team india

నంబర్ వన్‌గా ఇండియా, కోహ్లీ

Updated By ManamFri, 11/02/2018 - 00:14
  • ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్  

imageదుబాయ్: కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు టీమిండియా కూడా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా ని లిచింది. గురువా రం ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. ఎనిమిదో ర్యాంక్ లో ఉన్న వెస్టిండీ స్‌ను టీమిండియా 2-0 తో ఓడించి టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకు న్న సంగతి తెలిసిందే. దీంతో 116 పాయింట్లతో టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. 10 పాయింట్లు తక్కువగా సౌతాఫ్రికా రెండో స్థానం లో కొనసాగు తోంది. ఇక కోహ్లీ 935 పాయింట్లతో స్టీవ్ స్మిత్ (910) కంటే స్పష్టమైన 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. చెటేశ్వర్ పుజారాకు 765 పాయింట్లతో ఆరోస్థానం దక్కింది. మెనూ నుంచి బీఫ్‌ను తొలగించండి

Updated By ManamFri, 11/02/2018 - 00:14
  • క్రికెట్ ఆస్ట్రేలియాకు బీసీసీఐ విజ్ఞప్తి   

imageసిడ్నీ: ఆస్ట్రేలియా పర్యట నకు వెళ్లినప్పుడు టీమిండి యా ఫుడ్ మెనూ నుంచి బీష్ ఐ టంను తొలగించాలని క్రికెట్ ఆస్ట్రేలి యాకు (సీఏ) బీసీసీఐ పదే పదే విజ్ఞప్తి చేస్తోంది. నవంబర్‌లో ఆస్ట్రేలియాకు వెళ్లను న్న టీమిండియా రెండు నెలల పాటు ఆ దేశం లో పర్యటిస్తుంది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మ్యాచ్‌లు జరిగే వేదికలను పరిశీలించేందుకు వెళ్లిన బీసీసీఐ అధికారులు ఈ విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. బీసీసీఐకి చెందిన ఇద్దరు అధికారులు రెండు వారాల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లారు. ఈ పర్యటనకు సంబంధించిన ఎంఓయూ (మెమొరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్) చేసుకోవడంలో భాగంగా మెనూ నుంచి బీఫ్‌ను తొలగించే అంశం కూడా మాట్లాడారని ఓ ఆంగ్ల దినపత్రిక పేర్కొంది. ‘ఆస్ట్రేలియాలో చప్పిడి కూడు పెడు తున్నారని కొంత మంది ప్లేయర్స్ ఫిర్యాదు చేస్తున్నారు.

జట్టు లో కొంత మంది శాఖాహారులు కూడా ఉన్నారు. వీళ్లంతా తిండి సరి గా లేక మైదానంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో బీసీసీఐ అధి కారులు ఆస్ట్రేలియాలోని ఓ భారత రెస్టారెంట్‌కు వెళ్లి భారత క్రికెటర్లకు భో జనం తయారు చేయడాలని ఆర్డర్ కూడా ఇచ్చారు’ అని ఆ పత్రిక పే ర్కొంది. అయితే ఇంగ్లాండ్‌లో టీమిండియా లంచ్ మెనూను బీసీసీఐ అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం ద్వారా బీఫ్  విషయం బయటప డింది. ఆ మెనూలో బీఫ్ ఐటం కూడా ఉండింది. దీంతో బీఫ్ ఐటం ను తొలగించమన్న బీసీసీఐపై క్రికెట్ అభిమానులు ట్విట్టర్‌లో ధ్వజమెత్తారు. ఈ నెల 21 నుంచి జనవరి 18 వ తేదీ వరకు జరిగే ఆస్ట్రేలియా పర్యటనలో టీ మిండియా మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడుతుంది.సిరీస్ మనదే.. 

