fortis

మళ్ళీ మొదటి కొచ్చిన ఫోర్టిస్ కథ

Updated By ManamWed, 07/11/2018 - 22:13
  • శుక్రవారం సమావేశమవుతున్న డైరెక్టర్ల బోర్డు

fortisన్యూఢిల్లీ: ప్రాధాన్యతా కేటాయింపు ప్రాతిపదికన సెక్యూరిటీల జారీ ద్వారా నిధులు సమీకరించే అంశాన్ని పరిశీలించేందుకు ఫోర్టిస్ హెల్త్‌కేర్ డైరెక్టర్ల బోర్డు జూలై 13న సమావేశమవుతోంది. నగదు కొరతతో బాధపడుతున్న ఫోర్టిస్ హెల్త్‌కేర్ కొత్త ఇన్వెస్టర్‌ను కనుగొనే ప్రక్రియలో ఉన్న సంగతి తెలిసిందే. కొత్తగా ఏర్పాటైన డైరెక్టర్ల బోర్డు తాజా విడత బిడ్లను ఆహ్వానించినప్పుడు, చివరి తేదీ అయిన జూలై 3 నాటికి మలేషియాకు చెందిన ఐ.హెచ్.హెచ్ హెల్త్‌కేర్ నుంచి, మణిపాల్-టి.పి.జి ద్వయం నుంచి కంపెనీకి బైండింగ్ బిడ్లు అందాయి. ఫోర్టిస్ హెల్త్‌కేర్, రేడియంట్ లైఫ్ కేర్‌ల స్వాధీనానికి ఇంతకుముందు అగ్ర స్థానంలో నిలిచిన ముంజల్-బర్మన్ ద్వయం వెనక్కి తగ్గింది. శుక్రవారం సమావేశమవుతున్న డైరెక్టర్ల బోర్డు ఎంత మొత్తానికి నిధులు సేకరించాలనుకుంటున్నదీ కంపెనీ వెల్లడించలేదు. 
చిక్కుల్లో ఉన్న ఫోర్టిస్ హెల్త్‌కేర్ కొత్త ఇన్వెస్టర్‌ను కనుగొనేందుకు కొన్ని నెలలుగా ప్రయత్నిస్తూ వస్తోంది. రెండు వేర్వేరు సందర్భాలలో అది మణిపాల్-టి.పి.జి ద్వయం, ముంజల్-బర్మన్ ద్వయం సమర్పించిన ఆఫర్లను అంగీకరించింది. తర్వాత, వాటిని రద్దు చేసుకుని, తాజా బిడ్లకు ఆహ్వానించింది. సంస్థను స్వాధీనపరచుకోదలచినవారు ఎవరైనా సరే, ఫోర్టిస్ హెల్త్‌కేర్‌లోకి ప్రిఫరెన్షియల్ కేటాయింపు ద్వారా కనీసం రూ. 1500 కోట్లు పెట్టుబడి పెట్టాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు మే 29న ఒక కొత్త షరతు విధించింది. కొనుగోలు సంస్థకి ఆర్.హెచ్.టి హెల్త్ ట్రస్ట్ స్వాధీనానికి నిధులు సమకూర్చుకునే ప్రణాళిక ఉండాలి. అలాగే, దాని డయాగ్నస్టిక్ విభాగమైన ఎస్.ఆర్.ఎల్ నుంచి ప్రైవేటు ఈక్విటీ ఇన్వెస్టర్ల నిష్క్రమణకు వీలు కల్పించే ప్రణాళికను కూడా సిద్ధం చేసుకోవాలి.

