ప్రపంచ మాజీ చాంపియన్ ఎల్. సరితా దేవి సెలెసియన్ ఓపెన్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది. 60 కిలోల కేటగిరిలో ఆమె 0-5తో కజకిస్థాన్‌కు చెందిన కరినా ఇబ్రగిమోవా చేతిలో ఓటమిపాలైంది
భారత క్రికెట్ ప్రస్తుతం అసౌకర్యంగా ఉంది. ఇంగ్లాండ్ చేతిలో 4-1తో టెస్టు సి రీస్ ఓటమి మరక టీమిండియాను ఇప్ప ట్లో వదిలేలా లేదు. అయినప్పటికీ ఎడతెరి పిలేని షెడ్యూల్ కారణంగా అధికారులు ఓవర్‌టైమ్ వర్క్ చేయక తప్పడం లేదు.
ఆసియా కప్ తొలి మ్యాచ్ లో టీమిండియా తొలి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది. అయితే పాకిస్థాన్ జట్టు మాజీ కెప్టెన్, హైదరాబాద్ అల్లుడు షోయబ్ మాలిక్ టీమిండియా ప్రాక్టీస్ సెషన్ దగ్గరి కి వచ్చి మాజీ కెప్టెన్...
ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 49.3 ఓవర్లలో 261 పరుగులు చేసి ఆలౌటైంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టులో రహీమ్ శతకంతో, మిథున్ హాఫ్ సెంచరీతో రాణించారు
అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య(ఐఎస్‌ఎస్‌ఎఫ్)లో భారత షూటర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. 11 స్వర్ణ పతకాలతో పాయింట్ల పట్టికలో భారత్ జట్టు మూడో స్థానంలో నిలిచింది.
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు కోసం మరిన్ని వార్మప్ మ్యాచ్‌లను ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వెల్లడించింది.
ఈ ఏడాది ఆరంభంలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ తర్వాత నిరుత్పాహంతో ఉన్న తనకు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాటలు స్ఫూర్తి నిచ్చాయని.. తిరిగి జాతీయ జట్టులో చోటు సంపాదించగలిగానని ...
విరాట్ కోహ్లీ లేకపోవడంతో కాస్త కాంతి విహీనంగా మారొచ్చు. కానీ ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే పోరుకు ఎప్పటిలాగే ఉత్కంఠ నెలకొంది. ఆరు దేశాలు పాల్గొనే ఆసియా కప్ క్రికెట్ టోర్నీ శనివారమిక్కడ ప్రారంభం కానుంది.
భారత మహిళల జట్టు ఒత్తిడిని సైతం ధీటుగా ఎదుర్కొని శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో ఏడు పరుగులతో గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల ఐసీసీ చాంపియన్‌షిప్‌లో 2-0 ఆధిక్యంతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
కిదాంబి శ్రీకాంత్ ఓటమిపాలు కావడంతో జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ పోరు ముగిసింది. శుక్రవారమిక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఏడో సీడ్ శ్రీకాంత్ 21-19, 16-21, 18-21తో కొరియాకు చెందిన లీ డాంగ్ కున్ చేతిలో పోరాడి ఓడాడు.


Related News