supreme-court

నేరం కాదంటే.. ద్వేషం పోతుంది!

Updated By ManamThu, 07/12/2018 - 23:47
 • స్వలింగ సంపర్క చట్టంపై సుప్రీంకోర్టు

 • నేర భావన వల్లే సామాజిక ద్వేషభావం.. సెక్షన్ 377పై విచారణలో బెంచి వ్యాఖ్యలు

supreme-courtన్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం నేరం కాదని ఒక్కసారి చెబితే.. ఎల్‌జీబీటీక్యూ వర్గాల పట్ల సమాజంలో ఉన్న ద్వేషభావం కూడా పోతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ సమాజంలో ఉన్న వాతావరణం కారణంగా ఈ వర్గాల పట్ల వివక్ష తీవ్రస్థాయిలో పెరిగిపోయిందని రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. ఐపీసీ సెక్షన్ 377ను రద్దుచేయాలంటూ దాఖలైన పలు పిటిషన్ల విచారణ సందర్భంగా ధర్మాసనం గురువారం ఈ వ్యాఖ్యలు చేసింది. స్వలింగ సంపర్కంలో ఉన్నవాల్లు ఇతరులకు ఉన్న హక్కులను పొందకుండా అడ్డుకునేలా ఏదైనా చట్టం, నిబంధన, నియమం లేదా మార్గదర్శక సూత్రాలు ఉన్నాయా అని పిటిషనర్ తరఫున వాదిస్తున్న మనేకా గురుస్వామిని ధర్మాసనం ప్రశ్నించింది. అలాంటివి ఏమీ లేవని అందుకు ఆమె బదులిచ్చారు. దాంతో.. అంగీకారంతో కూడిన స్వలింగ సంపర్కం నేరం కావడం వల్లే వాళ్లు సామాజిక బహిష్కరణను ఎదుర్కొంటున్నారని ధర్మాసనం చెప్పింది. ఇది నేరం కాదని ఒక్కసారి చెబితే, ఇక వాళ్లకున్న అడ్డంకులు, సామాజిక ద్వేషభావం అన్నీ పోతాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టంలో ఉన్న కొన్ని అంశాలను బెంచి ప్రస్తావిస్తూ.. కేవలం లైంగిక కారణాలను చూపించి ఇలాంటివారిపై వివక్ష చూపడం తగదని స్పష్టం చేసింది. సెక్షన్ 377ను రద్దుచేసినంత మాత్రాన ఎల్‌జీబీటీక్యూ వర్గాల పట్ల వివిధ రంగాల్లో ఉన్న వివక్ష తొలగిపోదని సీనియర్ న్యాయవాది సీయూ సింగ్ వాదించారు. కేవలం ఈ కారణం చూపించి వారికి సరైన వైద్య సంరక్షణ కూడా ఇవ్వడం లేదని, వైద్యనిపుణులు కనీసం వ్యక్తిగత రహస్యాలను కూడా సరిగా నిర్వహించడం లేదని జస్టిస్ మల్హోత్రా అన్నారు. వయోజనులు వ్యక్తిగతంగా, పరస్పర అంగీకారంతో చేసుకునే చర్యల గురించి నిర్ణయాన్ని కోర్టు విచక్షణకే వదిలేస్తున్నామని చెప్పిన కేంద్రం.. వారి మధ్య పెళ్లిళ్లు, దత్తత తీసుకోవడం లాంటి విషయాలను మాత్రం ప్రస్తుతం చర్చించకపోవడం మంచిదని సూచించింది. ఆ వాదనతో సుప్రీం ధర్మాసనం కూడా ఏకీభవించింది. తాము ఇతర అంశాలను విచారించడం లేదని, సెక్షన్ 377ను మాత్రమే చూస్తున్నామని తెలిపింది. మహిళలకూ బాధ్యతా.. వద్దు!