Updated By ManamThu, 11/01/2018 - 17:23
  • రెచ్చిపోయిన రోహిత్ శర్మ, కోహ్లీ 

  • ఐదో వన్డేలో విండీస్‌పై 9 వికెట్ల తేడాతో విజయం

  • 3-1 సిరీస్‌తో కోహ్లీసేన గెలుపు 

5th ODI, West Indies, Team India, Thiruvananthapuram, Nov 1 2018తిరువనంతపురం: ఐదు వన్డేల సిరీస్‌లో కోహ్లీసేన దుమ్మురేపింది. పర్యాటక జట్టు వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి ఐదు వన్డేలో కరీబీయన్లు నిర్దేశించిన స్కోరును అలవోకగా ఛేదించిన భారత్ (211 బంతులు మిగిలి ఉండగానే) 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో టీమిండియా ఐదు వన్డేల సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. ఐదో వన్డేలో విండీస్ నిర్దేశించిన స్వల్ప స్కోరు 105 లక్ష్యాన్ని ఓపెనర్ రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లీ సునాయసంగా ఛేదించి భారత్‌కు విజయాన్ని అందించారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ ఆకాశమే హద్దుగా చెలరేగి (56 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్) 63 పరుగులు చేసి హఫ్ సెంచరీతో నాటౌట్‌గా నిలవగా, కోహ్లీ (29 బంతుల్లో 6 ఫోర్లు) 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (6) పరుగులకే థామస్ బౌలింగ్‌లో చేతులేత్తేశాడు. విండీస్ లక్ష్యాన్ని 14.5 ఓవర్లలో 1 వికెట్ల నష్టానికి భారత్ ఛేదించి సిరీస్‌ను చేజిక్కించుకుంది.

ఆఖరి వన్డేలో పేలవ ప్రదర్శనతో స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయిన కరీబియన్ బౌలర్లు కోహ్లీసేను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో థామస్ ఒక వికెట్ మాత్రమే దక్కింది. అంతకుముందు బ్యాటింగ్ చేపట్టిన విండీస్ జట్టు 105 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటివరకు జరిగిన నాలుగు వన్డేల్లో తొలి వన్డేలో భారత్ గెలవగా, రెండో వన్డే టైగా ముగిసింది. ఇక మూడో వన్డేలో భారత్ విజయం సాధించగా నాల్గో వన్డేలో విండీస్ గెలిచింది. ఆఖరి వన్డేలో కరీబియన్లు పరాజయం మూటగట్టుకోవడంతో సిరీస్ భారత్ వశమైంది.  భారత్ లక్ష్యం 105 పరుగులు

Updated By ManamThu, 11/01/2018 - 15:56
  • 104 పరుగులకే విండీస్ ఆలౌట్

  • విజృంభించిన భారత బౌలర్లు..

  • జడేజా 4 వికెట్లు.. అహ్మద్, బుమ్రా 2 వికెట్లు 

5th ODI, West Indies, Thiruvananthapuram, Team India, VIrat kohliతిరువనంతపురం: టీమిండియాతో జరుగుతున్న ఆఖరి ఐదో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ 31.5 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో కోహ్లీసేనకు 105 పరుగుల లక్ష్యాన్ని హోల్డర్ సేన నిర్దేశించింది. భారత బౌలర్లు రవీంద్ర జడేజా (4/34), అహ్మద్ (2/29), బుమ్రా (2/11) కట్టడి చేయడంతో కరీబియన్ల వికెట్లు టపటపా రాలాయి.

విండీస్‌లో ఓపెనర్ పొవెల్ (0) ఆదిలోనే చేతులేత్తేశాడు. జాసన్ హోల్డర్ (25), శామూల్స్ (24) మినహా మిగతా ఆటగాళ్లు రొమన్ పొవెల్ (16), హెట్మయర్ (9), అలెన్ (4), పాల్ (5), బిషూ (8 నాటౌట్), రోచ్ (5), థామస్ (0) పేలవ ప్రదర్శనతో స్వల్ప స్కోరుకే వికెట్లు సమర్పించుకున్నారు. దీంతో కరీబీయన్ల జట్టు 104 పరుగులకే చాప చుట్టేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, కుల్‌దీప్ యాదవ్ తలో వికెట్ తీసుకున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్

Updated By ManamThu, 11/01/2018 - 13:06
INDvWI 5th ODI: Windies win the toss and elect to bat

తిరువనంతపురం: భారత్‌తో గురువారం జరుగుతున్న  చివరి, అయిదో వన్డేలో వెస్టిండీస్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దశాబ్దం తర్వాత మళ్లీ వన్డే మ్యాచ్‌కు ఈ వేదిక ఆతిథ్యమిస్తోంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో రెండు వన్డేల్లో టీమిండియా గెలవగా.. ఒక వన్డేలో వెస్టిండీస్ విజయం సాధించింది. మరో మ్యాచ్ టైగా ముగిసింది.

