మోదీజీ.. మ్యాజికల్ ఎక్సర్‌సైజెస్‌ను మరి కాస్త పెంచండి!

rahul gandhi posts modi's video

ప్రధాని నరేంద్ర మోడీ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.క్షీణిస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ తన వ్యాయామాన్ని మరింత పెంచితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘ప్రియతమ ప్రధాన మంత్రి గారూ, దయచేసి మీ రోజువారీ  మ్యాజికల్ ఎక్సర్‌సైజెస్‌ను మరి కాస్త పెంచండి. మీకు తెలియదు, అవి ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచవచ్చు’ అని ట్వీట్ లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం శనివారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే  ఈ బడ్జెట్‌పై కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుపడుతోంది.