Diwali

సరోజిని కంటి ఆసుపత్రికి చేరిన ‘దీపావళి’ బాధితులు

Updated By ManamThu, 11/08/2018 - 10:06

Eye Hospitalహైదరాబాద్: దేశవ్యాప్తంగా అట్టహాసంగా జరిగిన దీపావళి వేడుకలు కొందరి కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. టపాసులు పేలుస్తూ కళ్లకు గాయాలు అవ్వడంతో చాలామంది నగరంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి చేరారు. వెంటనే స్పందించిన ఆసుపత్రి సిబ్బంది శస్త్ర చికిత్సలు నిర్వహించారు.

ఆసుపత్రికి మొత్తం 50మంది బాధితులు రాగా.. వారిలో 8మంది కళ్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. గాయాలైన వారిలో చిన్న పిల్లలే కాకుండా అన్ని వయసులు వారు ఉన్నారని ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ బేగ్ తెలిపారు. హైదరాబాద్‌ నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి బాధితులు వచ్చారని, దీపావళి రోజు రాత్రి నుంచే వైద్యులు అందుబాటులో ఉన్నారని బేగ్ వెల్లడించారు.త్వరలోనే చెబుతా: అల్లు అర్జున్

Updated By ManamThu, 11/08/2018 - 09:45

Allu arjunసినిమా కోసం ఎంతైనా కష్టపడే అల్లు అర్జున్‌కు సరిపోయే కథలు దొరకడం లేదు. ఓ వైపు తన తోటి హీరోలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు చేస్తుంటే.. బన్నీ మాత్రం ఆ రేస్‌లో కాస్త వెనుకబడ్డాడు. అందుకే నిదానమైనా ఫర్వాలేదు గానీ ఈసారి గట్టిగా ఓ పెద్ద హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ కథలను వింటూనే ఉన్నాడు. అయితే బన్నీ ఇంకా తదుపరి సినిమాను ప్రకటించకపోవడంపై ఆయన అభిమానులు మాత్రం నిరాశకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఉత్సాహపరిచేందుకు అల్లు అర్జున్ తాజాగా ఓ ట్వీట్ చేశాడు.

‘‘ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితంలో మంచి కాంతులు నింపాలని ఆశిస్తున్నా. నా తదుపరి చిత్రం కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు థ్యాంక్స్. త్వరలోనే నా చిత్రం గురించిన వివరాలు ప్రకటిస్తా. మీ ప్రేమ, అభిమానానికి థ్యాంక్యు’’ అంటూ బన్నీ ట్వీట్ చేశాడు. కాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే.

 చీకటి వెలుగుల రంగేళి!

Updated By ManamWed, 11/07/2018 - 07:29

హరిత దీపావళితో పర్యావరణాన్ని, 
ప్రజారోగ్యాన్ని పరిరక్షించుకుందాం!

దీపావళి అంటేనే ‘దీపాల శ్రేణి’ సంబురం. దీప జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిద ర్శనంగా భావిస్తారు. దీపాలను సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీక లుగా భావిస్తారు. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలం శరధ్రు తువులో దీపావళి అరుదెంచడం విశేషం. ప్రాణశక్తికి ప్రతీక దీపం.. ఆనందానికి మరో రూపం. చీకటిని పారదోలి వెలుగునిచ్చే సాధనం. అసత్యంపై సత్యం సా ధించే విజయానికి ప్రతీక దీపం. అజ్ఞానం నుంచి జ్ఞానానికి, దుఃఖం నుంచి ఆనందానికి, నిరాశలోంచి ఆశాభావంలోకి చేరాలన్న మనిషి నిరంతర తపనకు దీపం సంకేతం. ఆనందోత్సాహాలతో జాతి, కుల, మత వర్గ భేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే దీపావళి పండుగ భారతీయ బాహుళత్వ సంస్కృతికి ప్రతి బింబం. నరకాసురవధ, రావణుడిపై రాముని విజయం వంటి పురాణ గాథల మాట ఎలా వున్నా చీకటిని, కష్టాలను పారదోలుతూ వెలుగు, సుఖాలు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి నిలుస్తుంది. పంచభూతాలలో ప్రధాన మైనది అగ్ని. ఈ అగ్ని ప్రాణికోటి మనుగడకు ఉపకరించే తేజస్సును, ఆహారాన్ని ఐహికంగాను, విజ్ఞాన ధర్మగరిమను ఆధ్యాత్మికంగాను ప్రసాదిస్తుంది. అంతేగాక మానవులకు విజ్ఞానం, వివేకం, వినయాలకు దీప ప్రజ్వలన సంకేతమని భారతీయుల నమ్మకం. 
 

