Stock-Markets

నష్టపోయిన సెన్సెక్స్

Updated By ManamWed, 10/31/2018 - 00:41

Stock-Marketన్యూఢిల్లీ: బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) సెన్సెక్స్ మంగళవారం 176 పాయింట్లకు పైగా పతనమైంది. భారీ అమ్మకాలతో ముఖ్యంగా ఫినాన్షియల్, ఎనర్జీ రంగాల షేర్లలో అమ్మకాలతో మార్కెట్ దిగువ గతి పట్టింది. కంపెనీలు ప్రకటిస్తున్న త్రైమాసిక ఫలితాలు మిశ్రమంగా ఉండడం, అమెరికా-చైనాల మధ్య వాణిజ్య చర్చలు జరుగనుండడంతో మార్కెట్‌లో పాల్గొనేవారిలో అప్రమత్త ధోరణి కనిపించింది. సెన్సెక్స్ 176.27 పాయింట్లు నష్టపోయి 33,891.13 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 కంపెనీల సూచి నిఫ్టీ 52.45 పాయింట్లు కోల్పోయి, 10,198.40 వద్ద ముగిసింది. మిగిలిన అన్ని చైనా దిగుమతులపై సుంకాల విషయంలో వచ్చే నెలలో అమెరికా స్పందన కోసం ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాయి. చమురు ధరలు మంగళవారం కూడా స్వల్పంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ పీపా ధర 11 సెంట్లు తగ్గి, 76.75 డాలర్లుగా ఉంది. ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరంలో చక్కెర ఉత్పత్తి 3 శాతం తగ్గి, 31.5 మిలియన్ టన్నులుగా ఉండవచ్చని చక్కెర పరిశ్రమ సంస్థ ‘ఇస్మా’ అంచనా వేయడంతో చక్కెర తయారీ కంపెనీల షేర్ల ధరలు 10 శాతం పెరిగాయి. అకాల వర్షాలు, కీటకాల దాడులతో చెరకు దిగుబడి తగ్గవచ్చని భావిస్తున్నారు. సెన్సెక్స్ సోమవారం 718 పాయింట్లు, నిఫ్టీ 220 పాయింట్లు లాభపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి తగ్గుముఖం పట్టడం ప్రారంభించిన ముడి చమురు ధరలు ఒక్కటే మార్కెట్‌కు ఆలంబనగా నిలిచే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. మళ్ళీ కుదేలైన మార్కెట్లు

Updated By ManamThu, 10/11/2018 - 23:01
  • కుంగిన వాల్‌స్ట్రీట్ ప్రపంచ మార్కెట్లలో అమ్మకాలకు పురికొల్పింది

stock-marketsముంబై: బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) ‘సెన్సెక్స్’  గురువారం 750 పాయింట్లకు పైగా పతనమై, ఆరు నెలల కనిష్ఠానికి పడిపోగా, నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ 10,300 స్థాయికి దిగువన ముగిసింది. ప్రపంచ మార్కెట్లలో ముమ్మర అమ్మకాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినడంతో ప్రపంచ సూచీలన్నీ నష్టాలను చవి చూశాయి. విదేశీ ఫండ్లు మదుపు మొత్తాలను నిర్విరామంగా వెనక్కి తీసుకుంటూండడం కూడా ఇన్వెస్టర్ల కష్టాలకుతోడైంది. తక్కువ స్థాయిలోనే మొదలైన బి.ఎస్.ఇ 30 షేర్ల ‘సెన్సెక్స్’ 1000 పాయింట్లకు పైగా కోల్పోయి, 34,000 స్థాయి కిందకు జారిపోయింది. మధ్యాహ్న ట్రేడ్‌లో 34,325.09ని తాకడానికి ముందు 33,723.53 తక్కువ స్థాయిని చూసింది. ‘సెన్సెక్స్’ చివరకు 759.74 పాయింట్ల నష్టంతో 34,001.15 వద్ద ముగిసింది. ఏప్రిల్ 11 తర్వాత, ‘సెన్సెక్స్’ ఇంత తక్కువ స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. ‘సెన్సెక్స్’ బుధవారం 461.42 పాయింట్లు లాభపడిన సంగతి తెలిసిందే. 

