సీఎం పదవిని స్వీకరించడం ద్వారా కుటుంబ సంప్రదాయాన్ని పక్కనపెట్టాం..

Uddhav


రాజకీయ పదవిని అంగీకరించడం ద్వారా తమ కుటుంబ సంప్రదాయాన్ని పక్కనపెట్టామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అంగీకరించారు. కాని తన దివంగత తండ్రి మరియు బాల్ థాకరేకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం కోసం ముఖ్యమంత్రి పదవిని స్వీకరించక తప్పలేదని ఉద్ధవ్ స్పష్టం చేసారు. 

రాజకీయ పదవిని అంగీకరించని థాకరే కుటుంబం యొక్క సంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేశాము అనేది నిజం, కాని ఈ పదవిని అంగీకరించకుండా నా తండ్రికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేనని అనుకున్నప్పుడు, సీఎం పదవి అనివార్యం అనిపించిందని తమ పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు.

''తాను ముఖ్యమంత్రి కావడం అనేది తన తండ్రికి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే క్రమంలో ఒక మెట్టు మాత్రమేనని ఉద్ధవ్ అన్నారు. ఇప్పటికి.. నేను నా తండ్రికి ఇచ్చిన వాగ్దానాన్ని నేను ఇంకా నెరవేర్చలేదని.. ఇది ఆ దిశగా ఒక అడుగు మాత్రమే" అని ఉద్ధవ్ స్పష్టం చేసారు.