మాజీ ప్రమోటర్లు మల్వీందర్  సింగ్, షివీం దర్ సింగ్‌ల నియంత్రణలో ఉన్న సంస్థలకు ఇంటర్-కార్పొరేట్ డిపాజిట్ల రూపంలో ఇచ్చిన సుమారు రూ. 500 కోట్లను తిరిగి రాబట్టేందుకు న్యాయపరమైన చర్యకు దిగుతున్నట్లు ఫోర్టిస్ హెల్త్‌కేర్ ప్రకటించిన తర్వాత, మంజల్-బర్మన్ కుటుంబ ద్వయం, రేడియంట్ లైఫ్‌లు వెనక్కి తప్పుకున్నాయి. డైరెక్టర్ల బోర్డు ఆమోదం లేకుండా, తగినంత తనఖా భద్రత లేకుండా ఆ రుణాలు ఇచ్చేశారు. కంపెనీ వ్యవహారాలపై ఫోరెన్సిక్ దర్యాప్తునకు ‘సెబి’ ఆదేశించింది. మే 22న నిర్వహించిన కంపెనీ షేర్‌హోల్డర్ల అసాధారణ సర్వ సభ్య సమావేశంలో డైరెక్టర్ల బోర్డు నుంచి బ్రయా న్ టెంపస్ట్‌ను తొలగించారు. రెండు మదుపు సంస్థలు తొలగించాలని కోరిన నలుగురు డైరెక్టర్లలో ఆయనొకరు. మిగిలిన ముగ్గురు (హర్పాల్ సింగ్, సబీనా వైశోహ, తేజీందర్ సింగ్ షెర్గిల్‌లు) సర్వ సభ్య సమావేశానికి ముందే రాజీనామా చేశారు. బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా కొత్తగా సువలక్ష్మి చక్రబర్తి, రవి రాజగోపాల్, ఇంద్రజీత్ బెనర్జీలు నియమితులయ్యారు. రూ. 1800 కోట్లకు ముంజల్-బర్మన్ సమర్పించిన బిడ్‌ను ఇంతకుముందరి డైరెక్టర్ల బోర్డు ఆమోదించడంతో,  పునర్నిర్మితమైన డైరెక్టర్ల బోర్డు, కొత్తగా బిడ్లను ఆహ్వానించడానికి, ముంజల్-బ ర్మన్ ద్వయం నుంచి ఆమోదం పొందింది.ఇంటర్-కార్పొరేట్ డిపాజిట్లతో గోల్ మాల్

Updated By ManamThu, 06/28/2018 - 22:59
  • రూ. 914 కోట్ల ఇంపెయిర్‌మెంట్ చార్జీలతో పెరిగిన ఫోర్టిస్ నష్టాలు

fortisముంబై: ఫోర్టిస్ హెల్త్ కేర్ లిమిటెడ్ తాజా బోర్డు సమావేశం, తదనంతరం ఆడిట్ కాని ఫైనాన్షియల్ ఫలితాలను ప్రకటించిన తీరును సూచనగా తీసుకుంటే, వ్యాపారాన్ని కుదుటపరచేందుకు ఎంత వీలైతే అంత ప్రయత్నాలూ చేస్తున్నప్పటికీ, కంపెనీ పట్ల నమ్మకంలో స్పష్టమైన తరుగుదల కనిపిస్తోంది. ఫోర్టిస్ కు చెందిన అనుబంధ సంస్థ ఒకటి మేనేజ్ మెంట్ వ్యక్తపరచిన అన్ని అభ్యంతరాలనూ తోసిపుచ్చుతూ రుణ గ్రహీతలకు రూ. 494 కోట్ల రుణం ఇచ్చినట్లు దర్యాప్తు నివేదికలో వెల్లడైంది. ఈ రుణ గ్రహీతలు సింగ్ సోదరులకు అనుబంధమైనవిగా చెబుతున్న మూడు కంపెనీలకు చెందినవారని తేలింది. 

రీపేమెంట్ ఆబ్లిగేషన్లు
ఫోర్టిస్ హెల్త్ కేర్ 2017 జూలై 3న మూడు కంపెనీల్లో రూ. 494.14 కోట్ల విలువ చేసే ఇంటర్-కార్పొరేట్ డిపాజిట్లు ఉంచింది. ఆ మొత్తం 90 రోజుల లోపల తిరిగి రావలసి ఉంది. కానీ, 2018 మార్చి 31 వరకు ఆ మొత్తం తిరిగి చేతికందనే లేదు. రావలసిన బకాయి రూ. 445.03 కోట్ల మేర ఉంది. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమవడం వల్ల న్యాయపరమైన చర్యను చేపట్టవలసి వచ్చింది. 