‘నిఫ్టీ’ 225.45 పాయింట్ల నష్టంతో 10,234.65 పాయింట్ల వద్ద స్థిరపడింది. డే ట్రేడ్‌లో అది 10,138.60 నుంచి 10,335.95 మధ్య ఊగిసలాడింది. ‘‘ప్రపంచ మార్కెట్లలోని అమ్మకాలలో భాగంగానే, దేశీయ స్టాక్ మార్కెట్లలో కూడా అమ్మకాలు చోటుచేసుకున్నాయి. అమెరికా మార్కెట్‌లో తీవ్ర కోత వీటికి పురికొల్పింది’’ అని జియోజీత్ ఫినాన్షియల్ సర్వీసెస్‌లో ప్రధాన ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహకర్త వి.కె. విజయకుమార్ అన్నారు. ‘‘అమెరికా ఆర్థిక వ్యవస్థ పనితీరు చాలా బాగుంది. ద్రవ్యోల్బణం కూడా పెరగడం ప్రారంభించింది. ప్రపంచంలోనే రిస్క్ రహిత అసెట్‌గా భావించే అమెరికా 10 ఏళ్ళ బాండ్ ప్రతిఫలం దాదాపు 3.15 శాతంగా ఉంది. ఇది ఇండియా వంటి ప్రవర్థమాన మార్కెట్ల నుంచి  మదుపు మొత్తాలు తరలిపోవడానికి పురికొల్పుతోంది. అమెరికాలో బాండ్ల ప్రతిఫలాలు పెరగడం, ప్రవర్థమాన దేశాల కరెన్సీలు పడుతున్న కష్టాలకు ప్రపంచ వాణిజ్య ఘర్షణలు కూడా తోడవడం సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతోంది’’ అని ఆయన అన్నారు. ఏషియన్ మార్కెట్లు తక్కువ స్థాయిలో ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లు కూడా మందగించి గురువారం ఆరంభ సెషన్‌లో 18 నెలలకుపైగా చూడని కనిష్ఠ స్థాయిలకు పడిపోయాయి. వాల్‌స్ట్రీట్ బుధవారం హఠాత్తుగా దారుణమైన నష్టాలను చూసింది. వాల్‌స్ట్రీట్ ఎనిమిది నెలల కాలంలో అంతటి నష్టాలను ఎన్నడూ చూడలేదు. ప్రపంచంలోని మిగిలిన మార్కెట్లు ఈ బాటనే అనుసరించాయి. 

ఒడుదుడుకులు
ఫారెక్స్ మార్కెట్‌లో అమెరికన్ డాలర్‌తో మారకంలో రూపాయి మరోసారి సరికొత్త అత్యల్ప స్థాయి రూ. 74.50కి క్షీణించింది. మధ్యాహ్నా ట్రేడ్‌లో కొంత కోలుకుని 24 పైసలు బలపడింది. ఇన్ని ఒడుదుడుకుల మధ్య కాస్త ఊరట నిచ్చే అంశం బ్రెంట్ క్రూడ్ ధర పీపాకు 82 డాలర్ల దిగువకు తగ్గడం. కాగా, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు బుధవారం రూ. 1096 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా, దేశీయ మదుపు సంస్థలు రూ. 1893 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశాయని తాత్కాలిక డాటా వెల్లడించింది.బక్కచిక్కిన రూపాయితో బెంబేలు

Updated By ManamTue, 08/14/2018 - 00:37
  • దేశీయ స్టాక్‌మార్కెట్‌ను తాకిన టర్కీ సంక్షోభ ప్రకంపనలు

  • వరుసగా రెండో సెషన్‌లో నష్టాల్లో సూచీలు

stock-marketముంబై: బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల ‘సెన్సెక్స్’ సోమవారం వరుసగా రెండో సెషన్‌లోనూ నష్టాలను నమోదు చేసి, 224 పాయింట్లకు పైగా క్షీణించి, దాదాపు రెండు వారాల కనిష్ఠ స్థాయి 37,645కి పడిపోయింది. డాలరుతో రూపాయి మారకం విలువ మరీ క్షీణించడం, టర్కిష్ ఫినాన్షియల్ సంక్షోభం ఇన్వెస్టర్లను కలవరపెట్టడంతో ప్రధానంగా ఫినాన్షియల్ సంస్థల షేర్లు భారీయెుత్తున అమ్మకాలకు లోనయ్యాయి. విస్తృతమైనదిగా భావించే నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ కూడా 73.75 పాయింట్లు కోల్పోయి 11,355.75 వద్ద ముగిసింది. 

