సినీ ప్రయాణం గురించి విజయశాంతి కీలక ప్రకటన..!

Vijayashanthi gives clarity about cinemas

దశాబ్ధ కాలానికి పైగా వెండితెరకు దూరమై 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి. తాజాగా తన సినీ ప్రయాణం గురించి విజయశాంతి కీలక ప్రకటన చేసారు. ప్రజా జీవన పోరాటంలో తన ప్రయాణం కొనసాగుతుందని.. మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం తనకు కల్పిస్తోందో, లేదో కూడా తెలియదని.. ఇప్పటికి ఇక శెలవు.. అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అంతేకాకుండా.. నా నట ప్రస్ధానానికి 1979 కళ్ళుకుల్ ఇరమ్, కిలాడి కృష్ణుడు నుండి నేటి 2020 సరిలేరునీకెవ్వరు వరకు ఆగౌరవాన్ని అందించిన ప్రేక్షకులకు, అభిమానులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. మనసు నిండిన మీ ఆదరణకు,నా ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికీ నమస్సులు అంటూ వరుస ట్వీట్లు చేశారు.