కాగా పుణెలో జరిగిన మూడో వన్డేలో ఓటమిపాలైన కోహ్లీ సేన మళ్లీ పుంజుకుని ముంబైలో జరిగిన నాలుగో వన్డేలో 224 పరుగుల భారీ తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. ఈ చివరి మ్యాచ్‌లోనూ కోహ్లీ సేన అదే జోరును కొనసాగించే అవకాశముంది. మరోవైపు జాసన్ హోల్డర్ సేన ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. సిరీస్‌పై టీమిండియా గురి

Updated By ManamThu, 11/01/2018 - 00:12
  • నేడు వెస్టిండీస్‌తో చివరి, ఐదో వన్డే

  • మధ్యాహ్నం 1-30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

తిరువనంతపురం: మరో హోం సిరీస్‌ను సొంతం చేసుకునేందుకు టీమిండియా సిద్ధమైంది. వెస్టిండీస్‌తో గురువారమిక్కడ జరగనున్న చివరి, ఐదో వన్డేల్లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. దశాబ్దం తర్వాత మళ్లీ వన్డే మ్యాచ్‌కు ఈ వేదిక ఆతిథ్యమిస్తోంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో రెండు వన్డేల్లో టీమిండియా గెలవగా.. ఒక వన్డేలో వెస్టిండీస్ విజయం సాధించింది. మరో మ్యాచ్ టైగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో వరుణుడు కొంత సేపు ఆటంకం కలిగించే అవకాశముంది. పుణెలో జరిగిన మూడో వన్డేలో ఓటమిపాలైన కోహ్లీ సేన మళ్లీ పుంజుకుని ముంబైలో జరిగిన నాలుగో వన్డేలో 224 పరుగుల భారీ తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. ఈ చివరి మ్యాచ్‌లోనూ కోహ్లీ సేన అదే జోరును కొనసాగించే అవకాశముంది. ఈ వేదికలో చివరిసారి ఈ రెండు జట్లు ఆడిన మ్యాచ్‌లో పర్యాటక జట్టు గెలిచింది. అప్పట్లో ప్రపంచ క్రికెట్‌లో వెస్టిండీస్ జట్టు బలమైనదిగా ఉండింది. ఆ మ్యాచ్‌ను స్ఫూర్తిగా తీసుకుని జాసన్ హోల్డర్ సేన ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. వచ్చే ఏడాది జూన్‌లో ఇంగ్లాండ్‌లో జరగనున్న వన్డే వరల్డ్ కప్‌కు ఈ సిరీస్‌ను తొలి సన్నాహక టోర్నీగా భావిస్తున్న ఇరు జట్లూ ఓటమిని అంగీకరించడం లేదు. 
 

image

కోహ్లీ, రోహిత్ శర్మ అసాధారణ ఫామ్‌లో ఉన్నారు. ఒకరు మూడు, మరొకరు రెండు సెంచరీలు చేశారు. కెప్టెన్ ప్రశంసలు అందుకున్న అంబటి రాయుడు కూడా పరుగుల వరద పారిస్తున్నాడు. అయితే మిగతా బ్యాట్స్‌మెన్ మాత్రం అశించిన మేరకు రాణించడం లేదు. విధ్వంసకర బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ శుభారంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. మరోవైపు సీనియర్ బ్యాట్స్‌మన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒక్కో పరుగు కోసం శ్రమిస్తున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌కు టీ20 జట్టులో చోటు కోల్పోయిన జార్ఖండ్ వికెట్ కీపర్ స్టంప్స్ దగ్గర అద్భుత ప్రతిభ కొనసాగిస్తూనే ఉన్నాడు. అయితే ధోనీ మరో మైలురాయికి చేరువయ్యాడు. 10 వేల పరుగులు పూర్తి చేయడానికి మరో 1 పరుగు దూరంలో ఉన్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా మళ్లీ జట్టులోకి రావడంతో టీమిండియా బలం పెరిగింది. తన సత్తా ఏంటో రెండు మ్యాచ్‌ల్లో చూపించాడు. కాగా ఖలీల్ అహ్మద్ బ్రాబోర్న్ స్టేడియంలో స్ఫూర్తిదాయక బౌలింగ్‌ను ప్రదర్శించాడు. వెస్టిండీస్ జట్టులోని చాలా మంది బ్యాట్స్‌మెన్‌ను స్పిన్నర్లు దెబ్బ తీశారు. ముఖ్యంగా కుల్‌దీప్ బౌలింగ్‌లో ఆడేందుకు ఇబ్బంది పడ్డారు. నాలుగో వన్డేల్లో రవీంద్ర జడేజాను తీసుకోవడంతో యజ్వేంద్ర చాహల్ బెంచ్‌కు పరిమితమయ్యాడు. 

