ అవ్వనున్నారు. అలాగే శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, సీతారాం ఏచూరి, తేజస్వి యాదవ్‌తోనూ చంద్రబాబు సమావేశం అవ్వనున్నారు. ఈ టూర్‌లో మంత్రులు కళా వెంకట్రావు, యనమల కూడా చంద్రబాబు వెంట వెళ్లనున్నారు.ఢిల్లీ మాజీ సీఎం మదన్‌లాల్ కన్నుమూత

Updated By ManamSun, 10/28/2018 - 11:04

Madanlal Khuranaన్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మదన్‌లాల్‌ ఖురానా (82) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. శనివారం రాత్రి 11 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అయితే 1993–96 మధ్య కాలంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఖురానా, 2004లో రాజస్తాన్‌ గవర్నర్‌గా కూడా పనిచేశారు. ఖురానాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్తెలు కాగా.. ఆయన ఓ కుమారుడు నెల రోజుల క్రితం మరణించాడు.జగన్‌పై దాడి: ఢిల్లీకి వైసీపీ నేతలు

Updated By ManamSun, 10/28/2018 - 10:49

YSRCPహైదరాబాద్: వైసీపీ నేతలు ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. మూడు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేయనున్న వైసీపీ నేతలు ఇవాళ హోంమంత్రి రాజ్‌నాథ్‌ను కలవనున్నారు. ఈ సందర్భంగా ఏపీలో శాంతిభద్రతలు లేవని వారు హోంమంత్రికి ఫిర్యాదు చేయనున్నారు. అలాగే జగన్‌పై దాడి కేసును థర్డ్ పార్టీతో విచారణ చేయించాలని విఙ్ఞప్తి చేయనున్నారు. ఇక సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్నారు. వైసీపీ బృందంలో సీనియర్ నాయకులు, మాజీ ఎంపీలు ఉన్నారు. మరోవైపు జగన్‌పై దాడి కేసులో సిట్ అధికారులు విచారణను వేగవంతం చేసిన విషయం తెలిసిందే.మళ్లీ ఢిల్లీని కమ్మేసిన పొగ

Updated By ManamWed, 10/17/2018 - 23:33
 • పెరిగిన కాలుష్యం స్థాయిలు

 • పంజాబ్, హరియాణలో ఆగని పంట వ్యర్థాల కాల్చివేతలు

 • కాలుష్యాన్ని తగ్గించేందుకు కార్యాచరణ

delhiఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మరోసారి కాలుష్యం గుప్పిట్లో చిక్కుకుపోయింది. మరోసారి దట్టమైన పొగలు అలుమకున్నాయి. దాంతో  ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) ఆదివారం 208కు చేరుకుంది. ఈ స్థాయికి పడిపోవటాన్ని వాయు కాలుష్యంలో అతి తీవ్రంగా పరిగణిస్తారు. శనివారం ఈ ఇండెక్స్ స్థాయి 300గా ఉందని ని కేంద్ర ప్రభుత్వం అధీనంలోని ‘సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ రీసెర్చ్ (సఫర్) వెల్లడించింది. కాలుష్య బోర్డు నివేదిక ప్రకారం.. ఆనంద్‌విహార్‌లో ఏక్యూఐ 261, ఢిల్లీ యూనివిర్సిటీ పరిధిలో ఏక్యూఐ 207, ఐటీవో దగ్గర ఏక్యూఐ 204కు చేరింది.  0-50 మధ్య ఏక్యూఐ ఉంటే ‘స్వచ్ఛం’ అని, 51-100 మధ్య ఉంటే సంతృప్తికరమని, 101-200 మధ్య ఉంటే ‘సాధారణం’ అని, 201-300 మధ్య ఉంటే చాలా తక్కువ (పూర్)గా భావిస్తారు. ఆపై వాటిలో అతి తీవ్ర తక్కువగా భావిస్తారు. ‘ప్రెసెన్స్ ఆఫ్ పార్టిక్యులర్ (పీఎం) ప్రకారం ఇది 2.5 ఉంది. ఢిల్లీలో వాతావరణ కాలుష్యం పెరిగేందుకు పంజాబ్, హరియాణాల్లో పంట నూర్పిళ్ల అనంతరం వ్యర్థాల కాల్చివేతలే కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇలా పంట వ్యర్థాలను కాల్చకూడదని నిషేధం ఉన్నా కొందరు రైతులు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. అయితే.. ఆ వ్యర్థాల తొలగింపునకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందకపోవడం వల్లే వారు వ్యర్థాల కాల్చివేతకు పాల్పడుతున్నారని అంటున్నారు. పంజాబ్‌లో ఇప్పటి వరకు 330, హరియాణలో 701 చోట్ల పంట కాల్చివేత ఘటనలు చోటు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. కాగా, కాలుష్యాన్ని తగ్గించేందుకు సోమవారం నుంచి కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నామని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ప్రకటించారు. చెత్తను కాల్చివేయడం, డీజిల్ జనరేటర్ల వినియోగాన్ని తగ్గించడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు.మాజీ ఎంపీ కొడుకు వీరంగం