Updated By ManamWed, 07/11/2018 - 23:34

supreme-courtవివాహేతర సంబంధాలలో కేవలం పురుషులనే కాక మహిళలను కూడా బాధ్యులను చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖైలెన పిటిషన్‌ను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈ మేరకు బుధవారం ఫిడవిట్ దాఖలు చేసింది.  ఐపీసీ సెక్షన్ 497 ప్రకారం భార్య కాని మహిళతో లైంగిక సంబంధం పెట్టుకున్నప్పుడు పురుషుడిని మాత్రమే బాధ్యుడిగా చేస్తున్నారు. వైవాహిక వ్యవస్థ పవిత్రతను కాపాడేందుకే సెక్షన్ 497 ఉందని, అలాంటి చట్టాన్ని నీరుగారిస్తే వివాహబంధం దెబ్బతింటుందని కేంద్రం చెప్పింది. ప్రస్తుతం ఇటలీలోని ట్రెంటోలో ఉంటున్న కేరళవాసి జోసెఫ్ షైన్ దాఖలుచేసిన పిల్‌ను చీఫ్ జస్టిస్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది. వివాహేతర సంబంధాల విషయంలో  పురుషుడు ఒక్కడే తప్పు చేసినట్లు కాదని, సంబంధానికి అంగీకరించిన వేరే వ్యక్తి భార్యది కూడా తప్పేనని ఆయన తన పిటిషన్‌లో వాదించారు. ఇలాంటి సంబంధాల విషయంలో మహిళల పాత్ర ఎలా ఉన్నా వాళ్లను నిర్దోషులుగా విడిచిపెడుతూ, పురుషుడిని మాత్రమే బాధ్యుడిని చేసే చట్టం అనాగరికమని పిటిషనర్ తరఫు న్యాయువాది కాళీశ్వరం రాజ్ వాదించారు. అదే పెళ్లికాని మగ, ఆడ; పెళ్లికాని మగ - పెళ్లయిన ఆడ; పెళ్లయిన మగ - పెళ్లికాని ఆడవారి మధ్య అంగీకారంతో కూడిన లైంగిక సంబంధం మాత్రం తప్పు కాదని ఈ సెక్షన్ చెబుతోందన్నారు. ప్రస్తుతం  ఆడవారిని బాధితులుగా భావించి నిర్దోషులుగా విడిచిపెడుతున్నారని, ఒకరికి మాత్రమే శిక్ష విధించడం ఎంతవరకు సబబో పరిశీలించాల్సిందేనని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.మధ్యంతర ఉత్తర్వులకు నో

Updated By ManamWed, 07/11/2018 - 23:34
 • ఎస్సీ/ఎస్టీలకు పదోన్నతుల్లో  రిజర్వేషన్లపై సుప్రీం వెల్లడి

 • 2006 తీర్పును రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించాల్సిందే

supreme-courtఎస్సీ/ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతులు కల్పించేటప్పుడు క్రీమీలేయుర్ వర్తించదన్న పాత తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం కుదరని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 2006లో ఎం.నాగరాజు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ విషయంతో వెలువడిన ఆ తీర్పును ఏడుగురు న్యాయుమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారించాల్సిందేనని తేల్చి చెప్పింది. రిజర్వేషన్ల అంశంపై నెలకొన్న సందిగ్ధత వల్ల రైల్వే, ఇతర సర్వీసుల్లో లక్షలాది ఉద్యోగాల భర్తీ, ప్రమోషన్లు నిలిచిపోయాయని, దీనిపై తక్షణం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని బుధవారం కేంద్రం.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ అంశాన్ని ప్రధాన న్యాయుమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఇప్పటికే రిజర్వేషన్ల అంశానికి సంబంధించి వేర్వేరు కోర్టుల్లో వచ్చిన భిన్నైమెన తీర్పుల విషయంలో కొన్నింటిని రాజ్యాంగ ధర్మాసనం పరిష్కరించిందని బెంచి వ్యాఖ్యానించింది. ప్రస్తుతానికి ఉన్న చట్టాల ప్రకారం ఉద్యోగాల భర్తీ తదితరాలను చేపట్టవచ్చని పేర్కొంది. అంశాన్ని ఆగస్టు మొదటి వారంలో ఏడుగురు న్యాయుమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుందని వెల్లడించింది.బీజేపీ మోసానికి సుప్రీం చెల్లు