మరోవైపు టెస్టుల్లో ఘోరపరాజయాన్ని చవిచూసిన వెస్టిండీస్ జట్టు వన్డేల్లో కొంత ప్రతిఘటించింది. ముఖ్యంగా షిమ్రన్ హెట్మేయర్, షాయ్ హోప్ జట్టుకు అండగా నిలిచారు. వీళ్లిద్దరూ సెంచరీ చేయడం వారి సామర్థ్యాన్ని తెలియజేస్తోంది. అయితే భారత స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోగలనని కెప్టెన్ జాసన్ హోల్డర్ నిరూపించాడు. కానీ మిగతా బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ తమ సత్తాను చాటుకోలేకపోయారు. ఈ చివరి మ్యాచ్‌లో జట్టు సభ్యులందరూ కలిసికట్టుగా ఆడి గెలిపిస్తారని, టీమిండియా సిరీస్ విజయాన్ని అడ్డుకుంటారని హోల్డర్ ఆశిస్తున్నాడు. అయితే అది చెప్పినంత సులభం కాదు. ఎందకంటే వెస్టిండీస్ జట్టులో ప్రతిభావంతులున్నప్పటికీ జట్టును గెలిపించగల తెగింపు వారిలో కనబడటం లేదు. నిలకడగా రాణిస్తున్న ఆఫ్ స్పిన్నర్ యాష్లే నర్స్ ముంబై మ్యాచ్‌లో గాయపడ్డాడు. అతను లేకపోవడంతో కీలకమైన ఐదో మ్యాచ్‌లో ప్రభావం చూపనుంది. ఈ చివరి వన్డే మ్యాచ్‌కు గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం క్రిక్కిరిసి పోనుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. 

గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం
కేరళలోని ట్రివేండ్రంలో గల గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియం తొలిసారి అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇండియా, వెస్టిండీస్ మధ్య చివరి వన్డే ఇక్కడ జరగనుంది. ఈ సిరీస్‌లో ఇండియా ఇప్పటికే 2-1 ఆధిక్యంతో నిలిచింది. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ భారత్ సొంతం అవుతుంది. అదే వెస్టిండీస్ గెలిస్తే 2-2తో సిరీస్ సమమవుతుంది. ఈ మ్యాచ్‌లో ఏదో ఒక సమయంలో వరుణుడు ఆటంకపరచనున్నాడు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం గురువారం ఇక్కడ చిన్నపాటి వర్షం కురిసే అవకాశముంది. ఈ బహుళ క్రీడల స్టేడియం 2017లో ఒక మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చింది. ఇండియా, న్యూజిలాండ్ మధ్య ఇక్కడ టీ20 మ్యాచ్ జరిగింది. అప్పుడు కూడా వర్షం ఆటంకం కలిగించింది. దీంతో 8 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో టీమిండియా 6 పరుగులతో గెలిచింది. 

స్టేడియం గురించి సంక్షిప్త వివరణ
ఈ స్టేడియం ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చింది. 2015లో 
సాఫ్ కప్‌లో భాగంగా ఇండియా, అఫ్ఘానిస్థాన్ జట్లు ఫైనల్ 
మ్యాచ్ ఆడాయి. ఆ మ్యాచ్‌కు 48 వేల మంది అభిమానులు వచ్చారు. దీన్ని బట్టి చూస్తే ఇక్కడి ప్రజలు 
క్రీడలను ఎంత ఆదరిస్తారో తెలుస్తోంది.