image

కృష్ణదేవరాయల కాలంలో దీపావళిని లక్ష్మీ ఉత్సవంగా జరుపుకునేవారు. నిజానికి ఈ దీపావళి పండుగ అన్ని దేశాల్లోనూ వివిధ రూపాల్లో ఉంది. అగ్నిపై మానవుని విజయానికి, ఆ ప్రకృతి శక్తిని మానవీకరించడానికి సంకేతమే ఈ దీపా వళి పండగని ప్రపంచంలో వివిధ జాతుల ప్రజలు దీపాల పండుగను జరుపు కుంటారని చరిత్రకారులు చెబుతున్నారు. దీపావళి సరదా పండుగే అయినా అందులో గొప్ప దార్శనికత ఉంది. కొందరు ఈ పండుగను అనవసరంగా డబ్బు లు తగలేసే పండుగని, పర్యావరణ విధ్వంసక సంబురమని విమర్శించడంలో వాస్తవం ఎంత ఉన్నప్పటికీ ఇంటిల్లిపాదికి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని చేకూర్చే పండుగ ఇది. దేశవ్యాప్తంగా ఒక్క దీపావళి పండుగ రోజు కాల్చే టపాకాయల విలువ వందల కోట్లు చేస్తుంది. తమిళనాడులోని శివకాశిలో ఉన్న 8 వేలకు పైగా ఉన్న బాణసంచా పరిశ్రమలు భారత దేశంలోని 90 శాతం టపాసులను ఉత్పత్తి చేసి, వెయ్యి కోట్లకు పైగా టపాసుల వ్యాపారం జరుగుతుంది. అయితే దేశ రాజధాని ఢిల్లీ సహా దేశవ్యాప్త నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో దీపావళి రోజున జరిగే సంబురాల్లో తగలేసే టపాకాయలు నుంచి విడుదలవబోతున్న కాలుష్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. బాణసంచాతో మిరుమిట్లు గొలిపే దీపావళి పండుగకు ముందుగానే దేశ రాజధానిలో వాయు కాలుష్య ప్రమాదపు ఘంటి కలు మోగిస్తున్నాయి. ఆదివారం నాటికి తగ్గిన తీవ్రత దీపావళికి ముందు సోమ వారం నాడు సురక్షిత పరిమితి కంటే 20 రెట్లు ప్రమాదకర స్థాయికి పెరిగింది.

మందిర్ మార్గ్, జవహర్ నెహ్రూ స్టేడియం, మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడి యం ప్రాంతాలలో గాలిలో నలుసులు తీవ్రస్థాయిలో ఉన్నట్లు రికార్డు అయింది. గత ఏడాది దీపావళి సమయంలో ఢిల్లీలో కాల్చిన బాణసంచా వల్ల పి.ఎమ్. 2.5 (నలుసు పదార్థ కాలుష్యం 2.5) కాలుష్యం సురక్షిత పరిమితి కంటే 6.6 రెట్లు పెరిగిందని సీఎస్‌ఈ అధ్యయనం వెల్లడించింది. అయితే దీపావళికి ముందే 20 రెట్లు ప్రమాదకర స్థాయికి చేరుకున్న రాజధానిలో కాలుష్యం వల్ల ఎలాంటి విపత్తు ముంచుకొస్తుందో? సుప్రీంకోర్టు దీపావళి రోజు రాత్రి రెండు గంటలు మాత్రమే బాణసంచా కాల్చాలని స్పష్టమైన ఆదేశాలిచ్చినా, ఆ తీర్పును దేశ వ్యాప్తంగా అమలు జరిపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి కనీస మాత్రం ప్రయత్నం కూడా చేయలేదని పర్యావరణ వేత్తలు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు చెందిన అంశాలపై (శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల ఆడవాళ్ళ ప్రవేశం వగైరా) సుప్రీంకోర్టు ఆదేశాల అమలు తరచూ వివాదాస్పదంగా మారాయి. అదేతీరులో దీపావళి సంబురాల్లో బాణసంచా వినియోగంపై హరిత టపాసులే వినియోగించాలని, రెండుగంటలే టపాసుల సంబురాలు జరుపుకోవాలని సుప్రీం కోర్టు ఆంక్షలు విధించినా అమలు చేసే యంత్రాంగం లేక పోవడం, సామాజిక మాధ్యమాల్లోనూ, కొన్ని హిందుత్వ సమూహాలు ఆ ఆంక్షల్ని ధిక్కరించడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈసారి కూడా దీపావళి సృష్టించే వాయు కాలుష్యం భారతీయులకు ఒక సవాలుగా మారనుంది. 
 