వ్యవస్థాగత లోపాలు, నియంత్రణలపై ఉపేక్ష
చక్రభ్రమణ పద్ధతి అమలులో ఉండే దానికోసం కంపెనీ నుంచి అందుకున్న నిధులను ఫోర్టిస్ హెల్త్ కేర్ ఉపయోగించుకుంది. దీని సారాంశం ఏమంటే, ఇంటర్-కార్పొరేట్ డిపాజిట్లను వాస్తవానికి ఎన్నడూ తిరిగి చెల్లించనే లేదు. వ్యవస్థాగతమైన లోటుపాట్లు కొన్ని ఉన్నాయి. కంపెనీ/ఫోర్టిస్ హెల్త్ కేర్ లిమిటెడ్ ఫైనాన్షియల్ ఒత్తిడిలో ఉన్నపుడు సెక్యూరిటీ చార్జిని సష్టించడం, డాక్యుమెంట్లను అమలుపరచడంలో లొసుగులతో సహా నియంత్రణలను ఉపేక్షించారు అని ముగ్గురు డైరెక్టర్లతో స్వతంత్రంగా ఏర్పడిన బోర్డు ఎన్.ఎస్.ఇకి, బి.ఎస్.ఇకి జారీ చేసిన ప్రకటనలో తెలిపింది. రుణాలు తీసుకున్న కంపెనీలు ఆ నిధులను వేటికి వినియోగించిందీ దర్యాప్తు నివేదిక నిర్థరించలేదు. కానీ, రుణాలు తీసుకున్న కంపెనీలు ఆ ఇంటర్-కార్పొరేట్ డిపాజిట్లను కొన్ని అదనపు సంస్థలకు రుణాలు మంజూరు చేసేందుకు లేదా తిరిగి చెల్లించేందుకు వినియోగించుకున్నాయని కనుగొన్న అంశాలు దాని నివేదికలో ఉన్నాయి. ఆ కంపెనీల ప్రస్తుత లేదా గత ప్రమోటర్లు, డైరెక్టర్లకు ఫోర్టిస్ కంపెనీ ప్రమోటర్లతో సంబంధాలున్నాయి అని ఆ ప్రకటన తెలిపింది. రుణాలు తీసుకున్న కంపెనీలు కంపెనీకి లేదా ఫోర్టిస్ హెల్త్ కేర్ కి చెందిన సంబంధిత పక్షాలేనని చెప్పడానికి ఆధారాలున్నాయని దర్యాప్తు నివేదిక వ్యాఖ్యానించింది. అయితే, ఉన్నట్లుగా చెబుతున్న ఆ సంబంధాలేమిటో అది వెల్లడించలేదు. డైరెక్టర్ల బోర్డు ఈ విషయమై ఇండియన్ అకౌంటింగ్ స్టాండరడ్స్ కి మాత్రం రేఖామాత్రంగా వివరించింది. ఆ నష్టాలను పూడ్చుకునేందుకు ఆర్.హెచ్.టి హెల్త్ ట్రస్టునకు చెందిన 18.2 మిలియన్ యూనిట్లను 13.65 మిలియన్ డాలర్లకు గ్రూపునకు చెందిన ఒక అసోసియేట్ కు ఫోర్టిస్ హెల్త్ కేర్ లిమిటెడ్ విక్రయించిందని ఆ ప్రకటన పేర్కొంది. కంపెనీకి 2018 మార్చి 31 నాటికి రూ. 1404 కోట్ల నికర రుణం ఉంది. ఈ రుణం 2017 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ. 1279 కోట్ల మాత్రమేనని ఫలితాలు వెల్లడించాయి. 

దెబ్బతిన్న ఆస్పత్రి వ్యాపారం
సంవత్సరంలో కొన్ని నెలలపాటు ఆస్పత్రి వ్యాపారం, ముఖ్యంగా ఉత్తరాదిన, గణనీ యమైన ప్రభావానికి లోనైంది. కొన్ని ఆస్ప్రతు ల్లో రోగులకు సంబంధించి చోటుచేసుకున్న ఘటనలు బాగా ప్రచారంలోకొచ్చి, వ్యాపారం దెబ్బతిందని బోర్డు అంగీకరించింది. 