రూపాయి విలవిల
అవెురికన్ డాలరుతో భారతీయ రూపాయి మారకం విలువ మునుపెన్న డూ ఎరుగనంతగా (ఇంట్రా-డేలో) రూ. 69.85కి క్షీణించింది. ప్రపంచ మార్కెట్ల సంకేతాల ననుసరించి నడిచింది. డాలరుతో టర్కిష్ లైరా మారకం విలువ నిర్విరామంగా క్షీణిస్తూ పోవడంతో ఫినాన్షియల్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల విభాగాలు తీవ్ర అమ్మకాల తాకిడిని చూశాయి. సురక్షిత మదుపు నెలవుల కోసం డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ‘‘అవెురికా-టర్కీల మధ్య రేగిన ఉద్రిక్తతలు ప్రపంచ ఫినాన్షియల్ మార్కెట్లను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. దాని ప్రకంపనల ప్రభావం దేశీయ మార్కెట్‌ను కూడా తాకింది. జూన్ నెలకు సంబంధించి పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 7 శాతంగా ఉండి ఆశావాదాన్ని రేకెత్తించినప్పటికీ, బలహీనంగా ఉన్న ప్రపంచ సంకేతాలు, క్షీణిస్తూ వచ్చిన భారతీయ రుపాయి ఇన్వెస్టర్లను లాభాల స్వీకరణకు పురికొల్పాయి. అయితే, కంపెనీల ఆదాయాల్లో వృద్ధి పునరుద్ధరణ, తగ్గుతున్న చమురు ధరలు, మెరుగుపడుతున్న దేశీయ స్థూల ఆర్థికాంశాలు, విదేశీ మదుపు సంస్థలు తిరిగి  కొనుగోళ్ళు జరుపుతూండడం, మార్కెట్ మరింత పతనం కాకుండా చాలా వరకు అడ్డుకట్ట వేశాయి’’ అని జియోజీత్ ఫినాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగాధిపతి వినోద్ నాయర్ అన్నారు. ‘సెన్సెక్స్’ 37,693.19 వద్ద తక్కువ స్థాయిలో మొదలై, అమ్మకాలు తీవ్రతరమవడంతో  కిందకు జారడాన్ని కొనసాగించి 37,559.26 పాయింట్ల కనిష్ఠ స్థాయిని చూసింది. కానీ, కొన్ని విలువైన షేర్లు తక్కువ ధరకు లభిస్తూండడంతో సాగిన కొనుగోళ్ళు, నష్టాలను తగ్గించుకునేందుకు కొందరు చేసిన కొనుగోళ్ళతో స్వల్పంగా రికవరయింది. చివరకు, 224.33 పాయింట్ల నష్టంతో 37,644.90 వద్ద ముగిసింది. మునుపటి సెషన్‌లో ‘సెన్సెక్స్’ 155.14 పాయింట్లు కోల్పోయింది. ‘నిఫ్టీ’ 10,400 స్థాయి నుంచి కిందకు దిగి చివరకు 73.75 పాయింట్ల నష్టంతో 11,355.75 వద్ద ముగిసింది. విదేశీ ఫండ్లు శుక్రవారం రూ. 510.66 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా, దేశీయ మదుపు సంస్థలు రూ. 457.83 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశాయని తాత్కాలిక డాటా వెల్లడించింది. రూపాయి పతనం వల్ల టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగ సంస్థల షేర్లు మాత్రం సానుకూల స్థితిలో ముగిశాయి.రికార్డు దిశగా ‘సెన్సెక్స్’ పరుగు