image

దీపావళి పేరుతో వివిధ కార్పొరేట్ కంపెనీలు ఆఫర్లు, అక్షయ తృతీయ పేరుతో నగల వ్యాపారం, బట్టల వ్యాపారం ఒక్కటేమిటి వివిధ రకాల చిన్న పెద్ద వ్యాపారాలు జోరందుకుంటాయి. దాంతో సమాజమంతా కళకళలాడుతూ అంద ర్ని సంతోషపెట్టే దీపావళి అంటే చిన్న పెద్దలందరికీ ఎంతో సంతోషం, సరదా. అయితే మాల్స్ వచ్చిన దగ్గర నుంచి వీధి చివరి దుకాణాదారులు, రోడ్ల వెంబడి చిల్లర వ్యాపారస్తులకు తీవ్ర నష్టం వాటిల్లింది. విదేశీ సంస్కృతి మీద మోజుతో స్వదేశీయలకు తీవ్రనష్టం కలిగిస్తూ చైనా టపాసులు వంటి అనేక సరకులను మాల్స్‌లో వేలకు వేలు ఖర్చుచేస్తూ, చిరు వ్యాపారస్తుల దగ్గర కొనేటప్పుడు మాత్రం గీసిగీసి బేరమాడుతుంటారు.

ప్రముఖ, కంప్యూటర్లు, ప్రింటర్ల మేకింగ్ కంపెనీ హెచ్‌పీ ఇండియా ‘వీధి వ్యాపారస్తులకు మద్దతు తెలపండి.. మన ఇళ్ళలోని దీపాలు వారి ఇళ్ళలో కూడా కాంతులు నింపుతాయి’ అని చిరు వ్యాపారులకు సాయం చేసినప్పుడే, వారి బతుకులు కళకళలాడినప్పుడే నిజమైన దీపావళి అనే ఉద్దేశంతో చేసిన ‘ఉమ్మీద్ కా దియా’ అనే యాడ్ ఇప్పుడు నెటి జన్లను తెగ ఆకట్టుకుంటోంది. ప్రమిదల్లో తైలాన్ని నింపి దీపాలు వెలిగించి, బాణ సంచా ఆర్భాటంగా కాల్చినంత మాత్రాన దీపావళి రాదు. ప్రజలందరిలో సుఖ సంతోషాలను, ఆకలి కేకలు వేసే చిన్నారుల కళ్లల్లో వెలుగులు నింపినపుడు,  పర్యావరణ విధ్వంసక, భూతాపాన్ని పెంచి మానవ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చే, విషకాలుష్యాలను వెదజల్లే బాణసంచాను కాల్చకుండా నిగ్రహంగా వ్యవ హరించినపుడు నిజమైన దీపావళి వచ్చినట్లవుతుంది. ఓ చిరుదివ్వెను వెలిగిం చినా అది చీకటిని పారదోలి వెలుగు పువ్వులు నింపుతుంది. పర్యావరణ విధ్వం సాన్ని చొరవతో నిరోధించి, సామాన్యులకు జీవనోపాధిని కల్పించి వారి జీవన ప్రమాణాలు పెంచే విధానాలను ప్రభుత్వాలు చేపడితే దేశంలో నిజమైన దీపావళి వెల్లివిరుస్తుంది.

భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకొని ఉదాసీనమైన, చీకట్లు అలుముకుంటున్న స్థితి నుంచి ఉత్సాహభరితమైన, వెలుగులు విరజిమ్మే ఆశలు, ఆకాంక్షలతో దృఢ సంకల్పాన్ని ప్రోదిచేసుకునేందుకు ఈ సందర్భంగా వ్యక్తులు, వ్యవస్థలు పునఃసంకల్పించాలి. ప్రజల జీవితాల్లో పండుగ వాతావరణం తీసుకు రావటం కోసం ప్రభుత్వాలు ప్రజల కొనుగోలు శక్తిని పెంచే విధానాల రూప కల్పనకు శ్రీకారం చుట్టడం ద్వారా దీపావళి ముఖ్య ఉద్దేశాన్ని, స్ఫూర్తిని సాకారం చేసి వారి బతుకుల్లో వెలుగులు తీసుకురావాలి. దుబాయ్ దీపావళి

Updated By ManamWed, 11/07/2018 - 05:11

imageదుబైలో మొట్టమొదటి సారి 10 రోజుల పాటు దీపావళి పండుగను అధికారికంగా జరుపుతున్నారు.  దుబైలోని మన కాన్సులేట్ జనరల్ సహకారంతో కని వినీ ఎరుగని రీతిలో అక్కడి ప్రభుత్వం దివాలీ జరుపుతుండడం విశేషం. దీంతో ఈ ఏడాది దీపావళి పండుగను తాము మాతృదేశానికి వె ళ్లి జరుపుకోలేకపోయామనే బాధ తప్పిందని ఇక్కడి భారతీయులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

గిన్నిస్ రికార్డ్

దుబై వాటర్ ఫ్రంట్ ప్రొమెనేడ్, దుబై ఫెస్టివల్స్ అండ్ రిటైల్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆధ్వర్యంలో దీపావళి కాంతులీనింది. యూఏఈలో మెగా ఈవెంటుగా దీపావళి సెలబ్రేట్ చేస్తుండడంతో మనవారు కూడా ఈ వేడుకల్లో భాగమయ్యేందుకు పెద్దఎత్తున దుబై వెళ్లారు. ఓవైపు బాలీవుడ్ హంగామా మరోవైపు దివాలీ స్వీట్లు.. ఇక టపాసుల సందడి మధ్య దుబై సరికొత్తగా కనిపిస్తోంది. ఈనెల ఒకటవ తేదీన ప్రారంభమైన వేడుకలు రాత్రయిందంటే అంబరాన్ని అంటేలా సాగుతున్నాయి. ఈనెల 10వ తేదీ వరకూ సాగే ‘ఫైర్ క్రాకర్స్ షో’ అదరగొడుతోంది. అత్యధికులు ఎల్‌ఈడీ లైట్లు వెలిగించే కార్యక్రమంలో పాల్గొంటుండడంతో ఇది సరికొత్త గిన్నిస్ బుక్ ఆఫ్ వల్డ్ రికార్డ్ సృష్టించనుంది కూడా.  

image


దుబై పోలీస్ బ్యాండ్ మన జాతీయగీతం ఆలపించడం ఈ ఉత్సవాల్లో హైలైట్‌గా నిలిచింది. దుబై బేస్డ్‌గా ఉన్న ఎమిరేట్స్ విమాన సంస్థ కూడా ఈ ఉత్సవాల్లో పాలుపంచుకుని దివాలీకి కొత్త సొబగులు అద్దే ప్రయత్నం చేసి ప్రయాణికులను ఆశ్చర్యపరిచింది. భారతీయ సంప్రదాయ రుచులను పంచుతూ ఎమిరేట్స్ ఉద్యోగులు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.

image


ఇక ఇంటర్నెట్‌లో ఇప్పుడు ఈ వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతూ, ట్రెండింగ్ అవుతున్నాయి. భారత్-యుఏఈ మధ్య సాంస్కృతిక సంబంధాల మెరుగుదలతో పాటు టూరిజం అభివృద్ధికి కూడా దీపావళి అతిపెద్ద ఈవెంట్‌గా తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక్కడికి వచ్చిన విదేశీ టూరిస్టులు ఓవైపు దుబై అందాలు, మరోవైపు ఆద్యంతం భారతీయతను ఆస్వాదిస్తూ, హ్యాపీగా షికార్లు చేస్తున్నారు. 
 

