india

మూడో వన్డే: టాస్ గెలిచి ఇంగ్లాండ్ ఫీల్డింగ్

Updated By ManamTue, 07/17/2018 - 17:23

Ireland England, 3rd ODI, India, Team India, Shikar Dhawanలీడ్స్‌: మూడు మ్యాచ్‌ల వన్డేలో భాగంగా ఇంగ్లాండ్‌తో నిర్ణయాత్మక చివరి వన్డే మంగళవారం లీడ్స్‌ వేదికగా జరుగుతోంది. ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్‌ మోర్గాన్‌ టాస్ గెలిచి కోహ్లీసేనను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. భారత్ ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ బరిలోకి దిగగా, కేఎల్‌ రాహుల్‌ స్థానంలో దినేశ్‌ కార్తీక్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. సిద్ధార్థ్‌ కౌల్‌, ఉమేశ్‌ యాదవ్‌ స్థానాల్లో శార్దూల్‌ ఠాకూర్‌, భువనేశ్వర్‌ కుమార్‌ జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఇక ఇంగ్లాండ్‌ జట్టులో గాయపడ్డ జేసన్‌ రాయ్‌ స్థానంలో జేమ్స్‌ విన్స్‌ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇప్పటికే తలో వన్డే మ్యాచ్ గెలిచిన ఇరుజట్లు సిరీస్‌ను దక్కించుకునేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. టాస్ గెలిచి ఇంగ్లాండ్ బ్యాటింగ్

Updated By ManamSat, 07/14/2018 - 15:28

2nd ODI, India, Ireland and England, Londonలండన్: మూడు మ్యాచ్‌ల వన్డేలో భాగంగా టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య శనివారం ఇక్కడ రెండో వన్డే మ్యాచ్‌ జరుగనుంది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లాండ్ జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతుండగా, భారత్ జట్టులో కూడా ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ‘‘పిచ్ కాస్త క్షిష్టముగా మారవచ్చు. కానీ, మంచి స్కోరును రాబట్టేందుకు పిచ్ అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నాం. మణికట్టుతో మాయ చేసే కుల్‌దీప్‌ స్పిన్‌ను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తాం. గత మ్యాచ్‌ల్లో బౌలింగ్‌లో రాణించాం. అదే తరహాలో బౌలర్లు రాణిస్తారని ఆశిస్తున్నాం’’ అని ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ చెప్పాడు.

భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ‘‘ఛేదించే అవకాశాన్ని సద్వినియోగపర్చుకుంటాం. టాస్ కూడా మాకు అవసరం లేదు (నవ్వుతూ). కుల్‌దీప్, చాహల్ అద్భుతంగా రాణిస్తున్నారు. పేసర్లు కూడా మ్యాచ్‌లో రాణిస్తారని ఆశిస్తున్నా’’ అని చెప్పాడు. కాగా, తొలి వన్డేలో విజయం సాధించిన కోహ్లీసేన రెండో వన్డేలో కూడా విజయం కోసం ఉవ్విళ్లూరుతోంది. ఇంగ్లాండ్ తొలివన్డేలో ఓటమికి బదులు తీర్చుకునేందుకు వ్యూహాలను రచిస్తోంది. రెండోవన్డేలో తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ జట్టులో జాసన్ రాయ్, బెయిర్‌స్టో ఓపెనర్లుగా బరిలోకి దిగారు. భారత బౌలర్ ఉమేశ్ యాదవ్ తొలి ఓవర్ అందుకున్నాడు.  వచ్చే ఏడాది రిపబ్లిక్ డే అతిథిగా ట్రంప్

Updated By ManamFri, 07/13/2018 - 11:53

Trump రానున్న ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆహ్వానించినట్లు సమాచారం. దీనికి సంబంధించి భారత ప్రభుత్వం ఏప్రిల్‌లోనే ట్రంప్‌కు ఆహ్వానం పంపిందని, దానికి ట్రంప్ యంత్రాంగం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే రిపబ్లిక్ డే వేడుకలకు హాజరైన రెండో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవుతారు. కాగా 2015లో అప్పటి అధ్యక్షుడు ఒబామా రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న విషయం విదితమే. అయితే ఇతర దేశాల ఉత్పత్తుల దిగుమతులు పెంచుతూ వాణిజ్య యుద్ధానికి తెర లేపడంతో పాటు.. ఇరాన్‌ను నుంచి చమురు దిగుమతిని ఆపేయాలని భారత్‌ను అమెరికా హెచ్చరిస్తున్న సమయంలో ఇప్పుడు ఆ దేశ అధ్యక్షుడిని గణతంత్ర వేడుకలకు ఆహ్వానించడం విశేషం.టాస్ గెలిచి టీమిండియా బౌలింగ్