Updated By ManamSat, 05/19/2018 - 01:38
 • రాజ్యాంగ వ్యతిరేకంగా గవర్నర్.. చట్టబద్ధంగా దాన్ని అడ్డుకున్నాం: రాహుల్

supreme-courtన్యూఢిల్లీ/బిలాస్‌పూర్: కర్ణాటకలో మెజారిటీ లేకున్నా తమ ప్రభుత్వ ఏర్పాటు ద్వారా బీజేపీ చేసిన మోసానికి సుప్రీం కోర్టు చెక్ పెట్టిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిచ్చి గవర్నర్ వజూభాయ్ వాలా రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించారని సుప్రీం తీర్పుతో తేలిపోయిందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ మోసాన్ని చట్టం సాయంతో అడ్డుకున్నామని, ఇప్పుడు ఆ పార్టీ మెజారిటీ కోసం ధన, అంగ బలాలను వాడుతుందని చెప్పారు. కర్ణాటకలో అసెంబ్లీలో యడ్యూరప్ప తన బలాన్ని శనివారమే నిరూపించుకోవాలని సుప్రీం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాహుల్ ఈ మేరకు ట్విటర్ ద్వారా స్పందించారు. ఇదిలా ఉండగా ఛత్తీస్‌గఢ్‌లో రెండు రోజుల పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ శుక్రవారం బిలాస్‌పూర్‌ల్ బూత్ స్థాయి కార్యకర్తలతో ముఖాముఖీ మాట్లాడారు. బీజేపీ దేశంలో విభజన రాజకీయాలు చేస్తోందని, ప్రజల మధ్య కొట్లాటలు పెట్టేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఏడాది చివరిలో ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంతో రాహుల్ ఇప్పటి నుంచే అక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రపతి వద్దకు పంచాయితీ!
గవర్నర్ల తీరుపై రాష్ట్రపతి వద్ద పంచాయితీ పెట్టాలని విపక్ష పార్టీలు భావిస్తున్నాయి. కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలా ఆ రాష్ట్రంలో బీజేపీకి మెజారిటీ లేనప్పటికీ యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంపై రగిలిపోతున్న కాంగ్రెస్ ఈ విషయాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మిగిలిన రాష్ట్రాల్లోని కాంగ్రెస్‌తో కలిసి వచ్చే అన్ని పార్టీలనూ కలుపుకొని పోవాలని భావిస్తోంది. గోవా, మణిపూర్, మేఘాలయ, బిహార్‌లలో గవర్నర్లు వ్యవహరించిన తీరు... కర్ణాటకలో గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై అంతా కలిసి రాష్ట్రపతి వివరించాలని యోచిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే కోవింద్ కలిసేందుకు కాంగ్రెస్ అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది. తొలుత శనివారం ఆయనను కలవాలని భావించినప్పటికీ.. సుప్రీం కోర్టు యడ్యూరప్పను శనివారమే బల నిరూపణ చేసుకోవాలని ఆదేశించడంతో దాని ఫలితం తేలాక వెళ్తే మేలనే నిర్ణయానికి వచ్చింది. 

బీజేపీ బలం 104కు మించి లేదు
కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ సంఖ్యా బలం 104కు మించి లేదని, కాంగ్రెస్-జేడీఎస్ ద్వయానికే స్పష్టమైన మెజారిటీ ఉందని కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్దరామయ్య చెప్పారు. శుక్రవారం మీడియా తో మాట్లాడిన ఆయన తమ ఎమ్మెల్యేల సం ఖ్య తగిందని వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. 104 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన జేడీ ఎస్, కాంగ్రెస్, ఇండిపెండెంట్లు సహా అంతా ఐకమత్యం గా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తమతో 117 ఎమ్మెల్యేలు ఉన్నారని, వాస్తవికతను పక్కన పెట్టి గవర్నర్ వజూభాయ్ వాలా బీజేపీకి బల నిరూపణకు 15 రోజుల సమయం ఇచ్చారని సిద్దూ మండిపడ్డారు. గతంలో ఏ గవర్నర్ కూడా ఇంత సమయం ఇచ్చిన దాఖలాలు లేవని, ఈ గడువు ఆయనను ఎవరూ అడగలేదని, కేవలం మోదీ, అమిత్ షాల డైరక్షన్‌లో ఇలా చేస్తున్నారని ఆరోపించారు. వారిద్దరూ హిట్లర్ శిలాజ రూపాలని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ప్రజాస్వామ్యాన్ని దారుణంగా హత్య చేశారని ధ్వజమెత్తారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్‌ను కేంద్ర ప్రభుత్వం బందీగా చేసుకుందని కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ ఆరోపించారు.

