Komati Reddy Venkatareddy

సంపత్, కోమటిరెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్

Updated By ManamTue, 06/12/2018 - 20:27

Court contempt petition, Sampath kumar, Komati reddy venkatareddy, High court, Telangana assembly speaker హైదరాబాద్‌: ఎమ్మెల్యేలుగా తమను కొనసాగించాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడం లేదని కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల్లో అసెంబ్లీలో జరిగిన ఘటనల నేపథ్యంలో ఇద్దరి శాసనసభ సభ్యత్వాన్ని రద్దుచేస్తూ స్పీకర్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తమ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై గతంలో కోమటిరెడ్డి, సంపత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ జారీచేసిన ఉత్తర్వులను రద్దుచేస్తూ వారిద్దరినీ పదవీకాలం పూర్తయ్యే వరకూ యథాతథంగా ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని హైకోర్టు తీర్పు వెలువరించింది.

హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను అసెంబ్లీ కార్యదర్శి, రాష్ట్ర శాసనసభా వ్యవహారాల కార్యదర్శి ఇద్దరూ పరిగణించలేదు. ఎమ్మెల్యేలుగా కాకుండా, రావాల్సిన మర్యాద, జీతభత్యాలను కూడా తమకు ఇవ్వడంలేదంటూ వారిద్దరిపైనా కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ హైకోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగే అవకాశం ఉంది. 2019లో ఆ ముగ్గురు కీలకనేతలు గెలవలేరు!

Updated By ManamThu, 03/22/2018 - 14:12

Nakrekal MLA

హైదరాబాద్: రూ. 100 కోట్లు ఖర్చుపెట్టినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలవడని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం జోస్యం చెప్పారు. గురువారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన.. కాంగ్రెస్ కీలక నేతలు.. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి కూడా ఓడిపోతారని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అసలు కాంట్రాక్టులు కోమటిరెడ్డికి ఎలా వచ్చాయో చెప్పాలని వీరేశం డిమాండ్ చేశారు. కోమటిరెడ్డిని ఎదుర్కొనే బలమైన శక్తిగా టీఆర్ఎస్ మారిందని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. అందుకే మాపై, మా పార్టీపై కోమటిరెడ్డి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వీరేశం మీడియాకు వివరించారు. కాగా వీరేశం వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.మా సభ్యత్వాల రద్దు చెల్లదు

Updated By ManamFri, 03/16/2018 - 02:28

హైకోర్టులో కోమటిరెడ్డి, సంపత్ పిటిషన్
Komati Reddy Venkatareddy, A. Samapakumarహైదరాబాద్
: తమ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.సంపత్‌కుమార్‌లు హైకోర్టును ఆశ్రయించారు. నల్లగొండ, ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీ అయ్యాయంటూ అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేయడాన్ని ఇద్దరు నేతలు తమ వ్యాజ్యాల్లో సవాల్ చేశారు. ఈ కేసును వెంటనే విచారణ జరపాలని కోర్టును అభ్యర్థించారు. అయితే.. కేసును శుక్రవారం విచారణ చేస్తా మని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు ప్రకటించారు. ఈ కేసులో తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి, రాష్ట్ర న్యాయ,శాసనవ్యవహారాల శాఖ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల కార్యదర్శులను ప్రతివాదులుగా చేశారు. ‘మేం సభలో హుందాగా వ్యవహరించలేదని రెండు రోజల్లో మాకు ఎలాంటి విషయం చెప్పలేదు. మా వాదన కూడా వినలేదు. సంజాయిషీ తీసుకోకుండానే నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ ప్రసంగాన్ని ఇతరపార్టీ సభ్యులు వ్యతిరేకించి వాకౌట్ చేశారు. ఇలా చేయడం హుందాతనం అవుతుందా? అలా అయితే  తాము నిరసన చెప్పడం కూడా సబబే అవుతుంది. గవర్నర్ ప్రసంగ సమయంలో అధికారపార్టీ సభ్యులు సీఎం కేసీఆర్‌ను కొనియాడుతూ బల్లలు చరచడం హుందాతనం అవుతుందా? హుందాతనంపై తమపై వేటు వేసే నిర్ణయం తీసుకోవడం సరైనదే ఐతే ఆ విధంగా చేసిన వారిపై చర్య తీసుకోకపోవడం పక్షపాతమే అవుతుంది’’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.  ‘‘నిజంగానే గాయపడితే గవర్నర్‌కు వీడ్కోలు చెప్పేప్పుడు స్వామిగౌడ్ గవర్నర్ వెంట ఎలావెళ్లారు? గాయపడితే గవర్నర్ తో ఎలా మాట్లాడారు? గవర్నర్‌కు వీడ్కోలు చెప్పిన తర్వాత స్వామిగౌడ్ కంటికి దెబ్బ తగిలిందని చెప్పి ఆస్పత్రిలో చేర డం.. కంటికి కట్టుకట్టుకోవడం విడ్డూరంగా ఉంది. హెడ్‌ఫోన్ తగిలితే ఆ మేరకు అసెంబ్లీ వీడియో పుటేజీని బహిర్గతం చేయాలి. వీడియో పుటేజీని హైకోర్టు తెప్పించుకోవాలి. వాస్తవాల్ని పరిశీలించి ఏది హుందానో.. ఏది హుందా కాదో తేల్చాలి. ఈలోగా తమ సభ్యత్వాన్నిరద్దు చేసిన నిర్ణయం అమలు కాకుండా స్టే ఉత్తర్వులు ఇవ్వాలి. రెండు అసెంబ్లీ సీట్లు ఖాళీగా ఉన్నట్లు ఇచ్చిన నోటిఫికేషన్ నిలుపుదల చేయాలి. రెండు అసెంబ్లీ ఖాళీ అయినట్లుగా ప్రకటించకుండా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలి’’ అని వ్యాజ్యంలో హైకోర్టును కోరారు.  చట్ట వ్యతిరేకంగా నోటిఫై చేశారు కాబట్టి దానిని నిలిపివేయాలని, ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని రిట్‌లో హైకోర్టును కోరారు. తాము తప్పు చేయలేదని, అసెంబ్లీ వీడియో పుటేజీని పరిశీలిస్తే తమపై అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం సరైనదికాదని తేలుతుందని అన్నారు.

టీఆర్‌ఎస్ తీరుపై ఈసీకి ఫిర్యాదు: మర్రి
కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల పట్ల తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో అప్రజాస్వామికంగా వ్యవహరించిందని ఈసీని కలిసి ఫిర్యాదు చేసినట్లు మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. ఈమేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోమటి రెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ల సభ్యత్వం రద్దు అక్రమమ ని పేర్కొన్నారు. వారిపై తీసుకున్న చర్య చట్ట, రాజ్యాంగ విరుద్ధమని, సభ్యత్వం రద్దు చేసే అధికారం స్పీకర్‌కు లేదని వివరించారు. సభ్యులపై తీసుకునే చర్యలేవైనా కాండక్ట్ ఆఫ్ బిజినెస్ రూల్‌కు లోబడి ఉండాలని తెలిపారు.

Related News