నిర్మాణం : 2015
సామర్థ్యం : 55,000
ప్రాంతం : త్రివేండ్రం, ఇండియా

కేసీఏలో గందరగోళం
చివరి వన్డే నిర్వహణకు బీసీసీఐ గ్రీన్‌ఫీల్డ్ స్టేడియాన్ని ఎంపిక చేసింది. అయితే ఈ మ్యాచ్‌ను కొచ్చిలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియానికి మార్చాలని కేరళ క్రికెట్ అసోసియేషన్ (కేసీఏ) కోరింది. అయితే జవహర్‌లాల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తే టర్ఫ్ దెబ్బతింటుందని, ఆటగాళ్లు గాయాల బారిన పడతారని కేరళ బ్లాస్టర్స్ ఫుట్‌బాల్ క్రీడాకారులు, అభిమానులు వ్యతిరేకించారు. కేసీఏ నిర్ణయాన్ని సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ కూడా వ్యతిరేకించడంతో పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. చివరికి క్రీడల మంత్రి జోక్యంతో కేసీఏ వెనక్కితగ్గింది. దీంతో క్రికెట్ మ్యాచ్ నిర్వహణ బాధ్యతలు గ్రీన్‌ఫీల్డ్ స్టేడియానికి అప్పగించారు.
 టీమిండియా విజయలక్ష్యం 284 పరుగులు

Updated By ManamSat, 10/27/2018 - 17:58
3rd ODI

పుణె : మూడో వన్డేలో వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది. దీంతో  టీమిండియాకు 284 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.  ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా పుణెలో జరుగుతున్న మూడో వన్డేలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొమ్మిది పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ ఎనిమిది పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు. 

అంతకు ముందు భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బూమ్రా తమ సత్తా చాటారు. కుల్దీప్ 52 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీయగా, జస్‌ప్రీత్ 35 పరుగులకు నాలుగు వికెట్లు తీశాడు.  భువనేశ్వర్(1/70), ఖలీల్ అహ్మద్(1/65)  బౌలింగ్ చేశారు. ఇక  విండీస్ బ్యాట్స్‌మెన్లు హెట్‌మైర్(37), జాసన్ హోల్డర్(32) మాత్రమే రెండు అంకెల స్కోర్ చేశారు.

కాగా గువహాటిలో జరిగిన తొలి వన్డేలో విండీస్ బౌలర్లను టీమిండియా బ్యాట్స్‌మెన్ చితకబదారు. దీంతో ఆ మ్యాచ్‌లో కోహ్లీ సేన ఎనిమిది వికెట్లతో గెలిచింది. అయితే విశాఖపట్నంలోనూ గెలిచి ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 2-0 ఆధిక్యంతో నిలవాలన్న టీమిండియా ఆశలను వెస్టిండీస్ అడ్డుకుంది. ఆ మ్యాచ్‌లో షాయ్ హోప్ కరేబియన్ల ఆశలకు అండగా నిలిచాడు. మొత్తానికి ఆ మ్యాచ్‌లో ఈ పర్యటనలో ఎన్నడూ లేనంతగా టీమిండియాకు ఎదురొడ్డి నిలిచారు. టీ20ల నుంచి ధోనికి ఉద్వాసన..?

Updated By ManamSat, 10/27/2018 - 09:56

Dhoniటీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై వేటు పడింది. గత కొన్ని రోజులుగా ఫామ్‌ కోల్పోయిన ధోనీకి టీ20ల నుంచి ఉద్వాసన పలికింది సెలక్షన్ కమిటీ. వెస్టిండీస్, ఆస్ట్రేలియాలతో జరగనున్న టీ20లకు ఎంపిక చేసిన టీంలో ధోనీని సెలక్షన్ల కమిటీ పక్కనపెట్టింది. దీంతో వన్డే ప్రపంచకప్‌లో ఆడాలనుకుంటున్న ధోనీపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది ఆసక్తికరంగా ఉంది. ఇక అతడి స్థానంలో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ను ఎంపిక చేసింది. అలాగే వెస్టిండీస్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతిని ఇస్తూ రోహిత్ శర్మకు నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. 