వంద శాతం విజయం మాదే
కర్ణాటక అసెంబ్లీలో తనపై విశ్వాసాన్ని నిరూపించుకుంటానని, వంద శాతం విజయం సాధించేది తానేనని ఆ రాష్ట్ర సీఎం యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. శనివారమే అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీం తీర్పును తాము స్వాగతిస్తున్నామని, రాజకీయ క్రీడలో గెలుపు తమదేనని, బీజేపీకి పూర్తి మెజారిటీ ఉందని ఆయన వెల్లడించారు. అసెంబ్లీని సమావేశపరచడం, ఇతర వ్యవహారాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేస్తానని చెప్పారు. కాగా, బల నిరూపణకు బీజేపీ సిద్ధంగా ఉందని, ఇందులో విజయం తమదేనని కేంద్ర మంత్రి జావడేకర్ ట్వీట్ చేశారు. అలాగే, యడ్యూరప్ప నాయత్వంలోని తమ ప్రభుత్వం విశ్వాసాన్ని చాటుకుంటుందని, ఇందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు తాము చేశామని కర్ణాటక బీజేపీ ప్రధాన కార్యదర్శి శోభా కరండలజే చెప్పారు. చాలా మంది ఎమ్మెల్యేలు తమకు మద్దతిస్తున్నారని, తమకు 120 మందికి పైగా ఎమ్మెల్యేల బలం ఉందని పేర్కొన్నారు.అభిశంసనపై సుప్రీంకు ఎంపీలు

Updated By ManamTue, 05/08/2018 - 05:55
 • రాజ్యసభ చైర్మన్ నిర్ణయం సవాలు

supreme-courtన్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై తామిచ్చిన అభిశంసన నోటీసును రాజ్యసభ చైర్మన్ తిరస్కరించడాన్ని సవాలుచేస్తూ ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ వ్యవహారాన్ని అత్యవసరంగా విచారించాలంటూ నోటీసు మీద సంతకం చేసిన ఎంపీలలో ఒకరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు. అయితే, అత్యవసరంగా వినాలంటే ముందుగా దీన్ని ప్రధాన న్యాయమూర్తి ముందు పెట్టాలని ధర్మాసనంలో ఉన్న జస్టిస్ ఎస్‌కే కౌల్ తదితరులు సిబల్‌కు, మరో న్యాయవాది ప్రశాంత భూషణ్‌కు సూచించారు. మాస్టర్ ఆఫ్ రోస్టర్స్ అధికారాల గురించి రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును వాళ్లు ప్రస్తావించారు. పంజాబ్‌కు చెందిన ప్రతాప్ సింగ్ బాజ్వా, గుజరాత్‌కు చెందిన అమీ హర్షద్రయ్ యాజ్ఞిక్ ఈ పిటిషన్ దాఖలుచేశారు. మంగళవారం వస్తే ఈ విషయం గురించి మాట్లాడచ్చని సిబల్, భూషణ్‌లకు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ కౌల్ చెప్పారు. అయితే తనకు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు గురించి తెలుసుగానీ, ఇది ప్రధాన న్యాయమూర్తి అభిశంసనకు సంబంధించినది కాబట్టి సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి లిస్టింగ్‌కు ఆదేవించవచ్చని సిబల్ వాదించారు. తన సొంత కేసు గురించి ఎవరూ నిర్ణయం తీసుకోలేరని, అందుకే తాను ఈ కేసును అత్యవసరంగా వినాలంటున్నానే తప్ప మధ్యంతర ఊరట కోరడం లేదని అన్నారు. ఇలాంటి పరిస్థితి ఇంతకుముందెన్నడూ ఎదురు కాలేదు కాబట్టి, ఈ కేసును ఎవరు వింటారో కోర్టు వెంటనే చెప్పాలన్నారు. పిటిషన్‌కు నంబరు వేశారా అని జస్టిస్ కౌల్ ప్రశ్నించగా, తాము రిజిస్ట్రీ వద్ద పిటిషన్ దాఖలు చేశాము గానీ, వాళ్లు నంబరింగ్ ఇవ్వలేదన్నారు. ఈ కోర్టులో తాను గత 45 ఏళ్లుగా ప్రాక్టీసు చేస్తున్నానని, ఇలాంటి కేసుల్లో సీజేఐ నుంచి రిజిస్ట్రార్ ఉత్తర్వులు తీసుకోలేరని, అందుకే జస్టిస్ చలమేశ్వర్‌ను కేసు లిస్టింగ్ చేయాల్సిందిగా కోరతున్నానని సిబల్ చెప్పారు. అయితే తాను త్వరలో పదవీ విరమణ చేయబోతున్నానని జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. అయినా, పిటిషన్‌ను ఎప్పుడు వినాలో, ఎవరు వినచ్చో ఉత్తర్వులు జారీచేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు సిబల్ తెలిపారు. నిబంధనల ప్రకారం సీజేఐ ఇలాంటి కేసుల్లో ఏమీ చేయలేరు కాబట్టి సీనియర్ మోస్ట్ న్యాయవాదే చొరవ తీసుకకుని లిస్టింగ్‌పై నిర్ణయించాలని సిబల్‌తో పాటు కేసు వాదించిన ప్రశాంత భూషణ్ అన్నారు.ఎస్సీ, ఎస్టీ తీర్పుపై స్టే కుదరదు

