జామియా వర్సిటీ దగ్గర మరోసారి కాల్పులు..

Another firing reported at Jamia University

ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో 5 వ నెంబర్ గేట్ దగ్గర మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. విద్యార్థులపై కాల్పులు జరిపారని.. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని విద్యార్థులు వివరించారు. వారం వ్యవధిలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం మూడోసారి కావడం గమనార్హం. కాల్పులకు నిరసనగా జామియా నగర్ పోలీస్‌ స్టేషన్ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్యపట్నాయక్ మాట్లాడుతూ.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలను మోహరించినట్లు తెలిపారు. విద్యార్థులు తమ ఆందోళనను విరమించాలని కోరారు.