అక్కాచెల్లెళ్ల కాళ్ళు కట్టి.. రోడ్డు పై ఈడ్చుకెళ్లి..!

Two Sister Tied Up, Beaten

తమకు చెందిన భూమిలో తలపెట్టిన రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్న అక్కాచెల్లెళ్లను నడిరోడ్డుపై కొట్టి, ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన శుక్రవారం పశ్చిమ బెంగాల్‌లో జరిగింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. ఈ ఘటన పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  స్మృతి దాస్‌ స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయురాలినిగా పని చేస్తోంది. తన తల్లి, సోదరితో కలిసి ఫటా నగర్‌లో నివాసముంటోంది. గతంలో పంచాయతీ రోడ్డు నిర్మాణం కోసం వీరికి చెందిన భూమిలో కొంత భాగాన్ని అప్పగించారు. అయితే గ్రామ పంచాయతీ మరోసారి రోడ్డు వెడల్పు చేయాలని భావించగా వారు దీనికి ఒప్పుకోలేదు. దీనివల్ల తమ భూమిలో ఎక్కువ మొత్తాన్ని కోల్పోతామని దీనికి వారు ససేమిరా అన్నారు. అయితే ఇదేదీ పట్టని పంచాయతీ పెద్దలు  రోడ్డు నిర్మాణం తలపెట్టారు. దీన్ని అడ్డుకుని నిరసన తెలిపిన ఇద్దరు యువతులపై తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పంచాయతీ నాయకుడు తన అనుచరులతో దాడికి తెగబడ్డాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో టీఎంసీ అధిష్టానం నిందితుడుని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.