Updated By ManamWed, 07/11/2018 - 22:13
  • టీసీఎస్ ఫలితాలతో జోష్

stock-marketముంబై: సమాచార సాంకేతిక పరిజ్ఞాన రంగ దిగ్గజం టీసీఎస్ ఏప్రిల్-జూన్‌లో అంచనాలకు మించి రాణించి నికర లాభంలో 23 శాతం వృద్ధిని కనబరచడం మార్కెట్‌కు టానిక్‌లా పనిచేసింది. బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) ‘సెన్సెక్స్’ వరుసగా నాల్గో సెషన్‌లోనూ పెరిగి, దాని ఆల్-టైమ్ శిఖర స్థాయికి మరింత చేరువైంది. బి.ఎస్.ఇ 30 షేర్ల ‘సెన్సెక్స్’ 26 పాయింట్లు పెరిగి బుధవారం 36,265.93 వద్ద ముగిసింది. దాని జీవిత కాల గరిష్ఠ ముగింపు (జనవరి 29 నాటి) 36,283.25కి అది తిరిగి చేరువైంది. నాలుగు సెషన్లలో ‘సెన్సెక్స్’ 691.38 పాయింట్లను పుంజుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన టీసీఎస్ నికర లాభం రూ. 7,340 కోట్లుగా నమోదైంది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో టీసీఎస్ రూ. 5,945 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మంగళవారం వెల్లడైన ఈ ఫలితాలతో బుధవారం టీసీఎస్ షేర్ ధర 5.47 శాతం పెరిగి జీవితకాల అత్యధిక స్థాయి 1979.60ని చేరింది. ‘సెన్సెక్స్’ గైనర్ల లిస్ట్‌లో దానిదే మొదటి స్థానం. ఊహించిన దానికన్నా మెరుగైన ఫలితాలు ప్రకటించిన టీసీఎస్ సెంటిమెంట్‌తో మొత్తం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగ కంపెనీల షేర్లన్నీ పెరిగాయి. బి.ఎస్.ఇలోని ఐటీ ఇండెక్స్ 2.38 శాతం పెరిగింది. త్రైమాసిక ఫలితాల సీజన్‌కు శుభారంభం కావడంతో, బలహీనంగా ఉన్న ప్రపంచ ధోరణిని పక్కనపెట్టి దేశీయ మదుపరుల సెంటిమెంట్ ఆశావాదంతో నిండిపోయింది. అదనంగా 200 బిలియన్ల డాలర్ల విలువైన చైనా దిగుమతులపై సుంకాలు విధిస్తామని అవెురికా చెప్పిన తర్వాత, ఆసియా మార్కెట్లు పతన దిశలో సాగాయి. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు మళ్ళీ తెరపైకి వచ్చాయి. తిరిగి భారత్ విషయానికి వస్తే, పార్టిసిపెంట్ల ఆశావాద కొనుగోళ్ళతో ‘సెన్సెక్స్’ పటిష్టమైన స్థితిలో ప్రారంభమై 36,362.30 స్థాయిని తాకింది. తర్వాత, లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో, అది కొన్ని పాయింట్లు కోల్పోయి 36,169.70 కనిష్ఠ స్థితిని చూసింది. చివరకు 26.31 పాయింట్ల లాభంతో 36,265.93 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ నామమాత్రంగా 1.05 పాయింట్ల లాభంతో 10,948.30 వద్ద ముగిసింది. ఇంట్రా-డేలో అది 10,923 నుంచి 10,976.65 మధ్య ఊగిసలాడింది. దేశీయ మదుపు సంస్థలు మంగళవారం రూ. 293.96 కోట్ల విలువ చేసే ఈక్విటీలను కొనుగోలు చేయగా, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ. 20.73 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించినట్లు తాత్కాలిక డాటా సూచించింది. మార్కెట్లకు ప్రపంచ పరిణామాలే కీలకం

Updated By ManamMon, 06/18/2018 - 00:00

Stock-Marketsన్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లను ఈ వారం అనేక రకాల అంశాలు ప్రభావితం చేయనున్నాయి. ప్రపంచ వాణిజ్య యుద్ధంపై తిరిగి రేకెత్తిన భయాలు, ముడి చమరు ధరల ధోరణి, రుతుపవనాల్లో ప్రగతి వాటిలో ప్రధానైవెునవి. చైనా దిగుమతులపై అవెురికా విధించిన తాజా సుంకాల నేపథ్యంలో ట్రేడింగ్ సెంటిమెంట్ దెబ్బతినే అవకాశం ఉంది. ‘‘అవెురికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధానికి ఉన్న అవకాశంపై నెలకొన్న భయాలను, వాస్తవిక స్థితిగతులను మార్కెట్లు మున్ముందు బేరీజు వేసుకునే అవకాశం ఉంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ఉపాధ్యక్షురాలు (పరిశోధన) టీనా వీరమణి చెప్పారు. కంపెనీలు ఫలితాలను వెల్లడించే సీజన్, స్థూల ఆర్థిక డాటా, ఆర్.బి.ఐ పరపతి విధాన ప్రకటన వంటి ఘట్టాలు ముగిసినందువల్ల భారతీయ స్టాక్ మార్కెట్లు ఇప్పుడు మందగొడి దశలోకి ప్రవేశిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఇన్వెస్టర్ల దృష్టంతా ప్రపంచ పరిణామాలపైనే కేంద్రీకృతమై ఉందని మేం భావిస్తున్నాం. మరో 50 బిలియన్ల డాలర్ల సుంకాలపై అవెురికా సంతకాలు చేయడంతో వాణిజ్య యుద్ధం మళ్ళీ తెరపైకి వచ్చింది. ముడి చమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువ వంటివి పరిశీలనకు వస్తాయి. దేశీయ ఫండమెంటల్స్ ప్రస్తుతానికి వెనుకపట్టు పట్టాయి’’ అని ఎపిక్ రిసెర్చ్ సి.ఇ.ఓ ముస్తఫా నదీమ్ చెప్పారు.  హెమ్ సెక్యూరిటీస్ డైరెక్టర్ గౌరవ్ జైన్ కూడా అదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొనసాగిన ర్యాలీ

