Anurag Kashyap

ఆ న్యూడ్ సీన్‌లో ఏడుసార్లు నటించా..

Updated By ManamWed, 07/11/2018 - 16:05
  • ‘సేక్రెడ్ గేమ్స్’ సన్నివేశంపై కుబ్రా సేత్ వివరణ

kubbra sait-sacred games

న్యూఢిల్లీ : ఓ వెబ్ సిరీస్ చిత్రీకరణలో భాగంగా ఏడుసార్లు నగ్నంగా నటించాల్సి వచ్చిందని ప్రఖ్యాత నటి, యాంకర్ కుబ్రా సేత్ వెల్లడించారు. ఈ సిరీస్‌లో కొన్ని న్యూడ్ సీన్లు కూడా ఉంటాయని తనకు ముందే చెప్పారని ఆమె తెలిపారు. ఆ విషయం ముందే తెలిసినా.. సెట్స్‌లో నటించడానికి అంగీకరించానని చెప్పారు. 

అయితే ఆ ఒక్క సన్నివేశమే పదే పదే చిత్రీకరించడంతో కొంత ఇబ్బంది పడ్డానని.. ప్రతీసారీ ఆ సీన్ పూర్తయిన తర్వాత నేలమీద పడి ఏడ్చానని సేత్ వివరించారు. ఈ వెబ్ సిరీస్‌కు అనురాగ్ కశ్యప్ కో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన సూచనల మేరకు, ఆ సన్నివేశంలో పర్‌ఫెక్షన్ వచ్చేంత వరకూ రీటేక్ చేయాల్సి వచ్చిందని సేత్ పేర్కొన్నారు. 

తనకు కావాల్సిన సన్నివేశాన్ని నటీనటులతో రాబట్టుకోవడానికి అనురాగ్ కశ్యప్ చాలా తపన పడతారని వివరించారు. ఈ సన్నివేశాన్ని చిత్రీకరించే సమయంలో ప్రతిసారీ కశ్యప్ తనవద్దకు వచ్చి మరో టేక్ తీద్దామని అనేవారని చెప్పారు. ఆ సమయంలో ఇలా పదే పదే చేయిస్తున్నందుకు నన్ను తిట్టుకోవద్దని అనేవారు.

‘నాకు తెలుసు నాపై కోపం, ద్వేషం వస్తోంది. కానీ నన్ను తిట్టుకోవద్దు’ అని కశ్యప్ చెప్పేవారని సేత్ అన్నారు. ఇలా ఆరుసార్లు జరిగాక ఏడోసారి టేక్ ఓకే అయిందని సేత్ వివరించారు. అప్పటికే అలసిపోయిన తాను సెట్‌లోంచి బయటికి వెళ్లానని.. అప్పుడు లోపలి నుంచి చిత్ర యూనిట్ సభ్యుల కరతాళ ధ్వనులు వినిపించాయని కుబ్రా సేత్ పేర్కొన్నారు. ఇంత కష్టపడి తీసిన ఆ సన్నివేశం అద్భుతంగా ఉందా.. లేక వల్గర్‌గా ఉందా చూసి మీరే చెప్పండంటూ ఆమె ఓ ప్రశ్నను సంధించారు.



ఆకట్టుకుంటున్న నయన్ కొత్త మూవీ ట్రైలర్

Updated By ManamWed, 06/27/2018 - 13:21

Nayantharaనయనతార ప్రధానపాత్రలో అజయ్ ఙ్ఞానముత్తు తెరకెక్కించిన చిత్రం ‘ఇమైక్క నొడిగల్’. అథర్వ, రాశిఖన్నా కీలక పాత్రలో నటించగా.. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ విలన్‌గా, విజయ్ సేతుపతి అతిథి పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఇందులో నయనతార సీబీఐ ఆఫీసర్‌గా నటిస్తుండగా.. అథర్వ డాక్టర్‌గా కనిపించనున్నాడు. సీజే జయకుమార్ నిర్మించిన ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతం అందించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.



రెండేళ్ల తరువాత కెమెరా ముందుకొస్తున్నా

Updated By ManamFri, 03/02/2018 - 12:46

Abhishek "కెమెరా ముందుకు రాక దాదాపుగా రెండేళ్లైంది. కొత్త ప్రయాణం. కొత్త సినిమా ప్రారంభమైంది. మీ అందరి ఆశీర్వాదం కావాలి" అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్. 'మన్మార్జియాన్' అనే కొత్త చిత్రంలో అభిషేక్ నటిస్తుండగా.. ఈ చిత్రం శుక్రవారం ప్రారంభమైంది.

ఇందులో అభిషేక్ సరసన తాప్సీ నటించనుండగా.. విక్కీ కౌశల్ కీలక పాత్రలో కనిపించనుంది. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి మరో దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ నిర్మించడం విశేషం. అయితే 2016లో 'హౌస్‌ఫుల్-3'తో అభిషేక్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

 





Related News