image

 సెంట్రల్‌లో స్పెషల్ కలెక్షన్

Updated By ManamSat, 10/27/2018 - 19:26
special collection in diwali

దీపావళి పండగ సందర్బంగా ప్రత్యేక పండగ కలెక్షన్స్ ను ఆవిష్కరించినట్లు ‘సెంట్రల్‘ వెల్లడించింది. అన్ని వర్గాల వారికీ నచ్చేలా అత్యాధునిక సాంప్రదాయ డిజైన్లు, రంగుల్లో వీటిని మార్కెట్లోకి విడుదల చేసినట్టు సంస్థ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

​    ​central special collection

ఈ కలెక్షన్స్ లో 500కు పైగా బ్రాండ్లు ఉన్నాయని, బంగారం, ఎరుపు నలుపు, గులాబీ తదితర వర్ణాల్లో ఇవి లాభిస్తాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సెంట్రల్ స్టోర్ల లో ఇవి లభ్యమవుతాయని ఫ్యూచర్ లైఫ్ స్టయిల్ ఫాషన్ సి ఈ ఓ విష్ణు ప్రసాద్ తెలిపారు. 

special collection in central

 

special collection in central

 దీపావళి సెలవుల్లో మార్పులు 

Updated By ManamTue, 10/17/2017 - 13:56
  • 18న ఐచ్ఛికం, 19న సాధారణ సెలవు  

హైదరాబాద్, అక్టోబరు 16: తెలంగాణ ప్రభుత్వం దీపావళి సెలవుల్లో మార్పులు చేసింది. ఐచ్ఛిక సెలవును ఈ నెల 18కి, సాధారణ సెలవును 19కి మారుస్తున్నట్టు సోమవారం వెల్లడించింది. అంతకుముందు 17న ఐచ్ఛిక సెలవు, 18న దీపావళి సెలవుగా ప్రకటించింది. దీనిపై పండితులు, అధికారులు, ఉద్యోగుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పండగ సెలవు తేదీని 19కి మార్చాలంటూ పలువురు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో సెలవుల్లో మార్పులు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీపావళి నుంచి జియో ఫోన్ల డెలివరీ

Updated By ManamMon, 10/02/2017 - 18:45

రిలయన్స్ జియో చవక ఫోన్ల కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వారికి యాజమాన్యం శుభవార్త చెప్పింది. ఫోన్లు బుక్ చేసిన వినియోగదారులు దసరాకు డెలివరీ ఉంటుందని భావించారు. కానీ దసరాకు జియో నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఫోన్ బుక్ చేసిన చాలామంది నిరాశ చెందారు. అయితే వారందరినీ సంతోషపరిచేలా జియో తాజాగా ఓ ప్రకటన చేసింది. జియో ఫోన్ల డెలివరీ దివాళి నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించింది. డెలివరీ స్థితిని తెలుసుకునేందుకు 18008908900 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే సమాచారం అందుతుందని జియో కేర్ ట్వీట్‌లో తెలిపింది.

స్టోర్ అడ్రస్‌ను, ఫోన్ డెలివరీ తేదీని త్వరలో ఎస్‌ఎంఎస్ ద్వారా పంపిస్తామని రిలయన్స్ జియో వెల్లడించింది. దాదాపు 60లక్షల మంది ఈ జియో ఫోన్‌ను బుక్ చేశారు. ముందుగా గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు జియో ఫోన్‌ను డెలివరీ చేయాలని ముఖేశ్ అంబానీ భావిస్తున్నారు. వారానికి 50లక్షల ఫోన్లను విక్రయించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే రూ.500 చెల్లించి లక్షల మంది ఈ ఫోన్‌ను బుక్ చేశారు. మిగిలిన వెయ్యి రూపాయలు ఫోన్ చేతికందిన రోజు చెల్లిస్తే చాలని జియో ప్రకటించిన సంగతి తెలిసిందే.

Related News