Updated By ManamThu, 04/05/2018 - 22:12
  • సానుకూల సంకేతాలతో లాభపడ్డ సెన్సెక్స్, నిఫ్టీలు

Stock-Markets-Soarముంబయి: రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేటును మార్చకుండా అలానే ఉంచి,  ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి తిరిగి విజృంభిస్తుందని అంచనా వేసి, ద్రవ్యోల్బణ అంచనాలను తగ్గించడంతో బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల సూచి ‘సెన్సెక్స్’ గురువారం ఏకంగా 577 పాయింట్లు లాభపడింది. చైనాతో వాణిజ్య వివాదం విషయంలో చర్చలకు సిద్ధంగా ఉన్నానని అవెురికా సూచించడంతో, పూర్తి స్థాయి వాణిజ్య యుద్ధ భయాలు సడలిపోయాయి. సానుకూల ప్రపంచ ధోరణులతో ఈక్విటీలు కూడా ఉప్పొంగాయి. దేశీయంగా పలు సానుకూల సంకేతాలు వెలువడ్డాయి. వర్షాలు బాగానే పడతాయనే జోస్యం కూడా వాటిలో ఒకటి. సేవల రంగానికి సంబంధించిన పి.ఎం.ఐ డాటా కూడా ప్రోత్సాహకరంగా ఉంది. ఇవన్నీ కొనుగోళ్ళు పెరగడానికి తోడ్పడ్డాయని బ్రోకర్లు చెప్పారు. అందరూ ఊహించినట్లుగానే ఆర్బీఐ రెపో రేటును మార్చకుండా 6 శాతం వద్దనే ఉంచింది. వర్తమాన ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలానికి ద్రవ్యోల్బణ అంచనాలను 4.7-5.1 శాతానికి తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత దేశపు ఆర్థిక వృద్ధి రేటు 2017-18 నాటి 6.6 శాతం నుంచి 7.4 శాతానికి పటిష్టపడుతుందని కూడా అది ప్రకటించింది. పెట్టుబడుల కార్యకలాపాలు పునరుద్ధరణ చెందుతున్నాయని తెలిపింది. 

 ‘సెన్సెక్స్’ గురువారం 33,289.96 స్థాయి వద్ద పటిష్టమైన స్థితిలోనే పయనం ప్రారంభించి, ఆర్బీఐ విధాన ప్రకటన వెలువడిన వెంటనే ఈ సెషన్‌లోనే అత్యధిక స్థాయి అయిన 33,637.46 పాయింట్లను తాకింది. అంతిమంగా 577.73 పాయింట్ల లాభంతో 33,596.80 పాయింట్ల వద్ద ముగిసింది. మార్చి 12న (610.80 పాయింట్లు పుంజుకున్న తర్వాత) ‘సెన్సెక్స్’ ఒకే రోజులో ఇంత అధిక స్థాయిలో లాభాలు మూటగట్టుకోవడం ఇదే మొదటిసారి. బుధవారంనాటి సెషన్‌లో  ‘సెన్సెక్స్’ 351.56 పాయింట్లు నష్టపోయింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) సూచి ‘నిఫ్టీ’ కూడా అదే మాదిరిగా 10,331.80 పాయింట్ల నుంచి 10,227.45 పాయింట్ల మధ్య ఊగిసలాడి 196.75 పాయింట్ల లాభంతో 10,325.15 పాయింట్ల వద్ద ముగిసింది. తాత్కాలిక సమాచారం ప్రకారం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు బుధవారం రూ. 335.18 కోట్ల విలువ చేసే షేర్లు కొనుగోలు చేయగా, దేశీయ మదుపు సంస్థలు రూ. 152.55 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించాయి. 
 నష్టాలకు ఎట్టకేలకు బ్రేక్

