ananthapur

లోకేష్ తో అంబిక లక్ష్మీ నారాయణ భేటీ

Updated By ManamWed, 06/13/2018 - 12:47

lokesh, ambika హిందూపురం : అనంతపురం జిల్లా హిందూపురంలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుందా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. హిందూపురం కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ అంబిక  లక్ష్మీ నారాయణ హస్తానికి హ్యాండ్ ఇచ్చి సైకిల్ ఎక్కేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ వార్తలకు ఊతం ఇచ్చేలా ఆయన బుధవారం సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ ను కలిశారు.  జిల్లా పర్యటనకు వస్తున్న లోకేష్ ను అంబిక లక్ష్మీ నారాయణ కోడికొండ సమీపంలో కలిసి, కొద్ది నిమిషాలు ప్రత్యేకంగా మాట్లాడారు.

కాగా అంబిక లక్ష్మీ నారాయణ గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా హిందూపురం నుంచి పోటీ చేసినప్పటికీ టీడీపీ అభ్యర్థి అబ్దుల్ ఘనీ చేతిలో ఓటమి పాలయిన విషయం తెలిసిందే. అంతకు ముందు బెంగళూరు విమానాశ్రయం వద్ద మంత్రి లోకేష్ ను మంత్రి కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యే బీకె పార్థసారథి, జెడ్పీ చైర్మన్ పూల నాగరాజు, చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు తదితరులు కలిసి స్వాగతం పలికారు. మంత్రి లోకేష్ ఇవాళ మడకశిరలో పర్యటించనున్నారు. అందులో భాగంగా కోడికొండ చెక్ పోస్టు చేరుకున్న  ఆయనకు  జిల్లా, నియోజకవర్గ టిడిపి నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఘన స్వాగతం పలికారు.మళ్లీ లేపాక్షి ఉత్సవాలు వాయిదా

Updated By ManamFri, 03/02/2018 - 11:24

Lepakshi అనంతపురం: మార్చి 9, 10 తేదీల్లో నిర్వహించాల్సిన లేపాక్షి ఉత్సవాలు మరోసారి వాయిదా పడ్డాయి. సాంకేతిక సమస్యల కారణంగా ఈ ఉత్సవాలను మార్చి 31, ఏప్రిల్‌ 1వ తేదీల్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ వీరపాండియన్‌ తెలిపారు. ఉత్సవాల విజయవంతానికి అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. అయితే మామూలుగా ఫిబ్రవరి 23, 24న లేపాక్షి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన అధికారులు.. ఆ తర్వాత మార్చి 9,10 తేదీలకు వాయిదా వేశారు. తాజాగా మరోసారి ఈ ఉత్సవాలు వాయిదా వేయడంపై స్థానికులు పెదవి విరుస్తున్నారు.అనంతలో వైసీపీ నేతపై హత్యాయత్నం?

Updated By ManamWed, 02/28/2018 - 10:33

ysrcpఅనంతపురం: జిల్లాలో మరోసారి టీడీపీ నేతలు రెచ్చిపోయారు. జేసీ వర్గీయులు వైసీపీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు గయాజ్‌ బాషా ఆలియాస్‌ మున్నాపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనలో జేసీ వర్గీయుల నుంచి వైసీపీ నేత త్రుటిలో తప్పించుకున్నారు. వివరాల్లోకెళితే.. తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న బంధవును మంగళవారం రాత్రి పరామర్శించి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో తారసపడ్డ జేసీ వర్గీయులు మున్నాకారుపై దాడి చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ దాడిలో వారి నుంచి మున్నా ప్రాణాలతో బయటపడ్డారు. అతనికి సంబంధించిన రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కారుపై బండరాళ్లతో దాడిచేశారు. ఈ ఘటనలో ఒకరిద్దరికి గాయాలయినట్లుగా తెలుస్తోంది. తాడిపత్రి వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న మున్నాను హతమార్చేందుకు జేసీ వర్గీయులు కుట్రపన్నారని తెలుస్తోంది. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి అరాచకాలపై వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. స్థానిక సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related News