rtc

అదుపుతప్పిన బస్సు.. 20మందికి గాయాలు

Updated By ManamSun, 09/16/2018 - 12:23
 • ప్రాణాపాయం తప్పిందంతే!.. అదే నిర్లక్ష ్యం.. అంతే ఘోరం..

 • 50 సీట్ల బస్సులో 107 మంది ప్రయాణం

 • ప్రయాణికుల భారానికి విరిగిన ఇరుసు.. ఊడిన టైర్లు..

 • అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు

 • 12 మందికి తీవ్ర గాయాలు.. నాగర్‌కర్నూల్ జిల్లా వట్టెం వద్ద ఘటన

imageనాగర్‌కర్నూల్: డొక్కు బస్సులో వంద మందిని ఎక్కించి 60 మందిని పొట్టనపెట్టుకున్నా ఆర్టీసీ తీరుమారలేదు. కొండగట్టు ఘాట్ రోడ్డు ఘటన మరువక ముందే అచ్చు అలాంటిదే ఆదివారం మరో ప్రమాదం చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో డ్రైవర్ అప్రమత్తతో పెను ముప్పు తప్పింది. యాదగిరి గుట్ట ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు (ఎపి24జడ్0037) హైదరాబాద్  నుంచి వనపర్తి వెళ్తోంది. బిజినపల్లి మండలం వట్టెం గ్రామ సమీపంలోకి రాగానే స్టీరింగ్ గుండి ఊడిపోయింది(స్టీరింగుకు టైర్లకు సంబంధం తెగిపోయింది). వెంటనే డ్రైవర్ అప్రమత్తమై బ్రేకు వేసి బస్సును ఆపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బస్సు ఇరుసు విరిగి, ముందరి టైర్లు ఊడిపోయి పక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది.

వీఆర్వో అభ్యర్థులతో కిక్కిరిసిన బస్సు
యాభై సీట్ల బస్సులో వంద మందిని ఎక్కించడంతో, ఒకరిపై ఒకరు పడి ఊపిరాడకే ఘాట్ రోడ్డు ఘటనలో ఎక్కువimage మంది మరణించారు. అయినప్పటికీ ఆర్టీసీ అధికారుల తీరు మారలేదు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించొద్దని కండక్లర్లు, డ్రైవర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయలేదు. ఆక్యుపెన్సీ ఒత్తిడి ఉండడంతో 50 సీట్ల బస్సులో కండక్టర్లు 100 మందిని ఎక్కిస్తున్నారు. తాజాగా ప్రమాదానికి గురైన బస్సులోని ప్రయాణికుల సంఖ్య ఇదే స్పష్టంజేస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 107 మంది ఉన్నారు. వీఆర్వో పరీక్షకు వెళ్తున్న అభ్యర్థులతో కిక్కిరిసిపోయింది. బస్సు టాప్‌పైన 20 మందిని కూర్చోబెట్టారు. బస్సు ఒక్కసారిగా కుదుపులకు గురవడంతో వీరిలో సగానికిపైగా కిందపడిపోయారు. 12 మంది తీవ్రగాయాలపాలయ్యారు. పరిస్థితి విషమంగా ఉన్న ఆరుగురిని హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో బస్సులో కిక్కిరిసిన ప్రయాణికులు ఒకరిపైఒకరు పడి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరయ్యారు. బస్సు పల్టీలు కొట్టకుండా నిలిచి ఉండడంతో వారంతా నిమిషాల వ్యవధిలో తేరుకుని స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను  నాగర్‌కర్నూల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బస్సు పల్టీలు కొట్టుంటే మరో కొండగట్టు ప్రమాదమయ్యేదని స్థానికులు ఆందోళన వ్యక్తంచేశారు. ప్రమాద కారణంగా కొంతమంది వీఆర్వో అభ్యర్థులు పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోవడం గమనార్హం.

అధిక బరువే కారణం!
సరైన సమయంలో బ్రేక్‌లు వే యడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు పేర్కొన్నారు. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు  ఉండడంతో ఇరుసుపై భారం ఎక్కువై అది ప్రమాదానికి దారి తీసి ఉండవచ్చునని భావిస్తున్నారు. క్షణాల వ్యవధిలోనే బస్సు రోడ్డు దిగి పొలాల్లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. ఆ సయమంలో బస్సు వేగం తక్కువగానే (గంటకు 30-40 కిలోమీటర్లు) ఉన్నదని స్థానికులు తెలిపారు. ప్రమాద సమాచారం తెలియగానే వట్టెం గ్రామ ప్రజలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నాగర్‌కర్నూలు నుంచి పది నిమిషాల్లో అంబులెన్స్ చేరుకుంది.