మితిమీరిన చార్జీల కేసు
ఫోర్టిస్ ఆస్ప్రతిలో ఆద్య అనే పాప మరణించింది. ఆ పాపకు 15 రోజుల చికిత్సకు ఆస్పత్రి రూ. 16 లక్షల బిల్లు వేసింది. దీనితో పాప తండ్రి జయంత్ సింగ్ కేసు పెట్టారు. ఫలితంగా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఈ ఆస్ప్రతుల వ్యవహారాలపై దర్యాప్తు జరిపింది. కంపెనీ 2018 ఆర్థిక సంవత్సరం క్యూ4కి ప్రకటించిన ఫలితాల్లో ఇంపెయిర్ మెంట్ చార్జీలు కూడా అధికంగానే ఉన్నాయి. కంపెనీ స్థిరాస్తిలో శాశ్వత తరుగు దలను ఇంపెయిర్ మెంట్ అంటు న్నారు.  ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఇంపెయిర్ మెంట్ నష్టం సుమారు రూ. 327 కోట్లుగా నమోదైంది. ఎస్కారట్స్ హార్ట్ ఇన్ స్టిట్యూట్ అండ్ రిసెర్చ్ సెంటర్ లిమిటెడ్ లో రూ. 125 కోట్ల కంపెనీ పెట్టుబడులకు సంబంధించిన సుహద్భావ ఇంపెయిర్ మెంట్ కూడా దానిలో ఇమిడి ఉంది. ఇతర ఇంపెయిర్ మెంట్లలో ఆర్.హెచ్.టి ట్రస్టీ మేనేజర్ రూ. 37.6 కోట్లు, బర్డ్ అండ్ బర్డ్ రియల్టర్స్ రూ. 69.4 కోట్లు (ఇది కంపెనీకి చెందిన వంద శాతం అనుబంధ సంస్థ. దీనికి న్యూఢిల్లీలో కొంత భూమి ఉంది), లంక హాస్పిటల్స్ లో రూ. 49 కోట్లు కూడా ఉన్నాయి. రాయ్ పూర్ యూనిట్ మూతపడడం వల్ల అంతకుముందు త్రైమాసి కంలో రూ. 45 కోట్ల సుహద్భావ ఇంపెయిర్ మెంట్ ను కంపెనీ నమోదు చేసింది. 

త్రైమాసిక ఫలితాలు
ఫోర్టిస్ హెల్త్ కేర్ 2017-18 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో రూ. 932 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఇంటర్-కార్పొరేట్ డిపాజిట్ రుణాలను రుణ గ్రహీతలు 2011 డిసెంబర్ నుంచి 2016 మార్చి 31 వరకు చెల్లించారని బుధవారం ఉదయం స్టాక్ ఎక్చ్సేంజీలకు కంపెనీ నివేదించింది. కాగా, 2016-17 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం నుంచి చక్రభ్రమణ యంత్రాంగాన్ని అమలులోకి తెచ్చారు. రుణం తీసుకున్న కంపెనీలు ప్రతి త్రైమాసికం చివరలో చెక్కు రూపంలో ఆ రుణాలను తిరిగి చెల్లిస్తాయి. తదుపరి త్రైమాసికం ప్రారంభంలో కొత్త ఇంటర్-కార్పొరేట్ డిపాజిట్లను విడుదల చేస్తారు. ప్రత్యేకంగా అమలులోకి తెచ్చిన ఇంటర్-కార్పొరేట్ డిపాజిట్ ఒప్పందాల కింద ఈ వెసులుబాటు కల్పించుకున్నారు. 

ట్రెజరీ విధాన ఉల్లంఘన
ఇంటర్-కార్పొరేట్ డిపాజిట్లు కూడా ఒక రకమైన రుణాల లాంటివి. కంపెనీకి చెందిన సాధారణ ట్రెజరీ కార్యకలాపాల కింద ఆ రుణాలు ఇవ్వడానికి వీలులేదు. ఈ ఉదంతంలో ట్రెజరీ పాలసీ ఉల్లంఘనకు గురైందని లూధ్రా అండ్  లూధ్రా న్యాయ సేవల సంస్థ సమర్పించిన దర్యాప్తు నివేదిక వెల్లడించింది. డాక్యుమెంట్లను, ఇ-మెయిళ్ళను సమీక్షించి, ఇంటర్వ్యూలు నిర్వహించిన తర్వాత అది ఆ రకమైన నిర్థరణకు వచ్చింది. ఫోర్టిస్ హెల్త్ కేర్ బోర్డు ఆ రుణాలను ప్రత్యేకించి ఏమీ అధీకతం చేయలేదు. వాటిని తిరిగి రాబట్టుకునేందుకు కంపెనీ న్యాయపరమైన చర్యకు దిగింది.ఆఫర్ మెరుగుపరచిన మణిపాల్

