ఈ ప్రభుత్వానికి సిగ్గులేదు : అసదుద్దీన్ ఒవైసీ

Asaduddin Owaisi attack on Modi govt in lok sabha

లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. విద్యార్థులపై కాల్పులు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోని ఈ ప్రభుత్వానికి సిగ్గులేదని ఒవైసీ మండిపడ్డారు. లోక్ సభలో ఈ రోజు మాట్లాడిన ఆయన వారం రోజుల వ్యవధిలో జామియా వర్సిటీ విద్యార్థులు లక్ష్యంగా మూడు సార్లు కాల్పులు జరిగినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే సంఘ్ పరివార్ శక్తులు ఈ దుర్మార్గానికి ఒడిగట్టాయని.. మేం జామియా విద్యార్థులకు మద్దతుగా నిలుస్తామని ఒవైసీ స్పష్టం చేశారు.