దిశ నిందితుడి భార్యను కలిసిన రామ్ గోపాల్ వర్మ

Asaduddin Owaisi attack on Modi govt in lok sabha

దిశపై హత్యాచారం జరిపి, పోలీసుల ఎన్ కౌంటర్లో మృతి చెందిన వారిలో ఒకడైన చెన్నకేశవులు భార్య రేణుకను సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కలిశారు. ఈ సందర్భంగా ఆమె గురించి వర్మ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.16 ఏళ్లకే రేణుకకి పెళ్లి అయింది.17 ఏళ్ళకి ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. చెన్నకేశవులు దిశనే కాదు. రేణుకను కూడా మోసం చేశాడు. రేణుక ఇంకా చిన్న పిల్ల.అలాంటిది ఆమె త్వరలో ఓ పిల్లకు జన్మనివ్వబోతోంది. ఇప్పుడు ఆమెకి, తన బిడ్డకి భవిష్యత్తు లేకుండా పోయింది అంటూ వర్మ ట్వీట్ చేశాడు. దిశ కథాశంతో వర్మ సినిమా తెరకెక్కించబోతున్నారని వార్తలు వినబడుతున్నాయి.