Updated By ManamThu, 07/12/2018 - 17:10
 • నాటింగ్‌హమ్ వేదికగా ఇంగ్లాండ్‌తో తొలి వన్డే 

1st ODI, India, tour of Ireland, England, Nottinghamనాటింగ్‌హమ్: మూడు మ్యూచ్‌ల వన్డేల సిరీస్‌లో భాగంగా నాటింగమ్‌ వేదికగా గురువారం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ‘‘ఇంగ్లాండ్ బ్యాటింగ్‌పై మాకు ఎలాంటి ఆందోళన లేదు. మేం పటిష్టంగా ఉన్నాం. తొలుత బౌలింగ్ చేస్తాం. మునపటి వ్యూహాలనే కొనసాగించాలనుకుంటున్నాం’’ అని కోహ్లీ పేర్కొన్నాడు.

ఇంగ్లాండ్ పర్యటనలో ఇప్పటికే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1తో సిరీస్‌ను కోహ్లీసేన కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అదే విజయోత్సాహంతో దూకుడు మీదున్న టీమిండియా మూడు వన్డేల సిరీస్‌ను కూడా దక్కించుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు సొంతగడ్డపై వన్డేలకు తిరుగులేని జట్టుగా ఇంగ్లాండ్‌ టీ20సిరీస్‌ను కోల్పోయినప్పటికీ వన్డేల్లో రాణించి తమ సత్తాను చాటేందుకు తహతహలాడుతోంది.బ్రిటన్ ఎంపీని వెనక్కి పంపిన భారత్‌

Updated By ManamThu, 07/12/2018 - 13:11
british mp lord alexander carlile

న్యూఢిల్లీ: భారత్‌లో బ్రిటన్ ఎంపీకి చేదు అనుభవం ఎదురైంది. సరైన వీసా పత్రాలు లేనందున  బ్రిటీష్‌ పార్లమెంటేరియన్‌ లార్డ్‌ అలెగ్జాండర్‌ కార్లిలేను ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ఆయనను వెనక్కి పంపించివేశారు. కాగా కార్లిలే...బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియాకు న్యాయ సలహాదారుగా కూడా ఉన్నారు.

అయితే కార్లిలే ప్రస్తుత పర్యటన... ఆయన వీసాలో పొందుపరిచిన వివరాలు సరిపోలనందున భారత్‌లోకి అనుమతించలేదని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌  వెల్లడించారు. కానీ వీసాలో పర్యటన ఉద్దేశాన్ని​ కార్లిలే వేరేగా పేర్కొనడంతో ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.ఇండియాకు ఆరో ర్యాంక్

Updated By ManamThu, 07/12/2018 - 07:05
 • ఆరో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ మనదే

 • 2.597 ట్రిలియన్ డాలర్లుగా జీడీపీ.. ఏడో స్థానానికి పడిపోయిన ఫ్రాన్సు

 • మొట్ట మొదటి స్థానంలో అవెురికా.. జీడీపీ వృద్ధి 7.4 శాతమన్న ఐఎంఎఫ్

 • మరింత పెరుగుతుందని ఆశాభావం.. అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు

india-eco-graప్యారిస్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ మరో మెట్టు పైకి ఎదిగింది. ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచి.. ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న ఫ్రాన్సును ఏడో స్థానంలోకి నెట్టేసింది. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 2017 సంవత్సరం ఆఖరుకు 2.597 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఫ్రాన్సు మాత్రం 2.582 ట్రిలియన్ డాలర్ల వద్దే ఆగిపోయింది. దాంతో ఫ్రాన్సును తోసిరాజని భారత్ ఆరో స్థానానికి ఎదిగింది. మొట్టమొదటి స్థానంలో అవెురికా ఉండగా, ఆ తర్వాత వరుసగా చైనా, జపాన్, జర్మనీ, బ్రిటన్ ఉన్నాయి. 2017 సంవత్సరానికి సంబంధించిన ఈ వివరాలను ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. అంతకుముందు బాగా వెనకబాటులో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ.. 2017 జూలై తర్వాతి నుంచి వరుసగా బలపడటం మొదలైంది. భారత దేశంలో 134 కోట్ల జనాభా ఉండగా.. ఫ్రాన్సులో మాత్రం 6.7 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. దీనివల్ల భారతదేశంలో తలసరి ఆదాయం ఫ్రాన్సు కంటే చాలా తక్కువ అవుతుంది. మన దేశంలో ఒక్కో వ్యక్తికి ఏడాదికి ఉండే తలసరి ఆదాయం కంటే ఫ్రాన్సు వాళ్లది దాదాపు 20 రెట్లు ఎక్కువ అవుతుందని ప్రపంచబ్యాంకు చెప్పింది. గత సంవత్సరం వరకు పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలు కారణంగా ఆర్థిక వ్యవస్థలో కొంత మందగమనం కనిపించినా, ఆ తర్వాత ఉత్పాదక రంగం, వినియోగదారుల వ్యయం ఎక్కువగా వృద్ధి చెందడంతో ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంది. గత దశాబ్ద కాలంలోనే భారత జీడీపీ రెట్టింపు అయ్యింది. ఈ ఏడాది దేశంలో జీడీపీ వృద్ధిరేటు 7.4 శాతం వరకు ఉంటుందని, 2019లో అది 7.8 శాతం అవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. అదే అంతర్జాతీయ సగటు మాత్రం కేవలం 3.9 శాతం ఉండటం గమనార్హం. ఈ సంవత్సరం ఆఖరుకల్లా బ్రిటన్, ఫ్రాన్సు రెండు ఆర్థిక వ్యవస్థలనూ భారత్ దాటిపోతుందని లండన్‌కు చెందిన సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. 2032 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ అవతరిస్తుందని కూడా తెలిపింది. ప్రస్తుతం.. అంటే 2017 చివరినాటికి బ్రిటన్ 2.622 ట్రిలియన్ డాలర్లతో ప్రంపచంలో ఐదో స్థానంలో ఉంది. నేటి నుంచి ఇంగ్లాండ్‌తో వన్డే సమరం

Updated By ManamThu, 07/12/2018 - 00:30
 • నాటింగ్‌హామ్‌లో ఇవాళ తొలి మ్యాచ్

 • నాలుగోస్థానంలో బ్యాటింగ్‌కు కోహ్లీ!

 • సాయంత్రం 5 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్-3లలో ప్రత్యక్ష ప్రసారం

imageనాటింగ్‌హామ్: టీ20 సిరీస్ గెలుచుకున్న ఉత్సాహంతో ఉన్న టీమిండియా గురువారం నుంచి ఇంగ్లాండ్‌తో  ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌లోనూ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఇంగ్లాండ్‌పై మరో సారి ఆధిపత్యం ప్రదర్శించి వచ్చే ఏడాది ఇదే సమయంలో జరిగే వన్డే ప్రపంచ కప్‌కు రిహార్సల్‌లా ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలని ఉత్సాహంతో ఉంది.   టీ-20ల్లో ఇంగ్లాండ్‌ను 2-1 తేడాతో ఓడించి భారత్ ఈ సిరీస్‌కు సిద్ధమైతే.. ఆస్ట్రేలియాను  6-0 తేడాతో వన్డేల్లో చిత్తు చేసిన ఇయార్ మోర్గాన్ సేన కోహ్లీ సేనతో వన్డే పోరుకు సై అంటోంది.  అద్భుతమైన ఆటతో వన్డేల్లో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్న ఇంగ్లాండ్ సేన దూకుడుకు బ్రేకులేయటం ఇండియాకు అంత సులువు కాకపోవచ్చు. బట్లర్, జాసన్ రాయ్, అలెక్స్ హేల్స్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్‌లకు తోడు బెన్‌స్టోక్‌లతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. 2015 నుంచి ఇప్పటి వరకూ ఆడిన 69 వన్డేల్లో 46 మ్యాచ్‌లు గెలిచిన ఇంగ్లాండ్ భారత్‌కు సవాల్ విసురుతోంది.

వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సిరీస్‌లో పలు ప్రయోగాలు చేసేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఓపెనర్ కె.ఎల్.రాహుల్ భీకరమైన ఫామ్‌లో ఉండటంతో కెప్టెన్ కోహ్లీని నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలని టీమ్ మేనేజ్‌మెంట్ యోచిస్తోంది.  టాపార్డర్‌లో రాహుల్, ధావన్, రోహిత్‌శర్మలు బ్యాటింగ్ భారం మోస్తుండగా... సురేశ్‌రైనా, ధోనీతో పాటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మిడిలార్డర్‌లో ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొనేందుకు రెడీ అయ్యారు. చాహల్, కుల్దీప్ యాదవ్‌లు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌కు భారత్ స్పిన్ పవరేమిటో చూపెట్టబోతున్నారు.వెన్నెముక గాయం తో ఉన్న భువనేశ్వర్ కుమార్ కోలుకుంటే ఉమేశ్‌యాదవ్‌తో కలసి కొత్త బంతిని పంచుకునే అవకాశముంది.ఐఏఎస్ అధికారిపై కేంద్రం కన్నెర్ర