వెస్టిండీస్‌ టీ20 సిరీస్‌కు ఎన్నికైన భారత దీమ్: రోహిత్‌శర్మ(కెప్టెన్), ధావన్, రాహుల్, కార్తీక్, మనీశ్‌పాండే, అయ్యర్, రిషబ్ పంత్, కృనాల్ పాండ్యా, సుందర్, చాహల్, కుల్దీప్, భువనేశ్వర్, బుమ్రా, ఖలీల్ అహ్మద్, ఉమేశ్, షాబాజ్ నదీమ్. 

ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడనున్న భారత టీమ్: కోహ్లీ(కెప్టెన్), విజయ్, రాహుల్, పృథ్వీషా, పుజార, రహానే, విహారి, రోహిత్‌శర్మ, రిషబ్, పార్థివ్ పటేల్, అశ్విన్, జడేజా, కుల్దీప్, షమీ, ఇషాంత్, ఉమేశ్, బుమ్రా, భువనేశ్వర్. 

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడనున్న భారత టీమ్: కోహ్లీ(కెప్టెన్), రోహిత్‌శర్మ, ధావన్, రాహుల్, అయ్యర్, మనీశ్ పాండే, కార్తీక్, రిషబ్, కుల్దీప్, చాహల్, సుందర్, కృనాల్, భువనేశ్వర్, బుమ్రా, ఉమేశ్, ఖలీల్ అహ్మద్.వెస్టిండీస్ విజయలక్ష్యం 322

Updated By ManamWed, 10/24/2018 - 17:41
India vs Windies 2nd ODI: India score 321 runs against Windies

విశాఖ : రెండో వన్డేలో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసి వెస్టిండీస్‌కు 322 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. కాగా ఈ మ్యాచ్‌లో కోహ్లీ వన్డేల్లో అత్యంత వేగంగా పది వేల పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా కూడా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించారు. అంతేకాకుండా 129 బంతుల్లో 157 పరుగులు చేసి కోహ్లీ నాటౌట్‌గా నిలిచాడు.

ఇక అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ (4), ధావన్ (29) తక్కువ స్కోర్‌కే పెవిలియన్ దారి పట్టినా, ఆ తర్వాత క్రీజ్‌లోకి దిగిన కోహ్లీ, రాయుడు ఆదుకున్నారు. జట్టు 139 పరుగుల వద్ద రాయుడు తన వ్యక్తిగత స్కోర్ 73 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. జడేజా 13, ధోనీ 20, పంత్ 17 పరుగులు వద్ద పెవిలియన్ దారి పట్టారు. విండీస్ బౌలర్లు నర్స్, మెక్‌కాయ్‌లకు చెరో రెండు వికెట్లు లభించాయి.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

Updated By ManamWed, 10/24/2018 - 13:10
2nd ODI: India win the toss, elect to bat, in Visakhapatnam

విశాఖ : వెస్టిండీస్‌తో జరగనున్న రెండో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో బుధవారమిక్కడ ఇండియా, వెస్టిండీస్‌ల మధ్య రెండో వన్డే జరగనుంది. తొలి వన్డేలో సునాయాస విజయం సాధించడంతో టీమిండియా ఐదు మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది.

దీంతో రెండో వన్డేలో గెలుపుపై ధీమాగా ఉన్న కోహ్లీ ...టాస్ గెలిచిన అనంతరం మాట్లాడుతూ..  పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించేలా ఉన్నదని, పైగా తమ బౌలింగ్ టార్గెట్‌ను డిఫెండ్ చేయగలిగేలా ఉందని అభిప్రాయపడ్డాడు. అలాగే టీమిండియా జట్టులో ఓ మార్పు జరిగింది.పేస్ బౌలర్ ఖలీల్ అహ్మద్ స్థానంలో స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌కు చోటు దక్కింది.

ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో 81 పరుగులు చేస్తే వన్డేల్లో అతి వేగంగా 10 వేల పరుగులు పూర్తి చేసిన వాడవుతాడు. అంతేకాకుండా ఈ విషయంలో దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను వెనక్కి నెట్టేస్తాడు. కోహ్లీ ఈ రికార్డును సాధిస్తాడని పోర్ట్ సిటీ అభిమానులు ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. ఈ ఘనతను సాధించేందుకు టెండూ ల్కర్ 259 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. అయితే కోహ్లీ 204వ ఇన్నింగ్స్‌లోనే సాధించే అవకాశముంది.

Related News