Updated By ManamThu, 04/26/2018 - 02:12

fortisన్యూఢిల్లీ: ఫోర్టిస్ హెల్త్‌కేర్ లిమిటెడ్ (ఎఫ్.హెచ్.ఎల్)లో వాటా కోసం పోటీపడుతున్నవారిలో అగ్ర భాగంలో ఉన్న సంస్థల్లో ఒకటైన మణిపాల్-టి.పి.జి మంగళవారంనాడు తన బిడ్‌ను మరోసారి సవరించింది. నిపుణుల కమిటీ చేసిన మదింపును ఆధారం చేసుకుని ఫోర్టిస్ డైరెక్టర్ల బోర్డు రెండు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకోనుందనగా అది బిడ్‌ను సవరించింది. ఫోర్టిస్ హాస్పిటల్ బిజినెస్ ఈక్విటీ విలువ రూ. 5,003 కోట్లు కాగా, మణిపాల్ హెల్త్ ఎంటర్‌‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎం.హెచ్.ఇ.పి.ఎల్) దానికన్నా చాలా ఎక్కువగా ఎఫ్.హెచ్.ఎల్ షేర్‌హోల్డర్లకు రూ. 1319 కోట్ల ప్రీమియం చెల్లించడానికి సవరించిన బిడ్‌లో ప్రతిపాదన చేసింది. ఇంతకుముందు మణిపాల్ రూ. 1058 కోట్ల ప్రీమియం మాత్రమే ఆఫరు చేసింది. ‘‘దీనితో ఎఫ్.హెచ్.ఎల్ హాస్పిటల్ బిజినెస్ ఈక్విటీకి కడుతున్న విలువ (ఇంతకుముందు అనుకున్నట్లుగా రూ. 6,061 కోట్లు కాక) రూ. 6,332 కోట్లు అవుతుంది. ఫోర్టిస్ నుంచి దాని ఆస్పత్రి వ్యాపార విభాగాన్ని పక్కన పెట్టే ప్రయోజనాలకు షేర్ల హక్కు నిష్పత్తిని లెక్కగట్టేటందుకు ఈ ఈక్విటీ విలువ అవసరమవుతుంది. ఈక్విటీ పెరుగుతున్నందు వల్ల ఎఫ్.హెచ్.ఎల్ షేర్‌హోల్డర్లకు షేర్ మార్పిడి నిష్పత్తి మరింత అనుకూలంగా మారుతుంది’’ అని ఎఫ్.హెచ్.ఎల్ డైరెక్టర్ల బోర్డుకు సమర్పించిన సవరించిన ఆఫరులో మణిపాల్ సంస్థ పేర్కొంది. 

వర్తించే చట్టాల ననుసరించి ఫోర్టిస్ ఆస్పత్రి వ్యాపార విభాగానికి రూ. 750 కోట్ల వరకు ఆర్థిక సహాయం ఏర్పాటు చేసేందుకు కూడా  మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్ ముందుకొచ్చింది. రుణ ఫైనాన్సింగ్ ద్వారా లేదా కొన్ని షరతులకు లోబడి, ఎఫ్.హెచ్.ఎల్ రుణ దాతలకు గ్యారంటీలు/కంఫర్ట్ లెటర్లు ఇవ్వడం ద్వారా ఆ నిధులు సమకూరుస్తామని మణిపాల్ సంస్థ సవరించిన బిడ్‌లో తెలిపింది. ‘ఫోర్టిస్’ బ్రాండ్ అమ్మకం ద్వారా ఎఫ్.హెచ్.ఎల్ అందుకుంటున్న నిధులను, వాస్తవ రుణ భారాన్ని తగ్గించడానికి ఉపయోగించాలని అమలు అగ్రిమెంట్ నిర్దేశిస్తోందని ఆ ప్రతిపాదనలో తెలిపారు. ఈ బేరాన్ని కుదుర్చుకునే అవకాశాలు పెంచుకునేందు కు అమలు అగ్రిమెంటులోని కొన్ని క్లాజులకు మణిపాల్ సంస్థ మార్పులు సూచిం చింది. వాటిని ఎఫ్.హెచ్.ఎల్ డైరెక్టర్ల బోర్డు సమీక్షకు మణిపాల్  సంస్థ పంపింది. విలువను లెక్కగట్టే ప్రక్రియను పర్యవేక్షించేందుకు, డైరెక్టర్ల బోర్డుకు సలహాదారుగా వ్యవహరించేందుకు ఫోర్టిస్ డైరెక్టర్ల బోర్డు గత వారం ఒక సలహాదారుల కమిటీని ఏర్పాటు చేసింది. దానికి ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ (ఇండియా) మాజీ చైర్మ న్, సి.ఇ.ఓ దీపక్ కపూర్ అధ్యక్షుడుగా ఉ న్నారు. బైండింగ్ బిడ్లు అన్నింటినీ మదింపుచే యువలసిందిగా సలహాదార్ల కమిటీని కోరారు. మలేషియన్ కంపెనీ ఐ.హెచ్.హెచ్ హెల్త్‌కేర్ బీహెచ్‌డీ తన నాన్-బైండింగ్ ఆఫరును బైండింగ్ ఆ ఫరుగా మార్చవలసిందిగా మంగళవారం విజ్ఞప్తి చేసింది. ఫోర్టిస్ హాస్పిటల్ బిజినెస్ స్వాధీన రేసు లో బర్మన్-ముంజల్ కుటుంబాలు, కేకేఆర్ అండదండలున్న రేడియంట్ లైఫ్ కేర్ కూడా ఉన్నాయి. అవి కూడా బైండింగ్ ఆఫర్లు సవుర్పించాయి.