Updated By ManamWed, 07/11/2018 - 14:59
 • ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు

 • ఐఏఎస్ అధికారికి షోకాజ్ నోటీసులు

shah faesal

న్యూఢిల్లీ: సివిల్స్‌లో టాపర్‌గా నిలిచి యువతకు ఆదర్శప్రాయంగా మారిన వ్యక్తి.. సామాజిక మాధ్యమాల్లో దేశాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయడంపై కేంద్రం కన్నెర్ర చేసింది. సదరు బ్యూరోక్రాట్‌పై చర్యలు తీసుకోవాలంటూ మానవ వనరుల శాఖను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మానవ వనరుల శాఖ ఆ అధికారికి షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఆ యువ అధికారి దానిని ప్రజల్లోకి తీసుకెళ్లి చర్చకు పెట్టడంతో వివాదం మరింతగా పెరిగింది. 

అసలేం జరిగిందంటే.. జమ్ము కశ్మీర్‌కు చెందిన షా ఫజల్ అనే యువకుడు 2009లో జరిగిన సివిల్స్ పరీక్షలలో టాపర్‌గా నిలిచాడు. జమ్ము కశ్మీర్ రాష్ట్రం నుంచి సివిల్స్ టాపర్‌గా నిలిచిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. దీంతో మీడియా అతడిని ఆకాశానికెత్తేసింది. స్థానిక యువతకు ఆదర్శప్రాయుడంటూ కొనియాడింది. జమ్ము యువత కూడా అతడినే ఆదర్శంగా తీసుకున్నారు. 

అయితే, శిక్షణ అనంతరం బాధ్యతలు స్వీకరించిన ఫజల్.. కొంతకాలానికి ఉన్నత చదువుల కోసం సెలవు  పెట్టి విదేశాలకు వెళ్లాడు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా దారుణంపై ఫజల్ సోషల్ మీడియాలో ఓ వివాదాస్పద పోస్ట్ చేశాడు. అవినీతి, అశ్లీలం, అరాచకత్వం, జనాభా, మద్యం, నిరక్షరాస్యత, సాంకేతికత కలగలిసి రేపిస్థాన్ అంటూ పోస్ట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

విషయం కేంద్ర ప్రభుత్వం దాకా వెళ్లడంతో శాఖాపరమైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగాలలో ఉంటూ ప్రభుత్వాన్ని విమర్శించడం నేరమంటూ 2016లో గవర్నమెంట్ ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన నేరానికి  చర్యలు ఎందుకు తీసుకోవద్దో చెప్పాలంటూ మానవ వనరుల శాఖ ఫజల్‌కు షోకాజ్ నోటీసులు జారీచేసింది.

ఈ నోటీసులను ఫజల్ తిరిగి ట్విట్టర్‌లో పెట్టడంతో నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న నీకు ప్రభుత్వ ఉద్యోగం ఎందుకంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ముందు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ తర్వాత మాట్లాడమంటూ మరికొందరు మండిపడ్డారు.భారత్ చేతికి ‘మట్టల ఎయిర్‌పోర్ట్’?

Updated By ManamMon, 07/09/2018 - 16:51
 • చర్చలు జరుపుతున్నాం.. శ్రీలంక ప్రధాని

Sri Lanka, India, Buy Into Airport, Without Planes, China Refusedకొలంబో: మట్టల రాజపక్స అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అమ్మేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే పార్లమెంట్‌లో పేర్కొన్నారు. విమానాల రాకపోకలు లేక ఈ ఎయిర్‌పోర్టు ‘తెల్ల ఏనుగు’లా మారిందని, నిర్వహణ వ్యయం పెరిగి నష్టాల్లో ఉందని తెలిపారు. 2011 నుంచి ఈ ప్రాజెక్టు వల్ల శ్రీలంక ప్రభుత్వానికి 300 మిలియన్ డాలర్ల నష్టం వచ్చిందని చెప్పారు. పైసా ఆదాయంలేకున్నా విదేశాల సహకారంతో గత ప్రభుత్వం ఇలాంటి భారీ ప్రాజెక్టులను నిర్మించి ప్రభుత్వాన్ని అప్పుల పాలుచేసిందని ప్రధాని ఆరోపించారు. ఆదాయంలో పెద్ద మొత్తం వడ్డీలకే సరిపోతోందని వివరించారు. ఈ నేపథ్యంలో గుదిబండలా మారిన ఇలాంటి ప్రాజెక్టుల నిర్వహణలో భారత్ వంటి దేశాల భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.