ఘటనపై మంత్రి ఆరా
బస్సు ప్రమాద ఘటనపై ఆపద్ధర్మ మంత్రి మహేందర్‌రెడ్డి ఆరాతీశారు. ఆర్టీసీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుకుల మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.  ప్రభుత్వాస్పత్రిలో క్షతగాత్రులను జిల్లా కలెక్టర్  శ్రీధర్, ఎస్పీ సాయిశేఖర్, మాజీ ఎమ్మేల్యే మర్రి జనార్థన్‌రెడ్డి, టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జక్కా రఘునందన్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగం జనార్థన్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి గాయపడిన వారిని పరామర్శించారు.  

ప్రమాదంలో గాయపడినవారు
కటకల కృష్ణ  (ఎల్జాల)
నల్లారి మధు (ఆమన్‌గల్)
జక్కా నాగమల్లయ్య(ఆలేరు)
భూపాల్ (షాబాద్)
జరుపుల రాంచందర్ (బాల్‌నగర్)
యం.ప్రబాకరాచారి (కొల్లూరు)
కోట్ల రాజశేఖర్ (నల్ల చెరువు)
శివకుమార్ (ఆలేరు)
పల్లె నర్సింహులు(పెద్ద నర్వల్)
రాజు (బాల్‌నగర్)
అనిల్ (కొడంగల్)ఆర్టీసీ కార్మికులతో మంత్రుల కమిటీ భేటీ

Updated By ManamWed, 05/16/2018 - 15:16

etela హైదరాబాద్: ఆర్టీసీ కార్మిక సంఘం నేతలతో మంత్రుల కమిటీ సమావేశమైంది. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో మంత్రులు హరీశ్ రావు, మహేందర్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండీ రమణారావు, టీఎంయూ సంఘం నేతలు తదితరులుపాల్గొన్నారు. ఇందులో ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు, సమస్యలపై వారు చర్చిస్తున్నారు. అయితే వేతనాలు పెంచాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తుండగా.. వేతనాలు పెంచలేమని, పెంచితే ఆర్టీసీకి మరింత నష్టాలొస్తాయని మంత్రుల కమిటీ పేర్కొంది. దీంతో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. 

 బస్‌భవన్ ముట్టడి శాంపిల్ మాత్రమే

Updated By ManamMon, 05/07/2018 - 14:57

rtc హైదరాబాద్: బస్‌భవన్ ముట్టడి ఒక శాంపిల్ మాత్రమేనని ప్రగతి భవన్ ముట్టడి వరకు రానివ్వొద్దు అంటూ టీఎంయూ తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల చలవతోనే ఇప్పుడు ప్రభుత్వంలో కొందరు మంత్రులుగా ఉన్నారని, కానీ ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆర్టీసీ కార్మికులు ఎవరూ లేరని టీఎంయూ నేతలు అన్నారు.

మీ అవసరం మాకెందుందో, మా అవసరం మీకూ అంతే ఉందని, తమ డిమాండ్లను నెరవేర్చకపోతే 21 తరువాత కార్మికులు ఎప్పుడైనా సమ్మె చేస్తారని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక ఆత్మగౌరవంతో పనిచేసి రోజుకు రూ.13కోట్లు తెస్తే, ఆర్టీసీ నష్టాల్లో ఉందనడం దారుణమని అన్నారు. గతంలో ఆర్టీసీని నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాన్ని గద్దె దింపామని, ఇప్పుడు కూడా న్యాయం చేయకపోతే అదే పరిస్థితే వస్తుందని హెచ్చరించారు.

 బడ్జెట్‌‌లో ఆర్టీసీకి మెుండిచేయి

Updated By ManamSat, 03/17/2018 - 05:45
 • వేల కోట్ల నష్టాల్లో టీఎస్‌ఆర్టీసీ..

 • ప్రత్యేక గ్రాంటు ప్రకటన లేదు.. రూ.975 కోట్ల కేటాయింపులే

 • అదంతా ప్రభుత్వం బాకీపడ్డ సొమ్మే.. అందులోనూ అరకొరగా విడుదల

 • ప్రైవేటీకరణ దిశగా అడుగులు?.. పదవీ విరమణలే తప్ప నియామకాలేవీ

 • ఫిట్‌మెంట్‌పై సీఎం హామీ అమలేదీ?.. ఆర్టీసీ కార్మిక సంఘాల ఆందోళన

rtcహైదరాబాద్: లక్షల మందిని నిత్యం గమ్యస్థానాలకు చేరవేస్తున్న టీఎస్‌ఆర్టీసీకి ప్రభుత్వం ఈ ఏడాది కూడా మొండి చేయి చూపింది. వందల కోట్ల అప్పులతో నష్టాలతో నడుస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ)ను ఆదుకుంటామని సీఎం కేసీఆర్, రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలులోకొచ్చే సంకేతాలేవీ ఈ బడ్జెట్‌లో కనిపించలేదు. ఆర్టీసీకి బాకి పడ్డ సొమ్మునే కేటాయింపుల్లో చూపి అంకెల గారడీ చేశారే తప్ప, ప్రగతి రథ చక్రాన్ని ఆదుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.