Updated By ManamTue, 03/20/2018 - 23:23

ఎటువైపూ ఎక్కువ మెుగ్గకుండా పెరుగుతూ, తగ్గతూసాగిన ట్రేడింగ్‌లో సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి
Stock-Marketsముంబయి
: బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) సున్నిత సూచి సెన్సెక్స్ మంగళవారం నాడు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ట్రేడింగ్‌లో, ఐదు సెషన్లలోని పతన ధోరణిని పక్కన పెట్టి స్వల్ప లాభాలను నమోదు చేయగలిగింది. ప్రపంచంలోని ఇతర స్టాక్ మార్కెట్ల నుంచి సంకేతాలు మిశ్రమంగా ఉండగా, ఇటీవల బాగా దెబ్బతిన్న సమాచార సాంకేతిక పరిజ్ఞాన (ఐ.టి) రంగ షేర్ల కొనుగోలు పట్ల మదుపరులు మొగ్గు చూపారు. 30 షేర్ల  సెన్సెక్స్  సుమారు 74 పాయింట్లు పెరిగి 32,996.76 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ)కి చెందిన మరింత విస్తృతమైన 50 షేర్ల సూచి నిఫ్టీ 30 పాయింట్లు లాభపడి 10,124.35 పాయింట్ల వద్ద ముగిసింది. ఇటీవల దెబ్బతిన్న షేర్లలో వాల్యూ బయింగ్ (అంతర్లీనంగా ఎక్కువ విలువ కలిగిన షేర్లు తక్కువ ధరలకు లభిస్తున్నప్పుడు వాటిని ఎంపిక చేసి కొనుగోలు చేయడం)తో మార్కెట్లు ప్రయోజనం పొందాయి. విదేశాల నుంచి సంకేతాలు మిశ్రమంగా ఉన్నాయి. ఫెడరల్ రిజర్వ్ నూతన చైర్మన్ జిరోమ్ పోవెల్ మొదటి విధాన సమావేశంలో తీసుకునే నిర్ణయంపై మదుపరులు దృష్టి కేంద్రీకరించారు. ప్రపంచ వాణిజ్య యుద్ధ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఐ.టి, టెలికాం షేర్లు రికవరీకి నేతృత్వం వహించడంతో, తొలి దశ నష్టాల నుంచి సెన్సెక్స్ బయుటపడి ఒక దశలో 33,102.74 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. కరెంట్ అకౌంట్ లోటు వ్యత్యాసం పెరగడం, అవెురికా ఫెడ్ రేటు పెంపునకు ఉన్న అవకాశంపై ఆందోళనలతో ఇంతకుముందు ఐదు సెషన్లలో  సెన్సెక్స్ 994.82 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 10,100 స్థాయిని మళ్ళీ అందుకుని 30.10 పాయింట్ల లాభంతో చివరగా 10,124.35 పాయింట్ల వద్ద ముగియుడానికి ముందు 10,155.65 పాయింట్ల గరిష్ఠ స్థితిని చూసింది. బలహీనపడిన రూపాయి కారణంగా, ఐ.టి, ఫార్మా షేర్లలో షార్ట్ కవరింగ్ (పతనమై తిరిగి పెరగడం ప్రారంభించిన షేర్లు ఇంకా పెరుగుతాయని భావించి నష్టాలను తగ్గించుకునేందుకు కొనుగోలు చేయడం)తో సూచీలు సానుకూల దృక్పథంతో ముగిశాయి అని జియోజీత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగాధిపతి వినోద్ నాయర్ అన్నారు. కేసులో ఇరుక్కున్న కెనరా బ్యాంక్ షేర్ ధర మంగళవారం నాడు 3.84 శాతం క్షీణించింది. 

తారుమారైన ధోరణి
కొద్ది రోజులుగా అమ్మకాల పరంపరను కొనసాగిస్తూ వచ్చిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు, తాత్కాలిక డాటా ప్రకారం, సోవువారం నాడు, రూ. 292.23 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ మదుపు సంస్థలు రూ. 191.52 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించాయి. 

Related News