జనజాతరను తలపిస్తున్న మేడారం..

Submitted by editor on Mon, 02/03/2020 - 05:15
Asaduddin Owaisi attack on Modi govt in lok sabha

ఆసియాలోనే అతి పెద్ద జాతరగా పిలుస్తున్న మేడారం జాతరకు ముందే జనజాతరను తలపిస్తోంది. రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు రెండు రోజుల ముందే మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది. జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసిన అనంతరం భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. జంపన్నవాగులో స్నానం చేసి దర్శించుకుంటే తల్లులు కరుణిస్తారని భక్తుల నమ్మకం. ఇప్పటికే వారం నుంచీ దాదాపు 50 లక్షల మంది భక్తులు మేడారానికి తరలిరాగా.. నిన్న ఒక్కరోజే మేడారానికి 10 లక్షల మంది తరలివచ్చినట్లు అంచనా. ఈ నెల 5 న మొదలవనున్న జాతరలో.. ఇదే రోజు సారలమ్మ గద్దె మీదకు చేరుకుంటుంది. 6న సమ్మక్క గద్దెను అధిష్టించనుంది. 7వ తేదీన భక్తుల దర్శనం, మొక్కుల చెల్లింపులు ఉంటాయి. 8వ తేదీన అమ్మవార్లు వన ప్రవేశం చేస్తారు.