Updated By ManamThu, 05/03/2018 - 22:05
 • ఏజీ విజ్ఞప్తిని తోసిపుచ్చిన ధర్మాసనం.. నేరస్థులను శిక్ష వద్దనడంలేదు

 • తక్షణ అరెస్టును మాత్రమే నిషేధించాం.. ఈ నెల 16కు విచారణ వాయిదా

supreme-courtన్యూఢిల్లీ: ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలుపై మార్చి 20న జారీచేసిన ఉత్తర్వులపై స్టే విధించేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసును విస్తృత ధర్మాసనం విచారించాలన్న అటార్నీ జనరల్(ఏజీ) అభ్యర్థననూ తోసిపుచ్చింది. సుప్రీం గతంలో జారీ చేసిన ఉత్తర్వులపై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే! ఈ పిటిషన్‌పై గురువారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ వర్గాల హక్కుల రక్షణకు కట్టుబడి ఉన్నట్లు సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో జారీచేసిన ఉత్తర్వుల ఉద్దేశం నేరస్థులకు శిక్ష పడకూడ దని కాదని పేర్కొంది.. అట్రాసిటీ కేసుల విచారణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వెన్వెంటనే అరెస్టు చేయడంపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తేల్చిచెప్పింది. కాగా, ఈ కేసులో కేంద్రం తరఫున అటార్నీ జనరల్ వాదనలు వినిపించారు. తమ రివ్యూ పిటిషన్‌ను విస్తృత ధర్మాసనానికి బదలాయించాలని కోరారు. దీనికి సుప్రీం నిరాకరించింది. ఈ అంశంపై తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఈ అంశంపై ఇతరత్రా పిటిషన్లను అంగీకరించబోమని తేల్చిచెప్పింది. తదుపరి వాయిదాలో మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇతర పిటిషన్లపైన విచారణ జరపనున్నట్లు తెలిపింది.

గతంలో ఏం జరిగింది?
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదుల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని తక్షణం అరెస్టు చేయడాన్ని నిషేధిస్తూ మార్చి 20న సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. దళిత సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు భారత్ బంద్ సహా పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. ఇక విపక్షాలతో పాటు స్వపక్షంలోని దళిత ప్రజాప్రతినిధుల నుంచి వ్యతిరేకత ఎదురుకావడంతో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 3న సుప్రీం ఉత్తర్వులపై రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది.పిల్లలపై రేప్ కేసులు వేగవంతం

Updated By ManamWed, 05/02/2018 - 03:00
 • అనవసరంగా వాయిదాలు వద్దు.. హైకోర్టులకు సుప్రీం మార్గదర్శకాలు

supreme-courtన్యూఢిల్లీ: చిన్నారులపై లైంగిక వేధింపులు, అత్యాచారాలకు సంబంధించిన కేసుల్లో విచారణ వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలని దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులకు మంగళవారం సుప్రీం ధర్మాసనం మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే పిల్లలకు లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించే చట్టం (పోస్కో) కింద నమోదయ్యే ఈ తరహా కేసుల విచారణ సమయంలో ట్రయల్ కోర్టులు అనవసరంగా వాయిదాలు వేయకుండా చూడాలని హైకోర్టులకు సూచించింది. జనవరి 28న ఢిల్లీలో ఎనిమిది నెలల పసికందుపై మేనమామ వరసయ్యే 28ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటనను ప్రస్తావిస్తూ అలోక్ శ్రీవాస్తవ అనే న్యాయవాది సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇటువంటి కేసుల్లో ఆరు నెలల్లో విచారణ పూర్తి చేసి నేరస్థులకు ఉరి శిక్ష విధించాలని కోరారు. ఈ మేరకు నిర్ధిష్ట మార్గదర్శకాలను జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని డివిజన్ బెంచ్ హైకోర్టులకు పైవిధంగా సూచనలు చేసింది. అవసరమైతే ఆయా కేసుల్లో ట్రయల్ కోర్టు విచారణను పర్యవేక్షించేందుకు హైకోర్టు ముగ్గురు న్యాయమూర్తులతో కమిటీని కూడా ఏర్పాటు చేయవచ్చని సుప్రీం సూచించింది.మళ్లీ పంపుతాం

Updated By ManamSun, 04/29/2018 - 23:24
 • కేంద్రానికి మరోసారి జస్టిస్ జోసెఫ్ పేరు.. తగిన వివరాలతో పంపనున్న కొలీజియం

 • కేంద్రం.. సుప్రీంకోర్టు మధ్య మరింత పోరు.. అసలైన వాస్తవాలేంటో మేం వివరిస్తాం

 • సుప్రీం జడ్జి జస్టిస్ కురియన్ జోసెఫ్ వ్యాఖ్యలు.. సీనియారిటీ ఒక్కటే ప్రాతిపదిక కాదని వెల్లడి

supreme-courtత్రిసూర్: కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు మధ్య వివాదం మరింత ముదిరే లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు అంశాలలో రెండు ప్రధాన వ్యవస్థల మధ్య పరిస్థితి ఉప్పు.. నిప్పు అన్నట్లుంది. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టులోని సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కొలీజియం చేసిన సిఫార్సును మరోసారి పరిశీలించాలంటూ కేంద్రం తిప్పి పంపి.. రెండు వ్యవస్థల మధ్య నిప్పు మరింతగా రాజేసింది. అయితే, సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నియమించాలంటే కేవలం సీనియారిటీ ఒక్కటే కాదని.. ఇంకా చాలా అంశాలుంటాయని సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ అన్నారు. దాంతో కేఎం జోసెఫ్ పేరును మరోసారి కేంద్రానికి పంపేందుకే సుప్రీం కొలీజియం నిర్ణయించినట్లు దాదాపు స్పష్టం అవుతోంది. ఇది ఏదో ప్రాంతీ య సమస్య కాదని, ఇందులో చాలా అంశాలను వివరించాల్సి ఉందని జస్టిస్ కురియన్ జోసెఫ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరిస్తూ త్వరలోనే కొలీజియం స్పందిస్తుం దని ఆయన చెప్పారు. ప్రాంతీయ సమతౌల్యం, సీనియారిటీ, సుప్రీంకోర్టులో ఎస్సీ, ఎస్టీ న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం లాంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అయితే, బుధవారం నాడు మరోసారి సమావే శం కానున్న సుప్రీంకోర్టు కొలీజియం.. జస్టిస్ కేఎం జోసెఫ్ విషయంలో ఉన్న వాస్తవాలను చర్చించనుంది. ప్రభుత్వం నిజాలు అనుకుంటున్నవన్నీ నిజాలు కావని, అసలైన నిజాలు ఏంటో తాము చెబుతామని జస్టిస్ కురియన్ జోసెఫ్ అన్నారు. కొలీజియం సమావేశంలో తీసుకునే నిర్ణయం సానుకూలంగానే ఉంటుందని ఆయన భావిస్తున్నారు. తాము ఇంతకుముందు తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న వాస్తవాలు, కారణా లు అన్నింటినీ ప్రభుత్వానికి వివరిస్తామని, అప్పుడు ప్రభుత్వానికి కూడా వాస్తవాలేంటో అర్థమవుతుందని.. అప్పుడు వాళ్లు కూడా తమ అభిప్రాయం మార్చుకునే అవకాశం ఉందని జస్టిస్ కురియన్ జోసెఫ్ తెలిపారు.మీ తీర్పుతో తీవ్ర నష్టం

Updated By ManamThu, 04/12/2018 - 22:42
 • ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగారుస్తోంది.. వెంటనే దాన్ని సరిచేసుకుంటే మేలు

 • ఇది అత్యంత సున్నితమైన విషయం.. తీర్పుతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు

 • సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

supreme-courtన్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు.. ఆ చట్టంలోని అంశాలను నీరుగార్చేలా ఉందని, దానివల్ల దేశానికి తీవ్ర నష్టం వాటిల్లిందని కేంద్రం చెప్పింది. వెంటనే దాన్ని సరిచేసుకోడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అత్యంత సున్నితమైన విషయంలో సుప్రీంకోర్టు కలగజేసుకోవడం వల్ల దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయని, సామాజిక ఐకమత్యం దారుణంగా దెబ్బతిందని తెలిపింది. ఆ తీర్పును సమీక్షించడం, తాను జారీచేసిన ఆదేశాలను రీకాల్ చేసుకోవడం ద్వారా తీర్పు వల్ల కలిగిన గందరగోళాన్ని సరిచేయాలని కూడా కోరింది. ఈ మేరకు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు లిఖితపూర్వకంగా ఓ అభ్యర్థన పంపారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలో ఉన్న లోపాలను సవరించలేదు గానీ, న్యాయచట్టం ద్వారా దాన్ని సవరించిందని అన్నారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలకు ఉన్న అధికారాల విభజన చాలా స్పష్టంగా ఉందని, వాటిని ఉల్లంఘించడం సరికాదని కూడా ఆయన నొక్కిచెప్పారు. మనమంతా ఒక లిఖిత రాజ్యాంగ పరిధిలోనే నివసిస్తున్నామని, అందులో స్పష్టంగా మూడు వ్యవస్థల మధ్య అధికార విభజన ఉందని గుర్తుచేశారు. ఈనెల రెండో తేదీన ఎస్సీ, ఎస్టీ సంగాలు భారత్‌బంద్‌కు పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో తీవ్రస్థాయిలో ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే వేణుగోపాల్ ఈ లేఖ రాశారు. అయితే కోర్టు మాత్రం ఇంతకుముందే అసలు చట్టంలోని ఏ అంశాన్ని పలుచన చేయలేదని, నిర్దోషుల ప్రాథమిక హక్కులను కాపాడేందుకు అదనపు రక్షణలను మాత్రమే తాము కల్పించామని చెప్పింది. మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న అదనపు సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా కేంద్రం దాఖలుచేసిన రివ్యూ పిటిషన్‌పై ఒక నిర్ణయం తీసుకునేవరకు సుప్రీంకోర్టు తన ఉత్తర్వులను అబెయున్స్‌లోపెట్టాలని కోరారు. వేణుగోపాల్ అభ్యర్థనతో పాటు దీన్ని కూడా సుప్రీంకోర్టు ఆమోదించలేదు. ఈ చట్టం నుంచి రక్షణ పొందేందుకు ఇతర చట్టాల్లో ఉన్నట్లుగా ఇందులో ఏమీ లేదని.. అందుకే తమ తీర్పులో ముందస్తు బెయిల్‌కు అవకాశం కల్పించామని కోర్టు తెలిపింది. అయితే, చట్టాలు చేయాల్సింది పార్లమెంటు అని.. వేధింపుల బారి నుంచి ఎస్సీ, ఎస్టీలకు రక్షణ ఉండాల్సిందేనని పార్లమెంటు భావిస్తోందని ఏజీ వేణుగోపాల్ అన్నారు. నిజమైన కేసులలో నిందితులను నిర్దోషులుగా వదిలేయాలని తాము ఎన్నడూ సూచించలేదని కోర్టు స్పష్టం చేసింది. కాగా ఈ కేసులో అమికస్ క్యూరీగా నియుమితులైన సీనియర్ న్యాయవాది అమరేంద్ర శరణ్ కూడా కేంద్రం దాఖలుచేసిన రివ్యూ పిటిషన్‌ను వ్యతిరేకించారు. ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన పార్లమెంటరీ కమిటీ నివేదికలోని సమాచారం ఆధారంగానే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన తెలిపారు. ఒకే చోట పోటీకే మా మద్దతు

