శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలకు హాజరైన ఏపీ సీఎం

Asaduddin Owaisi attack on Modi govt in lok sabha

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలకు హాజరయ్యారు. విశాఖ శారదా పీఠం వార్షికోత్సవం ముగింపు కార్యక్రమాన్ని పురస్కరించుకొని సోమవారం నాడు వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం శారద పీఠం చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌కు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.

దాదాపు రెండు గంటల పాటు వార్షిక మహోత్సవ ముగింపు కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొంటారు. పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రలతో కలిసి శారదా పీఠం ప్రాంగణంలోని రాజశ్యామల అమ్మవారికి ముఖ్యమంత్రి పూజలు చేశారు. విశ్వశాంతి యాగంలో జగన్ పాల్గొన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ కార్యాక్రమంలో పాల్గొన్నారు.