సవరించిన ఆఫర్లు
ముంబయిలో ఉన్న ఫోర్టిస్‌కు చెందిన ములంద్ హాస్పిటల్ స్వాధీనానికి రేడియంట్ లైఫ్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 1200 కోట్లు ఇవ్వజూపిందని ఫోర్టిస్ మంగళవారంనాడు తెలిపింది. షేర్‌హోల్డర్లకు ఈక్విటీ డైల్యూషన్ లేకుండా, నగదు కొరతతో బాధపడుతున్న ఫోర్టిస్‌కు తక్షణం రూ. 6,800 కోట్లు సవుకూర్చేందుకు రేడియంట్ కొత్త ఆఫరులో సిద్ధపడింది. ఫోర్టిస్‌లో నాల్గవ వంతుకన్నా తక్కువ వాటా కొనుగోలుకు 350 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు చైనాకు చెందిన ఫోసన్ ఇంటర్నేషనల్ ముందుకొచ్చింది. మొత్తం ఆఫరు విలువలో సుమారు ఐదో వంతుకోసం మలేషియాకు చెందిన ఐ.హెచ్.హెచ్ హెల్త్‌కేర్ మంగళవారంనాడు సవరించిన బైండింగ్ ప్రతిపాదనను సవుర్పించింది.ఫోర్టిస్ హెల్త్‌కేర్‌కు నోటీసు

Updated By ManamSat, 03/03/2018 - 23:20

fortisన్యూఢిల్లీ: నిర్దిష్ట సమాచారాన్ని, డాక్యుమెంట్లను కోరుతూ తీవ్ర మోసాల దర్యాప్తు కార్యాలయం (ఎస్.ఎఫ్.ఐ.ఓ) నుంచి నోటీసు అందుకున్నట్లు ఫోర్టిస్ హెల్త్‌కేర్ శనివారం వెల్లడించింది. వాటిని మార్చి 9కల్లా సమర్పించాలని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కోరినట్లు తెలిపింది. సంస్థలో చోటుచేసుకున్న ఆర్థిక అవకతవకలకు సంబంధించి వార్తలు వెలువడడంతో ఫోర్టిస్ హెల్త్‌కేర్ వ్యవహారాలను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. మంత్రిత్వ శాఖ ఆదేశం మేరకు దానికి కూడా ఫోర్టిస్ హెల్త్‌కేర్ సమాచారాన్ని అందించనుంది. ప్రస్తుతం ఆ సమాచారాన్ని సంకలనపరచే పనిలో ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం లేకుండా ఇద్దరు (వుల్వీందర్ సింగ్, షివీందర్ సింగ్) ప్రమోటర్లు ఏడాది క్రితం కంపెనీ నుంచి కనీసం 78 మిలియన్ల అవెురికన్ డాలర్లను తీసుకున్నారని ఆరోపణలొచ్చాయి. ఫోర్టిస్ హెల్త్‌కేర్ ఆర్థిక లావాదేవీలపై మరోపక్క భారతీయ సెక్యూరిటీల, ఎక్చ్సేంజి బోర్డు (సెబి) కూడా దర్యాప్తు జరుపుతోంది.

Related News