Updated By ManamWed, 04/04/2018 - 22:37
 • రెండు స్థానాల్లో పోటీ అనవసరం

 • ఒక స్థానాన్ని వదులుకోవడం అన్యాయం.. సుప్రీంకు ఈసీ స్పష్టం

supreme-courtన్యూఢిల్లీ: ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఒకే సీటు నుంచి పోటీ చేయాలన్న ప్రతిపాదనకు మద్దతు తెలుపుతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. ఎన్నికల్లో ఒకే అభ్యర్థి రెండు చోట్ల పోటీ చేయాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. ఒక అభ్యర్థి ఒకే చోట పోటీ చేసేలా నిబంధన చేయాల్సిన అవసరం ఉందని ఈసీ పేర్కొంది. అంతేకాదు, రెండు చోట పోటీ చేసి గెలిచిన అభ్యర్థులు ఒక స్థానాన్ని వదులుకునే సమయంలో ఆ స్థానానికి జరిగే ఉప ఎన్నికల ఖర్చును ఆ వ్యక్తే భరించాలని కూడా అభిప్రాయపడింది. ఇలా పోటీ చేయడం వల్ల ప్రజాధనం వృథా అవుతోందని ఈసీ తెలిపింది. అంతేకాకుండా, గెలిచిన అభ్యర్థి ఒక స్థానాన్ని ఖాళీ చేసి మరొక స్థానానికి వెళ్లడం కూడా అక్కడి ఓటర్లకు అన్యాయం చేయడమేనని అభిప్రాయపడింది. సుప్రీం కోర్టు న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందిస్తూ సుప్రీం కోర్టుకు ఈసీ అఫిడవిట్ సమర్పించింది. 2004, 2016 సంవత్సరాల్లోనే రెండు సార్లు కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశంపై ప్రతిపాదనలు పంపినట్లు ఈసీ అఫిడవిట్‌లో పేర్కొంది. ఇదిలా ఉంటే, సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకే అభ్యర్థి రెండు స్థానాల్లో గెలుపొంది.. ఒక స్థానానికే పరిమితమవడం, మరో స్థానానికి రాజీనామా చేస్తుండటంతో ఉప ఎన్నిక అనివార్యమవుతోందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి దీపక్ మిశ్రా వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టమైన వైఖరిని ప్రకటిస్తూ వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. మన దేశంలో అభ్యర్థులు రెండు స్థానాల్లో పోటీ చేసేందుకు ప్రజా ప్రాతినిథ్య చట్టంలో సెక్షన్33(7) వెసులుబాటు కల్పించింది. ఈ నిబంధనను సవాల్ చేస్తూ అశ్వని ఉపాధ్యాయ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉంటే, భారతదేశంలో రెండు స్థానాల నుంచి పోటీ చేసిన ప్రముఖులు చాలామందే ఉన్నారు. 2014 ఎన్నికల్లో మోదీ కూడా రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేశారు. గుజరాత్‌లోని వడోదర, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి పోటీ చేసి రెండు స్థానాల్లో విజయం సాధించారు. అయితే అనంతరం వడోదరాను వదులుకోవడంతో మూడు నెలలకే అక్కడ ఉప ఎన్నికలొచ్చాయి. సాధారణంగా పార్టీలను ముందుండి నడిపించే వ్యక్తులు ఇలా రెండు చోట్ల పోటీ చేస్తుంటారు. ఒక చోట ఓడిన మరొక చోట పరువు దక్కుతుందనే ఉద్దేశంతో ఎన్నికల బరిలో నిలుస్తుంటారు.

Related News