జై అమరావతి నినాదాలు చేసిన విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేత

Asaduddin Owaisi attack on Modi govt in lok sabha

‘జై అమరావతి’ నినాదాలు చేసినందుకుగానూ నలుగురు విద్యార్థులపై ఏఎన్‌యూ విధించిన సస్పెన్షన్‌ను యాజమాన్యం ఎత్తివేసింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం విద్యార్థి ఐకాస చేపట్టిన నిరసనలో ఈ నలుగురు విద్యార్థులు పాల్గొని రాజధానిపై నినాదాలు చేసినందుకు సస్పెన్షన్‌కు గురయ్యారు. 

ఏఎన్‌యూ ఎదుట విద్యార్థి, పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. యూనివర్సిటీ వీసీ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీసీపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని నినాదాలు చేశారు.