అంకెల్లో అదుర్స్.. అసలు చూస్తే డొల్ల
విద్యార్థులు, ఉద్యోగులు, జర్నలిస్టులు తదితరులకు బస్ పాసుల రూపంలో ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. ఈ రాయితీ డబ్బును ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుంది. ఈ తరహా రాయితీల రూపంలో ప్రభుత్వం ఆర్టీసీకి ఏటా రూ.520 కోట్లు బాకి పడుతోంది. 2015-16 నుంచి ఏటా ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఔదర్యంతో ఆర్టీసీకి ఇస్తున్నట్టు కేటాయింపుల్లో చూపుతోంది. అప్పటికీ పూర్తి స్థాయిలో నిధులను విడుదల చేయడంలేదు. గత మూడేళ్లుగా బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.2వేల కోట్లకు పైగా కేటాయించిన ప్రభుత్వం, చెల్లించింది మాత్రం రూ.811 కోట్లు మాత్రమే. 2018-19 బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.975 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.520 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సిన రాయితీ డబ్బులు. ప్రభుత్వ హామీ రుణాలను చెల్లించేందుకు మరో రూ.315.54 కోట్లు.. ఇవిపోనూ మిగిలిన రూ.140 కోట్లను కొత్త బస్సుల కొనుగోలుకు కేటాయించింది. 2017-18 బడ్జెట్‌లో కూడా కొత్త బస్సుల కొనుగోలుకు రూ.140 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, ఇప్పటివరకూ విడుదల చేసింది రూ.70 కోట్లు మాత్రమే. 2017-18 ఆర్థిక ఏడాదికిగానూ ఆర్టీసీ రూ.4 వందల కోట్లకుపైగా నష్టాలను మూటగట్టుకుంది. ఇటీవల కరీంనగర్ సభలో ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేదిలేదని, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటీని ఆదుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. దీంతో ఆర్టీసీకి ఈ బడ్జెట్‌లో ప్రత్యేక గ్రాంటు ఉంటుందని అంతా ఆశించారు. ఆర్టీసీ ఉద్యోగులు అడిగినదానికంటే ఎక్కువగా 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించిన ముఖ్యమంత్రి, దాని అమలు చేయడం మరిచారని పలు కార్మిక సంఘాలు ఆందోళన బాటపడుతున్నాయి. గతేడాది ఏప్రిల్ నుంచే ఫిట్‌మెంట్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ వేతన సవరణ అమలైతే జీతాల రూపంలో సంస్థపై రూ.కోట్ల భారం పడనుంది.

నష్టాల సాకుతో ప్రైవేటీకరణ దిశగా
నష్టాల పేరుతో ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే దిశగా అడుగులు పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఏటా దాదాపు రూ.450 కోట్ల నష్టాలను మూటగట్టుకుంటున్న ఆర్టీసీకి, జీతాల చెల్లింపు కూడా కష్టమేకానుంది. తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రి సహా జిల్లాల్లోని డిస్పెన్సరీలకు సంబంధించిన ఫార్మసీలను ఇప్పటికే ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. వరంగల్‌లో ఉన్న ఆర్టీసీ టైర్ రీ ట్రేడింగ్ యూనిట్‌నూ మూసేశారు. అరిగిపోయిన టైర్లు మరికొంతకాలం మన్నేలా టైర్లకు రబ్బర్‌ను ఏర్పాటు చేసే పని ఈ యూనిట్‌లో చేపట్టేవారు. యాభై ఏండ్లుగా బస్సు టికెట్లు, ఎస్‌ఆర్ పత్రాలు, తదితరాలను ముద్రిస్తున్న ఆర్టీసీ ప్రింటింగ్ ప్రెస్‌ను సైతం మూసివేసేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఈ ఏడాది జూన్-జూలై నాటికి దీన్ని మూసివేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆర్టీసీలో కొన్నేళ్లుగా వేల సంఖ్యలో ఉద్యోగ విరమణలుంటే, పదుల సంఖ్యలో కూడా నియామకాలు చేపట్టడంలేదు. కొత్త బస్సుల కొనుగోలుకు అంతగా ప్రాధాన్యమివ్వకుండా అద్దె బస్సులవైపే యాజమాన్యం మొగ్గు చూపుతోంది. తాజా బడ్జెట్‌లోనూ ఆర్టీసీకి ప్రభుత్వం మొండి చేయి చూపింది. ఇవన్నీ ప్రైవేటీకరించే యోచనలో భాగమేనని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు.

ఆర్థిక సంవత్సరం                    కేటాయింపు                     విడుదల
                                        (రూ.కోట్లలో) 
2015-16                            400                             211
2016-17                            633                             275
2017-18                            994                             325+
2018-19                            975

Related News