Updated By ManamTue, 10/16/2018 - 20:47
 • ఢిల్లీలో తుపాకీతో మహిళకు వార్నింగ్ 

BSP leader son brandishes gun outside a 5star hotel in Delhi

న్యూఢిల్లీ: బీఎస్‌పీ మాజీ ఎంపీ రాకేశ్ పాండే కొడుకు ఆశిష్ పాండే ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో మహిళను గన్‌తో బెదిరించిన వీడియో బయట పడింది. ఈ వీడియోలో ఆశిష్  పాండే తన చేతులో గన్ పట్టుకుని ఒక మహిళతో గొడవ పడుతున్నాడు. ఆమె ఆశిష్ పాండేను మహిళల వాష్‌రూంలోకి వెళ్లోదని వారిస్తుంది. మరోవైపు ఆశిష్‌ను అతడి స్నేహితురాలు, సెక్యూరిటీ గార్డు అడ్డుకుంటున్నారు. వీడియో ముగింపులో హోటల్ సిబ్బంది ఆశిష్‌ను వెనక్కి లాగటం. ఆ మహిళపై అతడి స్నేహితురాలు వాగ్వాదానికి దిగటం వంటి దృశ్యాలు నమోదయ్యాయి.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్‌లో స్పందించారు. ‘ఢిల్లీ పోలీసులు దీనిపై వెంటనే స్పందించి ఆశిష్ పై ఆయుధాల చట్టం, ఐపీసీల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని రిజిజు ట్విట్టర్లో పేర్కొన్నారు.  అశిష్ తరచూ తన స్నేహితులతో కలిసి ఢిల్లీకి వస్తుంటాడని. తండ్రి రాకేశ్ పాండే పేరు కూడా క్రిమినల్ లిస్టుల్లో రికార్డులో ఉందని పోలీసులు తెలిపారు. మంత్రి ఇంటిపై ఐటీ దాడులు

Updated By ManamWed, 10/10/2018 - 11:58
 • 16 చోట్ల ఏకకాలంలో సోదాలు

 • మంత్రి కైలాష్ గెహ్లాట్ లక్ష్యం

Gahlotన్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వంలో రవాణాశాఖ మంత్రి అయిన కైలాష్ గెహ్లాట్ లక్ష్యంగా బుధవారం ఆదాయపన్ను దాడులు జరిగాయి. ఆయనకు సంబంధం ఉందని భావించడంతో దేశ రాజధాని, చుట్టుపక్కల ప్రాంతాలలోని దాదాపు 16 చోట్ల ఆదాయపన్ను శాఖ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

మంత్రికి సంబంధించిన రెండు నిర్మాణ కంపెనీలు ఆదాయపన్ను ఎగవేసినట్లు ఫిర్యాదులు రావడంతో, దానికి సంబంధించి ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. నజఫ్‌గఢ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కైలష్ గెహ్లాట్.. ఢిల్లీ ప్రభుత్వంలో రవాణా, న్యాయ, రెవెన్యూ శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు. 

Related News