తొలుత దీనిని చైనాకే అమ్మజూపినా.. డ్రాగన్ కంట్రీ పెద్దగా ఆసక్తి ప్రదర్శించకపోవడంతో భారత్‌తో చర్చలు జరుపుతున్నట్లు వివరించారు. దీనివల్ల ఎయిర్‌పోర్ట్ నిర్వహణ బాధ్యతల నుంచి, తద్వారా ఎదురవుతున్న నష్టాల నుంచి ప్రభుత్వానికి విముక్తి లభిస్తుందని విక్రమసింఘే వివరించారు. ఎయిర్‌పోర్ట్ నిర్వహణలో భాగస్వామ్యానికి సంబంధించి భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని ప్రధాని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టులో 70 శాతం షేర్లను భారత్‌కు అమ్మేయాలని నిర్ణయించి.. ఆ దిశగా చర్చలు జరుపుతున్నామని సింఘే వివరించారు. శ్రీలంక ప్రభుత్వం గతంలోనూ ఓ ఓడరేవును చైనాకు అప్పగించింది. కాగా, దాయాది దేశంలో చైనా ప్రాబల్యం పెంచుకోవడంపై భారత్‌లో ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా, జపాన్ దేశాలు కూడా ఈ వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.భారత్ వచ్చే ఆలోచన లేదు

Updated By ManamWed, 07/04/2018 - 17:30
 • నిష్పక్షపాతంగా వ్యవహరిస్తేనే వస్తా

 • ఆ నమ్మకం నాకు కలగాలి: జకీర్ నాయక్

ముంబై : భారత ప్రభుత్వం తన విషయంలో న్యాయంగా వ్యవహరిస్తుందనే నమ్మకం కుదిరినప్పుడే అక్కడ అడుగుపెడతానంటూ వివాదాస్పద ముస్లిం మతప్రబోధకుడు జకీర్ నాయక్ స్పష్టం చేశాడు. తనపై నమోదైన వివిధ కేసులలో విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందనే నమ్మకం ప్రస్తుతం లేదన్నాడు. ఇటీవల సామాజిక మాధ్యమాలలో తాను ఇండియా వెళతానంటూ వస్తున్న వార్తలు అబద్ధమని, నిరాధారమైనవని జకీర్ తేల్చిచెప్పాడు. ఇండియా వెళ్లాలన్న ఆలోచన తనకేమాత్రం లేదని వివరించాడు. 

Zakir Naik

ఈమేరకు జకీర్ నాయక్ పీఆర్‌వో బుధవారం ఓ ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. విద్వేషపూరిత ప్రసంగాలతో పాటు మనీలాండరింగ్‌కు సంబంధించి జకీర్‌పై పలు కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి ఆయనపై అరెస్టు వారెంట్ కూడా జారీ అయ్యింది. అయితే, అరెస్టు నుంచి తప్పించుకునేందుకు జకీర్ విదేశాలకు పారిపోయాడు. ప్రస్తుతం మలేషియాలో తలదాచుకుంటున్న జకీర్‌ను స్వదేశానికి డిపోర్ట్ చేసుకునే ప్రయత్నాలలో భారత ప్రభుత్వం నిమగ్నమైందని వార్తలు వెలువడుతున్నాయి. 

ఈ నేపథ్యంలోనే జకీర్ పీఆర్‌వో నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం! కాగా, వివాదాస్పద మతగురువుగా పేరొందిన జకీర్ నాయక్ దేశంలో మత సామరస్యతను దెబ్బతీసేలా, ఓ వర్గం యువతను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పట్లో దీనిపై ఓ కేసు కూడా నమోదైంది. 

ఆయన నడిపిస్తున్న స్వచ్చంద సంస్థ విరాళాలు సేకరిస్తూ అనైతిక కార్యకలాపాలకు, సమాజంలో ఆందోళనలు రేకెత్తించేందుకు వినియోగిస్తోందనే ఆరోపణలు వినిపించాయి. దీంతో ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న స్వచ్చంద సంస్థపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. విదేశాల నుంచి ఎలాంటి విరాళాలు స్వీకరించొద్దని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి జకీర్‌ను విచారించేందుకు అవకాశం కల్పిస్తూ ఆయనపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ విషయాన్ని గ్రహించి జకీర్ విదేశాలకు పారిపోయాడు.

Related News